Karthika deepam 2 March 31st : రెస్టారెంట్ లో దీపాను నిలదీసిన శివనారాయణ.. వంటలక్కకు సవాల్
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 29వ తేదీ 318వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న నిశ్చితార్థం ఆగిపోవడంతో సుమిత్ర చాలా బాధపడుతుంది. గౌతమ్ తో తన కూతురు జోత్స్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడానికి కారణం దీప కావడంతో ఆమెపై కోపం తెచ్చుకుంటుంది. దీంతో వెంటనే కార్తీక్ బాబు ఇంటికి వెళ్లి దీపాను కడిగేస్తుంది. అంతే కాదు.. కార్తీక్ బాబు, కాంచన తోనూ విమర్శలు ఎదుర్కొంది దీపా. గౌతమ్ ను కొట్టడం ముమ్మాటికీ తప్పేనని కార్తీక్ బాబు స్పష్టం చేస్తాడు. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ లో గౌతమ్ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడంటే తానే కాసేపు నమ్మలేకపోయానని దీపాతో అంటాడు. అలాంటి వాడి గురించి ముందు తనతో చెప్పాలి కదా, అలా చెబితే వాడిని అందరి ముందు కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే వాడినని కార్తీక్ బాబు అంటాడు. నువ్వు గౌతమ్ ను కొట్టడం కారణంగా... జ్యోత్స్న నిశ్చితార్థాన్ని అడ్డుకున్న దానివి అయ్యావు. అంతే కాదు గౌతమ్ కు తప్పించుకునే అవకాశం కూడా ఇచ్చావు. ఇప్పుడు అందరి దృష్టిలో చెడ్డదానిగా మిగిలిపోయావు. అసలు నువ్వు గౌతమ్ ను కొట్టకుండా నార్మల్ గా చెప్పి ఉన్న నీ మాట అందరూ నమ్మేవారంటూ కార్తీక్ బాబు దీపాను మందలిస్తాడు.
అసలు సాక్ష్యం లేకుండా నింద వేయడం తప్పు అని చెప్పుకొస్తాడు. ఇక అయ్యిందేదో అయిపోయింది అంతా మర్చిపో అని సూచిస్తాడు. మరోవైపు అత్త కాంచన కూడా దీపానే తప్పుబడుతుంది. ఏదేమైనా నువ్వు గౌతమ్ ను కొట్టడం కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. నువ్వు అలా సడెన్ గా గౌతమ్ ను కొట్టడంతో షాక్ లో ఉండిపోయామని, తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని చెబుతుంది. ఇక అనసూయ మాత్రం దీపా కన్నీళ్లు తుడిచి ధైర్యం చెబుతుంది. ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు అనిచెప్పినా తాను మాత్రం అలా అనుకోనని చెప్తుంది. కానీ గౌతమ్ ను నువ్వు కొట్టడం మాత్రం తప్పేనని గుర్తు చేస్తుంది. ఏదేమైనా జ్యోత్స్న జీవితాన్ని మాత్రం కపాడగలిగానని, ఇక ఎన్ని నిందలు, అవమానాలైనా భరిస్తాడనని తనతో తాను చెప్పుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న ఇంట్లో వారందరికీ దీపా గురించి చెడు చెబుతుంది. ఇక మార్చి 31వ తేదీ 319 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ లో గౌతమ్ ను మోసగాడని ముద్ర వేయడమే కాకుండా, చెంప చెల్లుమనిపించినా దీపాను సుమిత్ర నానా మాటలు అంటుంది. మొదటి నుంచి దీపా చేసిన తప్పులన్నింటిని ఎత్తి చూపిస్తుంది. అసలు ఎలాంటి ఆధారం లేకుండా ఎలా నిందిస్తావంటూ ఫైర్ అవుతుంది. ఇక తన గదిలో బట్టలు ఐరన్ చేస్తూ దీపా ఇవన్నీ ఆలోచిస్తుంది. తన మనసుకు గాయం చేసిన సుమిత్ర మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కన్నీళ్లతో తన బాధను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు గౌతమ్ మోసగాడని ఎలా ఫ్రూవ్ చేయాలని ఆలోచిస్తూ కూడా ఉంటుంది. ఈలోపు కార్తీక్ బాబు దీపా వద్దకు అన్నం తీసుకొని వస్తాడు. ఉదయం నుంచి దీపా ఏం తినకపోవడంతో తినిపించేందుకు ప్లేట్ లో అన్నం, పప్పు, కొత్త ఆవకాయ పచ్చడి వేసుకొని తీసుకొస్తాడు.
ఇక దీపా తనపై పడ్డ నిందను, పారుజాతం ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం, సుమిత్రతో మాటలు పడటం, పైగా కార్తీక్ బాబు, కాంచన కూడా తనదే తప్పు అన్న విషయాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ బాబు ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇలాగైతే ఎలా అంటూ మాటలు కలుపుతూ అన్నం తినిపించే ప్రయత్నం చేస్తుంది. తనకు తినాలని లేదని దీపా బదులిస్తుంది. కానీ కార్తీక్ బాబు ఏమాత్రం ఊరుకోడు నువ్వు తినాల్సిందేనని చెబుతాడు. మనస్సులో బాధ ఉంటే.. ఆకలి ఉన్నా తినాలి అనిపించదని, ఆ బాధను తీసేస్తేనే తినగలవని చెప్పి దీపాకు అన్నం తినిపిస్తాడు.
ఆ తర్వాత దీపా గౌతమ్ గురించి మాట్లాడుతుంది. అతను పచ్చి మోసగాడిని మరోసారి గుర్తు చేస్తుంది. దాంతో కార్తీక్ బాబు అవును కావొచ్చు. కానీ మన దగ్గర సాక్ష్యం లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. దాంతో తనతో పాటు మీరు కూడా నిందమోయాల్సిందేనా అంటూ కార్తీక్ బాబుతో అంటుంది. ఇక కార్తీక్ బాబు మనం ఏం మార్చలేనప్పుడు జరిగేది చూడాల్సిందేనని చెబుతాడు. ఇక తెల్లవారక తమ రెస్టార్టెంట్ కు వెళ్తారు. అక్కడ వాళ్లకు ఊహించని షాక్ తగులుతుంది. రెస్టారెంట్ లో కస్టమర్లకు అన్నీ భోజనాల ఏర్పాట్లు చూస్తుండగా... కాశీ వచ్చి వారిని పలకరించడానికి వస్తాడు. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ లో జరిగిన దానికిపై పరామర్శిస్తాడు. కార్తీక్ బాబు అదంతా పెద్దగా పట్టించుకోవడం లేదని, జరిగేదేదో జరగనివ్వు అంటూ బదులిస్తాడు.
ఇక ఎవ్వరూ ఊహించని విధంగా కార్తీక్ బాబు రెస్టారెంట్ కు శివనారాయణ వస్తాడు. అది చూసుకోని కార్తీక్ బాబు శివనారాయణను కస్టమర్ అనుకొని ఏం కావాలి సార్ అని అడుగుతాడు. ఇక శివనారాయణ మెనూ కార్డును విసిరేసి కాస్తా విషయం ఉంటే ఇప్పించండి అంటూ ఒక్కసారిగా కోపం చేస్తాడు. అసలు శివనారాయణ అక్కడికి రావడం పట్ల కార్తీక్ బాబు, దీపా చాలా షాక్ కు గురవుతారు. ఇక శివానారాయణ తనకు దీపా చేతితో కాస్తా విషయం ఇప్పటించు అంటూ మండిపడుతాడు. నా మనవరాలి జీవితంలో నిప్పులు పోస్తూ నువ్వు సంతోషంగా ఉన్నావా? అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు.
తను కోరకున్న వాడితో జీవితం జ్యోత్స్నకు ఎలాగూ దక్కలేదు, కనీసం వేరే వాడితోనైనా పెళ్లి చేసుకోవాలని భావిస్తే దీపా చెడగొట్టిందంటూ కోపం చేస్తాడు. కార్తీక్ బాబు శివనారాయణ గొడవ చేయడానికే వచ్చాడని గ్రహించి పక్కకు వెళ్లి మాట్లాడుకుందామని అంటాడు. ఎందుకు? నీకు కస్టమర్ల ముందు పరువు పోయినట్టు, అవమానంగా అనిపిస్తుందా? అంటూ ప్రశ్నిస్తాడు శివనారాయణ. మరీ నీకె ఇలా ఉంటే.. అంత మంది బంధువుల ముందు పెళ్లి కొడుకును కొట్టి, జ్యోత్స్న నిశ్చితార్థాన్ని ఆపిన దీపా వల్ల ఇంకా మేమేం ఎంత బాధపడాలి, అవమాన పడాలి అంటాడు. అసలు నీ దగ్గర గౌతమ్ అమ్మాయిలతో తిరుగుతాడని ఫోటోలు ఉన్నాయా? ఇంకేమైనా ఆధారాలున్నాయా? లేనప్పుడు ఎందుకు అలా చేశావంటూ దీపాపై మండిపడుతాడు. దాంతో దీపా రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











