Karthika deepam 2 March 21st : జ్యోత్స్న పై తాత శివనారాయణ సీరియస్.. నిజం తెలుసుకున్న కార్తీక్ బాబు
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 20వ తేదీ 310వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శివానారాయణ ఇంట్లో జ్యోత్స్నకు సంబంధించిన పెళ్లి పనులు జరుగుతున్నాయి. కార్తీక్ బాబునే పెళ్లి చేసుకుంటానని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన జ్యోత్స్న కు చేధు అనుభవమే మిగిలింది. దీంతో తాత శివనారాయణ చూసిన సంబంధానికి ఓకే చెబుతుంది. పెళ్లి కొడుకు గౌతమ్ కూడా తనకు గతంలో తెలిసిన వ్యక్తి కావడంతో జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ కార్తీక్ బాబు మాత్రం జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది అంటే ఏమాత్రం నమ్మబోడు. తన మేన మరదలుపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంటాడు. పెళ్లి కూడా ఒక నాటకమేనని బలంగా నమ్ముతాడు. అనుకున్నట్టుగా జ్యోత్స్న తన అసలు రంగును బయటపెడుతుంది.
తన నిశ్చితార్థపు కార్యక్రమానికి పారుతో కార్తీక్ బాబు, దీపాల రెస్టారెంట్ లో భోజనాలకు ఆర్డర్ ఇస్తుంది. విషయం తెలుసుకున్న కార్తీక్ బాబు చిర్రెత్తిపోతాడు. ఇంతకీ ఆర్డర్ ఇచ్చి తమను అవమానించాలనుకున్నాడని తాత శివనారాయణను, పారుజాతంపై ఫైర్ అయ్యేందుకు నేరుగా వాళ్ల ఇంటికే వెళ్తాడు. అక్కడ అత్త, మామతో సార్, మేడమ్ అంటూ సంబోధిస్తాడు. తన మాటలతో దూరం పెంచుతాడు. అందుకు కారణం తమ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇవ్వడమేనని చెబుతాడు. ఆర్డర్ ఇచ్చారు కానీ మెనూ ఇవ్వలేదని చెబితే రాసుకొని వెళ్తామని బదులిస్తాడు. కార్తీక్ బాబు మాటలు విన్న మామ దశరథ్ చాలా బాధపడుతాడు. తమ మంధ్య ఏర్పడుతున్న దూరంతో ఎంతో కుమిలిపోతున్నామని తన బాధను వ్యక్తం చేశాడు. ఇక కార్తీక్ కూడా అందుకు కారణం తాను కాదని వివరిస్తాడు. ఇలోగా శివనారాయణ తిరిగి ఇంటికి వస్తాడు. భోజనాల ఆర్డర్ విషయం తెలుసుకొని పారు, జ్యోత్స్నలను ఇంట్లోకి పిలుస్తాడు. కార్తీక్ ను ఫోన్ లో మెనూ చెబుతారని పంపించేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మార్చి 21వ తేదీ 311 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...?

.... ఇక ఎవరిని అడిగి కార్తీక్ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చావని జ్యోత్స్నను తాత శివనారాయణ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న చేసిన పనితో శివనారాయణకు గుండె నొప్పి వచ్చినంత పనైతుంది. తాతకు పొలమారడంతో జ్యో, కుుటంబ సభ్యులు కంగారు పడుతారు. ఆయన కాస్తా శాంతించాక జ్యో ఎందుకు ఆర్డర్ ఇచ్చిందో చెప్పే ప్రయత్నం చేసింది. అత్త, కార్తీక్ కూడా తన నిశ్చితార్థానికి రావాలని కోరుకున్నట్టు చెబుతుంది. లేదంటే తన కూతురుని ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్టు జనాలు అందరూ అనుకుంటారని, క్యాటరింగ్ ద్వారా దీపాతో పనిచేయించి, అత్త , కార్తీక్ లను అధికారికంగా ఆహ్వానించి తమ కుటుంబంలో మళ్లీ కలుపుకోవాలని ఆలోచించినట్టు తెలిపింది. పైగా క్యాటరింగ్ కార్తీక్ వాళ్లకే అప్పజెప్పడం వల్ల రెండు కుటుంబాలు కలిసిపోయాయని అందరూ అనుకుంటారని వివరించింది.
ఇక జ్యోత్స్న చెప్పడంలోనూ న్యాయం ఉండటంతోపాటు, అప్పటికే తమ ఇంటిపై ఉన్న మచ్చ తొలిగిపోతుందనే భావనతో శివనారాయణ కూడా సైలెంట్ అవుతారు. ఆర్డర్ కు అనుమతిస్తున్నట్టు మౌనంగా లోపలికి వెళ్లిపోతారు. ఇక జ్యోత్స్న వెంటనే కార్తీక్ బాబుకు ఫోన్ చేసి ఆర్డర్ కన్ఫమ్ అని చెబుతుంది. అయితే అప్పటికే కార్తీక్ బాబు తన తల్లి కాంచనతో జరిగిన విషయాన్ని చెబుతాడు. కాంచన కూడా జ్యోత్స్న ఇంత పనిచేసిందా అంటూ మండిపడుతుంది. ఆ క్యాటరింగ్ ఆర్డర్ ను తిరిగి ఇచ్చేయండి అంటూ తెలుపుతుంది. కానీ వారి రెస్టారెంట్ రూల్ ప్రకారం ఒక్కసారి ఆర్డర్ తీసుకుంటే క్యాన్సిల్ చేసే అవకాశం లేదు. జ్యోత్స్న వాళ్లే క్యాన్సిల్ చేయాలని భావిస్తారు.
కానీ ఊహించని విధంగా జ్యోత్స్న ఫోన్ చేసి ఆర్డర్ ను క్యాన్సిల్ చేయకపోగా... మీరే స్వయంగా క్యాటరింగ్ చేయాలని కన్ఫమ్ చేస్తుంది. కార్తీక్ బాబు నో చెప్పబోతుంటే... దీపా మేం చేస్తామంటూ బదలిస్తుంది. మళ్లీ ఆర్డర్ క్యాన్సిల్ చేయరు కాదా అని జ్యోత్స్న దీపాను అడుగుతుంది. ఆర్డర్ తీసుకున్నాక క్యాన్సిల్ అనేది మీ నుంచే ఉండాలి కానీ మా నుంచి ఉండదని స్పష్టం చేస్తుంది. ఇక శివనారాయణకు ఆర్డర్ విషయం తెలిశాక కూడా ఒప్పుకున్నారంటే మనం తప్పకుండా క్యాటరింగ్ చేయాల్సిందేనని కార్తీక్ కూడా నిర్ణయించుకుంటాడు. బిజినెస్ పరంగానే వెళ్లి క్యాటరింగ్ చేద్దామని, అది తమకు కూడా మంచి గౌరవాన్నే పెడుతుందని చెబుతాడు. ఇక దీపా కూడా కార్తీక్ బాబు నిర్ణయాన్ని సమర్థిస్తుంది.
ఈ ఆర్డర్ వల్లనైనా.. రెండు కుటుంబాలు కలిసిపోతాయని ఆశిస్తున్నట్టు అత్త కాంచనతో దీపా చెబుతుంది. ఇక ఇదే విషయమై దీపా, కార్తీక్ లు కూడా మళ్లీ తమ బెడ్ రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందంటే ఏమాత్రం నమ్మకం కుదరటం లేదని కార్తీక్ చెబుతాడు. అలా ఏం జరగదంటూ కార్తీక్ బాబుకు దీపా సర్దిచెబుతుంది. ఇక తల్లి కాంచనాకు తన పుట్టినిల్లుపై ఉన్న ప్రేమను ఇద్దరు అర్థం చేసుకుంటారు. అక్కడి ఇంటి నుంచి ఎవరైనా వచ్చి అమ్మను ఆహ్వానిస్తే బాగుంటుందని ఆశిస్తాడు కార్తీక్. ఇక మరోవైపు కాంచన కూడా తండ్రి శివనారాయణ గానీ, అన్న దశరథ్ గానీ, వదిన సుమిత్ర గానీ తన ఇంటికి వచ్చి సంప్రదాయంగా ఆహ్వానిస్తారేమోనని ఎదురుచూస్తుంది. గుమ్మం ముందే కూర్చొని వాకిలికేసి చూస్తూ ఉంటుంది.
ఈ ఆ విషయాన్ని గమనించిన కార్తీక్ బాబు బాధపడుతుంది. తన తల్లికి పుట్టినింటి నుంచి ఎవరైనా వచ్చి కుంకుమ పెట్టి ఆహ్వానిస్తారనే చూస్తుందని తెలుసుకొని తల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. తనతో పాటు రెస్టారెంట్ కు రమ్మని బతిమితాడుతాడు. కానీ కాంచన రానని చెబుతుంది. ఇక కార్తీక్ బాబు ఆ ఇంటి నుంచి ఎవరూ రాబోరని చెబుతాడు. రెండు కుటుంబాలు కలిసి ఉండాలంటే రాజీ పడే గుణం ఉండాలని చెబుతుంటాడు. ఇద్దరూ సర్దుకుపోయేలా ఉండాలని భావిస్తూ తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆలోగానే ఎవరూ ఊహించని విధంగా తండ్రి శివనారాయణ, అన్న వదినలు దశరథ్, సుమిత్రలు బాధపడుతుండగానే కాంచన ఇంట్లోకి వచ్చేస్తారు. అంతే కాదు తండ్రి శివనారాయణ, తల్లి పారుజాతం కూడా సంప్రదాయంగా ఆహ్వానించేందుకు వస్తారు. దీంతో కాంచన మొహం వెయ్యి దీపాల కాంతుల్లాగా వెలిగిపోతుంది. అయితే శివనారాయణ కూతురితో మాట్లాడుతాడా? లేదా? అనేది వేచి చూడాలి? ఇక దీపాను కూడా కాంచనా లాగానే ఆహ్వానిస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రేపటితో ఆ విషయం తేలనుంది.


Click it and Unblock the Notifications











