Karthika deepam 2 March 19th : ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జ్యోత్స్న.. విఫలమైన దీపా
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 18వ తేదీ 308వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం శివనారాయణ ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతోంది. ఇన్నాళ్లు బావ కార్తీక్ వెంట పడ్డ జ్యోత్స్నకు ముక్కుతాడు వేసేందుకు తాత శివనారాయణ, తండ్రి దశరథ్ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక్ బాబును దక్కించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నించి విఫలమవుతూనే వస్తున్న జ్యోత్స్న ఇక ఏం చేయలేని పరిస్థితిలో పెళ్లికి ఒప్పుకుంటుంది. అయితే ఉన్నట్టుండిగా జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడం వల్లనే అసలు ట్విస్ట్ మొదలైంది. అసలు జ్యో నిజంగానే పెళ్లికి ఒప్పుకుందా? లేదా? అనే సందేహం అందరిలోనూ ఉత్పన్నమవుతోంది.
మరోవైపు కార్తీక్ బాబు కూడా జ్యోత్న్స పెళ్లికి ఒప్పుకుందని అంటే ఏమాత్రం నమ్మబోడు. ఆమె పెళ్లి వెనకాల ఏదో ప్లాన్ వేసే ఉంటుందని, ఇంత నాటకమేనని అనుమానిస్తూనే ఉంటాడు. ఇక ప్రస్తుతం జ్యోత్స్నకు పెళ్లి చూపులు అయినప్పటికీ కార్తీక్ బాబు ఏమాత్రం నమ్మబోడు. ఇక దీపా, తల్లి కాంచనా మాత్రం జ్యోత్స్న మారిపోయిందని పూర్తిగా నమ్ముతారు. జ్యోకు పెళ్లి కుదిరిందనే వార్తతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందా? లేదా? అనేది ఒక సందేహమైతే.. జ్యోత్స్న పెళ్లి చేసుకోబోయే వాడు అమ్మాయిను వాడుకొని వదిలేసే గుణం వ్యక్తి కావడం మరో ట్విస్ట్. అతని గురించి దీపాకు పూర్తిగా తెలుసు. దీంతో జ్యోత్స్న పెళ్లిని గౌతమ్ తో కాకుండా ఆపుతుందా? లేదా? ఆపితే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక కార్తీక దీపం 2 మార్చి 19వ తేదీ 309 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...?

జ్యోత్స్న నిశ్చితార్థం కోసమని ఆహ్వాన పత్రికలు ప్రింట్ చేయిస్తారు. బంధుమిత్రులతో పాటు, జ్యోత్స్న ఫ్రెండ్స్ ను కూడా ఇన్వైట్ చేసేందుకు శివనారాయణ పర్మిషన్ ఇస్తారు. కానీ తన సొంత కూతురు కాంచనను మాత్రం పిలవొద్దని చెబుతాడు. దాంతో కొడుకు దశరథ్ కంగారు పడుతాడు. చెల్లి లేకుండా తనకూతురు నిశ్చితార్థం ఎలా జరుగుతుందంటూ తండ్రి దశరథ్ తో అంటాడు. దానికి శివనారాయణ మండిపోతాడు. ఇంకెప్పుడు వాళ్ల పేర్లు చెప్పకూడదని హెచ్చరిస్తాడు. తనను కాదని, తన వ్యాపారాలను కాదని వెళ్లిపోయిన కాంచన, కార్తీక్ బాబుల గురించి తన ముందు ఎప్పుడూ మాట్లాడకూడదని చెబుతాడు. తనకు ఒక్కడే కొడుకు, ఒక్కతే మనవారాలు ఉందని బంధాన్నీ తెచ్చేకుంటాడు.
తండ్రి శివనారాయణ మాటలతో ఇంకా బాధపడుతాడు దశరథ్. అటు సుమిత్ర కూడా బాధపడుతుంది. కానీ జ్యోత్స్న మాత్రం వారికి తిపి కబురు చెబుతుంది. కాంచన అత్త, కార్తీక్ బాబు తన నిశ్చితార్థానికి తప్పకుండా వస్తారని మాట ఇస్తుంది. తను ఇందాకనే వెళ్లి కాంచన అత్త, కార్తీక్ బాబును కలిశానని చెబుతుంది. తన నిశ్చితార్థం గురించి వారికి చెప్పేశానని, వారంత ఎంతో సంతోషిస్తున్నారని వివరిస్తుంది. తన ఎంగేజ్ మెంట్ వాళ్లు తప్పకుండా వస్తారని, మీరు కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానించండి అంటూ చెబుతారు. తాతను ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని అఫీషియల్ గా పర్మిషన్ తీసుకుంటానని తల్లిదండ్రులకు చెబుతుంది.
జ్యోత్స్న మాటలతో తల్లిదండ్రులు దశరథ్, సుమిత్రలు ఫుల్ ఖుషి అవుతారు. చాలా సంతోషకరమైన కబురు చెప్పావంటూ కూతురికి ధన్యవాదాలు చెబుతాడు. గతంలో ఎంత హింసించిందో ప్రస్తుతం అంత సంతోష పెడుతున్నదంటూ కొడుకుపై ప్రశంసలు కురిపిస్తుంది. ఇదిలా ఉంటే.. దశరథ్ మాత్రం అసలు జ్యోత్స్న దాస్, శౌర్య, సౌమ్యలను ఎందుకు చంపాలనుకుందంటూ మరోసారి గుర్తుచేసుకుంటాడు. జ్యోత్స్న తండ్రి ఆలోచనను పసిగడుతుంది. ఎందుకు వారిని చంపాలని ప్రయత్నించానో నీకు తెలిసేలోపే వాళ్లను భూమిమీద లేకుండా చేస్తానని శపథం చేసుకుంటుంది. అలాగే దీపాను కూడా చంపేస్తానని మనస్సులో అనుకుంటూ ఉంటుంది.
ఇక మరోవైపు జ్యోత్స్న తనను వదిలేసి తల్లిదండ్రులతో చనువుగా ఉండటంతో పారు ఝలసీ ఫీల్ అవుతుంది. ఎలా మారిపోయిందోనంటూ ఆలోచిస్తుంటుంది. ఇక మరోవైపు దీపా, కార్తీక్ బాబు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తమ వ్యాపాలను మరింతగా వృద్ధి చేయాలని భావిస్తారు. అదే సమయంలో జ్యోత్స్న తండ్రి దశరథ్ తన చెల్లి కాంచనకు ఫోన్ చేస్తాడు. జోత్స్న నిశ్చితార్థానికి రావాలని కోరుతాడు. ఈ క్రమంలోనే తన చెల్లి ఇంటికి ఇవ్వాల్సిన జ్యోత్స్నను మరొకరి ఇంటికి పంపించాల్సి వస్తోందని చెబుతాడు. ఇక ఏదేమైనా తన చెల్లి జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కు వచ్చి అక్షింతలు వేయాల్సిందేనని చెబుతాడు. అయితే, తల్లి కాంచన తన అన్న దశరథ్ తో మాట్లాడిన మాటలను కార్తీక్ బాబు వింటారు. మేనకోడలు జ్యోత్స్నను కోడలు చేసుకోకపోవడం వల్ల కాంచన ఇంకా బాధపడుతుంది. కార్తీక్ బాబు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.
కానీ కాంచన మాత్రం తనకు ఎలాంటి బాధ లేదన్నారు. పుట్టింటిపై ప్రేమను ఒకేసారి చంపేసుకోలేము కాదా? అని కార్తీక్ తో చెబుతుంది. ఇక దీపా కూడా అత్త కాంచన బాధపడటం చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జ్యోత్స్న మీ కోడలు కాకపోవడం వల్ల బాధపడుతున్నారు మీరు.. ఆమె నిజంగానే మీ కోడలు అయ్యి ఉంటే సంతోషించే వారు కదా అంటూ కాంచనాతో దీపా అంటుంది. కానీ కాంచనా మాత్రం నువ్వు మాత్రం నాకు మేనకోడలివే కాదా.. మీ నాన్న నాకు అన్నయ్య అయినప్పుడు నిన్ను మేనకోడలని అనుకోలేనా? అంటూ బదులిస్తుంది. నేను ఏం కోల్పోయానో బాధపడటం లేదని, ఏం దక్కిందో దాంతోనే సంబర పడుతున్నానని చెప్పి వెళ్లిపోతుంది. ఇక ఆ విషయం విన్న కార్తీక్ బాబు దీపాపై కోసం చేస్తాడు. కాంచనమ్మతో ఏం మాట్లాడుతున్నావని మందలిస్తాడు. నా మనస్సులో నువ్వే ఉంటావని మరోసారి స్పష్టం చేస్తాడు.
అయితే, జ్యోత్స్న మాత్రం మరో ప్లాన్ చేస్తూ ఉంటుంది. కార్తీక్ బాబు, దీపాల రెస్టారెంట్ కు వెళ్లి తన నిశ్చితార్థానికి ఆర్డర్ ఇచ్చి ఏదోలా ఇరకాటంలో పెట్టాలని భావిస్తుంది. వెంటనే తన గ్రాండ్ మదర్ పారుజాతాన్ని కారులో దీపా వాళ్ల రెస్టారెంట్ వరకు తీసుకెళ్తుంది. తన నిశ్చితార్థం కోసమని పారుతో 100 పేట్ల వరకు ఆర్డర్ ఇవ్వమని చెబుతుంది. దాంతో పారు దీపా రెస్టారెంట్ లోపలికి వెళ్లి హ్యయేస్ట్ ప్రైజ్ ఉన్న మీల్స్ ను ఆర్డర్ చేస్తుంది. 3 లక్షల రూపాయాల ఫుల్ పేమేంట్ కూడా చేస్తుంది. అయితే, జ్యోత్స్నను చూస్తే దీపా రెస్టారెంట్ లో ఆర్డర్ తీసుకోరని, అందుకే పారుతో ఆర్డర్ తీసుకుంటుంది. ఆలోగానే కార్తీక్ బాబు, దీపా రెస్టారెంట్ వైపు సైకిల్ పై వస్తూ ఉంటారు. కారులో వెయిట్ చేస్తున్న జ్యోత్స్న వారు రావడాన్ని గమనిస్తుంది. పారును, తనను చూస్తారేమోనని భయపడుతుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











