Karthika Deepam September 12th Episode: నా మేనల్లుడు ప్రాణాల మీదుకు.. దీపకు తీవ్ర అవమానం
పంతులు తో ముందే మాట్లాడి కుటుంబ సభ్యులందరి ముందు పెళ్లి ముహూర్తం త్వరగా జరిగేలా పెట్టిస్తుంది జ్యోత్స్న. మరోవైపు వంట చేయడం కోసం ఒక ఇంటికి వెళ్తున్న దీపని దారిలో కనిపించిన కార్తీక్ తన కారులో డ్రాప్ చేస్తాడు. అక్కడ నర్సింహ దీప మీద హత్యాయత్నం చేస్తే ఆమెని కాపాడబోయి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు కార్తీక్. ఇదంతా దీప వల్లే అంటూ ఆమెపై ఫైర్ అవుతాడు శ్రీధర్. కోమలోకి వెళ్ళిపోతున్న కార్తీక్ శౌర్య పిలుపుకి రెస్పాండ్ అయ్యి, ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. సెప్టెంబర్ 12 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 147వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నేను జైలుకు వెళ్లడానికి కారణం దీప కదా అంటుంది జ్యోత్స్న. కాదు నువ్వు తాగి డ్రైవ్ చేయడం అంటాడు దసరధ్. ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణం ఆ దీపే కదా అంటుంది పారిజాతం. ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణం కార్తీక్ అంటాడు దశరథ్. నర్సింహ కార్తీక్ ని ఎందుకు చంపాలి అనుకున్నాడు, దీప కోసమే కదా అలాంటి మనిషి ఇక్కడే ఉంటే మళ్ళీ చంపడని గ్యారెంటీ ఏమిటి అంటుంది పారిజాతం. అప్పుడే అక్కడికి వచ్చిన శివ నారాయణ నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే నేను నిన్ను చంపనని గ్యారెంటీ ఏమిటి అంటూ భార్యని కోప్పడతాడు.

భార్య మాటలు పట్టించుకోవద్దని విధి విచిత్రమైనది దీపని నర్సింహ చంపాలనుకోవడం ఏమిటి దానికి కార్తీక్ అడ్డుపడటం ఏమిటి అంటూ మనవరాలికి నచ్చ చెపప్తడు శివ నారాయణ.
నిజమే విధి విచిత్రమైనది లేదంటే రక్తసంబంధం ఉన్న మనం పిలిస్తేనే పలకలేనిది ఆ చంటిది పిలిస్తే కార్తీక్ రెస్పాండ్ అయ్యాడు ఒకరకంగా అది కార్తీక్ ని రచించినట్లే అంటుంది సుమిత్ర. దశరథ్ కూడా పారిజాతాన్ని మందలిస్తాడు. ఈరోజు దీపని వెనకేసుకొస్తున్నందుకు ఏదో ఒక రోజు బాధపడతారు అంటుంది పారిజాతం. శాపం పెడుతున్నావా అని కోప్పడతాడు శివ నారాయణ. నా కుటుంబాన్ని నేనెందుకు శపిస్తాను అంటుంది పారిజాతం. మనవరాలిని తీసుకొని బయటికి వెళ్లబోతుంటే ఎక్కడికి అంటాడు శివ నారాయణ. కార్తీక్ దగ్గరికి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పారిజాతం, జ్యోత్స్న.
అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనవరాలు తో ఒకసారి మాట్లాడు అని కోడలికి చెప్తాడు శివ నారాయణ. దాని బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి మావయ్య, కార్తీక్ ని అది ఎంత ఇష్టపడిందో మనందరికీ తెలిసిందే నిజానికి దానికి ఆ ఆశలు కల్పించిందే మనం, కార్తీక్ కోలుకునే వరకు మనకి ఈ బాధ తప్పదు అంటుంది సుమిత్ర. మరోవైపు నర్సింహ లాంటి పాపాత్ముడిని కన్నందుకు ఏడుస్తూ ఉంటుంది అనసూయ. ఆమెకి ధైర్యం చెప్తుంది దీప.

నేను సుమిత్రమ్మ గారికి ముఖం చూపించలేను, పెళ్లి హడావిడితో ఈ ఇల్లు కళకళలాడవలసిందే నా కొడుకు వల్ల ఇదంతా జరిగింది అంటే బాధగా ఉంది అంటుంది అనసూయ. ఇప్పుడు నువ్వు నా అత్తగారివి కాదు నా మేనత్త వి ఆ నర్సింహకి మనకి ఎలాంటి సంబంధం లేదు కదా అంటుంది దీప. ఆ చంటి దానికి కార్తీక్ ని పొడిచింది నర్సింహ అని తెలిస్తే భరించ గలదా అంటుంది అనసూయ. అప్పుడే అక్కడికి శౌర్య రావడం చూసి ఎప్పుడు వచ్చిందో మాటలు వినేసిందేమో అని కంగారు పడతారు అత్త, కోడళ్లు .
కానీ శౌర్య వచ్చి తనని కార్తీక్ దగ్గరికి తీసుకు వెళ్ళమని తల్లిని అడుగుతుంది. ఇప్పుడు కాదు అక్కడ అందరూ ఉంటారు తర్వాత తీసుకువెళ్తాను అంటుంది దీప. నాకు కార్తీక్ ని చూడాలనిపిస్తుంది చిన్న ముల్లు గుచ్చుకుంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది అలాంటిది అదేదో గుచ్చుకుంది అంట కదా ఎవరో అన్నారు, ఏం గుచ్చుకుందో నేను కార్తీక్ ని అడుగుతాను అతని పక్కన కూర్చొని కబుర్లు చెప్తాను అంటుంది శౌర్య. ఆమెకి నచ్చజెప్పి నీకు టిఫిన్ పెడతాను పదా అని లోపలికి తీసుకువెళ్లి పోతుంది అనసూయ. శౌర్య మాటలకి ఆలోచనలో పడుతుంది దీప.

ఇప్పుడు కార్తీక్ బాబుని ఎవరు చూసుకుంటున్నారు, కాంచన గారు అన్ని పనులు చేసుకోలేరు శ్రీధర్ గారు ఇంటిపట్టున సరిగ్గా ఉండరు అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే డాక్టర్ కార్తీక్ ని టెస్ట్ చేసిన తర్వాత బాగా రెస్ట్ తీసుకోమని కొంచెం నొప్పి తగ్గిన తర్వాత నడవటం ప్రాక్టీస్ చేయమని అలాగే బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీధర్ దీప వల్ల ఇదంతా జరిగింది, నర్సింహతోపాటు ఆ దేవుని కూడా వదిలిపెట్టను అంటాడు. మధ్యలో తన ఏం చేసింది అంటాడు కార్తీక్.
నువ్వు దీప ని వెనకేసుకొస్తావని నాకు తెలుసు ఈ రెండు కుటుంబాల నుంచి ఆ దీపని తరిమేస్తేనే గాని ప్రశాంతత ఉండదు, ఈసారి తనని కనిపించనీ చెప్తాను అంటూ ఉండగానే అక్కడికి వచ్చిన దీప ని చూసి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతాడు. సాయం చేద్దామని వచ్చాను అంటుంది దీప. చేసిన సాయం చాలు అంటాడు శ్రీధర్. తండ్రిని కోప్పడతాడు కార్తీక్. మీరు ఎన్ని మాటలు అన్నా పర్వాలేదు ఈరోజు కార్తీక్ బాబు ఉన్న పరిస్థితికి కారణం నేను అంటుంది దీప. నీవల్లే బ్రతికాడు కూడా నువ్వు రక్తం ఇవ్వబట్టే తను బ్రతికాడు, నీ కూతురు పిలుపుతోనే కోమా నుంచి బయటపడ్డాడు అంటూ దీపకి థాంక్స్ చెప్తుంది కాంచన.
ఆ మాటలకి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్ ఆయన మాటలు పట్టించుకోవద్దు అంటుంది కాంచన. ఆయన బాధలో కూడా అర్థం ఉంది కదమ్మా అంటుంది దీప. అప్పుడే పారిజాతం వాళ్లు లోపలికి వచ్చి శ్రీధర్ కి విష్ చేస్తారు. కోపంగా ఉన్న శ్రీధర్ ని చూసి ఏం జరిగింది అని అడుగుతారు గెస్ట్లు వచ్చారు అంటాడు శ్రీధర్. ఎవరు అంటూ లోపలికి వెళ్తారు జ్యోత్స్న వాళ్లు. అక్కడ దీపని చూసిన జ్యోత్స్న వాళ్ళు షాక్ అవుతారు. రూల్స్ మాకేనా దీప కి లేవా అని అడుగుతుంది జ్యోత్స్న. ఏమి రూల్ అని అడుగుతుంది దీప.

తనని చూడటానికి ఎవరూ రావద్దని రాత్రి కార్తీక్ అందరికీ చెప్పాడు అంటుంది కాంచన. ఆయన చెప్పినా నేను వినను అంటుంది దీప. ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు నిజమే నేను ఆయన చెప్పినా వినిపించుకోను ఎందుకంటే నేను ఆయనని చూసి వెళ్ళిపోవడానికి రాలేదు, సాయం చేయటానికి వచ్చాను అంటుంది దీప. ఇంటి కోడలిగా ఆ మాత్రం సాయం జ్యోత్స్న చేయలేదా అంటుంది పారిజాతం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











