Karthika deepam 2 April 5th : గుండెలో భారం దించుకున్న కార్తీక్ బాబు.. షాక్ ఇచ్చిన దీపా
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 4వ తేదీ 323వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జోత్స్న ను పెళ్లి చేసుకుందామనుకున్న గౌతమ్ మోసగాడాని రుజువు చేసేందుకు దీపా ఎంతగానో ప్రయత్నిస్తుంది. అతను అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడని, ఇప్పటికే అతని ఇంట్లో పనిచేసే రమ్యకు కడుపు చేసి వదిలేశాడని శివనారాయణ, సుమిత్ర, దశరథ్ లకు చెబుతుంది. కానీ అప్పటికే దీపాపై పీకల్లోతు కోపంలో ఉన్న వారందరూ వంటలక్క మాట నమ్మడం లేదు. దీంతో దీపా రమ్యను తీసుకొచ్చి నిజం చెప్పించి, తన మీద పడ్డ నిందను తొలగించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆధారం లేకుండానే గౌతమ్ ను అనుమానించిందని, పైగా జ్యోత్స్న కు అన్యాయం చేయాలనే కుట్రతోనే దీపా నిశ్చితార్థాన్ని అడ్డుకుందని శివనారాయణ కుటుంబం నిందారోపణ చేస్తుంది. దాంతో రమ్యతో నిజం చెప్పించే ప్రయత్నం చేసినా విఫలం అవుతుంది.
అయితే, కార్తీక్ బాబుకు దీపా మళ్లీ ఆ ఇంటికి వెళ్లిందనే విషయం తెలుస్తుంది. దాంతో ఇంకోమారు వెళ్లబోకని, తన మాటలు ఎవ్వరూ నమ్మనప్పుడు వాళ్లకు దూరంగా ఉండటమే మంచిదని సలహానిస్తాడు. అయినా దీపా తనపై పడ్డ నిందను తానే తొలగించుకోవాలని, అందుకు గౌతమ్ మోసగాడని ఎలాగైనా రుజువు చేయాల్సిందేనని స్పష్టం చేస్తుంది. మరోవైపు రెస్టారెంట్ కు కూడా శివనారాయణ వచ్చి దీపాను తిట్టడంతో ఇక రెస్టారెంట్ కు వెళ్లకూడదని నిర్ణయించుకుంటుంది. అంతేకాకుండా కార్తీక్ బాబుకు దూరమైపోతున్నట్టు మాట్లాడుతుంది. దాంతో కార్తీక్ బాబు దీపాను తాము ఇద్దరి చిన్నప్పుడు కలిపిన కోనేరు దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడే కార్తీక్ బాబు ప్రాణాలను దీపా కాపాడిన ఘటనను గుర్తుచేస్తాడు. అప్పుడు నా ప్రాణదాతవు నువ్వేననే విషయం నాకు తెలుసు అని దీపాతో ఓపెన్ అవుతాడు. ఇన్నాళ్లు నా ప్రాణదాత కోసం ఎక్కడెక్కడో వెతికానని, ఇక అది నువ్వేనని తెలిసాకా నిన్ను ఎలా వదులుకుంటానని అర్థమయ్యేలా చెబుతాడు. ఇందుకు దీపా ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 5వ తేదీ 324 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

దీపా తనకు దూరమయ్యేలా మాట్లాడటంతో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. నా జీవితంలో నువ్వు బాటసారి అన్నావు కదా దీపా.. నువ్వు బాటసారివి కాదు.. నా జీవిత భాగస్వామివి. మనది దేవుడి కలిపిన బంధం కాదని అన్నావు కదా.. నన్ను కాపాడమని నేను అడిగానా? సుమిత్ర అత్తను రక్షించాలని నువ్వు అనుకున్నావా? ఆ దేవుడే నీతో కాపాడేలా చేశాడు కాదా.. మా ఇంట్లోకి నిన్ను నేను తీసుకొచ్చానా? లేదు కాదా.. ఆ దేవుడే ఇలా మనల్ని ప్రతి విషయంలో కలుపుతూ ఉన్నాడని దీపాకు అర్థమయ్యేలా చెబుతాడు. అందుకే ప్రతి విషయంలో మనం దగ్గరవుతూనే వస్తున్నామని, కానీ నువ్వేమో నాకు దూరంగా వెళ్లిపోతాననడం ఏమాత్రం బాగోలేదని చెబుతాడు.
ఆ తర్వాత మీ తండ్రికి రోడ్ యాక్సిడెంట్ జరగడం కూడా మన ఇద్దరినీ కలిపిందని గుర్తు చేస్తాడు దీపాకు. ఇలా ప్రతి విషయంలో దేవుడు మనల్ని కలుపుతూనే ఉన్నాడని, మన బంధాన్ని ఇంకా బలంగా మారుస్తున్నారని కార్తీక్ బాబు దీపా తో అంటాడు. నేను నీకోసం నిందలు పడటం లేదనీ, అవమానాలను గురి కావడం లేదు అని, జీవిత లక్ష్యాన్ని కూడా దూరం పెట్టడం లేదని దీపతో అంటారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే కారణం నువ్వు నా పక్కన ఉన్నావే అనే ధైర్యం మాత్రమే. నా గుండెలో ఊపిరి ఆ ఊపిరి లేకుండా నా ప్రయాణం ఎలా సాగుతుందని దీపతో అంటాడు. చిన్నప్పుడే నా ప్రాణాన్ని కాపాడి ప్రాణదాతగా నిలిచావని కృతజ్ఞతలు చెబుతాడు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిదని తెలుపుతాడు.
ఇక దీపా స్పందిస్తుంది. మీరు నా రుణం ఎప్పుడో తీర్చుకున్నారు కార్తీక్ బాబు అని చెబుతుంది దీప. వాడిపోయిన నా జీవితాన్ని తాళిబొట్టుతో వెలిగిపోయేలా చేశారని, నీ పేరు పక్కన చోటు ఇచ్చి కార్తీకదీపం లా మార్చారని కృతజ్ఞత భావం తెలుపుతుంది. చీకటి అయిన తన బతుకును వెలుగు బాటలో నడిపించావని కార్తీక్ బాబుతో దీప చెబుతుంది. ఇక మునుముందు కూడా ఇలాగే కలిసి ఉందాం అని కార్తీక్ బాబు దీపా తో అంటాడు. ఇక చిన్నప్పటినుంచి దాచుకుంటున్న లాకెట్ ను తిరిగి దీపాకు అప్పగిస్తాడు. ఇంతకు అది ఎవరిచ్చారని దీపను అడుగుతాడు. దాంతో దీప ఆసక్తికరంగా స్పందిస్తుంది.
చిన్నప్పుడే తన తల్లిగారు ఆ లాకెట్ ను తన అన్నయ్యకి ఇచ్చారని, ఆ లాకెట్ ను తన తండ్రి సత్యరాజ్ వాళ్ళ అమ్మ గుర్తుగా ఉంటుందని మెడలో వేశారని చెప్పింది. వెంటనే కార్తీక్ బాబు స్పందిస్తూ ఆ లాకెట్ నీ మెడలోకి రావడం, కోనేరు నుంచి నా దగ్గరికి చేరడం ద్వారా మీ తల్లిగారు కూడా మనల్ని చిన్నప్పుడే కలిపారని, ఇంత స్ట్రాంగ్ బంధం ఎలా విడిపోతుందని కార్తీక్ బాబు అంటాడు. దీంతో దీప ఇంకా సమరపడిపోతుంది. ఇక లాకెట్ ఎప్పుడు నీ మెడలోనే ఉండాలని కార్తీక్ బాబు దీప మెడలో తానే స్వయంగా వేస్తాడు.
అయితే ఆ లాకెట్ శౌర్యకు ఎంతో ఇష్టమని అందుకని తనకే లాకెట్ చేస్తానని దీపా కార్తిక్ బాబుకు చెబుతుంది. ఎలాగైతే ఏంటి మనం ముందే ఉంటుంది కదా అని కార్తీక్ బాబు కూడా సరే అంటాడు. ఇంకా ఇప్పటికైనా తనను వెళ్ళిపోతానని అనవద్దని కార్తీక్ బాబు దీప వద్ద ప్రామిస్ తీసుకుంటాడు. దీప కూడా ఇకపై వెళ్ళిపోతాను అనే మాట అనను అని చెబుతుంది. ఇక మరోవైపు దాసుకు మళ్లీ గతం గుర్తుకు వస్తుంది. పేవరల్లో తన అన్న దశరథ్ కు ఇంటి అసలు వారసురాలు గురించి రాసే ప్రయత్నం చేస్తాడు. కానీ మళ్లీ గతం మర్చిపోవడంతో సగం రాసి వదిలేస్తాడు.
అన్నయ్య ఇంటి వారసురాలు విషయంలో అన్యాయం జరిగింది. అసలు వారసురాలు.. అనేంత వరకు రాసి వదిలేస్తాడు. ఇక ఆ లెటర్ స్వప్నకు ఇల్లు ఊడ్చే సమయంలో దొరుకుతుంది. అది చదివిన వెంటనే కాశీని పిలిచి చూపిస్తుంది. అందులో ఉన్నది చదివాకా 'అసలు వారసురాలు' అని తన తండ్రి ఎవరి పేరో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుంటారు. ఇక వెంటనే వెళ్లి దాసును అడిగే ప్రయత్నం చేసినా.. అది నేను రాయలేదని, రాసిన వాడిని అడుగు అంటూ చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











