Karthika deepam 2 March 12th Episode : జ్యోత్స్నకు ఎదురుదెబ్బ... ఊహించని ట్విస్ట్ ఇచ్చిన శివనారాయణ!

Karthika deepam 2 Serial Latest Episode: కార్తీక దీపం 2 లేటెస్ట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మార్చి 12న వచ్చిన ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. ఆస్తి పంపకాల విషయంలో శివనారాయణ రాసిచ్చిన వీలునామా షాకింగ్ గా ఉంది. శివనారాయణ, సుమిత్ర, దశరథ్ లు ఆస్తి పంపకాల కోసం సిద్ధమవుతున్నారు.

ఈ సందర్భంగా లాయర్ వినాయక రావు అప్పటికే సిద్ధం చేసిన రెండు ఫైల్స్ ను వారికి చూపించి సైలెంట్ గా ఉంటాడు. దీంతో ఆస్తి మొత్తం ఎవరికి రాశారో సందేహం పారును వెంటాడుతుంది. కాగా ఆస్తి మొత్తానికి తన కొడుకు ధశరత్, కోడలు సుమత్రకే చెందేలా రాసినట్టు వీలునామాను రెడీ చేయిస్తాడు. ఆ తర్వాత వారి ఆస్తి దీపా, శౌర్యలకు చెందేలా కూడా అన్నీ ఏర్పాట్లు చేస్తాడు.

Karthika deepam 2 Serial Today s Episode 303 March 12th 2025 Here is full story

అయితే, శివనారాయాణ రాయించిన వీలునామాతో పారు, జ్యోత్స్న మనస్సులో కంగారు పుట్టించేలా ఉంటుంది. ఓవైపు లాయర్ చదువుతుంటేనే నాకేం రాయలేదా? అని అటు పారు, ఇటు జ్యోత్స్న సందేహం వ్యక్తం చేస్తారు. మరోవైపు లాయర్ పూర్తిగా ఆస్తిపంపకాలకు సంబంధించిన వీలునామాను చదువుతాడు.

శివనారాయణ మొదటి భార్యకు చెందిన బంగారం, ఆస్తులంతా దశరథ్, సుమిత్రల కూతురుకే వర్తిస్తుందని చెబుతాడు. అలాగే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ మీద కూడా సర్వ అధికారాలు ఆమెకే దక్కనున్నాయని వెల్లడిస్తారు. అయితే మనవరాలు అని చెప్పడంతో అంతా సందిగ్ధంగా మారుతుంది. పారు, జ్యోలకు కేవలం 50 ఆవులున్నా డైరీ తప్పా ఏమీ మిగలకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత ఆస్తి తమ చేతికి వచ్చేలా పలు వ్యూహాలు రచిస్తారు.

మరోవైపు లేటెస్ట్ ఎపిసోడ్ లో శివనారాయణ ఆస్తి పంపకాలతో కార్తీక్, దీపా ఎలాంటి వాటాలను కోరుకోరు. తన తల్లికి ఆసక్తి ఇచ్చినా ఇవ్వకపోయినా.. తాత శివనారాయణపై గౌరవం చూపిస్తూనే ఉంటాడు. అయితే తండ్రి శ్రీధర్ మాత్రం కార్తీక్ వద్దకు వచ్చి ఉసిగొల్పే ప్రయత్నం చేస్తాడు. మీ అమ్మకు ఆస్తి దక్కలేదురా.. మనవడిగా నువ్వు ఒక్క సంతకం పెట్టూ చాలు మిగితాది అంతా నేను నడిపిస్తాను అంటూ మాయమాటలు చెబుతాడు. అప్పులు తీరిపోవడంతో పాటు మంచి రెస్టారెంట్ కూడా పెట్టుకోవచ్చని చెబుతాడు. కానీ కార్తీక్ బాబు ఏమాత్రం లొంగడు. దీపా కూడా కార్తీ మాటే వింటుంది.

పైగా శ్రీధర్ తెచ్చిన అప్లికేషన్ ఫామ్ ను కూడా కార్తీక్ బాబు చింపేస్తాడు. సంతకం చేయడం కుదరదని మొహంమీదే చెప్పేస్తాడు. తనకు ఆస్తి వచ్చినా.. రాకున్నా.. తాతపై ఉన్న గౌరవం అలానే ఉంటుందని చెబుతాడు. ఆ కుటుంబంతో ఉన్న సంబంధం ఆ విధంగానే కొనసాగిస్తుందని అంటాడు. మరోవైపు తన వ్యూహం పండకపోవడంతో శ్రీధర్ ఏమాత్రం తగ్గడు. మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. ఇక దిల్ ఇంట్లో కూడా ఆస్తి పంపకాలపై చర్చ కొనసాగుతుంది. కాంచన అత్తకు అన్యాయం జరిగిందని దిల్ తన భర్తతో చెప్పుకుంటుంది. తన అన్నకు కూడా తీరని లోటు జరిగిందని వాళ్లకు మున్ముందు అంతా మంచే జరగాలని కోరుకుంటారు.

అయితే దిల్ వాళ్ల మామయ్య అసలు వారసురాలిని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆస్తి పంపకాల్లో జరుగుతున్న కుట్రను, తన కొడుకు, కోడలు దిల్ కు చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. కానీ మెమోరీ లాస్ వల్ల సడెన్ మర్చిపోతాడు. అది వాళ్లకి సహజమే కావడంతో మున్ముందు అంతా మంచే జరగాలని కోరుకుంటారు. ఇక మరోవైపు జోత్స్న ఆస్తి తనకు వస్తుందో? రాదో? అనే సందేహంలో మునిగితేలుతుంది. తను అసలు కూతురు కాకపోయిన విషయం దశరథ్, సుమిత్రలకు తెలిస్తే ఆస్తి ఏమాత్రం తనకు దక్కదని ఆందోళన పడుతుంది. అసలు వారసురాలు దీపా అని తెలిస్తే ఆస్తి మొత్తం ఆమెకే వెళ్లిపోతుందని చింతిస్తుంది.

జోత్స్న ఆస్తి దక్కుతుందో లేదో అనే ఆలోచనలో సతమతమవుతుంటే దశరథ్, సుమిత్రలు ఆమెకు పెళ్లి చేస్తామనే వార్తను తీసుకొస్తారు. వెంటనే నువ్వు పెళ్లి చేసుకుని చక్కటి కాపురం చేస్తే చూడాలని ఉందంటూ తన కూతురితోచెబుతుంది సుమిత్రా. ఆస్తి పంపకాల సమయంలో తనకు ఎందుకు పెళ్లి చేయాలని చూస్తున్నారంటూ జ్యో అనుమానం వ్యక్తం చేస్తుంది. మరోవైపు నాన్నమ్మ కూడా అదే చెప్పడంతో షాక్ అవుతుంది. పైగా తాత శివనారాయణ కూడా వచ్చి పెళ్లి చేసుకోవాల్సిందేనని అంటాడు. గౌతమ్ అనే కుర్రాడితో పెళ్లికి ఏర్పాట్లు చేశామని తాత జ్యోకు చెబుతాడు. కానీ ఎందుకో జ్యోకు అనుమానం కలుగుతుంది.

అయితే, జ్యో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆస్తి మొత్తం తన పేరుమీద రాస్తామని, నువ్వు పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా మాముందే ఉంటే చూడాలని ఉందంటూ తల్లి సుమిత్ర చెప్పుకొస్తుంది. పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం రాస్తారనడంతో మళ్లీ తన వ్యూహాన్ని మార్చుకొని సరేనంటూ తన అంగీకారాన్ని తెలియచేస్తుంది. కానీ పెళ్లి చేసుకోవాలంటున్న గౌతమ్ తో మాత్రం ఒకసారి మాట్లాడాకనే పెళ్లికి పూర్తిగా ఓకే చెబుతానని సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ జ్యో పెళ్లికి ఓకే చెబుతుందనే భరోసా సుమిత్ర, శివనారాయణ మనస్సులో ఉంటుంది.

అయితే, ఆస్తి విషయంలోజ్యో ప్లానింగ్స్ అన్ని దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాసు ఎంట్రీ ఇచ్చి తన వ్యూహాన్ని చెడగొడుతాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ఉండటంతో అసలు వారసురాలుపై చిక్కుముడి విడిపోతుందని తండ్రి దశరథ్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు దీపా పార్సెల్ ఇచ్చేందుకు ఓ ఇంటికి వెళ్తుంది. అక్కడ యువతికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంది. బాధితులకు అన్యాయం జరిగిందని తెలుసుకొని అండగా నిలుస్తుంది. కానీ తానే అనుకోని చిక్కుల్లో ఇరుక్కుంటుంది. అంతంటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక జ్యో పెళ్లికి ఒప్పుకుందా? లేదా?, గౌతమ్ తో ఏం మాట్లాడింది. ఆస్తి విషయాలను ఏమైనా గౌతమ్ తో మాట్లాడుతందా? లేక ఇంకేదైనా వ్యూహాలు రచించే ప్లాన్ లో ఉందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇన్నాళ్లు కార్తీక్ వెంట పడి ఇప్పుడు గౌతమ్ ను ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటుందా? అనేది వేచి చూడాలి. దీపా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లి ఆ ఇంటిలో ఎలాంటి సిచ్యూయేషన్ ను ఎదుర్కొందనేది రేపటి ఎపిసోడ్ పై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: karthika deepam 2 telugu serial
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X