Karthika deepam 2 March 27th : పచ్చిమోసగాడితో జ్యోత్స్న నిశ్చితార్థం.. అడ్డుకున్న దీపాకే ఘోర అవమానం

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 26వ తేదీ 315వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న నిశ్చితార్థపు వేడుకలో దాసుకు గతం గుర్తుకు రావడం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే, దీపా పెళ్లికొడుకు గౌతమ్ ను గుర్తుపట్టడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. దాస్ జ్యోత్స్న నిశ్చితార్థపు వేడుకకు హాజరైన సందర్భంలో గతం గుర్తుకు వస్తుంది. దీంతో వెంటనే దీపాను ఇంట్లోకి తీసుకెళ్లి శివనారాయణకు దీపానే తన అసలు వారసురాలు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ క్షణాల్లో గతాన్ని మర్చిపోయే వ్యాధి ఉండటంతో అసలు విషయం చెప్పే సమయంలో ఓ శబ్ధం అవడంతో మళ్లీ గతం మర్చిపోతాడు. దీంతో దీపానే శివనారాయణ అసలు మనవరాలని చెప్పలేకపోతాడు. ఈ సమయంలో జ్యోత్స్న ఎంతో టెన్షన్ పడుతుంది. దాసు నిజం చెప్పేస్తాడేమోనని కంగారు పడుతుంది. కానీ ఈసారి తప్పించుకుంటుంది.

మరోవైపు జ్యోత్స్నను పెళ్లి చేసుకోబోతున్న గౌతమ్ ఒక ఫ్రాడ్ అని, అమ్మాయిల జీవితాలతో ఆడుకునే కామంధుడని దీపాకు తెలిసి ఉంటుంది. ఇక జ్యోత్స్న నిశ్చితార్థపు వేడుకకు దీపా, కార్తీక్ బాబుల రెస్టారెంట్ ల నుంచే భోజనాలు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎంగేజ్ మెంట్ కు వచ్చిన వారిందరికీ దీపా కూల్ డ్రింక్స్ అందిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో గౌతమ్ ను చూస్తుంది. గౌతమ్ జ్యోత్స్న వేలికి ఉంగరం తొడిగే సమయంలో అడ్డుకుంటుంది. గౌతమ్ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వాడని నిజం చెబుతుంది. కానీ శివనారాయణ నమ్మబోడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా దీపా మాత్రం గౌతమ్ పచ్చిమోసగాడంటూ చెబుతుంది. ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని వివరిస్తుంది. ఇక గౌతమ్ సంగతి అంతా దీపాకు తెలుసు కాబట్టి అతను దీపాను ఫూల్ ను చేసే ప్రయత్నం చేస్తాడు. అసలు మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నానని, నేను అలాంటి వాడిని కాదని గౌతమ్ వాదిస్తాడు. పైగా దీపాపై మాటలు కూడా జారుతాడు. దాంతో కోపంలో గౌతమ్ చెంప చెల్లుమనిపిస్తుంది దీపా.. ఆ తర్వాత ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మార్చి 27వ తేదీ 316 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Karthika deepam 2 Serial Today s Episode 316 March 27th 2025

ఒక వంట మనిషి, పైగా ఆడ మనిషి తనపై ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఎందుకని సైలెంట్ గా ఉన్నారని శివనారాయణపై గౌతమ్ మండిపడుతాడు. ఈ ఇంట్లోని అందరి గురించి నాకు తెలుసుని, దీపా మీ మనవరాలు అని, కార్తీక్ భార్య అనే విషయం నాకు తెలుసని గౌతమ్ శివనారాయణతో అంటాడు. జ్యోత్స్న కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నించిందని ఆ విషయం కూడా తెలుసని బయట పెడుతాడు. అంతే కాదు మీ అల్లుడు శ్రీధర్ గురించి, ఆయన ఇప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉండటం లేదో కూడా తనకు పూర్తిగా తెలుసని చెప్పారు. ఇవన్నీ తెలిసినా కూడా జ్యోత్స్నతో పెళ్లి ఒప్పుకోవడం నా తప్పేనని గౌతమ్ అవమానంగా భావిస్తున్నట్టు శివనారాయణతో అంటాడు. దీపా గౌతమ్ ను చెంపదెబ్బ కొట్టడంతో షాక్ లో ఉన్న శివనారాయణ గౌతమ్ మాటలకూ సైలెంట్ గా ఉంటారు.

అసలు ఫంక్షన్ హాల్ లో ఎంగేజ్ మెంట్ చేయమని ముందే చెప్పాను కానీ వినలేదు.. ఇంట్లోనే చేస్తామని చెప్పినా కూడా సరేనని చెప్పడం తప్పు మాదేనన గౌతమ్ మండిపడుతాడు. కోపంతో ఎంగేజ్ మెంట్ రింగ్ ను శివనారాయణ కాళ్ల ముందు విసిరేస్తాడు. ఇక ఎంగేజ్ మెంట్ చేసుకోబోమని తేల్చి చెబుతాడు గౌతమ్. తన తల్లిదండ్రులను తీసుకొని శివనారాయణ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. వాళ్లను శివనారాయణ అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. గౌతమ్ తో పెళ్లి చెడిపోయినందుకు అస్సలు బాధపడకండి తాతయ్య, అతన్ని వెళ్లనివ్వండి అంటూ శివనరాయణతో అంటుంది.

అప్పటికే దీపాపై రగిలిపోతున్న శివనారాయణ గౌతమ్ ను వెళ్లనివ్వండి అంటూ అనడంతో కోపోద్రేకితుడవుతాడు. దీపాపై నిప్పుల వర్షం కురిపిస్తాడు. దీపా కారణంగా ఈ ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయని ఫైర్ అవుతాడు. అయినా గౌతమ్ అస్సలు మంచి వాడు కాదని దీపా చెప్ప ప్రయత్నం చేస్తుంది. దాంతో శివనారాయణ నువ్వు మంచిదానివా? అని ప్రశ్నిస్తాడు. కార్తీక్ ను సుమిత్రకు అల్లుడిని చేస్తానని, జ్యోత్స్నకు భర్తను చేస్తానని మోసం చేయలేదా? అని శివనారాయణ ప్రశ్నిస్తాడు. ఇప్పుడు మళ్లీ ఈ నిశ్చితార్థపు వేడుకను కూడా మధ్యలోనే ఆగిపోయేలా చేసావ్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. అసలు మిమ్మల్ని ఈ ఫంక్షన్ కు పిలవడం నాదే తప్పు, కొడుకుతో పాటు కూతురు కాంచనను ఆహ్వానించడం ఒక తప్పు అయితే, దీపాను క్యాటరింగ్ పనులు అప్పగించి రెండో తప్పు చేశానని శివనారాయణ తన బాధను వ్యక్తం చేస్తాడు.

గౌతమ్ గురించి నీకు ఏమీ తెలుసని ఎంగేజ్ మెంట్ ను అడ్డుకున్నావని శివనారాయణ దీపాను ప్రశ్నిస్తాడు. అతను మోసగాడు తనకు గౌతమ్ గురించి బాగా తెలుసని దీపా బదులిస్తుంది. దాంతో శివనారాయ నీకెలా తెలుసు వారి కుటుంబం గురించి మాకు బాగా తెలుసు, పైగా జ్యోత్స్న గౌతమ్ ఇద్దరూ కలిసి చదువుకున్నారు అని శివనారాయణ అంత కోపంలోనూ వివరించే ప్రయత్నం చేస్తాడు. జ్యోత్స్నకు గౌతమ్ గురించి ఏమీ తెలియకుండానే ఈ పెళ్లికి ఒప్పుకుందని దీపా తన అభిప్రాయాన్ని చెబుతుంది. దీంతో వెంటనే జ్యోత్స్న తనకు గౌతమ్ గురించి పూర్తిగా తెలుసని ఫైర్ అవుతుంది. దీపాపై మాటల తుటాలు పేల్చుతుంది. తన నిశ్చితార్థం ఆగిపోయిందనే బాధను వ్యక్తం చేస్తుంది.

మొదటి నుంచి తనకు కష్టాలే వస్తున్నాయని జ్యోత్స్న కన్నీళ్లు పెట్టుకుంటూ తన మనస్సులోని మాటలను చెబుతుంది. తను పుట్టకముందే కార్తీక్ కు భార్యనని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. పుట్టాక కూడా కార్తీకే తన భర్తగా చెప్పి పెంచారంటూ చెబుతుంది. తను కూడా కార్తీక్ భార్య అనే ఎన్నో ఆశలు పెట్టుకున్నానని వివరిస్తుంది. అలా పెరిగానని, జీవితంలో ఎన్నో సంతోషాలను, ఆనందాలను ఊహించుకున్నానని తన బాధను వ్యక్తం చేస్తుంది. కానీ దీపా వల్లనే తన జీవితం నాశనం అవుతుందని చెబుతుంది. కార్తీక్ తో ఎంగేజ్ మెంట్ అన్నారు దీపా వల్లనే ఆగిపోయిందని గుర్తు చేస్తుంది. ఆ కార్తీక్ కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసినా తనకు దక్కకుండా చేసిందని దీపాపై మండిపడుతుంది.

ఇక కార్తీక్ చెప్పిన మాటల కారణంగానే తన మనస్సు మార్చుకొని ఈ పెళ్లికి ఒప్పుకున్నానని వివరిస్తుంది. ఇక ఇప్పుడు కూడా దీపా వచ్చి చెడగొట్టిందని నిందవేస్తుంది. అయితే గౌతమ్ అస్సలు మంచి వాడు కాదని జ్యోత్స్న ను బాధపడవద్దంటూ, నీకు నేను మంచే చేస్తున్నానని దీపా బదులిచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇంకా జ్యోత్స్న ఆవేశానికి లోనై తన ముందే టేబుల్ పై ఉన్న రకరకాల పూల పళ్లాలను నేలపై విసిరి కొడుతుంది. తన బాధను, కోపాన్ని వెల్లగక్కుతుంది. దీంతో జ్యోత్స్న నానమ్మ దీపాను ఈ దరిద్రం ఇక్కడ ఉండకూడదంటూ చేయి పట్టుకొని లాకెళ్లి గుమ్మం అవతలికి నెట్టివేస్తుంది. కార్తీక్ బాబును కూడా ఇంట్లో నుంచి వెళ్లగొడుతారు. ఇక తన నిశ్చితార్థం పాడైపోయినందుకు జ్యోత్స్న, శివనారాయణ, సుమిత్ర, దశరథ్ ఎంతో బాధపడుతారు. ఆ తర్వాత సుమిత్ర కార్తీక్ బాబు ఇంటికి వెళ్లి దీపాను ప్రశ్నిస్తుంది. గౌతమ్ మంచి వాడు కాకపోతే నిరూపించు అంటూ చెబుతుంది. లేదంటే నిన్ను జన్మలో క్షమించబోమని హెచ్చరిస్తుంది. అంతటి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X