Karthika deepam 2 April 4th : జ్యోత్స్న ప్లాన్ తెలుసుకున్న కార్తీక్ బాబు.. దీపా మరో ప్రయత్నం
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 3వ తేదీ 322వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జోత్స్న నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణమైన దీపా పెళ్లికొడుకు గౌతమ్ మోసగాడని రుజువు చేసేందుకు ఎంతో ప్రయత్నిస్తోంది. కానీ ఆమె ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. పైగా నిందల పాలవుతోంది. అంతేకాదు అవమానాలనూ భరిస్తోంది. గౌతమ్ తన ఇంట్లో పని మనిషిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడుపు చేసి తీరా వదిలేస్తాడు. ఆమెకు అన్యాయం చేస్తాడు. ఈ విషయం దీపాకు ముందే తెలుస్తుంది. అందుకే జ్యోత్స్న నిశ్చితార్థాన్ని వెంటనే అడ్డుకుంటుంది. గౌతమ్ మోసగాడని శివనారాయణ కుటుంబానికి అర్థమయ్యేలా చెబుతుంది. కానీ వారు వినిపించుకోరు. పైగా తనే మోసం చేసిందని, శుభకార్యాన్ని అడ్డుకొని క్షమించరాని తప్పు చేసిందని నిందలు వేస్తారు. ఎన్నిసార్లు ఈ ఇంటి గడప తొక్కవద్దని చెప్పినా వినిపించుకోవా? అంటూ అవమానిస్తారు.
అయితే తను ఎంతగానో గౌరవించే శివనారాయణ, సుమిత్రలు నిందారోపణలు చేయడంతో దీపా చాలా కుమిలిపోతుంది. దాంతో ఎలాగైనా గౌతమ్ మంచివాడు కాదని రుజువు చేయాలని ప్రయత్నిస్తుంది. దీంతో ఇటు కార్తీక్ బాబు, అటు కాంచనకు తెలియకుండా గౌతమ్ మోసం చేసిన పనిమనిషి రమ్యను కలుస్తుంది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని శివనారాయణ కుటుంబానికి తెలియజేయాలని, దాంతో జ్యోత్స్న జీవితాన్ని కాపాడాలని కోరుతుంది. అంతే కాకుండా గౌతమ్ కు కూడా తగిన గుణపాఠం చెప్పాలని రమ్యతో చెప్పి శివనారాయణ ఇంటికి తీసుకెళ్తుంది. కానీ అక్కడ రమ్య నిజం చెప్పేందుకు ప్రయత్నించినా జ్యోత్స్న ఓ రౌడీని పంపించి అడ్డుకునేలా చేస్తుంది. దాంతో నిజాన్ని రుజువు చేద్దామని ప్రయత్నించిన దీపానే అవమానం పాలవుతుంది. ఈ విషయం శ్రీధర్ ద్వారా భర్త కార్తీక్ బాబు, అత్త కాంచనకు తెలుస్తుంది. కార్తీక్ బాబు దీపాపై కాస్తా కోసం చేసి, ఆ ఇంటి గురించి వదిలేయ్ అని చెబుతాడు. గౌతమ్ ను మోసగాడని రుజువు చేయాలంటే సరైన ఆధారం ఉండాలని, రమ్య సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన ఎవరో విషయం తెలుసుకొని అడ్డుకున్నారని దీపాకు అర్థమయ్యేలా చెబుతాడు. దీంతో దీపా నెక్ట్స్ ఏం చేయాలనే ఆలోచనలో మునిగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 4వ తేదీ 323 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

గౌతమ్ మోసగాడని నిరూపించడంలో దీప విఫలమవుతుంది. ఆ విషయం కార్తీక్ బాబు కూడా తన తండ్రి శ్రీధర్ ద్వారా తెలుస్తుంది. దీంతో దీపా పై కార్తీక్ బాబు కోపం చేస్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు అందరు అవమానించాక కూడా ఎందుకు వెళ్లావని ప్రశ్నిస్తాడు. వాళ్ల కోసం నువ్వు ఆలోచించడం, నీకోసం నేను ఆలోచించడం మొదటినుంచి ఇదే అవుతుందని, మనకంటూ ప్రత్యేకమైన జీవితం ఉందంటూ దీపతో అంటాడు. ఆమె స్పందిస్తూ తన నిజాయితీని రుజువు చేసుకోవడానికి వెళ్లానని, ఆ గౌతమ్ మాత్రం అస్సలు వదలను అని శబదం చేస్తుంది. కార్తీక్ బాబు కూడా మోసగాళ్లకు శిక్ష పడాలని మనసులో అనుకుంటాడు. కానీ నిజం రుజువు చేసే క్రమంలో దీప ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందని, ఎందరితో ఎలా అవమాన పడాల్సి వస్తుందని కంగారు పడతాడు. ఇక రమ్య నిజం చెప్పడానికి కారణం గౌతం అయి ఉంటాడని కార్తీక్ బాబు అనుమానిస్తాడు.
రమ్యను అడ్డుకోవడానికి వచ్చిన సత్తిపండు వెనకాల ఎవరు ఉన్నారని కార్తీక్ బాబు ఆలోచిస్తూ ఉంటాడు. అయితే గౌతమ్ అయినా అయి ఉండాలి, లేదంటే మరెవరైనా నిజం చెప్పకుండా ఆపి ఉంటారని ఊహిస్తాడు. దానంతటికీ వెనుక జ్యోత్స్న ఉందని ఎవరికి తెలియకపోవడం గమనించదగిన విషయం. ఇక కార్తీక్ బాబు ఉదయం లేచాక అన్ని పనులు చూసుకుని రెస్టారెంట్ కు వెళ్లడానికి రెడీ అవుతారు. కానీ దీపావళి రోజు కార్తీక్ బాబుతో కలిసి రెస్టారెంట్ కి వెళ్లేందుకు రెడీ అవ్వదు. దాంతో చీపురు పట్టుకుని ఇల్లు ఊడుస్తూ కార్తీక్ బాబు కనిపిస్తుంది. రెస్టారెంట్ కి వెళ్లే సమయం అవుతున్న ఇంకా ఇల్లు ఊడుస్తున్నావంటేని కార్తీక్ బాబు దీపా తో అంటాడు.
ఇక దీప తన రెస్టారెంట్ కు రాబోవునని చెబుతోంది. ఎందుకు జ్వరం వచ్చిందా? ఇంకా ఏదైనా సమస్య ఉందా? అని కార్తీక్ బాబు ప్రశ్నిస్తాడు. దానికి దీప ఇవాళ ఒక్కరోజే కాదు రేపటి నుంచి కూడా నేను రావడం లేదని తన నిర్ణయాన్ని కార్తీక్ బాబుకు చెబుతుంది. అదే ఎందుకు అని కార్తీక్ బాబు ప్రశ్నిస్తాడు. దీప స్పందిస్తూ.. ఇప్పుడు నువ్వు నీ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారని, ఆ విషయంలో నేను మీకు భరోసా అవ్వాలి గాని భారం అవ్వకూడదు, అందుకనే రెస్టారెంట్ కు రావాలనుకోవడం లేదు అని దీప చెబుతుంది. ఎందుకు మా తాత శివ నారాయణ, సుమిత్ర అన్న మాటలను మనుసులో పెట్టుకొని ఇలా చేస్తున్నావా? అని ప్రశ్నిస్తాడు.
అందుకు దీప ఆసక్తికరంగా బదిలిస్తుంది. నేను రెస్టారెంట్ కు రావడం వల్ల పదేపదే గొడవలు జరుగుతాయని చెబుతుంది. నిన్న శివ నారాయణ వచ్చినట్లుగానే ఇవాళ పారిజాతం, రేపు జ్యోత్స్న వచ్చి నానా మాటలు మాట్లాడతారని అంటుంది. దానివల్ల రెస్టారెంట్లో మీకు మనశ్శాంతి లేకుండా పోతుందని అభిప్రాయపడుతుంది. నేను లేకుంటే మీ జీవితం సుఖంగా ఉంటుందని, మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారని, నేను మీ జీవితంలో బాటసారి గానే ఉండాలని, భారం కాబోనని చెబుతుంది. నేను నీకు దూరం అవుతున్న కొద్ది మీ కుటుంబ సభ్యులంతా దగ్గర అవుతారని కార్తీక్ బాబుతో ఉంటుంది. దాంతో కార్తీక్ బాబు దీపా ను చేయి పట్టుకుని తీసుకుని బయటకు తీసుకెళ్తాడు. తన చిన్నప్పుడు కోనేరులో ప్రమాదంలో చిక్కుకున్న స్థలానికి తీసుకెళ్తాడు.
ఆ కోనేరు చూడగానే కార్తీక్ బాబుకు తనే ప్రాణదాత అని తెలిసిపోయిందా అని దీప కంగారు పడుతుంది. ఊహించినట్టుగానే కార్తీక్ బాబు తన ప్రాణదాత నువ్వే అని ఇక ఓపెన్ అయిపోతాడు. నా ప్రాణదాత నువ్వే అన్న సంగతి. నీకు తెలుసని, కానీ నాకు కూడా తెలుసని విషయం నీకు తెలియదు అన్నారు. ఇంట్లో మంచం కింద పడి ఉన్న నీ చిన్ననాటి ఫోటో ద్వారా నా ప్రాణదాత నువ్వే అని తెలుసుకున్నానని దీపాకు వివరిస్తాడు. ఇక మనిద్దరిది దేవుడు కలిపిన బంధం కాదన్నావు, కానీ చిన్నప్పుడు నా ప్రాణాలను కాపాడి నాకు ఎంతో దగ్గర అయ్యావని చెబుతాడు. శౌర్య వాళ్ళ భార్య భర్తలు అయ్యామని, సుమిత్ర అత్త వల్ల ఆ ఇంట్లో నువ్వు కావలసిన వ్యక్తి అయ్యావని కార్తీక్ బాబు దీపా తో చెబుతాడు. నా జీవితంలో బాటసారి కాదని, నా జీవితంలో భాగస్వామి అని గుర్తు చేస్తాడు. నా లక్ష్యాన్ని చేదిస్తాననీ, నీ గౌరవ మర్యాదలను కూడా కాపాడతానని దీపాకు హామీ ఇస్తాడు. దాంతో దీప సంతోషం వ్యక్తం చేస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications










