Karthika deepam 2 March 20th : పారు, జ్యోత్స్నల దొంగపని.. ఇంటికెళ్లి రచ్చ చేసిన కార్తీక్ బాబు

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 19వ తేదీ 309వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబునే పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న ఎంతో కాలంగా విఫలయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరినీ పెళ్లి చేసుకోనని మంకు పట్టుపట్టిన జ్యోత్స్న ఎట్టకేలకు పెళ్లికి ఒప్పుకుంది. దీంతో తాత శివనారాయణ, తల్లిదండ్రులు దశరథ్, సుమిత్రలు ఎంతో సంతోషపడుతారు. కలెక్టర్ గారి కొడుకు, తన పాత స్నేహితుడు గౌతమ్ తోనే పెళ్లికి జ్యోత్స్న అంగీకారం తెలుపుతుంది. ఇక పెళ్లి చూపులు కూడా గ్రాండ్ గానే జరుగుతాయి. పెళ్లి చూపుల్లోనూ గౌతమ్ ను పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న ఒప్పుకుంటుంది. దాంతో అందరూ సంతోషిస్తారు. ఇక తాత శివనారాయణ, తండ్రి దశరథ్ వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తారు. దీంతో ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన పనులను జరిపిస్తున్నారు.

కానీ కార్తీక్ బాబు ఏమాత్రం జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందంటే నమ్మబోడు. జ్యోత్స్న ఏదో ప్లాన్ లోనే ఉందని, అందుకే పెళ్లినాటకం ఆడుతుందని మనసులో అనుకుంటూ ఉంటాడు. అదే విషయాన్ని తల్లి కాంచన, భార్య దీపాకూ కూడా చెబుతాడు. అయితే జ్యోత్స్న కూడా పైకి పెళ్లికి ఓకే అని చెప్పినా ఆమె చేసే పనులు మాత్రం ఏదో నాటకానికి తెరలేపబోతుందని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తన నిశ్చితార్థానికి మేనత్త కాంచనను, బావ కార్తీక్ బాబును తప్పకుండా రావాలని తానే స్వయంగా ఆహ్వానిస్తుంది. మరోవైపు కార్తీక్ బాబు, దీపాలకు తెలియకుండా సత్యరాజ్ రెస్టారెంట్ లో తన ఎంగేజ్ మెంట్ భోజనాల కోసం 100 పేట్ల ఆర్డర్ ఇస్తుంది. ఫుల్ ఎమౌంట్ రూ.3 లక్షలను తన గ్రాండ్ మదర్ పారుజాతంతో కట్టిస్తోంది. అయితే అదే సమయానికి కార్తీక్ బాబు, దీపాలు రెస్టారెంట్ వైపు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందేని ఆసక్తికరంగా మారింది. ఇక మార్చి 20వ తేదీ 310 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...?

Karthika deepam 2 Serial Today s Episode 310 March 20th 2025

కార్తీక్, దీపాల రెస్టారెంట్లో పారిజాతంతో జ్యోత్స్న ఆర్డర్ ఇప్పించింది. ఇక అప్పటికే కార్తీక్, దీపాలు తమ రెస్టారెంట్ వద్దకు వస్తుంటారు. వీళ్లు వస్తున్న సంగతిని జ్యోత్స్న గమనిస్తుంది. త్వరగా ఆర్డర్ ఇచ్చి పారిజాతం తిరిగి రావట్లేదు ఏంటని టెన్షన్ పడుతుంది. పారిజాతాన్ని చూస్తారేమో కంగారు పడుతుంది. కానీ జ్యోత్స్న గ్రాండ్ మదర్ పారిజాతం వారి కంట్లో పడకుండా బయటికి వస్తుంది. కానీ వాళ్ళను గమనించదు. ఇక తన కారు వద్దకు రాగానే పారిజాతాన్ని త్వరగా కారులోకి ఎక్కమని జ్యోత్స్న కంగారు పెడుతుంది. వాళ్లు వెనకే ఉన్నారని చెప్పడంతో పారు టెన్షన్లో కార్ ఎక్కేస్తుంది. ఇక తను వెళ్ళిన పని సక్సెస్ అయిందని, ఆర్డర్ ఇచ్చి, ఫుల్ అమౌంట్ పే చేసానని పారిజాతం జ్యోత్స్న కు సంతోషంతో చెబుతుంది. ఒకవేళ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే తిరిగి మనకి 6 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెబుతుంది. అలా ఇవ్వడం వారి రెస్టారెంట్ రూల్ అని కూడా తెలియజేస్తుంది.

ఇక రెస్టారెంట్ లోపలికి వెళ్లిన కార్తీక్ బాబు, దీపాలకు తమ రెస్టారెంట్లో ఆర్డర్ తీసుకున్న విషయాన్ని వర్కర్ చెబుతాడు. సర్ ఈరోజు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది, మన రెస్టారెంట్ లోనే హైయెస్ట్ ప్రైస్ ఉన్న మీల్స్ ని ఆర్డర్ చేసి, 3 లక్షల రూపాయలు ఫుల్ అమౌంట్ కూడా పే చేశారు అంటూ సంతోషంలో తెలియజేస్తాడు. అది విన్న కార్తీక్ బాబు, ఎవరు? వారి పేరేంటీ? డీటెయిల్స్ ఏమైనా కనుక్కున్నావా అని అడుగుతాడు. కంగారులో మర్చిపోయాను అని అని వర్కర్ బదులిస్తాడు. కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారంటూ చీటీ ఇస్తాడు. పైసలు చూసిన మైకంలో వివరాలు అడగడం కూడా మర్చిపోయావా అంటూ కార్తీక్ బాబు వర్కర్ పై మండిపడతాడు. ఆ చీటీ చూడగానే పారిజాతం వచ్చే ఆర్డర్ ఇచ్చిందని గుర్తిస్తాడు. వెంటనే పారు ఫోటోను ఆ వర్కర్ కు చూపించి కన్ఫర్మ్ చేసుకుంటాడు.

ఇక పారిజాతం ఇలా మన రెస్టారెంట్ కు వచ్చి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని దీప కార్తీక్ బాబుతో అంటుంది. ఇక వెంటనే కార్తీక్ బాబు చేసేదేముంది ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ నుంచి మెనూ కూడా తీసుకోవాలి కదా అని బదులిస్తాడు. స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లే ఆర్డర్ తీసుకుందాం పద అని దీపాను తీసుకెళ్తాడు. ఇక అప్పటికే అక్కడ జోత్స్నకు పెళ్లి చీర కోసం పలు రకాల డిజైన్లను చూస్తూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ని సుమిత్ర తన కూతురు జోత్స్నకు చూపిస్తూ ఉంటుంది. ఆలోగా కార్తీక్ బాబు, దీప ఆర్డర్ తీసుకోవడం కోసం అని ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కుతారు. ఇక కాలింగ్ బెల్ ఎవరు నొక్కేరా చూడడం కోసం పారిజాతం వెళ్లి డోర్ తీస్తుంది. వాళ్లను చూడగానే షాక్ అవుతుంది.

సుమిత్ర ఇంట్లో నుంచి వచ్చింది ఎవరు అంటూ అత్త సుమిత్ర అని అడుగుతుంది. ఇంకెవరు నీ మేనకోడలు ఆయన పెళ్ళాం అంటూ ఎటకారంగా బదులిస్తుంది. ఇక సుమిత్ర, దశరథ్ గబగబా ఇంట్లో నుంచి బయటికి వస్తారు. వాళ్లు రాగానే కార్తీక్ బాబు మేడం, సార్ అంటూ పిలుస్తూ మా రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చారు మేడం మీరు మెనూ చెప్తే రాసుకొని వెళ్తాం అని కార్తీక్ బాబు అడుగుతాడు. అసలు ఆర్డర్ ఎవరిచ్చారు అంటూ సుమిత్ర ప్రశ్నిస్తుంది. పారిజాతం ఇచ్చారని కార్తీక్ బాబు నిర్మోహమాటంగా చెబుతాడు. ఇచ్చింది నేనే కానీ ఇవ్వమని చెప్పింది మాత్రం జ్యోత్స్న అంటూ బదిలిస్తుంది. అత్తయ్యను రావాలని చెప్పినందుకే ఇలా ఆర్డర్ ఇచ్చానని, నార్మల్ గా తాత వాళ్లని రానిస్తాడో లేదోనని ఇలా ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పింది.

ఇక అప్పటికి కూడా కార్తీక్ బాబు తన మేనమామ దశరథ్ ను సార్ అని, అత్తను మేడం అంటూనే పిలుస్తుంటాడు. దీంతో ఒక్కసారిగా కోపోద్రికుడైన దశరథ్ తన మేనల్లుడు కార్తీక్ బాబు పై మండిపడతాడు. సార్ మేడమ్ అంటూ ఇంకా దూరాన్ని పెంచుకోరా అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తాడు. అసలు మీరు ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడే ఆపి గట్టిగా మాట్లాడాల్సింది. కానీ కుదరలేదు. ఇప్పుడు ఇంకా నీ వల్ల దూరం పెంచుతున్నావు అని బాధపడతాడు. నువ్వు ఇంట్లో నుంచి వేసిన ఒక్క అడుగు నా చెల్లికి నాకు మధ్య దూరాన్ని పెంచింది. నా తండ్రికి నాకు, మా చెల్లికి నా తండ్రికి మధ్య దూరాన్ని పెంచిందంటూ వివరిస్తాడు. ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ మరిప్పుడు మా అమ్మను మీ ఇంట్లోకి తీసుకురాగలుగుతారా? తాతయ్య మీ భార్యను వదిలేయమంటే మీరు వదిలేస్తారా? అని గట్టిగా ప్రశ్నిస్తాడు.

ఇక దశరథ్ మా నాన్న చెప్పిన నేను అత్తను వదిలేసేవాన్ని కాదని బదులిస్తాడు. కూడా అదే మామయ్య అంటూ కార్తీక్ వివరిస్తాడు. ఏ బంధమైనా తెంచుకోవడం సులువని, భరించడం చాలా కష్టమని దశరథ్, కార్తీక్ బాబుతో అంటాడు. ఇంకా భరిస్తూనే ఉన్నామని చెబుతాడు. ఆలోగా బయటికి వెళ్లిన దశరథ్ తిరిగి వస్తాడు. ఫుడ్ ఆర్డర్ విషయం తెలుసుకుని మండిపడుతాడు. జ్యోత్స్నను ఇంట్లోకి వెళ్లమని అంటాడు. ఇక ఆర్డర్ కు సంబంధించిన మెనూ ఫోన్ లో చెబుతారు. మీరు వెళ్లండి అంటూ కార్తీక్ బాబుకు బదులిస్తాడు. దాంతో కార్తీక్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత దశరథ్ వాళ్లను ఏమని ఉంటాడనేది ఆసక్తికరంగా మారింది. రేపటికి ఆ ఎపిసోడ్ వాయిదా పడింది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X