Karthika deepam 2 March 24th : దీపాకు ఘోర అవమానం.. కన్నీళ్లను దిగమింగుకున్న కార్తీక్ బాబు
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 21వ తేదీ 311వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. తాత శివనారాయణ, తల్లిదండ్రులు దశరథ్, సుమిత్రలు జ్యోత్స్న పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. మంచి ముహుర్తం ఉండటంతో వెంటనే నిశ్చితార్థానికి కూడా ఏర్పాట్లు ప్రారంభించారు. కాగా జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కు తన మేనత్త కాంచనను తప్పకుండా పిలవాలని తాత శివనారాయణను కోరుకుంటుంది. మరోవైపు తన తల్లిదండ్రులు దశరథ్, సుమిత్రలు కూడా కాంచన, కార్తీక్ బాబులను జ్యోత్స్న నిశ్చితార్థానికి పిలవాలని భావిస్తుంటారు. ఈ లోగా జ్యోత్స్న నుంచి ఆ విషయం శివనారాయణ వద్దకు వెళ్తుంది. అప్పటికే జ్యోత్స్న కూడా కార్తీక్ బాబు, దీపాల రెస్టారెంట్ లో ఎంగేజ్ మెంట్ భోజనాలకు ఆర్డర్ ఇస్తుంది. ఆ విషయం తాతకు తెలుస్తుంది. మరోవైపు ఇంట్లో వాళ్ల నిర్ణయం మేరకు కూడా శివనారాయణ చేసేదేమీ లేక కాంచనను ఆహ్వానించేందుకు వెళ్తాడు.
తన కూతురు కాంచనను శివనారాయణ ఆహ్వానించేందుకు వెళ్లి అవమానిస్తాడు. కూతురుగా పిలవాలి కాబట్టి వచ్చి పిలిచి వెళ్తాడు. ఈ సమయంలోనూ గతంలో కాంచన ఏం చేసిందనే విషయాన్ని కూడా గుర్తుచేశాడు. జ్యోత్స్నను కార్తీక్ బాబుకు ఇచ్చి పెళ్లి చేసుకోకుండా చేసిన తప్పు వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని కూతురు కాంచనకు గుర్తు చేస్తాడు. నానా మాటలు అనేసి బాధపెడుతాడు. ఈ క్రమంలో కార్తీక్ బాబు కూడా తాత ప్రతి మాటకు బదులిస్తాడు. తమ వల్లే తప్పేమీ జరగలేదని చెప్పుకొస్తాడు. ఇక దీపా వల్లనే తమ కుటుంబం విచ్ఛిన్నమైందని శివనారాయణ తన కూతురు కాంచనతో చెబుతాడు... కాసేపటి తర్వాత జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కు రావాలని కూతురు ఆహ్వానిస్తాడు. అలాగే దశరథ్, సుమిత్రలు కూడా కాంచన, కార్తీక్ బాబును ఆహ్వానిస్తారు. కానీ దీపాను మాత్రం పరాయిదానిలా చూస్తారు. బొట్టుపెట్టి ఆహ్వానించరు. దీంతో కార్తీక్ బాబు రగిలిపోతాడు... ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మార్చి 24వ తేదీ 313 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పూలదండలతో ఇంటిని మొత్తం అలంకరించారు. బంధువులను రిసీవ్ చేసుకునేందుకు దశరథ్, శివనారాయణ ఇంటి ముందు నిల్చుంటారు. ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా జ్యోత్స్న పెళ్లి పనులు కూడా చూసుకోవాలని దశరథ్ తో శివనారాయణ అంటాడు. తను కూడా ఎలాంటి గొడవలు జరగకుండా జ్యోత్స్న పనులు జరగాలనే కోరుకుంటున్నట్టు మనస్సులో అనుకుంటాడు. జ్యోత్స్న నిశ్చితార్థానికి కూడా అవుతున్నప్పటికీ జ్యోత్స్న దాస్ ను ఎందుకు చంపాలనుకున్నదనే విషయం కూడా తెలిస్తే బాగుండని దశరథ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కు పిలవకపోయినా అల్లుడు శ్రీధర్ వస్తాడు. బంధువుల కోసం ఎదురుచూస్తున్న బావ దశరథ్, మామ శివనారాయణ శ్రీధర్ ను చూసి ఆశ్చర్యపోతారు. పిలవకపోయినా వచ్చి ఏం గొడవ చేస్తాడోనని కంగారు పడుతాడు.
ఇక శ్రీధర్ రాగానే ఎందుకు వచ్చావని? ఏం గొడవ చేస్తావని ప్రశ్నిస్తాడు శివనారాయణ. పిలిస్తే బంధువులు వస్తారు.. పిలవకపోయినా ఆత్మీయులు వస్తారంటూ బదులిస్తాడు శ్రీధర్. రెండు కుటుంబాల కలవాలనే ఉద్దేశంతోనే వచ్చినట్టు చెప్పుకొస్తాడు. ఆయన నుంచి తలతిక్క సమాధానాలు విన్న శివనారాయణ చిర్రెత్తిపోతాడు ఫంక్షన్ లో ఏదైనా గొడవ చేస్తే తన విశ్వరూపం చూపిస్తానని హెచ్చరిస్తాడు. అయితే ఆ విశ్వరూపం చూసేందుకే పిలవకపోయినా ఎంగేజ్ మెంట్ కు వచ్చాననుకుంటాడు శ్రీధర్. ఇలా వీరి మధ్య వాగ్వాదం జరుగుతుండగానే పెళ్లి కొడుకు గౌతమ్, ఆయన తల్లిదండ్రులు విచ్చేస్తారు. వారిని చూసిన శివనారాయణ, దశరథ్ నవ్వుతూ దగ్గరికి రాగానే ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అక్కడే శ్రీధర్ తన మాటలతో గొడవ చేసే ప్రయత్నం చేస్తాడు. కావాలనే పెళ్లి కొడుకు వారితో పరిచయం చేసుకుంటాడు. శివనారాయణకు ఒళ్లు మండిపోతుంది.
మాటల్లోనే మాట కలిపి పారిజాతం శ్రీధర్ ను పక్కకు పెట్టేసి పెళ్లికొడుకు గౌతమ్, ఆయన తల్లిదండ్రులను ఇంట్లోకి తీసుకెళ్తుంది. మరోవైపు శ్రీధర్ కూడా వారి వెంట వస్తుంటే శివనారాయణ అడ్డుకుంటాడు. నువ్వు ఇంట్లోకి రావొద్దూ అని హెచ్చరిస్తాడు. శ్రీధర్ ఇంట్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని దశరథ్ కు కూడా చెప్పి తాను లోనికి వెళ్తాడు. ఇక శ్రీధర్ చేసేదేమీ లేక ఇంటి బయటే ఉండిపోతాడు. తన కుటుంబమైన కాంచన, కార్తీక్ బాబు ఎక్కడా కనిపించడం లేదేంటా అని ఎదురుచూస్తుండా... ఈలోగానే ఆటో ట్రాలీలో కార్తీక్ బాబు, దీపా భోజనాలను తీసుకొని ఎంట్రీ ఇస్తారు.. శ్రీధర్ కు కనిపిస్తారు. ఇక కాంచన కూడా వస్తుంది. వారిని చూసిన శ్రీధర్ వెళ్లి మందలిస్తాడు. మీరంతా కలిసిపోయారా? అని కార్తీక్ బాబును ప్రశ్నిస్తాడు. అదేం లేదంటూ చెప్తాడు.. తను దీపా క్యాటరింగ్ కు వచ్చామని, అమ్మ కాంచన మాత్రమే ఎంగేజ్ మెంట్ కు వచ్చిందని చెబుతాడు. దాంతో ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అవుతాడు.
ఇక కార్తీక్ బాబు, కాంచన కనిపించడంతో అన్న దశరథ్, వదిన సుమిత్రలు సంతోషంతో పొంగిపోతారు. వెంటనే వెళ్లి కాంచనపై ప్రేమ కురిపిస్తారు. తను రావడంతో ఎంతో సంతోషంగా ఉందని చెబుతాడు. ఇక వెంటనే ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఇదే సమయంలో శ్రీధర్ కూడా పద వెళ్దాం అంటాడు. ఇక సుమిత్ర అన్నయ్య మీకు అస్సలు ఆహ్వానం లేదు.. మామ శివనారాయణ మిమ్మల్ని లోపలికి రానివ్వద్దంటూ ఆదేశించాడని శ్రీధర్ తో చెబుతుంది సుమిత్ర. దాంతో పక్కనే ఉన్న కార్తీక్ బాబు నవ్వుకుంటాడు. అవమానంగా భావించిన శ్రీధర్ వెంటనే ఆవేశానికి లోనవుతాడు. ఎందుకు లోపలికి రాకూడదు. పిలవకపోయినా తను ప్రేమతో వచ్చామంటూ బదులిస్తాడు. జ్యోత్స్నపై ఉన్న ప్రేమతోనే ఎంగేజ్ మెంట్ కువచ్చానని చెబుతాడు. అలాగే తనను ఇంట్లోకి రాకుండా ఎవరు ఆపుతారో చూస్తానని తెగేసి చెబుతాడు. దశరథ్, సుమిత్ర, కాంచన కూడా ఎంత నివారిస్తున్న వినకుండా లోనికి వెళ్తాడు.
మరోవైపు ఇంటి ఆడపడుచు కాంచనను తీసుకెళ్తున్న క్రమంలో కార్తీక్ బాబును కూడా దశరథ్, సుమిత్రలు ఇంట్లోకి ఆహ్వానిస్తారు. కానీ కార్తీక్ బాబు రానని చెబుతాడు. తాత శివనారాయణ మీ ఇంటి గుమ్మ తొక్కినప్పుడే పంథంలో నువ్వు నెగ్గినట్టే కదా అని సుమిత్ర అత్త ఎంత చెప్పినా వినిపించుకోడు. తన భార్య దీపాకు ఆహ్వానం లేదని అంటే తనకు కూడా ఆహ్వానం లేదనే కదా అర్థం అని బదులిస్తాడు. దీపా, నేనే క్యాటరింగ్ పనులు చూస్తాం.. అమ్మను లోపలికి తీసుకెళ్లండని చెబుతాడు కార్తీక్ బాబు. ఇక వెంటనే భోజనాలకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దీపా కార్తీక్ బాబును కూడా ఫంక్షన్ లోని వెళ్లి ఉండాల్సి అని చెబుతుంది. దానికి కార్తీక్ బాబు ఇంక మండిపోతాడు.
వెళ్లే వాడినే నిన్ను కూడా పిస్తే అంటూ బదులిస్తాడు. ఇంట్లో ఎవరి పంతాలు వారేవేనని దీపాతో చెప్పుకొస్తాడు. సుమిత్ర అత్తకు అందరూ కావాలి, మామ దశరథ్ కు తన చెల్లి కావాలి, పారుకు ఎవ్వరూ వద్దు, తాత శివనారాయణకు తన పంతమే ముఖ్యంగా.. జ్యోత్స్న తన స్వార్థం కోసమే బతుకుతుంది. ఇంకెవ్వరూ ఏమై పోయినా పట్టించుకోదు. ఇక్కడ మనల్ని ఎవరూ పట్టించుకోనప్పుడు మనం కూడా ఎవ్వరినీ పట్టించుకోవాల్సిన పనిలేదని కార్తీక్ బాబు దీపాతో అంటాడు. కనీసం తమ కూతురు శౌర్యను కూడా ఎలా ఉందని పలకరించకపోవడమే పెద్ద అవమానంగా కూడా ఉందంటాడు. అవన్నీ పట్టించుకోకుండా క్యాటరింగ్ బిజినెస్ చూసుకొని వెళ్లిపోదామని దీపాతో అంటాడు.


Click it and Unblock the Notifications











