Karthika deepam 2 March 26th : దీపాకు ఊహించని షాక్.. జ్యోత్స్న గుండె గుబేల్ అనే ఘటన

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 25వ తేదీ 314వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న నిశ్చితార్థపు వేడుకులో ఊహించని ట్విస్ట్ లు చూపించిన సంగతి తెలిసిందే. ఓవైపు శివనారాయాణ తన మనవరాలు అనుకొని జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ను ఘనంగా జరిపిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి కొడుకు గౌతమ్ తో జ్యోత్స్న పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జ్యోత్స్న ఆస్తికోసమే పెళ్లి నాటకం ఆడుతుందని ఓవైపు కార్తీక్ బాబు సందేహం వ్యక్తం చేస్తూ ఉంటాడు. జ్యోత్స్న కూడా తన కుట్రను పెళ్లి ఒప్పుకున్న తర్వాత బయటిపెడుతూనే వస్తుంది. మేనత్త కాంచనతో కార్తీక్ బాబు - దీపాలను దూరం చేయాలని సలహానివ్వడం, దీపాకు క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వడం వంటి అంశాలు ఆమె పెళ్లి చేసుకుంటుందా? లేదా? అనే సందేహాలకు దారినిచ్చింది.

మరోవైపు జ్యోత్స్న గౌతమ్ ల నిశితార్థపు వేడుకకు ఆహ్వానం లేకున్నా దాసు తన కొడుకు, కోడలుతో కలిసి హాజరవుతాడు. ఫంక్షన్ కు వెళ్లగానే దాసుకు గతం ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే జ్యోత్స్న తన మనవరాలు కాదని శివనారాయణకు అసలు నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ విషయం అర్థం చేసుకొని శివనారాయణ కొడుకు దశరథ్ తో చెప్పి బయటికి పంపిస్తాడు. ఇక దాసు బయటికి వెళ్లిన తర్వాత లేన్ లో క్యాటరింగ్ ఏర్పాట్లు చూస్తున్న దీపాను చూస్తాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. గుళ్లో పూజలు అందుకోవాల్సిన రాయి కొబ్బరి దెబ్బలు తింటోందని, కొబ్బరి దెబ్బలు తినాల్సిన రాయి ఈ ఇంట్లో పూజలు అందుకుంటోందని దీపాతో అంటాడు. కానీ ఆ విషయం దీపాకు అర్థం కాక దాసువైపు చూస్తుంది. దాంతో దాసు దీపా చేయిపట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లి అసలు విషయం చెప్తానని తీసుకెళ్తాడు.... ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మార్చి 26వ తేదీ 315 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Karthika deepam 2 Serial Today s Episode 315 March 26th 2025

దాసు ఎంగేజ్ మెంట్ లో దీపా గురించి అసలు విషయం చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. శివనారాయణకు దీపానే అసలు విషయం చెప్పాలని ప్రయత్నించినా మళ్లీ గతం మరిచిపోయి విఫలమవుతాడు. ఇక ఎంగేజ్ మెంట్ వేడుకలోనే దాసు రచ్చ చేస్తుండటంతో శివనారాయణ కోపం చేస్తాడు. మరోవైపు పెళ్లి కొడుకు తరుపు వారు కూడా అతను ఎవరు? ఎందుకు ఇక్కడ అల్లరి చేస్తున్నారంటూ శివనారాయణను ప్రశ్నిస్తారు. అతను మతిస్థిమితం లేని వ్యక్తి అని తన కొడుకుతో పాటు వచ్చాడని శివనారాయణ బదులిస్తాడు. పారుజాతంతో చెప్పి దాసును బయటికి తీసుకొస్తారు. ఇక బాలు, దీపా కూడా దాసును బయటికి తీసుకొచ్చి కాస్తా శాంత పరుస్తారు.

అసలు దాసు ఏం చెప్పాలనుకుంటున్నాడనేది కొడుకు కాశీ, కోడలు దిల్ కు సందేహాన్ని కలిగిస్తుంది. తాము ఎంతగా అడిగినా చెప్పడం లేదంటూ కార్తీక్ బాబుతో చెబుతుంటాడు కాశీ. కేవలం తన అన్నయ్యతోను, తన తండ్రి శివనారాయణతోనూ మాత్రమే చెప్పాలని అంటున్నాడని కార్తీక్ బాబుతో అంటాడు. పైగా దీపాను తీసుకెళ్లి చెప్పే విషయం ఏమై ఉంటుందంటూ ఆలోచిస్తూ ఉంటారు. దాంతో కార్తీక్ బాబు కలుగజేసుకొని ఏమై ఉంటుంది.. ఇప్పుడు సుమిత్ర అత్త బతికి ఉందంటే కారణం దీపానే అని, అలాంటి దీపాకు ఈ ఇంట్లో గౌరవం దక్కాలని చెప్పాలనుకుంటున్నాడు అంటూ కార్తీక్ బాబు ఊహాత్మకంగా చెబుతాడు. దాంతో వారందరూ కూడా సరేనని సైలెంట్ అవుతారు.

ఇక మరోవైపు జ్యోత్స్న, గౌతమ్ ల ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన కార్యక్రమాలు జరిపిస్తుంటారు. ఎంగేజ్ మెంట్ లో దాసు నిజం చెప్పే ప్రయత్నం ఒకటైతే.. మరోవైపు పెళ్లికొడుకు గౌతమ్ అమ్మాయిలను వాడుకొని వదిలేసే వాడని దీపాకు అప్పటికే తెలుస్తుంది. అయితే గౌతమ్ దీపా కంట్లో పడేందుకు కాస్తా సమయం పడుతుంది. దాసు చేసిన హడావుడి వల్ల గౌతమ్ ను దీపా చూడలేకపోతుంది. ఇక క్యాటరింగ్ సర్వీస్ చేస్తుండగా.. అందరికీ జ్యూస్ లు అందిస్తున్న క్రమంలో చూస్తుంది. ఆ సమయానికి జ్యోత్స్న వేలికి గౌతమ్ ఎంగేజ్ మెంట్ రింగ్ తొడుగుతుంటాడు. అది చూసిన దీపా వెంటనే ఆపుతుంది. ఓరేయ్ అంటూ గౌతమ్ పై అరుస్తుంది.

దీపాను చూసిన గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీపాకు తన గురించి అంత తెలుసని గుర్తించి కంగారు పడుతాడు. మరోవైపు దీపా పెళ్లి కొడుకు గౌతమ్ ను ఎంగేజ్ మెంట్ రింగ్ ను తొడగనివ్వకుండా అడ్డుకోవడంతో శివనారాయణ, దశరథ్, సుమిత్ర, మరోవైపు జ్యోత్స్న షాక్ అవుతారు. అసలు ఎందుకు దీపా అడ్డుకుందని అంతా ఆలోచిస్తారు. ఈలోగా దీపా గౌతమ్ మోసగాడు అంటూ అందరికీ తెలియజేస్తుంది. అమ్మాయిల మానాలతో ఆడుకునేవాడని చెప్తుంది. అప్పటికే కార్తీక్ బాబు కూడా దగ్గరికి రావడంతో విషయం చెబుతుంది. అప్పటికే గౌతమ్ గురించి కార్తీక్ బాబుకు దీపా చెప్పి ఉండటంతో ఇతనే ఆ గౌతమ్ అని స్ఫష్టం చేస్తుంది. దాంతో కార్తీక్ బాబు కూడా షాక్ అవుతాడు.

అమ్మాయిల మానాలకు ఖరీదు కట్టే ఈ రాక్షసుడిని నమ్మొద్దు అంటూ దీపా వాదిస్తుంది. అందరికీ గౌతమ్ మోసాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. తనకు తెలిసినంత వరకు ఇద్దరు అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని చెబుతుంది. దాంతో గౌతమ్ సైలెంట్ గా ఉంటే తను దొరికిపోతానని భావించి దీపాను తప్పు చేసే ప్రయత్నం చేస్తాడు. అసలు ఎవరు ఈమె, ఇలా మీ ముందే నాపై నింద వేస్తుంటే వేడుక చూస్తున్నారేంటీ అంటూ శివనారాయణను ప్రశ్నిస్తాడు గౌతమ్. పెళ్లికి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కానీ ఇలా అవమానిస్తారా? అని అడుగుతాడు. దాంతో శివనారాయణ దీపాకు మాకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె వంటలు చేసుకునేదని బదులిస్తాడు.

దాంతో గౌతమ్ దీపాపై ఇంకా రెచ్చిపోతాడు. వంటలు చేసుకునే దానికి అలాంటి ఆలోచనలే వస్తాయని, అందుకే తనపై నిందలు మోపుతుందని అంటాడు. అమ్మాయిల మానాలకు డబ్బులు ఇచ్చానని అనడం కంటే ఆ డబ్బులు నీకు కావాలి అని అడగొచ్చు కదా అని ప్రశ్నిస్తాడు. దాంతో కార్తీక్ బాబు గౌతమ్ ను హద్దులు దాటొద్దు తను నా భార్య అని గుర్తుంచుకొని అని హెచ్చరిస్తాడు. గౌతమ్ అసలు దీపా ఎవరో నాకు తెలియదు. నేను ఇఫ్పుడే చూస్తున్నాను. నాకు ఎవ్వరితో ఎలాంటి సంబంధం లేదని చెప్తాడు. కానీ దీపా నువ్వు చెబుతున్నది అబద్దం. ఆ అమ్మాయిలను మోసం చేసింది నువ్వేనని నాకు కచ్చితంగా తెలుసని కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఇలా మాటామాట పెరగడంతో గౌతమ్ చెంపచెల్లుమనిపిస్తుంది దీపా. దాంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X