Karthika deepam 2 March 18th : కామాంధుడితో జ్యోత్స్నకు పెళ్లి చూపులు.. ముందే పసిగట్టిన కార్తీక్ బాబు!
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 18వ తేదీ 308వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆస్తి పంకాల విషయంలో శివనారాయణ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కథ కొత్త మలుపుకు దారి తీస్తోంది. 'అసలు వారసురాలు' ఎవరనేది తేలే వరకు ఆస్తి ఎవరికి దక్కుతుందనేది రహస్యంగానే ఉండిపోయింది. ఇదిలా ఉంటే.. జ్యోత్స్నకు పెళ్లి చేసే ఏర్పాట్లతో తాత శివనారాయణ, తల్లిదండ్రులు దశరథ్, సుమిత్రలు బిజీగా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు బావ కార్తీక్ బాబు వెంటపడిన జ్యోత్స్న ప్రస్తుతం పెళ్లికి ఒప్పుకోవడం మరో ట్విస్ట్ కు దారి తీసింది. అసలు జ్యోత్స్న పెళ్లికి అంగీకారం తెలియజేయడం వెనకున్న మతలాబ్ ఏంటనేది అంతుచిక్కకుండా ఉంది. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని అంటే అటు కార్తీక్ బాబు కూడా నమ్మడం లేదు. బంధువులేవరూ నమ్మబోవడం లేదు.
మరోవైపు జ్యోత్స్నకు తాత శివనారాయణ పోయిపోయి ఓ కామంధుడినే పెళ్లికొడుకుగా సంబంధం చూసి పెడ్తాడు. అతని పేరు గౌతమ్. గౌతమ్ అమ్మాయిలను వాడుకొని వదిలేసే వ్యక్తత్వం ఉన్న వాడు. ఈ విషయం అప్పటికే దీపాకు తెలుస్తుంది. అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. పెళ్లి చూపులకు వెళ్తూ కూడా గౌతమ్ మరో అమ్మాయితో కనిపిస్తాడు. ఆమెతో రొమాన్స్ చేస్తూ దీపా కంట పడుతాడు. దీపా పట్టుకుందామనే లోపే కారులో వెళ్లిపోతాడు. అక్కడి నుంచి గౌతమ్ నేరుగా జ్యోత్స్నతో పెళ్లిచూపులకు వెళ్తాడు. గుడికి వెళ్లొచ్చే సరికి లేట్ అయ్యిందని బదులిస్తాడు. ఇక అందరూ గౌతమ్ అసలు రంగు తెలియకపోవడంతో మంచి వాడని నమ్ముతారు. ఇక జ్యోత్స్న కూడా వచ్చి గౌతమ్ ను చూస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. జ్యోత్స్న గౌతమ్ తో పెళ్లికి అంగీకరిస్తుందా? లేదా? అన్నది తరువాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక కార్తీక దీపం 2 మార్చి 18వ తేదీ 308 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే......?

జ్యోత్స్నతో గౌతమ్ పెళ్లి చూపులు గ్రాండ్ గా జరిగింది. జ్యోత్స్న కూడా ఎంత ముద్దుగా రెడీ అయ్యి పెళ్లికి తన అంగీకారాన్ని తెలియజేసింది. కలెక్టర్ గారి అబ్బాయి గౌతమ్ కు జ్యోత్స్నను ఇచ్చి పెళ్లి చేసేందుకు అందరూ ఆనందం వ్యక్తం చేస్తారు. జ్యోత్స్నను పెళ్లి చేసుకున్న వారికే సర్వదాస్తి దక్కుతుందని చెబుతాడు శివనారాయణ. ఇక పెళ్లి వరకు ఇవ్వాళ్సిన అన్ని కట్నకానుకలు ఇస్తామన్నారు. ఆ తర్వాత గౌతమ్, జ్యోత్స్న ఇద్దరూ విడిగా మాట్లాడుకున్నారు. ఇక గౌతమ్ ఎప్పటి నుంచో జ్యోత్స్న వెంట పడుతున్నాడు. కానీ జ్యోత్స్న తన బావ కార్తీక్ బాబుపై మనసు పడటంతో అస్సలు ఒప్పుకోదు. కొన్నాళ్లుగా కార్తీక్ చుట్టూ తిరుగూనే ఉంటుంది. ఇక ఏట్టకేలకు గౌతమ్ తో పెళ్లికి అంగీకరిస్తుంది. ఇక అదే విషయాన్ని గౌతమ్ కు కూడా చెబుతుంది.
ఇక గౌతమ్ అసలు రంగును చూపిస్తాడు. జ్యోత్స్న ను పెళ్లి చేసుకోవడంతో కేవలం రూ.100 కోట్ల ఆస్తిని పొందుతానని అనుకుంటే.. ఏకంగా యవదాస్తికి ఓనర్ కాబోతున్నానని గౌతమ్ లోలోపల సంతోషం వ్యక్తం చేస్తాడు. ఇక జ్యోత్స్నపై కపట ప్రేమను చూపిస్తాడు. గులాబీ పువ్వు ఇచ్చి ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాడు. అటు జ్యోత్స్న కూడా తనకు ఈ పెళ్లి ఇష్టమేనని గౌతమ్ కు చెబుతుంది. ఇక పెళ్లి చూపుల తంతు ముగియడంతో గౌతమ్ వాళ్లు వెళ్లిపోతారు. ఇక వెంటనే జ్యోత్స్న ఈ శుభవార్తతో పాటు కార్తీక్ బాబు తన నుంచి ఏం మిస్ అవుతున్నారో తెలియజేసేందుకు వాళ్ల ఇంటికి వెళ్తుంది. స్వీట్స్ తీసుకొని మరీ కాంచనా అత్త వారింటికి వెళ్తుంది.
కార్తీక్ బాబు, దీపా, అత్త కాంచనను కలిసి తనకు పెళ్లి చూపులు అయ్యాయనే శుభవార్తను అందరికీ తెలియజేస్తుంది. స్వీట్స్ పంపిణీ చేసి మరీ తిపి కబురు చెబుతుంది. దాంతో అందరూ సంతోషిస్తారు. కానీ కార్తీక్ బాబుకు స్వీట్ ఇచ్చే సరికి బాక్స్ లో అయిపోతాయి. నీకు నన్నే స్వీట్ గా ఇద్దామని ఎంత ప్రయత్నించినా దక్కకుండా పోతుంది బావ. అందుకు బాధపడుతున్నావా? అంటూ ప్రశ్నిస్తుంది కార్తీక్ బాబును. కానీ కార్తీక్ బాబు అదేం లేదని, తనను అర్థం చేసుకునే వ్యక్తి దీపా తనపక్కనే ఉందని బదులిస్తాడు. ఇక తన పెళ్లి చూపుల్లో అత్త కాంచన, బావ కార్తీక్ బావ లేకపోవడంతో చాలా బాధపడ్డానని జ్యోత్స్న చెబుతుంది. ఇక ఎంగేజ్ మెంట్ కైనా కచ్చితంగా అత్త కాంచన, బావ కార్తీక్ ఉండాలని ఆహ్వానించింది. దీనికి కాంచన ఎంతో సంతోషిస్తుంది.

కానీ కార్తీక్ మాత్రం దీపా పెళ్లికి ఒప్పుకుంది అంటే ఏమాత్రం నమ్మబోడు. ఇంత సడెన్ గా పెళ్లి ఒప్పుకొని ఎలాంటి ప్లాన్ వేసిందోనని అనుమానిస్తాడు. ఇక జ్యోత్స్న వెళ్తూ వెళ్తూ మన అందరి కుటుంబాలు కలిసి పోవాలని కోరుకుంటున్నాను.. గతంలో కార్తీక్ బావతో నాకు ఎంగేజ్ మెంట్ అయ్యింది, పెళ్లి వరకు వచ్చి వేడుక ఆగిపోయింది. దాని ఒక వ్యక్తి (దీపా) కారమని మొహం ముందే అనేస్తుంది. ఆమెవరి కోసమో మనమందరం ఎందుకు దూరం కావాలి అంటూ అత్త కాంచనాకు చెబుతుంది. ఇక దీపా కూడా కుటుంబం మొత్తం కలవాలనే తాను కూడా ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. జ్యోత్స్న తీరుకు అత్త కాంచన, దీపా సంతోషించినా.. కార్తీక్ బాబుకు మరదలుపై అనుమానం పోవడం లేదు.
మరోవైపు జ్యోత్స్న పెళ్లికి ముహుర్తం పెట్టిస్తారు. దగ్గర్లోనే ఉండటంతో ముందుగా ఎంగేజ్ మెంట్ జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ సందర్భంగా నిశితార్థానికి తమ బంధువులు, మిత్రులు, ఆఖరికి తమ శత్రువైన సత్యరాజ్ ను కూడా ఆహ్వానించేందుకు కార్డులు ప్రింట్ చేయిస్తారు. మరోవైపు జ్యోత్స్న స్నేహితులకు కూడా ఆహ్వాన పత్రిక పేర్లు రాసి మరీ ఇవ్వండి అని శివనారాయణ చెబుతాడు. అయితే, కొడుకు దశరథ్ మాత్రం తన చెల్లి కాంచన పేరు మీద ఆహ్వాన పత్రిక ఇవ్వమని తండ్రి చెప్పకపోవడంతో చాలా బాధపడుతాడు. తండ్రి శివనారాయణకు చెల్లి కాంచన లేకపోతే ఎలా అంటూ గుర్తు చేస్తాడు. కానీ కార్తీక్ బాబు జ్యోత్స్నను పెళ్లి చేసుకోని కారణంగానే మనకు ఇలాంటి పరిస్థితి పట్టిందని, జ్యోత్స్న కాంచన కోడలే కావాల్సిందని... కానీ వాళ్లు వద్దనడంతోనే వేరే సంబంధం చూసి పెళ్లి చేయాల్సి వస్తోందని కొడుకు, కోడలు సుమిత్రతో అంటాడు. శివనారాయణ ఎంత చెప్పినా.. కాంచనా వేడుకలో ఉండాలని తమ అభిప్రాయాన్ని చెబుతారు. ఇక కాంచన, కార్తీక్ బాబు, దీపా జ్యోత్స్న నిశ్చితార్థానికి వస్తారా? లేదా? అన్నది చూడాలి. మరోవైపు జ్యోత్స్న ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడం ఏదైనా ట్విస్ట్ ఇస్తుందా? అనేది కూడా తరువాయి ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.


Click it and Unblock the Notifications











