Karthika deepam 2 March 22nd : కన్న కుతూర్నే కష్టపెడుతున్న శివనారాయణ.. అనాథగా దీపా

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 21వ తేదీ 311వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. అసలు కార్తీక్ బాబు వెంట పడ్డ జ్యోత్స్న ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు జ్యోత్స్న ప్లాన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తాత శివనారాయణ, తల్లిదండ్రులు దశరథ్, సుమిత్రలు జ్యోత్స్న పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో నిశ్చితార్థానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మేనకోడలైన జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కు మేనత్త కాంచనను ఆహ్వానించేందుకు తాజాగా కుటుంబ సమేతంగా కార్తీక్ బాబు ఇంటికి వెళ్తారు. అయితే అప్పటికే కాంచన తన మేనకోడలు ఎంగేజ్ మెంట్ కు ఆహ్వానం అందితే బాగుండు అని పుట్టింటి వాళ్లను తలుచుకుంటూ బాధపడుతుంది. అదే సమయానికి అన్న దశరథ్, వదిన సుమిత్రలు కాంచన, కార్తీక్ బాబు, దీపా నివాసం ఉంటున్న ఇంట్లోకి వస్తారు.

పుట్టింటి వారిని చూసిన ఆనందంలో కాంచన మొహంలో ఆనంద వెలుగులు విరజిమ్ముతాయి. పట్టరాని సంతోషంతో అన్న, వదినను ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. మేము ఒక్కళ్లమే కాదని, తండ్రి శివనారాయణ కూడా వచ్చారని పినతల్లి పారిజాతం కాంచనకు చెబుతుంది. శివనారాయణ కూడా ఇంట్లోకి వస్తారు. కాంచనను చూసి మౌనంగా ఉంటారు. ఇక కాంచన తండ్రి రాకతో ఇంకా సంతోషిస్తుంది. ఇక అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక అప్పటికే కార్తీక్ కూడా తన తల్లి బాధను చూడలేక పుట్టింటి వారి నుంచి ఎవరైనా ఒక్కరు వచ్చి ఆహ్వానం అందిస్తే బాగుండని ఆశిస్తారు. ఈలోగా అనుకున్నట్టుగానే కుటుంబమంతా ఆహ్వానం తెలిపిందేకు కాంచన, కార్తీక్ ఇంటికి వస్తుంది. మరోవైపు దీపాను అవమానించే కుట్రలో భాగంగా జ్యోత్స్న తన మేనత్త కాంచన, మేనబావ కార్తీక్ బాబులను అధికారికంగా ఆహ్వానించాలని తాత శివనారాయణతో కోరుతుంది.
దాంతో తన నిశ్చితార్థంలో కుటుంబమంతా కలిసి ఉంటే.. దీపా మాత్రం అప్పటికే ఇచ్చిన ఫుడ్ ఆర్డర్ ప్రకారం క్యాటరింగ్ చేస్తూ పనిమనిషిలా ఉంటుందని భావిస్తుంది. జ్యోత్స్న వ్యూహం ఏమేరకు పండుతుందనేది తరువాయి ఎపిసోడ్ తో తేలనుంది. ఈ క్రమంలో మార్చి 22వ తేదీ 312 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Karthika deepam 2 Serial Today s Episode 312 March 22nd 2025

జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కు కాంచనను ఆహ్వానించేందుకు తండ్రి శివనారాయణ వాళ్ల ఇంటికి వెళ్తాడు. తండ్రిని చూసిన ఆనందంలో కాంచన ఉప్పొంగిపోతుంది. కానీ శివనారాయణ గుమ్మం దగ్గరే ఉండిపోతాడు. కూతురు ఎంత పిలిచినా లోనికి వచ్చేందుకు సందేహిస్తూ ఉంటాడు. కాంచనా పదే పదే రా నాన్న రా నాన్న అంటూ పిలుస్తుంది. ఇక శివనారాయణ ఇంట్లోకి అడుగుపెట్టేముందు గతాన్ని గుర్తు చేస్తాడు. ఇంట్లో అడుగుపెట్టడం అంటూ జరిగితే అది మీరు మా ఇంటికే రావాలని గతంలో కార్తీక్ బాబు అన్నాడు. ఇప్పుడదే జరుగుతోంది. అలాంటి ఛాలెంజ్ లు కూడా నీ కోడలు దీపా కోసమే కార్తీక్ చేసి ఉంటాడని నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని కూతురు కాంచనతో అంటాడు. ఆ మాటకొస్తే దీపా కోసం కొండమీది కోతిని అయినా తీసుకొస్తాడు. ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. అని దెప్పిపొడుస్తాడు. ఇక తాత శివ నారాయణ అన్న మాటలకు కార్తీక్ బాబు కౌంటర్ ఇస్తాడు. మిమ్మల్ని చూడగానే మా అమ్మ ఎంతో సంతోషంతో పలకరించింది. నాన్న అంటూ నోరారా పిలిచింది. కానీ మీరు మాత్రం గతాన్ని గుర్తు చేశారు. మేము మీ ఇంటికి వచ్చిన మీరు మా ఇంటికి వచ్చిన మీ పలకరింపులు ఒకేలా ఉంటాయని అర్థం అవుతుంది అని కౌంటర్ ఇస్తాడు. కూతురిపై ప్రేమ చూపించాల్సిన మీరే ఇంత కఠినంగా మాట్లాడుతుండడం ఏమాత్రం సబబు అని ప్రశ్నిస్తాడు.

దానికి స్పందించిన శివ నారాయణ ఇంట్లోకి వచ్చి పిలవడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అంటూ ఇంట్లోకి వస్తాడు. ఈ సందర్భంలో కాంచన తన తండ్రి తనతో మాట్లాడట్లేదని బాధతో ఈ పేదదాన్ని పట్టించుకోవా నాన్న అంటూ లోలోపల దిగులు చెందుతుంది. దీంతో కాంచన మాటల్లో తప్పు తీసేందుకు పిన్ని పారిజాతం ప్రయత్నిస్తుంది. మనసులో ఎన్నో పెట్టుకుని కాంచన ఇలా మాట్లాడుతుందంటూ తన అభిప్రాయాన్ని చెబుతుంది. ఎందుకలా అంటున్నావ్ అని కార్తీక్ బాబు ప్రశ్నించడంతో.. తనకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని మనసులో పెట్టుకొని మమ్మల్ని అవమానించేందుకు పేద దాన్ని అంటూ మాట్లాడుతుందని కాంచనను తప్పుపడుతుంది. ఆస్తి కోసమే ఇలా మాట్లాడి ఇబ్బంది పెడుతుంది అంటూ పారిజాతం విసుక్కుంటుంది. ఇక కార్తీక్ బాబు ఇంట్లో పనిచేసే అమ్మ పారిజాతం మాటలకు ఉండలేక మాట్లాడుతుంది.

కాంచనమ్మ పుట్టింటి వాళ్ల కోసం ఎంత కుమిలిపోతుందో ఆమెకు మాత్రమే తెలుసు. తన తండ్రిపై ఎంత ప్రేమ కలిగి ఉందో మాటల్లో చెప్పలేం. ఇక ఆస్తి విషయానికొస్తే కాంచన, కార్తీక్ బాబు ఈ తల్లి కొడుకులు ఏనాడు కూడా ఆశపడలేదని, అందుకు ప్రయత్నాలు కూడా చేయలేదని చెబుతుంది. ఇక సుమిత్ర కలగజేసుకొని మామ శివ నారాయణకు వచ్చిన పనిని కానివ్వండి అంటూ చెబుతుంది. దాంతో శివ నారాయణ అలాగే అంటూ కాంచన తో మాట్లాడటం ప్రారంభిస్తాడు. అమ్మ కాంచన నా మనవరాలు జోత్స్న నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాం. ఇక జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందనే విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు మిమ్మల్ని ఆహ్వానించాలని లేకున్నా... తన మేనత్త తన పెళ్లిలో ఉండాలని జ్యోత్స్న కోరుకుంది అంటూ చెబుతాడు. ఇక కార్తీక్ బాబును చూస్తూ.. ఎవరు ఎన్ని రకాలుగా నా మనవరాలు జ్యోత్స్న మనసును ముక్కలు చేసిన నా మాట మీద తను పెళ్లికి ఒప్పుకుంది అని చెబుతాడు.

ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ జ్యోత్స్న తో అప్పుడు నేను పెళ్లికి ఒప్పుకోలేదు. కేవలం మీ మీద ఉన్న గౌరవంతో మాత్రమే పెళ్లికి ఒప్పుకున్నానని తాత శివ నారాయణకు కార్తీక్ బాబు సమాధానం ఇస్తాడు. ఇక ఏదైతేనేం వచ్చిన పనిని కానిద్దామంటూ చెబుతాడు శివ నారాయణ. ఈ సమయంలో పారిజాతం మీరు శుభకార్యాలకు ఆహ్వానించేటప్పుడు గడపకు బొట్టు పెట్టి వెళ్తారు కానీ మీ మనుషులకే బొట్టు పెట్టి ఆహ్వానిస్తామంటూ ఎటకారంగా మాట్లాడుతుంది. ఇక తను బొట్టు తీసుకొని కాంచనాను ఆహ్వానించే ప్రయత్నంలోనే శివ నారాయణ అడ్డుకుంటాడు. ఆహ్వానించాల్సింది నువ్వు కాదు కోడలు సుమిత్రా అని చెబుతాడు. పెళ్లికూతురు తల్లి ఆమె కావడంతో తనే ఆహ్వానించడం మంచిదంటూ అభిప్రాయపడతాడు. ఇక సుమిత్ర కాంచన బొట్టు పెట్టి రేపు ఉదయం 10:50 కు తన కూతురు జ్యోత్స్న నిశ్చితార్థ వేడుక జరగనుందని, మేనత్తగా, ఆ ఇంటి ఆడపడుచు గా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించాలని ఆహ్వానిస్తుంది.

కాంచనను పిలవగానే ఇక శివ నారాయణ పదండి వెళ్దాం అంటూ వేగరం చేస్తాడు. తనతో కార్తీక్ బాబు స్పందిస్తూ ఇంకా పిలవాల్సిన వాళ్ళు ఎవరూ లేరా అంటూ దీపాను ఉద్దేశించి అడుగుతాడు. ఇక దానికి శివ నారాయణ స్పందిస్తూ నా కూతురిని ఆహ్వానించాను, నా కూతురు కొడుకుగా నీకు కూడా ఆహ్వానం ఉంది. ఇక దీప అంటే ఎలాగో క్యాటరింగ్ ఆర్డర్ పై భోజనాలను ఏర్పాటు చేసేందుకు వస్తుంది.. అంటూ బదులిస్తాడు. ఇక పారిజాతం కూడా అర్హత ఉన్న వాళ్ళకి ఆహ్వానం అందుతుంది అని దీపాను అవమానిస్తుంది. మరోవైపు సుమిత్ర కూడా ఆడపడుచు కాంచనను మాత్రమే ఆహ్వానించి సైలెంట్ గా ఉంటుంది. అప్పుడు కార్తీక్ బాబు అత్తను కూడా అడుగుతాడు.. ఇంట్లో బొట్టు పెట్టి పిలిచి ఆహ్వానించే వ్యక్తులు ఇంకెవరూ లేరా అంటూ ప్రశ్నిస్తాడు. ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు వారి మనసులు మారిపోయాయని సుమిత్ర బదులిస్తుంది. ఇంకా వెళ్లి వస్తాము అనడంతో మామ దశరథ్ ను కూడా దీపాను ఆహ్వానించరా అంటూ అడుగుతాడు. మామ సైలెంట్ గా ఉండిపోతాడు. అంతటితో శివనారాయణ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. వాళ్లందరూ కూడా వెళ్లిపోతారు. అయితే సుమిత్ర దీపాను ఆహ్వానించకపోవడంతో కాంచనకు ఎందుకని సందేహం కలుగుతుంది. అసలు వాళ్ల మధ్య ఏం జరిగిందని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. నేరుగా తన వదిన సుమిత్రనే అడిగి తెలుసుకుంటానని ఆలోచిస్తూ ఉంటుంది. అంతటితో లేటెస్ట్ ఎపిసోడ్ ముగిసింది. ఇక సుమిత్ర నిజం చెబుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X