Karthika deepam 2 March 15th Episode : జ్యోత్స్న చెంపలు వాయించిన దీపా.. కార్తీక్ బాబుకు మొదలైన టెన్షన్!

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 15కు సంబంధించిన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆస్తి పంకాల విషయంలో శివనారాయణ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 'అసలు వారసురాలు' అంటూ రాయించిన వీలునామాతో సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. జ్యో, పారు కంగుతిన్నారు. అసలు వారసురాలు అని ఎందుకు తాత శివనారాయణ మెన్షన్ చేశారని సందేహిస్తారు పారు, జ్యో. అయితే శివనారాయణ రాయించిన రెండు వీలునామాలో ప్రస్తుతం ఒక్కటి మాత్రమే కుటుంబ సభ్యులకు వినిపించారు. రెండో వీలునామా తర్వాత వినిపిస్తానని చెబుతాడు. ఇక దానిలో ఆస్తుల పంపకంపై ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడోనని అందరూ సందేహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఆస్తి మొత్తం తనకే దక్కాలని, బావ కార్తీక్ ను ఎలాగైనా తన వశం చేసుకోవాలని జ్యోత్స్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటుంది. దీపాను చెడుదాన్ని చేసి, కార్తీక్ బాబును తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో రెస్టారెంట్ విషయంలో పోటీపడి ఫెయిల్ అవుతుంది, ఫలితంగా ఆ బాధ్యతల నుంచి తాత, తండ్రి జ్యోత్స్నను తొలగించేస్తారు. దాంతో దీపా రెస్టారెంట్ ను నాశనం చేయాలని భావించి ఫుడ్ లో విషం కలిపి ఉద్యోగుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. దీపా అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పిపోతుంది. అది చేయించింది జ్యోనే అని తెలుసుకున్న దీపా ఆమె దగ్గరకు వెళ్లి చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక కార్తీక్ బాబు కూడా జ్యోత్స్నను ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని వార్నింగ్ ఇస్తాడు.

Karthika deepam 2 Serial Today s Episode 306 March 15th 2025 Here is full story

జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడాన్ని కార్తీక్ బాబు ఏమాత్రం నమ్మబోడు. గతంలో ఎన్నోసార్లు తన వెంట పడ్డ ఘటనలు కార్తీక్ దీపాతో గుర్తుచేసుకుంటాడు. దీపాతో పెళ్లైనప్పటికీ వదిలేసి తనను పెళ్లిచేసుకోమని జ్యోత్స్న గతంలో ప్రాదేయపడిందని, అప్పటికీ వినకపోవడంతో నీతో బేరం పెట్టుకుందని దీపాతో జ్యో చేసిన పనులను గుర్తు చేస్తాడు. అప్పటికీ నువ్వు కూడా తిట్టిపంపించడంతో నిన్ను శౌర్యను అడ్డు తొలగించి నన్ను దక్కించుకోవాలని ఎత్తులు వేసిందని దీపాతో చెబుతూ కార్తీక్ జ్యో మండిపడుతాడు. ఇంత దాకా తెగించిన జ్యో సడెన్ గా పెళ్లికి ఒప్పుకుందంటే తనకు ఏమాత్రం నమ్మకం కలగడం లేదని దీపాతో చెప్పుకొస్తాడు.

ఇక ఇందుకు దీపా స్పందిస్తూ... అలా ఎందుకు అనుకుంటావు కార్తీక్ బాబు, జ్యో మనస్సు కూడా మారి ఉంటుంది కాదా. భోజనంలో విష ప్రయోగం చేయడంతో నువ్వు గట్టిగా మందలించడంతో పాటు పెళ్లి చేసుకో అని ఒత్తిచెప్పడం జ్యోత్స్న చెవికి ఎక్కి ఉంటుందని దీపా కార్తీక్ బాబుతో అంటుంది. తనకు దక్కదని తెలిసిన దాని కోసం ఎన్నాళ్లు వేచి ఉంటుందని, ఇక రియలైజ్ అయ్యి లైఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకై పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది కదా అంటూ కార్తీక్ బాబుకు దీపా సర్ది చెప్పుకుంటూ వస్తోంది. అందుకు కార్తీక్ బాబు కూడా అలాగైతే సంతోషమే అంటాడు. కానీ ఆ మనిషైతే అలాంటిది కాదు.. నీకెలా నమ్మకం కుదిరిందో అంటూ దీపాకు సందేహాత్మకంగా బదులిస్తాడు.

ఇక మరోవైపు శ్రీధర్ కు మూడో పెళ్లి అంటూ పట్టపగలే కలలు కంటాడు. అది కూడా రెండో భార్య కూడా మూడో పెళ్లికి సంబంధం చూసి మరీ, తన ఆస్తి రాసి ఇచ్చినట్టు కలలు కంటాడు. తీరా నిద్రలోంచి మేలుకొని అవాస్తవమని తెలుసుకుంటాడు. ఇక బెడ్ పై నుంచి లేచి వచ్చి తన రెండో భార్య ఏం చేస్తుందోనని, ఏదో తనకు తెలియకుండా జరుగుతోందని భావించి ఆమె దగ్గరకి వెళ్తాడు. అప్పటికే శ్రీధర్ రెండో భార్య కూతురు దిల్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. జ్యోత్స్న పెళ్లికి ఒఫ్పుకుందానే శుభవార్తను తెలియజేస్తుంది. కానీ శ్రీధర్ మాత్రం శివనారాయణ కార్తీక్ కు ఆస్తి రాసిచ్చాడేమోనని సందేహిస్తాడు. ఇక తనకివ్వాల్సిన భాకీని ఎలాగైనా వసూల్ చేస్తానని మరో ప్లాన్ కు పూనుకుంటాడు.

మరోవైపు జ్యోత్స్న పెళ్లి కోసమని శివనారాయణ ఏర్పాట్లు చేస్తుంటాడు. తన మొదటి భార్య జ్యోత్స్న కు సంబంధించిన ఏడు వారాల నగలు సరి చూస్తుంటాడు, ఇక తన రెండో భార్య పారును పిలిచి ఆ నగలను చూపిస్తాడు. అయితే ఆ నగలన్నీ తనకే ఇస్తాడేమోనని పారిజాతం ఉప్పొంగిపోతుంది. ఏడువారాల నగలు, ధగధగ మెరిసిపోయే ఆభరణాలు చూసి నివ్వెరపోతోంది. ఎప్పటి నుంచో ఆ నగల కోసం చూస్తున్న పారుకు భర్త శివనారాయణ ఇవ్వాళ్టికి ఇస్తాడేమోనని ఆశిస్తుంది. శివనారాయణ చెప్పేది వినకుండానే తొందరపడి కాళ్లమీద పడుతుంది. పొగడ్తలతో ముంచేత్తుతుంది. కానీ శివనారాయణ ఇవన్నీ నీకోసం కాదని, మనవరాలు జ్యోత్స్న కోసమని చెబతాడు. దాంతో పారు ఆశలన్నీ అడియాశలు అవుతాయి. ఇవన్నీ జ్యో రూమ్ కు మోసుకొని రా అని ఆదేశిస్తాడు.

పెళ్లి చూపుల కోసం అప్పటికే జ్యోత్స్నను తల్లి సుమిత్ర రెడీ చేస్తూ ఉంటుంది. శివనారాయణ ఏడువారాల నగలు తీసుకొని వచ్చి జ్యోత్స్నకు అలంకరించమని కోడలు సుమిత్రకు చెబుతాడు. నగలు ఇస్తూ మరోసారి ఆస్తి విషయాన్ని గుర్తు చేస్తాడు. ఎప్పటికైనా ఈ నగలన్నీ ఈఇంటి వారసురాలికే చెందాలి కదా... ఇవన్నీ నీకేనమ్మ అంటూ చెబుతాడు. కానీ జ్యోత్స్నకు అసలు వారసురాలు దీపా అని తెలియడంతో ఆస్తిమొత్తం తనకే దక్కుతుందని మనస్సులో భావిస్తుంది. ఆస్తి తనకే దక్కాలంటే దీపా ఉండకూడదని, దీపాను చంపేయాలని ఆలోచిస్తుంది. ఇక మరోవైపు దీపా, కార్తీక్ ల మధ్యల ఆసక్తికరమైన సన్నివేశం జరుగుతుంది.

Take a Poll

కార్తీక్ బాబుకు ప్రాణదాత దీపా అనే విషయం తెలిసిపోతుంది. దీపా ఎంత దాచినా కార్తీక్ బాబు ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. ఇక దీపాతో సంతోషంగా మాట్లాడుతూ.. త్వరలో తన ప్రాణదాతను కనిపెట్టబోతున్నానని చెబుతాడు. ఎన్నోజన్మల రుణాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నానని తెలియజేస్తాడు. ఒకరికొకరు తమపై ఉన్న ప్రేమను చూపించుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా తనను వీడిపోనని, ఏ శక్తి తమను విడదీయలేదని కార్తీక్ బాబు తన మనస్సులో అనుకుంటాడు. ఇక దీపా గాజులను అప్పటికే దాచేసి కొత్త గాజులు తీసుకొచ్చి దీపా చేతికి తానే స్వయంగా ఎక్కిస్తాడు.

అయితే, జ్యోత్స్న మళ్లీ ఎలాంటి ప్లాన్స్ వేస్తుందోననేది ఆసక్తికరంగా మారింది. తను అసలు వారసురాలు కాదని తెలియడంతో దీపాను ఎలాగైనా అడ్డు తొలగించాలని ఎత్తులు వేస్తుంటుంది. అయితే కార్తీక్ బాబును ఎంతగానో ప్రేమించి, తన బావను దక్కించుకోవడానకి ఇంత క్రూరంగా మారిపోయిన జ్యోత్స్న సడెన్ గా పెళ్లికి ఒప్పుకోవడం వెనకాల ఉన్న రహస్యం ఏంటనేది? ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు కార్తీక్ బాబు కూడా దీపాపై ఓవైపు మాదిరి ప్రేమను కురిపిస్తుండటంతో జ్యో ఎలాంటి చిక్కులు తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Read more about: karthika deepam 2 telugu serial
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X