Karthika deepam 2 March 29th : జ్యోత్స్న కుట్ర సక్సెస్.. కుమిలిపోతున్న దీపా

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 28వ తేదీ 317వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న నిశ్చితార్థం ఆగిపోవడంతో సుమిత్ర చాలా బాధపడుతుంది. గౌతమ్ తో తన కూతురు జోత్స్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడానికి కారణం దీప కావడంతో ఆమెపై కోపం తెచ్చుకుంటుంది. దీంతో వెంటనే కార్తీక్ బాబు ఇంటికి వెళ్లి దీపాను కడిగేస్తుంది. నీ దగ్గర ఎలాంటి ఆధారం ఉందని గౌతమ్ పై నింద వేశావని ప్రశ్నిస్తుంది. జోత్స్న గౌతమ్ ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలు కలిగి ఉన్నారని, వారిద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసా అని సుమిత్ర దీపాకు చెబుతుంది. వాళ్ళిద్దరికీ తెలియని విషయం నీకు ఎలా తెలుసు అని దీపాపై మండిపడుతుంది. నువ్వు చేసిన పనికి ఇంకెప్పుడూ నాకు కనిపించదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

జోత్స్నకు మంచి చేయాలని భావించిన దీపా కు ఇలా ఊహించని అవమానం ఎదురవుతుంది. శివ నారాయణ కుటుంబానికి ఎంత దగ్గర కావాలని ప్రయత్నించిన ఏదో ఒక సమస్య తనను దూరం చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు జోత్స్న నిశ్చితార్థం రూపంలో దీపాకు మరో సవాల్ ఎదురైంది. సుమిత్ర ఇంటికి వచ్చి మరి గౌతమ్ పై వేసిన నిందను రుజువు చేయాలని గట్టిగా మందలించడంతో దీపా సందిగ్ధంలో పడిపోతుంది. మోసగాడైన గౌతమ్ అసలు రంగును ఎలా బయట పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ సుమిత్ర అన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంది. ఇక దీప గౌతమ్ చెడ్డవాడని ఎలా రుజువు చేస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుమిత్ర అన్న మాటలకు నెక్స్ట్ దీప ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మార్చి 29వ తేదీ 318 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Karthika deepam 2 Serial Today s Episode 318 March 29th 2025

దీపా జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ అడ్డుకునే తీరుపై సుమిత్ర మండిపడుతుంది. దీపాను నానా మాటలు అనేసి వెళ్లిపోతుంది. అయితే, సుమిత్రనే కాదు, కార్తీక్ బాబు, కాంచన కూడా దీపా చేసింది తప్పు అనే విమర్శిస్తారు. సుమిత్ర వచ్చి దీపాపై కోపం చేసిన సందర్భంలో కార్తీక్ బాబు, కాంచన ఏమాత్రం అడ్డుకోలేకపోయారని బాధపడుతుంది. కార్తీక్ బాబుతో మాట్లాడుతూ తను జ్యోత్స్న బాగుండాలనే ఎంగేజ్ మెంట్ ను ఆపానని, గౌతమ్ పచ్చి మోసగాడని, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడనే ఎంగేజ్ మెంట్ ను అడ్డుకున్నాననే తప్ప జ్యోత్స్న మీద తనకెలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చింది. కానీ సుమిత్ర అమ్మ తనను పరాయిదానిలా చూడటం, జ్యోత్స్న ను నేనే ఇబ్బంది పెడుతుందని భావించడం చాలా బాధాకరంగా ఉందని దీపా చెపుకుంటుంది.

అసలు జ్యోత్స్న తనను ఎన్ని రకాలుగా ఇబ్బందిపెట్టిందో, ఎంత నరకం చూపించిందో మీ అందరికీ తెలిసింది కేవలం సగమేనని, మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని చెబుతుంది. తనకు అమ్మ ప్రేమ తెలియదని, చిన్నప్పుడే తల్లి తనకు దూరమవడంతో తల్లి పంచే మాధుర్యం ఎలాంటి ఉంటుందో ఎప్పుడు చూడలేదని బాధపడుతుంది. కానీ సుమిత్ర తనను కన్న కూతురిలా చూసుకుందని, అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియజేసిందని దీపా గుర్తు చేసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు సుమిత్ర అమ్మనే తనను అమ్మ అని పిలవొద్దని చెప్పడం చాలా బాధాకరంగా ఉందని తెలుపుతుంది. అయితే, దీపా తన వెర్షన్ చెప్పుకుంటూ వచ్చినా.. ఫలితం లేకుండా పోయింది.

జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ను అడ్డుకున్నందుకు, పైగాగౌతమ్ ను కొట్టినందుకు, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడని నింద వేసినందుకు దీపానే ఇప్పుడు అవమానం పాలైంది. ఎంగేజ్ మెంట్ సమయంలో శివనారాయణ, జ్యోత్స్న, పారులతో దారుణంగా అవమానాన్ని ఎదుర్కొంది. ఇక ఇప్పుడు కార్తీక్ బాబు, కాంచన తోనూ విమర్శలు ఎదుర్కొంది. దీపా గౌతమ్ ను కొట్టడం ముమ్మాటికీ తప్పేనని కార్తీక్ బాబు స్పష్టం చేస్తాడు. గౌతమ్ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడంటే తానే కాసేపు నమ్మలకపోయానని దీపాతో అంటాడు. అలాంటి వాడి గురించి ముందు తనతో చెప్పాలి కదా, అలా చెబితే వాడిని అందరి ముందు కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే వాడినని కార్తీక్ బాబు అంటాడు.

నువ్వు గౌతమ్ ను కొట్టడం కారణంగా... జ్యోత్స్న నిశ్చితార్థాన్ని అడ్డుకున్న దానివి అయ్యాడు. అంతే కాదు గౌతమ్ కు తప్పించుకునే అవకాశం కూడా ఇచ్చావు. ఇప్పుడు అందరి దృష్టిలో చెడ్డదానిగా మిగిలిపోయావు. అసలు నువ్వు గౌతమ్ ను కొట్టకుండా నార్మల్ గా చెప్పి ఉన్న నీ మాట అందరూ నమ్మేవారంటూ కార్తీక్ బాబు దీపాను మందలిస్తాడు. అసలు సాక్ష్యం లేకుండా నింద వేయడం తప్పు అని చెప్పుకొస్తాడు. ఇక అయ్యిందేదో అయిపోయింది అంతా మర్చిపో అని సూచిస్తాడు. మరోవైపు అత్త కాంచన కూడా దీపానే తప్పుబడుతుంది. ఏదేమైనా నువ్వు గౌతమ్ ను కొట్టడం కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. నువ్వు అలా సడెన్ గా గౌతమ్ ను కొట్టడంతో షాక్ లో ఉండిపోయామని, తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని చెబుతుంది.

ఇక దీపా వల్ల తన అన్న దశరథ్ 'క్షమించు' అనే మాట అన్నాడని, అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదని దీపాకు చెప్పి తన గదిలోకి వెళ్లిపోతుంది. ఇక అనసూయ మాత్రం దీపా కన్నీళ్లు తుడిచి ధైర్యం చెబుతుంది. ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు అనిచెప్పినా తాను మాత్రం అలా అనుకోనని చెప్తుంది. కానీ గౌతమ్ ను నువ్వు కొట్టడం మాత్రం తప్పేనని గుర్తు చేస్తుంది. ఇలా అందరూ దీపా గౌతమ్ ను కొట్టడం తప్పుగా భావించడంతో ఏం చేయాలో తెలియక బాధపడుతుంది. రెండు కుటుంబాలు ఈ పెళ్లితో కలవాలని ఎదురుచూసిన తనకే అవమానం కలిగిందని బాధపడుతుంది. ఏదేమైనా జ్యోత్స్న జీవితాన్ని మాత్రం కపాడగలిగానని, ఇక ఎన్ని నిందలు, అవమానాలైనా భరిస్తాడనని తనతో తాను చెప్పుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న ఇంట్లో వారందరికీ దీపా గురించి చెడు చెబుతుంది. మొదటి నుంచి దీపా వల్లనే తన జీవితం సంతోషంగా లేదని, మిమ్మల్ని కూడా సంతోషం ఉంచలేకపోవడానికి దీపానే కారణమని అన్ని విషయాలను గుర్తు చేస్తూ వస్తుంది. ఆ మాటలు తాత శివనారాయణ కూడా వింటాడు. దీపాపై రగిలిపోతాడు. మరోవైపు గౌతమ్ ను ఎలా పట్టించాలని దీపా ఆలోచనలో పడిపోతుంది. ఇలా అటు శివనారాయణ, ఇటు దీపా ఎలాంటి స్టెప్ వేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X