Karthika deepam 2 April 2nd : మళ్లీ ఫూల్ అయిన దీపా.. జ్యోత్స్న మాస్టర్ స్ట్రోక్ తో సీన్ రివర్స్

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 1వ తేదీ 320వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జోత్స్న నిశ్చితార్థం ఆగిపోవడంతో దీపాకు పెద్ద సవాల్ ఏర్పడింది. పెళ్ళికొడుకు గౌతమ్ అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడని దీప ఇంట్లో వాళ్లకు చెప్పి నిశ్చితార్థపు వేడుకను అడ్డుకుంటుంది. అప్పటికే శివ నారాయణ కుటుంబానికి, దీపా కు పెద్ద వైరం కొనసాగుతున్న క్రమంలో ఇలా నిశ్చితార్థపు వేడుకను కూడా దీప అడ్డుకోవడం ఆ కుటుంబంలో నిందితురాలుగా మార్చేసింది. అటు సుమిత్ర, శివ నారాయణ దీపా దగ్గర ఎలాంటి ఆధారం ఉందని ప్రశ్నిస్తారు. గౌతమ్ మోసగాడు అని మాటల్లో చెబితే సరిపోదు. సాక్ష్యంతో రుజువు చేయాలని చెబుతారు. ఎలాంటి ఆధారం లేకుండా గౌతంపై చేయి చేసుకోవడం, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నిశ్చితార్థపు వేడుకను క్షణాల్లోనే నిలిచిపోయేందుకు కారణం అవడంతో కుటుంబం మొత్తం దీపాను నిందిస్తుంది. దీంతో దీపా ఎంతో బాధపడుతుంది.

ఎలాగైనా గౌతమ్ అసలు రంగు బయట పెట్టాలని ప్రయత్నిస్తుంది. అయితే గౌతం అప్పటికే తన ఇంట్లో పని చేసే రమ్యకు కడుపు చేసి మోసం చేస్తాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను వాడుకొని వదిలేస్తాడు. తల్లిదండ్రులతో వెళ్లి రమ్య గౌతమ్ ను ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోడు. అదే సమయంలో దీప వెళ్లి గౌతమ్ ను గట్టిగా ప్రశ్నిస్తుంది. ఇదంతా నిశ్చితార్థానికి ముందు జరిగిన స్టోరీ. అందువల్లనే దీప గౌతమ్ తో జ్యోత్స్న నిశ్చితార్ధాన్ని అడ్డుకుంటుంది. కానీ ఊహించని విధంగా నిందతన పైకి వస్తుంది. ఆ మచ్చను తొలగించుకోవడానికి ఇప్పుడు దీప ప్రయత్నిస్తోంది. అందుకోసం రమ్యను శివ నారాయణ ఇంటికి తీసుకువచ్చి నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంది. రమ్య కూడా నిజం చెప్పేందుకు ధైర్యంగా ముందుకు వస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అంటూ... గౌతమ్ పేరు చెప్పకుండానే తటపటాయిస్తూ ఉంటుంది. జ్యోత్స్న ను చూస్తూ భయంతో అలాగే ఉండిపోతుంది. ఇక ఆమె నిజం చెప్పిందా లేదా అనేది తరువాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 1వ తేదీ 321 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Karthika deepam 2 Serial Today s Episode 321 April 2nd 2025

దీపా సాక్ష్యం చెప్పించేందుకు తీసుకొచ్చిన రమ్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గౌతమ్ అని చెప్పలేక పోతుంది. నిజం చెబుదామని వచ్చినప్పటికీ జ్యోత్స్న మాస్టర్ ప్లాన్ కు బలవుతుంది. దీప రమ్యను కలిసిన విషయం శ్రీధర్ ద్వారా జ్యోత్స్న కు తెలియడంతో అడ్డుకునేందుకు ఊహించిన విధంగా ప్లాన్ వేస్తుంది. రమ్యను తీసుకువచ్చి దీప నిజం చెప్పమంటూ శివ నారాయణ, సుమిత్ర, దశరథ్ ల ముందు అడుగుతుంది. దీప ఎంత ప్రయత్నం చేసినా రమ్య మాత్రం నిజం చెప్పేందుకు సాహసించదు. జోత్స్న ను చూస్తూ చెప్పేందుకు భయపడుతుంది. ఇక ఎలాగో చెప్పేద్దామని ధైర్యం చేసే సమయానికి ఓ వ్యక్తి వచ్చే అడ్డుకుంటాడు.

రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తాడు. అతను ఎవరో తెలియని దీప షాక్ అవుతుంది. రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు అసలు కారణం అనే విషయం దీపాకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి పచ్చి నేను రమ్య భర్తనని, కాబట్టి ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే అవుతానని అబద్ధం చెబుతాడు. ఆ విషయం దీపకు స్పష్టంగా తెలుస్తుంది. రమ్యకు కూడా తన భర్త ఆ వ్యక్తి కాదనే విషయం తెలుసు. కానీ గౌతమ్ పేరు చెప్పకుండా ఆ వ్యక్తి వచ్చి అడ్డుకుంటాడు. అతన్ని చూసిన శివ నారయణ, కొడుకు దశరథ్, కొడలు సుమిత్ర షాక్ అవుతారు. దీపా కూడా ఇతనెవరూ అంటూ ఆలోచిస్తుంది. ఇక పారుజాతం అతని వివరాలు అడిగే ప్రయత్నం చేస్తుంది.

కానీ, అతను రాగానే రమ్య గౌతమ్ గురించి చెప్పడం ఆపేస్తుంది. ఆ వ్యక్తి తమ పేటలో తిరిగే కిరాయి రౌడీ కావడంతో భయపడి అసలు విషయాన్ని చెప్పకుండా దాచేస్తుంది. ఇప్పుడు నిజం చెబితే అతనితో మళ్ళీ ఎలాంటి సమస్యలు వస్తాయోనని ఆలోచించి మౌనంగా ఉండిపోతుంది. దీప ఎంత ప్రేరేపించిన గౌతమ్ తనను మోసం చేశాడని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి తనేనని చెప్పలేక పోతుంది. ఒక్కసారిగా రమ్య మౌనంగా ఉండడంతో దీపా షాక్ అవుతుంది. అసలు అతనికి ఎందుకు భయపడుతుందని సందిగ్ధంలో పడిపోతుంది.

ఇక ఆ వ్యక్తిని పంపించింది నేనే అంటూ జోత్స్న మనసులో అనుకుంటుంది. రౌడీ కూడా రమ్యకు భర్తను నేనేనని, డబ్బులు తీసుకుని అబద్ధాలు చెప్పటం మా వృత్తి అని చెబుతాడు. కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పొద్దని ఎంత చెప్పినా తన భార్య రమ్య వినడం లేదని ఆ రౌడీ అబద్ధాలు చెప్పి, శివ నారాయణ, దశరథ్, సుమిత్రాను నమ్మిస్తాడు. అప్పటికే దీప పై కోపంతో రగిలిపోతుండడం, వచ్చింది ఒక రౌడీ అని తెలియకపోవడం, దీనంతటి వెనక జ్యోత్స్న మాస్టర్ ప్లాన్ ఉందని తెలియక వారందరూ ఆ రౌడీ మాటనే వింటారు. ఇలా మరోసారి దీప జ్యోత్స్న చేతిలో ఫూల్ అవుతుంది.

అసలైన సాక్ష్యంతో గౌతమ్ మోసగాడు అని రుజువు చేసే ప్రయత్నం చేసినప్పటికీని దీపానే మళ్లీ అవమానం పాలవుతుంది. ఆ రౌడీ మాటలనే నమ్మిన శివ నారాయణ దీపపై ఇంకా మండిపడతాడు. ఇలా డబ్బులు ఇచ్చి దొంగ సాక్ష్యం చెప్పించడం నీకు సిగ్గుగా లేదా అని దీపాను ప్రశ్నిస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకో అంటూ అసహ్యం వ్యక్తం చేస్తాడు. ఇక సుమిత్ర కూడా దీపా పై రెచ్చిపోతుంది. కన్న కూతురి వలె చూసుకున్నానని అయినా తన కుటుంబానికే మోసం చేయాలని ఎందుకు ఇంతలా ప్రయత్నిస్తున్నావు అంటూ దీపాను సుమిత్ర అవమానిస్తుంది. ఒక్క క్షణం కూడా నువ్వు మా ఇంట్లో ఉండొద్దు అంటూ అందరూ దీపాను వెళ్ళగొడతారు. మరోవైపు జ్యోత్స్న తన బావ కోసం దీపాను ఇంకా ఇంకా నిందలపాలు చేస్తానని తనతో తాను శపథం చేసుకుంటుంది. అందరూ తిట్టడంతో దీపా ఇంటి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దశరథ్ కు ఏదో జరుగుతుందనే సందేహం మొదలవుతుంది. దీని వెనకాల జ్యోత్స్న పాత్ర ఉండే ఉంటుందని నమ్ముతాడు... ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X