Karthika deepam 2 April 3rd : జ్యోత్స్న కుట్రపై దశరథ్ కు అనుమానం.. దీపా నెక్ట్స్ ప్లాన్
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 2వ తేదీ 321వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జోత్స్న నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణమైన దీపా ముందు పెద్ద సవాల్ ఉంది. పెళ్లికొడుకుగా శివనారాయణ ఎంపిక చేసిన గౌతమ్ మోసగాడాని రుజువు చేయడం వంటలక్కకు కత్తిమీద సాములా మారింది. ఎన్నో అవమానాలను, నిందలను మోస్తోంది. ఒక మోసగాడిని మోసగాడని రుజువు చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఎలాగోలా గౌతమ్ కడుపుచేసి వదిలేసిన పనిమనిషి రమ్యను సాక్ష్యంగా చూపించే ప్రయత్నం చేసినా జ్యోత్స్న మాస్టర్ మైండ్ ముందు నిలవలేకపోతుంది. ఫలితంగా దీపా మరోసారి శివనారాయణ కుటుంబం ముందు అవమానం పాలవుతుంది.
గౌతమ్ మంచివాడు కాదని, అమ్మాయిల జీవితాల ఆడుకునే క్రూరుడని ఎంత చెప్పినా ఎవ్వరూ ఆమె మాటను పట్టించుకోరు. పైగా జ్యోత్స్న జీవితాన్ని దీపా పాడుచేయాలని చూస్తుందనే భావన కల్పించుకుంటారు. ఇప్పుడు దీపా ఎలాగైనా గౌతమ్ అసలు రూపాన్ని బయటపెడితే తప్ప మళ్లీ శివనారాయణ ఇంట్లో మళ్లీ గౌరవం దక్కే అవకాశం లేకపోయింది. దీపా శతవిధాలుగా ప్రయత్నించినా.. జ్యోత్స్న మాత్రం ఎత్తుకు పైఎత్తు వేస్తూ నెగ్గుతోంది. మరోవైపు దీపాను నిజం రుజువు చేయకుండా శ్రీధర్, పారుజాతం కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలా జ్యోత్స్నకు గట్టి బలం దొరుకినట్టైంది. అయితే దీపానే శివనారాయణ అసలు మనవరాలని తెలిసిన ఏకైక వ్యక్తి దాసు అనే సంగతి తెలిసిందే.కాగా, దాసుకు మళ్లీ గతం గుర్తుకు వస్తుంది. అతనికి క్షణాల్లోనే మర్చిపోయే వ్యాధి ఉండటంతో ఈసారి పేపర్ పై తను ఏం చెప్పాలనుకున్నాడనేది పేపర్ పై రాస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 3వ తేదీ 322 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

గౌతమ్ మోసగాడని రమ్యతో నిజం చెప్పించాలని అనుకున్న దీపాకు చుక్కెదురైంది. శివనారాయణ, సుమిత్రలు.. దీపాను ఇంట్లోనుంచి వెళ్లగొట్టడంతో ఏడ్చుకుంటూ తిరిగి ఇంటికి వస్తుంది. ఇక ఈ విషయాన్ని అంతా గుంటకాడి నక్కలా గోడచాటున విన్న శ్రీధర్ సంతోషిస్తాడు. అంతటితో ఆగకుండా కార్తీక్ బాబు ఇంటికి వెళ్లి మరీ దీపా శివనారాయణ ఇంటికి వెళ్లిన విషయాన్ని తెలియజేయాలనుకుంటాడు. అయితే శ్రీధర్ ను చూసిన వెంటనే కార్తీక్ బాబు మండిపడుతాడు. ఎందుకు ఈ ఇంటివైపు పదే పదే వస్తూ విసిగిస్తూ ఉంటున్నావని ప్రశ్నిస్తాడు. క్షణాల్లోనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని కోపోద్రేకితుడవుతాడు. కానీ శ్రీధర్ ఎందుకు వచ్చాననో చెబితే మీరంతా షాక్ అవుతారని అంటాడు.
ఈరోజు దీపా శివనారాయణ ఇంటికి వెళ్లి వచ్చిందని చెబుతాడు. ఆ విషయం విన్న కార్తీక్ బాబు షాక్ అవుతాడు. దీపా అస్సలు ఆ ఇంటి గుమ్మం తొక్కబోదని ఘనంగా బదులిస్తాడు. అసలు నేను శివనారాయణ ఇంట్లోకి వెళ్లి వచ్చిన విషయం శ్రీధర్ కు ఎలా తెలిసిందంటూ దీపా షాక్ అవుతుంది. మరోవైపు కాంచన కూడా ఆశ్చర్యపోతుంది. మొన్న అంత పెద్ద గొడవ జరిగినా.. ఆ ఇంటి వాళ్లు అవమానించిన మళ్లీ ఎందుకు అక్కడి వెళ్లిందని కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ బాబు దీపా శివనారాయణ ఇంటికి ఎందుకు వెళ్లిందో చెప్పడం ప్రారంభిస్తాడు. దీపా మణికొండలో గల్లీ గల్లీ తిరుగుతూ ఉందని చెబుతారు. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారని అన్నాడు.
గౌతమ్ ను మోసగాడిగా రుజువు చేసేందుకు రమ్య అనే అమ్మాయిని తీసుకొని శివనారాయణ ఇంటికి వెళ్లిందని చెబుతాడు. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు గౌతమే తండ్రి అని రుజువు చేసేందుకు దీపా ఎంతో ప్రయత్నించిందని, కానీ చివరికి విఫలమైందన్నారు. రమ్య అసలు భర్తగా వచ్చిన వ్యక్తితో దీపా తిట్లపాలైందని శ్రీధర్ నవ్వుతూ కార్తీక్ బాబు, కాంచనాలకు చెబుతాడు. ఆ వ్యక్తి రమ్య అసలు భర్త అని, అతనే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అని అక్కడే తేలిపోయిందని శ్రీధర్ అపహస్యంతో వివరిస్తూ ఉంటాడు. దీపాను నానా తిట్లు తిట్టారని సంబరపడుతూ చెబుతాడు. అంతే కాదు దీపాకు డబ్బులిచ్చి మరీ గౌతమ్ చెడ్డవాడని రుజువు చేయాలని ప్రయత్నించిందని, అందుకు ఫలితంగా శివనారాయణ, సుమిత్రలు దీపాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని చెబుతాడు.
ఈ విషయం చెప్పగానే కార్తీక్ బాబు, కాంచనా బాధపడుతారు. వారి మొహాలు చూస్తూ శ్రీధర్ బాబు ఇంకా ఆనందపడుతాడు. అవమానిస్తాడు. ఇక జరిగింది ఇది అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంతకంటే ముందే దీపా ఆ సంభాషణకు దూరంగా వెళ్లిపోతుంది. ఇక దీపాను ఎలాంటి ప్రశ్నలు అడగకు అని, తన నిజాయితీని నిరూపించేందుకు దీపా ఇలా చేసి ఉంటుందని కార్తీక్ బాబు తల్లి కాంచనతో చెప్పి బయటికి వెళ్తాడు. ఇక తిరిగి సాయంత్రం వచ్చే సరికి ఇంట్లో దీపా కనిపించదు. దాంతో వీధి మొత్తం వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. మళ్లీ ఇంటికి వచ్చి చూసే సరికి దీపా చెప్పులు కనిపిస్తాయి. అది చూసిన కార్తీక్ బాబు ఊపిరి పీల్చుకుంటాడు. వెళ్లి చూసే సరికి ఇంట్లోనే ఉంటుంది. ఇక దీపా దగ్గరకు వెళ్లి అసలు ఏం జరిగిందనే విషయం అడిగి తెలుసుకుంటాడు.
నేను చెప్పేది నిజం అని మీరు నమ్మడం లేదు కదా అని దీపా కార్తీక్ బాబుతో అంటుంది. అదేం లేదని, కానీ ఆధారం కావాలి కదా అని కార్తీక్ బాబు బదులిస్తాడు. అసలు రమ్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు గౌతమే తండ్రి అని ఎందుకు చెప్పలేదని సందేహిస్తాడు కార్తీక్. అసలు రమ్య నిజం చెబుతానని వచ్చిందని, కానీ భర్త అని చెప్పి వచ్చిన సత్తిపండును చూసి రమ్య మౌనంగా ఉండిపోయింది. అలా ఎందుకు ఉండిందో అర్థం కాలేదని దీపా కార్తీక్ బాబుతో అంటుంది. దీంతో రమ్య చెప్పకపోవడం కాదు.. రమ్యను చెప్పనివ్వకుండా చేశారని కార్తీక్ బాబు అంచనా వేస్తాడు.
శ్రీధర్ ఉదయం నుంచి నిన్ను ఫాలో అవుతున్నాడంటే ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాడని సందేహిస్తాడు కార్తీక్ బాబు. అది గౌతమ్ కే అయ్యి ఉంటుందని ఓ నిర్ణయానికి వస్తాడు. గౌతమే రమ్యతో నిజం చెప్పించకుండా అడ్డుకుంటున్నాడని అనుకుంటారు. మరోవైపు దాసుకు గతం గుర్తుకు వచ్చి దీపా గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని పేపర్ మీద రాయాలని ప్రయత్నిస్తాడు. కానీ తన కొడుకు కాశీ శబ్ధం చేయడంతో మళ్లీ మర్చిపోతాడు. ఇక ఇటు దీపాను కార్తీక్ బాబు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఏదైనా ఉంటే తనతో చెప్పు అని, చెప్పకుండా ఎక్కడికి వెళ్లకని, తమకంటూ ఓ అద్భుతమైన జీవితం ఉందని చెప్పుకొస్తాడు... ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











