Karthika deepam 2 March 17th Episode : జ్యోత్స్న పెళ్లి నాటకం... కార్తీక్ బాబుకు మొదలైన టెన్షన్!

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 17కు సంబంధించిన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆస్తి పంకాల విషయంలో శివనారాయణ పెట్టిన ట్విస్ట్ కొత్త మలుపులకు దారి తీస్తోంది. 'అసలు వారసురాలు' అంటూ రాయించిన వీలునామాతో ఎంతటి సస్పెన్స్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఆ తర్వాత జ్యోత్స్న చేసిన పనికి కార్తీక్ బాబు టెన్షన్ కు గురవుతాడు. ఆస్తికోసమని జ్యో తమ ఇంట్లో పెళ్లి నాటకం ఆడుతున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ఓకే చెప్పింది కానీ.. కార్తీక్ బాబు వెంట పడటం మాత్రం మానలేదు. దాంతో జ్యో ఏం చేయబోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. శ్రీధర్ కు తన రెండో భార్యతో ఏమాత్రం గిట్టడం లేదు. ఆమెను అడ్డుతొలగించి మూడో పెళ్లి చేసుకుని ఆస్తిని మొత్తం తన పేరున రాయించుకోవాలని పగటి కలలు కంటుంటాడు. కానీ ఆలోపే శ్రీధర్ కు ఓ వార్త తెలుస్తుంది. తన రెండో భార్య జ్యోత్స్న పెళ్లి గురించి కూతురు దిల్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలను శ్రీధర్ దొంగచాటున వింటూ ఉంటాడు. కానీ వీరు మాట్లాడేది జ్యోత్స్న పెళ్లి గురించి అయితే... శ్రీధర్ కు మాత్రం శివనారాయణ ఆస్తి మొత్తం కార్తీక్ వచ్చినట్టుగా అర్థమవుతుంది. దీంతో వెంటనే తనకివ్వాల్సిన భాకీని ఎలాగైనా వసూల్ చేస్తానని నిర్ణయించుకుంటాడు. ఈ సందర్భంగా కార్తీక్ బాబు ఇంటికి వెళ్తాడు.

Karthika deepam 2 Serial Today s Episode 306 March 17th 2025 Here is full story

ఇక రెస్టారెంట్ కు వెళ్దామని బయల్దేరిన కార్తీక్ బాబు, దీపా కాంచనతో కాసేపు సరదాగా మాట్లాడుతుంటారు. వీరు ఆనందంలో మునిగి తేలుతున్న సమయంలో శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఉట్టిచేతులతో రాకుండా స్వీట్స్ తీసుకొని మరీ వచ్చి ఆస్తి గురించి పరోక్షంగా మాట్లాడుతుంటాడు. దీంతో కార్తీక్ బాబు, దీపా, కాంచన తిన్నగా మాట్లాడూ అంటూ శ్రీధర్ ను హెచ్చరిస్తారు. దానికి శ్రీధర్ స్పందిస్తూ అసలు మీరే నాకు స్వీట్స్ తినిపించాలి. కానీ ఆ శుభవార్త విన్నాకా నేనే స్వీట్స్ తీసుకొని వచ్చాను అంటాడు. దాంతో అసలు విషయం అర్థం చేసుకున్న కార్తీక్ శ్రీధర్ కు తెలిసి వచ్చేలా వివరిస్తాడు.

జ్యోత్స్న పెళ్లి శుభవార్తనే ఆస్తిని రాసిచ్చిన శుభవార్తగా భావిస్తున్నాడని కార్తీక్ బాబు వివరిస్తాడు. జ్యోత్స్నకు ఈరోజు పెళ్లి చూపులు.. అదే పిన్ని ఫోన్ లో మాట్లాడి ఉంటుంది. కానీ మీకు మాత్రం ఆస్తి మాకే వచ్చిందనే శుభవార్తలా అర్థమైందంటూ చెబుతాడు. అసలు మేటర్ అది కాదు అని.. జ్యోత్స్నకు పెళ్లి చూపులు జరుగుతుండటమే అసలు శుభవార్త అని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ షాక్ అయ్యాడు. జ్యోత్స్న అసలు పెళ్లికి ఒప్పుకుందా? అంటూ సందేహిస్తాడు. ఆ విషయమే తెలియడం లేదని అందరూ తమ బదులిస్తారు. కానీ శ్రీధర్ మాత్రం జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంటే మరి ఆస్తి ఎవరికి వెళ్తుందంటూ సందేహిస్తాడు.

కార్తీక్ బాబు అసలు విషయం చెప్పడంతో శ్రీధర్ బాబు కంగు తింటాడు. దాంతో అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. ఇక ఏం చేయాలో తోచని స్థితిలో కార్తీక్ బాబుపై మండిపడుతాడు. ఆస్తి త్వరగా చేతికి చిక్కడం లేదనే కోపంలో కార్తీక్ బాబపై మాటల తూటాలు పెల్చుతాడు. సూటిపోటి మాటలతో అవమానిస్తాడు. కార్తీక్ కు అష్టదరిద్రాలు దీపాతోనే అంటుకున్నాయని బాధపెడుతాడు. దీపాను పెళ్లిచేసుకోకపోయి ఉంటే... అష్ట ఐశ్వర్యాలు అనుభవించేవాడని శ్రీధర్ తన అభిప్రాయాన్ని చెబుతాడు. అంతే కాదు... దీపా వల్లే కార్తీక్ కు ఎలాంటి సుఖం లేకపోయిందని, పైగా కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడని మొహం మీదనే చెబుతాడు శ్రీధర్. జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కి ఉండేదని చెబుతాడు. దీపాతో పెళ్లి చేసుకోగానే సీఈవో పోస్ట్, ఆస్తి పోయి ఇలా పెంకుటిళ్లులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ దెప్పిపొడుతాడు.

శ్రీధర్ మాటలు విన్నాక కార్తీక్ పౌరుషంతో రగిలిపోతాడు. లేనిపోని మాటలతో హింసపెట్టినందుకు కోపోద్రేకితుడవుతాడు. పట్టలేని కోపంతో తండ్రిపై మండిపడుతాడు. ఒక్క క్షణం తన ముందు ఉన్నా చేయి చేసుకోవాల్సి వస్తుందని చెబుతాడు. తన మాటలు వినేందుకు ఇక్కడెవరూ సిద్ధంగా లేరని, నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తాడు. ఇప్పుడు తామంతా సంతోషంగానే ఉన్నామని, తప్పులు చేసిన వ్యక్తే నీతులు వల్లిస్తుంటే వినలేక పోతున్నామని మండిపడుతాడు. ఇంకో నిమిషం ఇంట్లో కనిపిస్తే ఒళ్లు హునమయ్యే కొడుతానని అంటాడు. దీపాను అన్నేసి మాటలు అనడంతో సహించలేకపోతాడు కార్తీక్ బాబు. దాంతో తండ్రిపైనే టెబుల్ ఎత్తి తన కోపాన్నిచూపిస్తాడు. దాంతో శ్రీధర్ వణికిపోతాడు. కాంచనా కార్తీక్ బాబును శాంత పరిచి శ్రీధర్ అక్కడిని వెళ్లిపోయేలా చూస్తుంది. ఆ తర్వాత కార్తీక్ బాబు, దీపాలిద్దరూ రెస్టారెంట్ కు బయల్దేరుతారు.

ఇదిలా ఉంటే.. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న గౌతమ్ ను మళ్లీ దీపా రోడ్డు మీద చూస్తుంది. అది కూడా వేరే అమ్మాయితో కారులో ఉండగా... ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా చూసి షాక్ అవుతుంది. తను ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వెళ్లిన సందర్భంలో గౌతమ్ ఓ అమ్మాయికి కడుపు చేసి మరీ బాధ్యతారహితంగా ప్రవర్తించడం దీపాకు కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మరో అమ్మాయితో గౌతమ్ కనిపించడంతో సంహించలేకపోతుంది. కారులో కనిపించి, వెళ్తుండగా రాయి పట్టుకొని మరీ కారుపైకి విసురుతుంది. మళ్లీ తన చేతికి దొరికితే మాత్రం అంతు చూస్తానని ఆవేశం వెల్లగక్కుతుంది. పక్కనే ఉన్న కార్తీక్ బాబు దీపా కోపాన్ని చూసి ఎవరు అతను ఏం జరిగిందంటూ... ఆరా తీస్తాడు. దీపా గతంలో జరిగిన విషయాన్ని కార్తీక్ బాబుకు చెబుతుంది.

అమ్మాయిలు అసలు ఇలాంటి మోసగాళ్లనే ఎలా ఇష్టపడుతారు. ఎంతో మంది అమ్మాయిల మానాలతో ఆ వెదవ ఆడుకుంటున్నాడని కార్తీక్ బాబుతో చెబుతూ కోపంతో రగిలిపోతుంది దీపా. మళ్లీ తనకంట కచ్చితంగా పడుతాడని అప్పడు తగిన బుద్ధి చెబుతానని దీపా నిర్ణయించుకుంటుంది. ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ.. ఇలా ఎంత మందికి అని మనం బుద్ధి నేర్పగలం.. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే వ్యక్తులు మన చుట్టూనే, మన ఇంట్లోనే మా నాన్న ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేగలమంటూ బదలిస్తాడు. ఇదిలా ఉంటే... ఓవైపు జ్యోత్స్న పెళ్లిచూపుల కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతుంటుంది. అక్కడి పెళ్లికొడుకుగా గౌతమ్ రావడం ట్విస్ట్ ను క్రియేట్ చేసింది. ఇక గౌతమ్ గుట్టుఎలా రట్టు అవుతుంది? కామాంధుడైన గౌతమ్ ను జ్యోత్స్న పెళ్లి చేసుకుంటుందా? జ్యోత్స్న అప్పటికే ఇంకేదైనా ప్లాన్ తో ఉందా? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Read more about: karthika deepam 2 telugu serial
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X