Karthika deepam 2 March 14th Episode: జ్యోత్స్న కుట్ర... దీపా రెస్టారెంట్ కు ప్రమాదం?

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 14కు సంబంధించిన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇప్పటికే శివనారాయణ ఆస్తుల పంపకాల విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అసలు మనవరాలు అంటూ ఇచ్చిన ట్విస్ట్ తో జ్యోత్స్న ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. తనకు ఆస్తి ఎక్కడ దక్కదో అని ఆందోళన పడుతోంది. ఈ క్రమంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఆస్తి మొత్తం తన చేతుల్లోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు వ్యూహాలు రచిస్తూ ఎవరికి తెలియకుండా అమలు చేస్తూనే వస్తోంది.

అయితే.. జ్యోత్స్నకు శివనారాయణ రెస్టారెంట్ బాధ్యతలను అప్పగించ.. ఆమె మెయింటెయిన్స్ మూలంగా నష్టలు వస్తున్నాయని బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. దీంతో జ్యోత్స్న చేతిలోకి వచ్చిన రెస్టారెంట్ సంపద వెనక్కి వెళ్లిపోయింది. తాత శివనారాయణ ఆగ్రహానికి జోత్స్న బలైపోతుంది. ఎలాగైనా మళ్లీ రెస్టారెంట్ బాధ్యతలను తన చేతికి చిక్కించుకోవాలని భావిస్తుంది. అందుకు కారణం దీపా రెస్టారెంట్ బాగా నడుస్తుందని, అక్కడ భోజనం రుచికరంగా ఉండటంతో తమ రెస్టారెంట్ కు రావాల్సిన ఆర్డర్లు దీపా రెస్టారెంట్ కు వెళ్తున్నాయని గ్రహిస్తుంది.

దీంతో దీపాకు సంబంధించిన సత్యరాజ్ రెస్టారెంట్, విజయ్ కంపెనీలకు చెక్ పెట్టాలని వ్యూహాలు చిస్తుంది. కంపెనీకోసం దీపా వండిన వంటల్లో జ్యోత్స్న తన పథకం ప్రకారమే దీపా రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఓ మోసగాడైన వర్కర్ తో పాయిజన్ కలిపిస్తుంది. అది గమనించని దీపా ఆ వంటలను తీసుకొని వెళ్లి విజయ్ కంపెనీలోని ఉద్యోగులకు మధ్యాహ్నం వడ్డిస్తుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న జ్యో అందరూ పాయిజన్ కు గురై అవస్థ పడుతుంటే కళ్లార చూడాలని వేచి ఉంటుంది.

Karthika deepam 2 Serial Today s Episode 305 March 14th 2025 Here is full story

ఉద్యోగులంతా వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి వెళ్తుంటే చూడాలని ఆశిస్తుంది. దీపా నడిపిస్తున్న సత్యరాజ్ రెస్టారెంట్ వల్లే ఇలా జరిగిందని, ఇటు విజయ్ కంపెనీ వాళ్లకు, అటు కార్తీక్ బాబుకు చెప్పి సత్యరాజ్ రెస్టారెంట్ ను మూయించాలని భావిస్తుంది. ఆ తర్వాత దీపాను జైలుకు పంపించి, కార్తీక్ బాబు జీవితంలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ భోజనాల్లో విషం కలిపినా ఎక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కానీ ఒక ఉద్యోగి లేచి వచ్చి దీపాపై ఈ భోజనం ఎవరు చేశారంటూ అరుస్తాడు. ఏమైందంటూ దీపా, కార్తీక్ ఎంతో కంగారు పడుతారు.

ఉప్పు లేదా, కారం ఎక్కువైందా, అసలు మీకు నచ్చలేదా? ఏమైందంటూ సదరు ఉద్యోగిని భయంతోనే అడుగుతుంది. అంతా చూస్తున్న జ్యోత్స్న దీపాను ఆ ఉద్యోగి భోజనం బాగా లేదని తిడితే చూడాలని ఆశిస్తుంది. కానీ అక్కడ సీన్ రివర్స్ అవుతుంది. దీపా వండిన వంటలు ఎంతో రుచికరంగా ఉన్నాయని, వాళ్ల అమ్మ చేతి వంటను గుర్తు చేశాయని ఆ ఉద్యోగి దీపాకు కాంప్లిమెంట్ ఇస్తాడు. పది రూపాయలు ఎక్కువైన మంచిదే గానీ ఇలాగే రోజు రుచికరమైన భోజనం అందించండి అంటూ కోరుతాడు. ఆ విషయం ఏమాత్రం తగ్గబోమని కార్తీక్ బాబు, దీపా బదులిస్తారు.

ఇక తన వ్యూహాం పండకపోవడంతో జ్యోత్స్న విషప్రయోగం చేసిన వర్కర్ కు ఫోన్ చేసి పక్కకు పిలుస్తుంది. అసలు ఏం జరిగింది? విషం కలిపావా? లేదా? ఎక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు ఎందుకు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అందుకు సమాధానం ఆ వర్కర్ కాకుండా దీపా నుంచి వస్తుంది. విషం సరిగానే కలిపాడు. నువ్వు చెప్పినంత మోతాదులోనే కలిపాడు. కానీ మధ్యలో ఓ చిన్న విషం జరిగిందంటూ... దీపా వర్కర్ ను కనిపెట్టి చెంప దెబ్బకొట్టిన విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఆ వర్కర్ కూడా దీపా మెడం చెప్పడంతో మారిపోయానని, ఆ పనిచేయలేకపోయానని జ్యోత్స్నకు బదులిస్తాడు.

అసలు కొట్టాల్సింది వర్కర్ ను కాదు. .. నిన్ను అంటూ జ్యోత్స్న చెంపను చెల్లుమనిపిస్తుంది. దీపా దెబ్బకు జ్యోత్స్న షాక్ అవుతుంది. అప్పటికే కార్తీక్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చి తన పేరు చెప్పి మరో చెంపదెబ్బ కొట్టు అంటూ దీపాకు సలహా ఇస్తాడు... అందుకు జ్యో కస్సుబుస్సులాడుతుంది. ఇక శౌర్య విషయంలో జ్యోను వదిలేసింది ఆధారం లేక కాదని, మరో కారణం చేత వదిలేసినట్టు చెప్పుకొచ్చింది.

ఇక కార్తీక్ బాబు జ్యోత్స్న మీద రెచ్చిపోతాడు. దీపాను మెడలో తాళి కట్టినందుకు ఇలాంటి పనులకు పూనుకుంటావా? అంటూ మండిపడుతాడు. నీకంటూ ఓ లైఫ్ ఉందని పెళ్లిచేసుకుని సంతోషంగా ఉండు అంటూ సలహా ఇస్తాడు. అంతేకానీ ఇలాంటి నీచమైన పనులు చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. రెండ్ హ్యాండెడ్ గా దొరికినప్పటికీ వదిలేస్తున్నానని, అక్కడ సుమిత్ర అత్త బాధపడుతుందనే తగ్గుతున్నానని చెబుతుంది. ఆ కుటుంబం మీద తనకు ఎంతో గౌరవం ఉందని, అలాంటి కుటుంబంలో పుట్టి ఇలాంటి దిగజారే పనులు చేయొద్దని చెబుతాడు. ఇక జ్యోత్స్న మొహం ఎర్రగా మారుతుంది. కార్తీక్ మాటలకు ఇంకా కోపోద్రేకిరాలవుతుంది. తన ప్లాన్ పాడైపోయినందుకు బాధపడుతుంది.

మరోవైపు జ్యోత్స్న పెళ్లి గురించి తండ్రి దశరథ్ ఆలోచిస్తూ ఉంటాడు. గౌతమ్ తో ఏర్పాటు చేసిన పెళ్లి విషయంలో.. ముందుగా జరిగే పెళ్లిచూపులు కార్యక్రమానికి తన చెల్లి కాంచనా ఉండాలని భావిస్తాడు. ఇదే విషయాన్ని తన భార్య సుమిత్రతో చెబుతాడు. శౌర్య విషయంలో దీపా జోత్స్నపై నిందవేసినందుకు తన చెల్లి కాంచనాను ఎందుకు దూరంగా పెట్టాలని బాధపడుతాడు. అందుకు సుమిత్రనే స్వయంగా ఫోన్ చేసి పిలువమని చెబుతాడు. కానీ మరోవైపు కాంచనాకు జ్యోత్స్న భోజనాల్లో విషం కలిపిన విషయాన్ని తెలుసుకుంటుంది. దీంతో పుట్టింటికి వెళ్లి జ్యోత్స్న ను కడిగేస్తానని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

కానీ పక్కనే ఉన్న కార్తీక్ బాబు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. అయిన కాంచనా కోపోద్రేకురాలవుతుంది. జ్యోత్స్నకు పెళ్లి చేసి పంపిస్తారా? లేదా? అని కడిగేస్తానంటూ కార్తీక్ తో అంటుంది. ఆలోగానే సుమిత్ర ఫోన్ కాల్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ లిప్ట్ చేసి తల్లి కాంచనాకు ఇస్తాడు. కాంచనా పెళ్లి చూపులు గురించి చెప్పేందుకు చేసిన సుమిత్రను మొదట్లో కోపంగా మాట్లాడుతుంది కాంచన. దీపాను కొట్టినందుకు కాంచనా తనపై కోపంగా ఉందని సుమిత్ర అనుకుంటుంది. కానీ తన కొడుకును సుమిత్ర కూతురు జ్యోత్స్న హింస పెడుతున్నా ఏమాత్రం పట్టించుకోనందుకు కాంచనా కోపంగా ఉండి చిర్రుబుర్రులాడుతోంది.

Take a Poll

అయినప్పటికీ సుమిత్ర ఎంతో ఒపిగ్గా మాట్లాడి జ్యోత్స్న పెళ్లి చూపులకు రావాలని, మొదటిగా తనకే చెబుతున్నామని వదిన కాంచనాను ఆహ్వానిస్తుంది. ఇక కాంచనా కూడా ఎంతో సంతోషిస్తుంది. ఇక జ్యోత్స్న పెళ్లి సెట్ అవ్వడంతో అందరూ సంతోషిస్తారు. దీపా స్వీట్స్ తీసుకొచ్చి... జ్యోత్స్న పెళ్లైనందుకు, ఓ పెద్ద కంపెనీ నుంచి తమకు ఆర్డర్ రావడమే కాకుండా బాగుందంటూ ప్రశంసలు కూడా అందినందుకు స్వీట్స్ తీసుకోండి అంటూ పంచుతుంది. అందరికీ స్వీట్స్ ఇస్తుంది. కానీ కార్తీక్ బాబు మాత్రం స్వీట్స్ తీసుకొని అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోతాడు.

నిశ్శబద్ధంగా ఉంటాడు. గమనించిన దీపా ఏమైందని అడుగుంది. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందంటే అస్సలు నమ్మకం కుదరడం లేదని కార్తీక్ బాబు చెబుతాడు. గతంలో జ్యోత్స్న చేసిన అన్నీ ఘటనలను గుర్తుచేసుకుంటాడు. దాంతో జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందంటే నమ్మకం కురదడం లేదంటూ భార్య దీపాతో చెప్పుకొస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరగబోతుందనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: karthika deepam 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X