Karthika deepam 2 March 13th Episode : దీపాను నాశనం చేసేలా జ్యో ప్లాన్.. ఆస్తి లాగేసుకున్న శివనారాయణ!

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 13కు సంబంధించిన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇప్పటికే శివనారాయణ ఇంట్లో ఆస్తుల పంపకాల విషయంలో తగదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అసలు మనవరాలుకే తన ఆస్తిలో మెజార్టీ వాటా చెందుతుందని శివనారాయణ వీలునామా రాయించిన విషయం తెలిసిందే. అందుకోసం రెండు పేపర్లను సిద్ధం చేయించారు. అందులో ఒకటి మాత్రమే పూర్తిగా చదివి కుటుంబ సభ్యులకు వినిపించారు.

ఆస్తి పంపకాల విషయంలో శివనారాయణ తీసుకున్న నిర్ణయం జ్యోత్స్నకు కంగారు పెడుతుంది. ఆస్తి మొత్తం తనకు కాకుండా అసలు మనవరాలైన దీపాకు వెళ్లిపోతుందనే టెన్షన్ లో తలామునకలైంది. 'అసలు మనవరాలు' అనే మెళికతో ఆస్తి తనకు దక్కదనే విషయం ముందుగానే జ్యో గ్రహించింది. అయితే ఎలాగైన ఆస్తిని తన చేతికి చిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే జ్యోకు తండ్రి దశరథ్, తల్లి సుమిత్రలతో పాటు తాత శివనారాయణ ఊహించని షాక్ ఇస్తారు.

Karthika deepam 2 Serial Today s Episode 304 March 13th 2025 Here is full story

జ్యో త్వరగా పెళ్లి చేసుకోవాలని, అందుకు గౌతమ్ అనే అబ్బాయిని అల్లుడిగా ఎంపిక చేశామని జ్యోకు వివరిస్తారు. అలాగే అతను ఇల్లరికానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని తాత శివనారాయణ జ్యోకు చెబుతాడు. పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం తన పేరున కూడా రాస్తామని అందరూ చెబుతారు. దీంతో జ్యోత్స్న పెళ్లి చేసుకుంటే తనకు ఆస్తి మొత్తం వస్తుందనే ఉద్దేశంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సందేహించకుండా ఓకే అని చెబుతుంది. అందుకు తల్లిదండ్రులు, శివనారాయణ ఎంతగానో సంతోషపడుతారు. జ్యోత్స్నకు త్వరలో పెళ్లి కాబోతుందనే ఆనందంలో మునిగి తేలుతారు.

కానీ జ్యోత్స్న ఈలోగా మరోట్విస్ట్ ఇస్తుంది. ఆస్తి తనమీదకు మార్పించేందుకు అప్పటికే పలు రకాలుగా వ్యూహాలు రచిస్తున్న జ్యో కాబోయే భర్త గౌతమ్ తో మాట్లాడాకనే పెళ్లికి పూర్తిగా ఓకే చెబుతాననింది. ఇక అతని మాట్లాడుతానని వెళ్లిన జ్యో తిరిగి ఇంటికి వస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు, తాత శివనారాయణ జ్యో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని టెన్షన్ పడుతూ ఉంటారు.

అయితే గౌతమ్ నచ్చపోతే మరో సంబంధం ఉందని చెప్పిన శివనారాయణను, కొడుకు దశరథ్ మరో సంబంధం ఎవరిది నాన్న? అని అడుగుతాడు. కానీ అలాంటి సంబంధం లేదు. గౌతమ్ ఒక్కడితోనే పెళ్లికి ఏర్పాట్లు చేశాను. జ్యోత్స్నకు నచ్చజెప్పడం కోసం అలా బదులిచ్చినట్టు చెప్పుకొచ్చాడు. వీరు జ్యో పెళ్లి గురించి మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఆమెనే తిరిగి ఇంటికి తిరిగి వస్తుంది.

అయితే గౌతమ్ ను తనకు కలవలేదని తల్లిదండ్రులకు చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఎందుకమ్మ నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇంకేదైనా సమస్యనా? అసలు ఎందుకు కలవలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అందుకు జ్యో స్పందిస్తూ అలాంటిదేమీ లేదు. మీరు ఏమాత్రం కంగారు పడకండి. మీరు ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారు కదా.. అందుకు నేను మళ్లీ అతన్ని కలిసి ఏం మాట్లాడాల్సి ఉంది.

అందుకే కలవలేదు. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే ఇంక మీరే అన్ని ఏర్పాట్లు చూడండి అంటూ తన పూర్తి అంగీకారం తెలియజేస్తుంది. గౌతమ్ కుటుంబంతో మాట్లాడటమే కాకుండా ఏకంగా నిశ్చితార్థం కోసం ఏర్పాట్లు చేయండంటూ మరో ఆఫర్ ఇస్తుంది. అందుకు తల్లిదండ్రులు, తాత ఎంతగానో సంతోషిస్తారు. జ్యో తియ్యటి మాటలకు పొంగిపోతారు.

మరోవైపు దీపా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లిన ఇంట్లో జరిగిన ఘటనతో చాలా బాధపడుతుంది. ఆ ఇంట్లో పనికోసం వెళ్లిన ఆమెకు కడుపుచేసి మోసం చేశాడని మండిపోతుంది. తాను వాళ్లను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా విఫలంకావడంతో ఇంకా బాధపడుతుంది. అయితే తన ఇంట్లో కూరగాయలు కోస్తూ ఈ విషయాన్నే ఆలోచిస్తూ రగిలిపోతూ ఉంటుంది. ఈలోగా ఇంట్లోకి వచ్చిన కార్తీక్ బాబుకు విషయం అంతా తెలియజేస్తుంది. వాళ్లని కాపాడలేక పోయానని కార్తీక్ బాబుకు చెబుతుంది.

ఇక కార్తీక్ ఆమెను ఆ బాధ నుంచి బయటికి తీసుకొస్తాడు. మరోవైపు ఓ గుడ్ న్యూస్ అంటూ కూడా ట్విస్ట్ ఇస్తాడు. వంటలక్క వంటలను మెచ్చి విజయ్ అనే కంపెనీ నుంచి భారీ ఆర్డర్ వచ్చిందని గుడ్ న్యూస్ చెబుతాడు. ఇది చాలా పెద్ద ఆర్డర్ అని చెప్పుకొస్తాడు. అయితే.... శివనారాయణ రెస్టారెంట్ కు వెళ్లాల్సిన విజయ్ కంపెనీ ఆర్డర్స్ కార్తీక్, దీపాల రెస్టారెంట్ కు వెళ్లడంతో శివనారాయణ రగిలిపోతాడు. రెస్టారెంట్ బాధ్యతలు జ్యోత్స్నకు అప్పగించడం వల్లే ఇలా జరిగిందంటూ తాత శివనారాయణ, తండ్రి శివనారాయణ మండిపడుతారు.

వెంటనే కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి ఒక్కరోజు గడువులోగా తప్పుకోవాలని ఆదేశించారు. అయితే తననే దెబ్బతీసిన సత్యరాజ్ రెస్టారెంట్, విజయ్ కంపెనీలకు చెక్ పెట్టాలని, వాళ్ల ఫుడ్ బాగుందనే ఆర్డర్ అటు వెళ్లడం జరిగింది.. కనుక అక్కడే కాన్సంట్రేట్ చేయాలని మరో వ్యూహానికి తెర లేపుతుంది. ఇక మరోవైపు దీపా ఆర్డర్ వచ్చిన రెస్టారెంట్ కు భోజనాలు అన్నీ సిద్ధం చేస్తుంది. వర్కర్లతో ఆ వంటన్నింటని పంపించేందుకు రెస్టారెంట్ బయటికి తీసుకొస్తుంది.

Take a Poll

కానీ ఆ వంటల్లో జ్యోత్స్న తన పథకం ప్రకారమే దీపా రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఓ మోసగాడైన వర్కర్ తో ఫుడ్ లో పాయిజన్ కలిపిస్తుంది. ఆ విషయం తనకు తెలియగానే... రెస్టారెంట్ నుంచి ఆఫీస్ కు భోజనాలు వెళ్లాయని తెలుసుకొని వెంటనే విజయ్ కంపెనీకి జ్యోత్స్న వెళ్తుంది. అక్కడ జరగబోయే విషప్రయోగాన్ని, దాని ఫలితాన్ని కళ్లరా చూసేందుకు వెళ్తుంది. అందరూ వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతారని, ఇక దీపా, కార్తీక్ జైలు పాలవుతారని అంచనా వేస్తుంది.

ఇక అంతటి ఎపిసోడ్ ముగుస్తుంది. కానీ ఆ తర్వాత ఏం జరగబోతుందనేది ఆసక్తి కరంగా మారింది. అయితే ఫుడ్ పాయిజన్ సంగతిని కార్తీక్ బాబు, దీపా కనిపెట్టారా? లేదా? ఆ భోజనాలు తిన్న ఉద్యోగులకు ఏమైనా జరిగిందా? అనే విషయాలు రేపటి ఎపిసోడ్ పై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు జ్యోత్స్న వ్యూహాం పండకపోతే ఆమె పరిస్థితి ఏమవుతుందని, అసలు పెళ్లి ఏర్పాట్లు ఎంత వరకు మున్ముందుకు వెళ్తాయనేది వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: karthika deepam 2 telugu serial
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X