Karthika deepam 2 March 25th : పెళ్లి సాకుతో జ్యోత్స్న హైడ్రామా.. హడలెత్తించిన మేనత్త కాంచన

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 24వ తేదీ 313వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడంతో తాత శివనారాయణ, తల్లిదండ్రులు దశరథ్, సుమిత్రలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ముహుర్తం కూడా కలిసి రావడం తో వెంటనే నిశ్చితార్థానికి కూడా ఏర్పాట్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. జ్యోత్స్న నిశ్చితార్థం కోసమని శివ నారాయణ కుటుంబ సమేతంగా తన కూతురు కాంచనను ఆహ్వానించేందుకు వెళ్తారు. కాంచనను ఆహ్వానించిన శివ నారాయణ, దశరథ్ సుమిత్రలు దీపాను మాత్రం ఆహ్వానించకుండా అవమానిస్తారు. ఇక దానికి కార్తీక్ ఎంతగానో బాధపడతాడు.

దీపాను ఆయన పెళ్లి చేసుకున్నప్పటికీ ఇంట్లో మనిషిగా చూడటం లేదంటూ తన బాధను వ్యక్తం చేస్తాడు. ఎలాగూ ఆహ్వానం అందింది కాబట్టి తన తల్లి కాంచన కోసం, అలాగే జ్యోత్స్నా ఎంగేజ్మెంట్ కు ఇప్పటికే వచ్చిన ఫుడ్ ఆర్డర్ పనులను చేయడం కోసమని తల్లి కాంచనను దీపాను తీసుకొని కార్తీక్ బాబు కూడా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కు వెళ్తాడు. అయితే అక్కడ కూడా కార్తీక్ దీపాలకు అవమానం కలుగుతుంది.తన భార్య దీపాకు ఆహ్వానం అందలేదు కాబట్టి తను కూడా ఫంక్షన్ కు రానని తెలియజేస్తాడు. తల్లి కాంచన మాత్రమే ఫంక్షన్ కు వెళ్ళమని చెప్పి తను దీపాను తీసుకొని క్యాటరింగ్ పనులు చేసేందుకు వెళ్తాడు. అంత దూరం వెళ్లిన కార్తీక్ బాబు దీపాలను ఆ ఇంట్లో వాళ్ళు పలకరించకపోగా కనీసం తన కూతురు శౌర్యను కూడా అడగలేదని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇదిలా ఉంటే లోనికి వెళ్లిన కాంచనకు పెళ్లికూతురు, తన మేనకోడలు జోత్స్న ఆహ్వానం పలుకుతుంది. ఇక మేనత్తతో మాట్లాడుతూ కార్తీక్ బాబు తనకు దూరం కావడానికి కారణం దీపానే అని చెబుతుంది. దీప వచ్చినప్పుడు నుంచే తమ కుటుంబాల్లో దూరాలు పెరిగాయని చెబుతుంది. అలాగే ఊరుకుంటే కార్తీక బాబు ఏదో ఒక రోజు నిన్ను కూడా వదిలేస్తాడు అత్త అంటూ జోత్స్న వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక కాంచన అసలు నన్ను ఫంక్షన్ కు పిలిచారా తన కుటుంబాన్ని విడదీయడానికి పిలిచారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతో జోత్స్న సైలెంట్ అయిపోతుంది... ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మార్చి 25వ తేదీ 314 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Karthika deepam 2 Serial Today s Episode 314 March 25th 2025 Here is full story

జ్యోత్స్న ఎంగేజ్మెంట్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పిలువని వాళ్లంతా నిశ్చితార్థ వేడుకకు వచ్చి శివ నారాయణకు తెలియని నిజాలు అన్నిటిని తెలియజేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఓవైపు జ్యోత్స్నా నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు తండ్రి దశరథ శివ నారాయణ. ఇక జోత్స్న మాత్రం పెళ్లి పేరుతో పెద్ద హై డ్రామా నడిపిస్తుందని కార్తీక్ బాబు అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే జోత్స్నా తన మేనత్త కాంచనతో దీపా కార్తీక్ బాబును విడదీసేందుకు లేనిపోని మాటలని చెబుతుంది. కానీ కాంచన ఫైర్ అవడంతో జ్యోత్స్న తగ్గి అత్తకు సారీ చెబుతుంది. గతంలో తన చేసిన తప్పులు అన్నిటిని క్షమించమని కోరుతుంది. పెళ్లయిన తనను ఎప్పటిలాగానే చూడాలని అంటుంది.

ఇదిలా ఉండగా నిశ్చితార్థపు వేడుకకు ఊహించని విధంగా దశరథ్ రెండో భార్య కొడుకు దాసు తన కొడుకు కోడలుతో వస్తారు. వీరిని చూసి దశరథ్, శివ నారాయణ, మరోవైపు జ్యోత్స్న షాక్ అవుతారు. అయితే దాసుకు ఆ ఇంట్లోకి ఎంటర్ కాగానే గత మొత్తం గుర్తుకొస్తుంది. జ్యోత్స్నాను పెళ్లికూతురుగా చూడగానే కంగారు పడతాడు. ఆస్తి మొత్తం ఆమెకే వెళ్లిపోయేలా ప్లాన్ చేసుకుందని గతం గుర్తుకు రాగానే దాసుకు అర్థమవుతుంది. ఆ ఇంటికి అసలు వారసురాలు జోత్స్న కాదని, దీపా అని కేవలం దాసుకు మాత్రమే తెలుసు. ఇక ఆ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించిన సమయంలో జోత్స్న దాసును తలపై బలంగా కర్రతో కొడుతుంది. దాంతో గతాన్ని మర్చిపోతాడు.

ఇక నిశ్చితార్థపు వేడుకకు రాగానే దాసుకు గతం గుర్తుకువస్తుంది. ఆ విషయాన్ని శివ నారాయణకు చెబుదామని అనుకుంటాడు. అయితే దాసుని చూసిన శివ నారాయణ మాత్రం పిలవకుండానే ఎలా వచ్చాడా అని సందేస్తాడు. కోపంతో రగిలిపోతాడు. అతని ఎవరు పిలిచారు అంటూ పారుపై మండిపడతాడు. నా కొడుకు దాసును నేనే పిలిచాను అంటూ పారు బదులిస్తుంది. ఆయన మీరెందుకు భయపడుతున్నారో ఆస్తిలో వాటా అడుగుతారని అనుకుంటున్నారా.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాంతో శివ నారాయణ ఇంకా కోపం తెచ్చుకుంటాడు. కొడుకు దశరథకు చెప్పి దాసును బయటికి పంపిస్తాడు.

ఓవైపు దాసు అసలు విషయాన్ని శివ నారాయణకు చెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో నిజం ఎక్కడ బయటికి వస్తుందోనని జోత్స్న గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ దశరథ్ వచ్చి తమ్ముడు దాసును బయటకు తీసుకెళ్తాడు. అయితే బయట కూడా దీప ఉండడంతో గతం గుర్తుకు వచ్చిన దాసు దీపతో విషయం మొత్తం చెబుతాడా అని భయపడుతుంది. ఇక జ్యోత్స్న ఊహించినట్టుగానే క్యాటరింగ్ పనులను చేస్తున్న కార్తీక్ బాబు, దీపాను దాసు చూస్తాడు. అప్పటికే గతం అంతా గుర్తుకు రావడంతో వెంటనే వెళ్లి దీపాకు విషయం చెప్పాలని ప్రయత్నిస్తాడు.

ఈ ఇంటికి అసలు వారసురాలు దీపా అని నిరూపించాలని నిర్ణయించుకుంటాడు. దీంతో వెంటనే దీపా దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో పూజలు అందుకోవాల్సిన వాళ్ళు బయట పని వాళ్ళలా, పని వాళ్ళలా ఉండాల్సిన వాళ్లు పూజలు అందుకుంటున్నారంటు దీపాతో అంటాడు. కానీ దీపకు మాత్రం ఏం అర్థం కాదు. పూజలందుకోవాల్సిన రాయి కొబ్బరి దెబ్బలను తింటుందని, కొబ్బరి దెబ్బలు తినాల్సిన రాయి ఈ ఇంట్లో పూజలు అందుకుంటుందని దాసు ఆవేదన వ్యక్తం చేస్తాడు. నాతో రా అమ్మ నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు తిట్టడం కాదు నెత్తిన పెట్టి పూజించుకునేలా చేస్తాను అంటూ వాగ్దానం చేస్తాడు.

ఇక దీపాను తీసుకొని కంగారు కంగారుగా ఇంట్లోకి వస్తుంటాడు. దాసు దీపాను తీసుకొని రావడంతో శివ నారాయణ ఆందోళన చెందుతాడు. నిశ్చితార్థం జరగకుండా ఎలాంటి రచ్చ చేస్తాడని ఆవేశపడతాడు. మరోవైపు జోత్స్న దాసు అసలు విషయం మొత్తం బయట పెడతాడా అని వణికి పోతుంది.... మరోవైపు పెళ్ళికొడుకు గౌతమ్ అదే సమయంలో ఫోన్ రావడంతో వేడుక నుంచి బయటికి వెళ్తాడు. అతని బంఢారం మొత్తం తెలిసిన దీపా దాసు వల్ల అతన్ని చూడలేకపోతుంది. ఇక దీపానే అసలు వారసురాలు అని చెప్పేందుకు వచ్చిన దాసును శివనారాయణ దశరథ్, శివనారాయణ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో పూలు ఉన్న పళ్లెం కింద పడి పెద్ద శబ్ధం వస్తుంది. దాంతో మళ్లీ దాసు బ్రెయిన్ మళ్లీ స్ట్రక్ అవుతుంది. అయితే.... దాసు నిజం చెబుతాడా? మళ్లీ గతం మర్చిపోయి ఉంటాడా? మరోవైపు గౌతమ్ ను దీపా గుర్తు పడుతుందా? లేదా? అన్న ట్విస్ట్ లకు తరువాయి ఎపిసోడ్ లో సమాధానాలు లభించనున్నాయి.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X