Karthika deepam 2 March 28th : పాపం జ్యోత్స్న.. దీపాకు కొత్త సవాల్.. సుమిత్ర ఉగ్రరూపం
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 27వ తేదీ 316వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న నిశ్చితార్థపు వేడుక ఆగిపోయింది. దాసుకు గతం గుర్తుకు రావడం, దీపా పెళ్లికొడుకు గౌతమ్ ను గుర్తుపట్టడంతో జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కు ఆటంకం కలిగింది. దీపా గౌతమ్ మోసగాడని అప్పటికే తెలిసి ఉండటంతో నిశ్చితార్థాన్ని అడ్డుకుంటుంది. దాంతో శివనారాయణ, జ్యోత్స్న ల ఆగ్రహానికి కూడా గురవుతుంది. అంతే కాదు పారు దీపాను చేయి పట్టుకొని మరీ ఇంటి బయటకు నెట్టేస్తుంది. దాంతో జ్యోత్స్నకు మంచి చేయబోయిన దీపాకు ఘోర అవమానం జరుగుతుంది.
ఇక ఎంగేజ్ మెంట్ ను దీపా అడ్డుకోవడం, తను పెళ్లి చేసుకోవాలని గౌతమ్ తో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఆగిపోవడంతో జ్యోత్స్న అప్సెట్ అవుతుంది. దీంతో దీపా వచ్చినప్పటి నుంచి జ్యోత్స్న ఎంత నరకం అనుభవిస్తుందో.. అన్నీ ఉన్న కార్తీక్ బాబు లేకపోవడంతో తన జీవితం ఎంత అంధకారంగా మారిపోయిందో చెబుతుంది. ఆనందంతో వెలిగిపోవాల్సిన తన మొహం కన్నీళ్లతో తడిపోతుంది. దీంతో తల్లి సుమిత్ర తన కూతురు జ్యోత్స్నను అలా చూడలేక కార్తీక్ బాబు ఇంటికి వెళ్లి దీపాను నిలదీస్తుంది. ఆధారం లేకుండా గౌతమ్ పై నిందా ఎలా వేశామని అడుగుతుంది.. ఆ తర్వాత ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మార్చి 28వ తేదీ 317 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

గౌతమ్ మంచి వాడు కాదని అందుకే జ్యోత్స్న నిశ్చితార్థాన్ని అడ్డుకున్నానని దీపా సుమిత్రకు చెబుతుంది. అప్పటికే చిర్రేత్తిపోయి ఉన్న సుమిత్ర తన కూతురు జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందనే బాధతో, అందుకు కారణం దీపానే అని మండిపోతుంది. దీపా ఇచ్చిన సమాధనంతో ఇంకా రగిలిపోతుంది. సాక్ష్యం లేకుండా ఎలా నువ్వు గౌతమ్ ను నిందిస్తున్నావంటూ ప్రశ్నిస్తుంది. నీదగ్గర ఆధారం ఉంటే వెంటనే చూపించూ అంటూ అడుగుతుంది. దీపాను తన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నానని, అయినా దీపా తమకు ఎందుకు ఇలా అన్యాయం చేస్తుందో అర్థం కావడం లేదని మండిపడుతుంది.
ఇక జ్యోత్స్న విషయంలో మరోసారి దీపా అడ్డుపడితే ఊరుకోబోనని దీపాను హెచ్చరిస్తుంది. తన కూతురు జ్యోత్స్న గురించి మనస్సులో ఏదో పెట్టుకొని మరీ ఇలా చేస్తోందని ఫైర్ అవుతుంది. కుటుంబమంతా చూస్తుండగానే తనకు కాబోయే అల్లుడు గౌతమ్ ను కొట్టడంతో, జ్యోత్స్న ఏడుస్తున్నా కూడా ఏం చేయలేని పరిస్థితిలో నిల్చొని చూస్తూ ఉండిపోయామని తన ఆవేదన వ్యక్తం చేసింది. మరోసారి జ్యోత్స్న జీవితంలోనూ, తమ జీవితంలోనూ కనిపిస్తే ఏమాత్రం సంహించేది లేదని సుమిత్ర దీపాకు వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు తనను అమ్మా అని పిలువొద్దని, జీవితంలో ఎప్పుడూ తన కంట పడొద్దని ఆగ్రహిస్తుంది.
ఇక ఈలోపే దశరథ్ కూడా వస్తాడు. సుమిత్ర ఆవేశాన్ని తగ్గించుకోమని చెబతాడు. ఇప్పుడు ఇంతలా మాట్లాడితే మాత్రం జరిగే ప్రయోజనం ఏమీ లేదని చెబుతాడు. సుమిత్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇక అన్నయ్య అంటూ పిలిచిన కాంచనను నేను నీకోసం రాలేదంటూ తన భార్య సుమిత్రను తీసుకోని వెళ్లడానికి వచ్చానంటూ మొహం మీదనే చెబుతాడు. దీంతో కాంచన బాధపడుతుంది. తన అన్న ఒక్కసారిగా బంధాలు తెంచుకున్నట్టు మాట్లాడటంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీపా కూడా గౌతమ్ మంచి వాడు కాదని చెబుతూనే ఉంటుంది. ఎన్ని మాటలకైనా ఒర్చుకుంటుంది. కానీ తిరిగి ఏమాత్రం కూడా మాట జారదు.
ఇదిలా ఉంటే.. జ్యోత్స్న ఊహించని షాక్ ఇచ్చింది. గౌతమ్ తో పెళ్లి క్యాన్సిల్ అయినందుకు ఆమె నిశ్చితార్థపు వేడకలో ఎంతో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీపా వల్లే తన జీవితం నాశనమవుతుందని కన్నీళ్లు పెట్టుకుని బోరున ఏడ్చేసింది. ఇక ఎంగేజ్ మెంట్ క్యానిల్ అవడంతో ఏడ్చుకుంటూ కూర్చుంటుందనుకుంటే తన కుట్రను బయటపెట్టింది. గౌతమ్ తో పెళ్లికి ఒప్పుకుంది ఒక నాటకమని తనతో తాను చెబుకుంటుంది. గౌతమ్ మంచి వాడు కాదని, మోసగాడనే విషయం తనకు ఎప్పుడో తెలుసని చెబుతుంది.
గౌతమ్ తన ఇంట్లోని పని మనిషికి కడుపు చేసిన విషయం కూడా తెలుసని, అసలు గౌతమ్ తో పెళ్లి చేసుకోనని చెబుదామనే ఆరోజు గౌతమ్ వాళ్ల ఇంటికి వెళ్లాలనని తెలుపుతుంది. కానీ అదే సమయంలో దీపా గౌతమ్ మోసగాడని తెలుసుకొని ఎదురిస్తుంది. ఆ సంగతి అంతా తాను స్వయంగా దగ్గరుండి చూశానని తెలుపుతుంది. అసలు గౌతమ్ తో పెళ్లే జరగదని చెబుదామని వెళ్లిన జ్యోత్స్నకు దీపా మరో నాటకానికి అవకాశం ఇచ్చిందని, దాంతోనే పెళ్లికి ఒప్పుకున్నానని తెలుపుతుంది. ఇతరుల జీవితాల కోసం ఎంతో ఆరాటపడే దీపా వ్యక్తిత్వాన్నే తన నాటకానికి వాడుకున్నట్టు చెబుతుంది.
పెళ్లికి ఒప్పుకోవడమే కాకుండా, తాత శివనారాయణను దగ్గరుండి ఆహ్వానించేందుకు పిలిపించేలా చేశానని తన ప్లాన్ మొత్తాన్ని వివరిస్తుంది. అంతే కాదు పారుజాతంతో కూడా క్యాటరింగ్ ఇప్పించి తప్పకుండా ఫంక్షన్ వచ్చేలా చేశానని, ఇక గౌతమ్ గురించి తెలిసిన దీపా ఎలాగైనా ఎంగేజ్ మెంట్ ను అడ్డుకుంటుందని ఊహించనని చెప్పింది. అచ్చం అలాగే దీపా చేసిందని సంబరపడుతుంది. దాంతో కుటుంబ దృష్టిలో దీపా పెద్ద తప్పు చేసిన దానిలా ఉండిపోతుంది, ఎప్పటికి దీపాను క్షమించరని భావిస్తుంది. మరోవైపు తనను కూడా పెళ్లి చేసకోమని ఇంట్లో వాళ్ల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండబోదని చెబుతుంది.
ఇక ఇదంతా తన బావ కార్తీక్ ను దక్కించుకోవడం కోసమే చేసిందని, తన బావ కోసం ఎంతటి పనికైనా తెగిస్తానని అంటుంది. ఎవరైనా అడ్డువస్తే చంపడానికైనా, చావడానికైనా వెనకాడబోనని శపతం చేస్తుంది. కార్తీక్ బావను దక్కించుకునేందుకు, దీపాను సర్వనాశనం చేసేందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తానని, ఎంత దూరమైనా వెళ్తానని జ్యోత్స్న మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. మరోవైపు దీపా సుమిత్ర అన్న మాటలకు కుమిలిపోతుంది. జ్యోత్స్న కు మంచి జరగాలనే నిశ్చితార్థాన్ని అడ్డుకున్నానని చెబుతుంది. కానీ తానే చెడుగా మిగిలిపోయానని బాధపడుతుంది. ఇక జ్యోత్స్న తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో కూడా వివరించబోతోంది... అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











