Karthika deepam 2 April 1st: దీపా దెబ్బకు వణికిపోయిన జ్యోత్స్న.. షాక్ లో శివనారాయణ, కానీ
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మార్చి 31వ తేదీ 319వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణమైన దీపాను సుమిత్ర దారుణంగా తిడుతుంది. ఇన్నాళ్లు కన్న కూతురిలా చేసుకొని ఒకేసారి అనాథను చేసి మాట్లాడుతుంది. అయితే, గౌతమ్ అనే వ్యక్తితో జ్యోత్స్న నిశితార్థం అవుతున్న సమయంలో అతను అమ్మాయిలను మోసం చేసే వాడని చెప్పి ఎంగేజ్ మెంట్ ను అడ్డుకుంటుంది. దీపా చెప్పేది నిజమే అయినా.. ఆమె దగ్గర సరైన ఆధారాలు లేవు. దాంతో నీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఎలా నువ్వు ఎంగేజ్ మెంట్ ను అడ్డుకుంటావని, పైగా గౌతమ్ చెంప పగలగొడుతావని సుమిత్ర మండిపడుతుంది. ఇకపై తనతో మాట్లాడొద్దని షరతు పెడుతుంది. అలాగే దశరథ్ కూడా తన కూతురి ఎంగేజ్ మెంట్ ఆగిపోయిన బాధలో దీపా, కాంచనతో మాట్లాడటం మానేస్తాడు.
ఇక దీపా ఇవన్నీ తలుచుకుంటూ కుమిలిపోతుంటే.. కార్తీక్ బాబు ధైర్యం చెబుతాడు. గౌతమ్ ను కొట్టకుండా నువ్వు ఏమి చేసినా అంతా మంచిగానే ఉండేదని, అసలు మోసగాడైన గౌతమ్ తప్పించుకునే వాడు కాదని కూడా కార్తీక్ బాబు దీపాకు వివరిస్తాడు. అయితే శివనారాయణ మాత్రం ఏకంగా దీపా, కార్తీక్ బాబుల రెస్టారెంట్ కు వెళ్లి మరోసారి మండిపడుతాడు. అప్పటికే జ్యోత్స్న దీపాపై ఎక్కించి చెప్పిన మాటలకు దీపాపై దారుణంగా సీరియస్ అవుతాడు. మా అందరికీ విషయం ఇచ్చి చంపేసేయ్ అటూ దారుణంగా దీపాపై మాట్లాడుతాడు. అయినా గౌతమ్ మంచి వాడు కాదు కాబట్టే ఎంగేజ్ మెంట్ ను అడ్డుకున్నానని చెప్పడంతో శివనారాయణ ఇంకా మండిపడుతాడు. అసలు నీ దగ్గర గౌతమ్ అమ్మాయిలతో తిరుగుతాడని ఏం ఆధారం ఉందని, కనీసం ఒక్క ఫొటోనైనా ఉందా? అంటూ ప్రశ్నిస్తాడు. ఇక దీపా శివనారాయణకు నిజం తెలియజేసేందుకు ప్రయత్నిస్తుంది. వెంటనే గౌతమ్ కడుపు చేసిన పని మనిషి ఇంటికి బయల్దేరుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతనేది తరువాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 1వ తేదీ 320 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

ఎలాగైన గౌతమ్ మంచివాడు కాదనే విషయాన్ని తెలియజేసేందుకు దీపా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే సుమిత్ర, శివ నారాయణ గౌతమ్ విషయంలో సాక్ష్యం అడుగుతుండడం, పక్క ఆధారంతో రుజువు చేసి చూపించు అని సవాల్ విసురుతుండడంతో దీప సీరియస్గా తీసుకుంటుంది. ఇప్పుడు తను గౌతం మోసగాడని రుజువు చేయకపోతే ఇక ఎప్పటికీ శివ నారాయణ కుటుంబం తనను కార్తీక్ ను నిందితులు గానే చూస్తారని భావిస్తుంది. దాంతో గౌతమ్ మోసం చేసిన పనిమనిషి రమ్య కోసం వెతుకుతుంది. ఇక తన అడ్రస్ తెలుసుకుని మణికొండలోని కొత్తపేటకు వెళుతుంది. తను వెళ్లే క్రమంలోనే రమ్య ఎదురవుతుంది.
దీపా రమ్యను కలిసే కంటే ముందే శివ నారాయణ అల్లుడు శ్రీధర్ దీపాకు ఎదురవుతాడు. ఇక సూటిపోటి మాటలతో ఆమె మనసును ఇబ్బంది పెడతాడు. శ్రీధర్ మాటలకు దీటుగా బదులిచ్చి దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే దీప చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడటంతో ఎలాగైనా గౌతం మోసగాడు అని రుజువు చేయబోతుందని శ్రీధర్ గ్రహిస్తాడు. దాంతో దీప వెంటనే ఫాలో అవుతాడు. ఇక దీప రమ్య ను కలిసి గౌతమ్ గురించి చెప్పిన మాటలన్నింటినీ వింటాడు. వెంటనే శివ నారాయణ భార్య పారిజాతం కు ఫోన్ చేస్తాడు.
దీప ఒక అమ్మాయిని కలిసిందని చెప్తాడు. బహుశా ఆమె గౌతమ్ మోసం చేసిన అమ్మాయి కావచ్చు అంటూ మేటర్ లీక్ చేస్తాడు. దీపా నువ్వు ఎలాగూ ఏం చేయలేకపోతున్నారు, కానీ దీపా మాత్రం ఆ గౌతమ్ ను చెడ్డవాడని రుజువు చేసేందుకు సాక్ష్యం కూడా సిద్ధం చేసిందని చెబుతాడు. అయితే అక్కడ ఫోన్ లిఫ్ట్ చేసింది మాత్రం పారిజాతం కాకపోవడం గమనార్హం. అయితే ఫోన్ లిఫ్ట్ చేసింది జ్యోత్స్న. శ్రీధర్ మామ చెప్పిన విషయాలన్నీ జోత్స్నా వింటుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
ఇక గౌతమ్ మోసం చేసిన రమ్య ఆశకు కోసం చూస్తున్న సమయంలో రమ్యనే దీపా కు కనిపిస్తుంది. ఇక గౌతమ్ నిన్ను ఒక్కదాన్నే కాదు చాలామంది అమ్మాయిలను మోసం చేశాడని చెప్పి, గౌతమ్ కు తగిన గుణపాఠం చెప్పాలని తన వెంట పెట్టుకుని శివ నారాయణ ఇంటికి వస్తుంది. వచ్చి రాగానే శివ నారాయణ దీపా పై మండిపడతాడు. ఈ ఇంటి గుమ్మం తొక్కద్దు అని చెప్పినా వినవా అంటూ దీపాపై అసహ్యించుకుంటాడు. కానీ దీప ధైర్యంగా మాట్లాడుతుంది. సాక్ష్యం లేకపోతే నిజాలు నీటి మీద రాళ్ల వంటివని అన్నారు కదా, ఇప్పుడు సరైన సాక్ష్యంతో వచ్చానని చెబుతోంది.
రమ్యను చూసిన జ్యోత్స్న షాక్ అవుతుంది. గౌతమ్ చెడ్డవాడని, రమ్య ను వాడుకొని వదిలేసాడని, ఇప్పటికే జ్యోత్స్నకు కూడా తెలుసు. అయితే గౌతం గురించి రమ్య పూర్తిగా నిజం చెప్పేస్తే.. దీప తప్పించుకుంటుందని, ఆమెపై ఉన్న నింద తొలగిపోతుందని.. ఇదే సమయంలో తను ఇంట్లో క్రియేట్ చేసుకున్న సింపతి కూడా పోతుందని జోత్స్న భయపడుతుంది. ఇక దీప తీసుకొచ్చిన రమ్యతో ఆ నిజమేంటో చెప్పించు అని శివ నారాయణ, దశరథ్, పారిజాతం అంటారు. ఇక దీప రమ్యతో నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు అని అంటుంది. కానీ రమ్య నిజం చెప్పడం కోసం తటపటాయిస్తుంది.
రమ్య నిజం చెబుతుందని లేదంటే డీఎన్ఏ టెస్ట్ చేయించాలని దీప అడుగుతుంది. ఇక రమ్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అంటూ.. అసలు విషయం చెప్పడంలో సాగదీస్తుంది. ఇక నిజం చెప్పడంలో రమ్య ఎందుకు అనుమానం పడుతుందని దీపా ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు రమ్య జ్యోత్స్న వైపు చూసి నిజం చెప్పేందుకు భయపడుతుంది. అయితే జ్యోత్స్న రమ్యను ఎలా భయపెట్టిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు తను నిజం చెబుతుందా? లేదా? అనేది వేచి చూడాలి. ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందనేది, ఇప్పుడు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











