Karthika deepam 2 April 7th : దీపా కు వార్నింగ్ ఇచ్చిన గౌతమ్.. జోత్స్న కు ఊహించని దెబ్బ
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 5వ తేదీ 324వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శివ నారాయణ, సుమిత్రా దీపా పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంతో బాధపడుతుంది. కార్తీక్ తను దగ్గర అయినందువలన ఆ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయని భావిస్తుంది. ఇక జ్యోత్స్న ఎంగేజ్మెంట్ కూడా దీపా వల్లనే ఆగిపోయిందని వారిద్దరూ నిందారోపణ చేయడంతో దీప కుమిలిపోతుంది. పెళ్ళికొడుకు గౌతం మోసగాడని రుజువు చేయడం ఆమె ముందు సవాల్గా మారుతుంది. గౌతమ్ ఇంట్లో పనిమనిషిగా చేసిన రమ్యను అతను వాడుకొని వదిలేసిన విషయాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెప్పిన నమ్మరు. ఇక రమ్య తోనే ఆ విషయాన్ని చెప్పిద్దామని దీప ప్రయత్నించిన ఫలితం లేకుండా పోతుంది. పైగా దీపానే అమ్మకు డబ్బులు ఇచ్చి మరి అబద్ధం చెప్పిస్తుందని అంటారు.
ఇక కార్తీక్ బాబుకు తెలియకుండా దీప గౌతం గురించి అసలు విషయాన్ని బయట పెట్టేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తుంటుంది. శివ నారాయణ, సుమిత్రలు ఆ విషయం అర్థం చేసుకోకుండా దీపాను నిందిస్తుంటారు. అందుకే కార్తీక్ బాబుకు దూరం కావాలని నిర్ణయించుకుంటుంది. కానీ కార్తీక్ బాబు దీపాను తామిద్దరు చిన్నప్పుడు కలిసిన కోనేరు వద్దకు తీసుకెళ్లి తన ప్రాణదాత దీపానే అని తనకు తెలుసు అని చెబుతాడు. దీప లేకుండా తన జీవితం సాఫీగా ఉండదని తెలుపుతాడు. తన జీవితంలో దీప బాటసారి కాదని, భాగస్వామి అని అర్థమయ్యేలా చెబుతాడు. దాంతో దీప కూడా సంతోషిస్తుంది. మరోసారి కార్తీక్ బాబుకు దూరం కానని హామీనిస్తుంది. మరోవైపు దాసు శివ నారాయణ అసలు మనవరాలు విషయంపై సస్పెన్స్ క్రియేట్ చేస్తాడు. తనకు గతం గుర్తు వచ్చిన సమయంలో అసలు వారసురాలు అని రాసి వదిలేస్తాడు. ఆ పేపర్ ను కొడుకు కాశి చదివి అసలు వారసురాలు ఎవరు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 7వ తేదీ 325 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

దీపాన్ని తన ప్రాణదాత అని కార్తీక్ బాబు తెలుసుకోవడం, కార్తీక్ బాబుకు తెలిసింది అనే విషయాన్ని దీపాకు తెలియజేయడంతో దీప ఎంతగానో సంతోషిస్తుంది. ఇకపై తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనే ఆలోచన రాకూడదని కార్తీక్ బాబు దీపాను సూచిస్తాడు. దీప కూడా మరొకసారి అలాంటి నిర్ణయాలు తీసుకోనని, కార్తీక్ బాబును దూరం పెట్టే ప్రయత్నం ఎప్పటికీ చేయనని చెబుతోంది. ఇక జ్యోత్స్న పెళ్లి ఆగిపోయింది అనుకున్నా సమయంలో ఊహించని షాక్ తగులుతుంది. గౌతమ్ శివ నారాయణ కు ఫోన్ చేసి జ్యోత్స్న ను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు.
రింగ్ నేలకు వేసి కొట్టి వెళ్లిన గౌతం మళ్లీ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడని శివ నారాయణను దశరథ్ సుమిత్ర పారిజాతం అడుగుతారు. దశరథ్ బదులిస్తూ గౌతమ్ కు జోష్నా ను పెళ్లి చేసుకోవడంలో ఇలాంటి అభ్యంతరం లేదని తెలిపాడని చెబుతాడు. ఎంగేజ్మెంట్లో అందరి ముందు దీప అలా నిందారోపణ చేయడంతో బాధగా అనిపించిందని, తనను మీరు సైతం అడ్డుకోలేకపోవడంతోనే వెళ్లిపోయినట్టు తనతో గౌతమ్ చెప్పాడని శివ నారాయణ కుటుంబ సభ్యులకు తెలుపుతారు. దీంతో పారిజాతం తెగ సంబరపడిపోతుంది. వెంటనే ముహూర్తాలు పెట్టించి పెళ్లికి ఏర్పాట్లు చేయాలని సలహానిస్తుంది. గౌతమ్ కూడా అదే విషయం చెప్పాడని శివ నారాయణ అంటాడు.
అయితే గౌతం చెప్పాడని ఇప్పుడు వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయడం సరి కాదని, ఒకసారి గౌతమ్ వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడాల్సి ఉంటుందని సుమిత్ర తన అభిప్రాయాన్ని తెలుపుతుంది. అంతేకాకుండా జోష్నాకు మళ్లీ పెళ్లి అని ఇప్పుడే చెప్పడం సరికాదని భావిస్తుంది. అతి శివ నారాయణ మాటలు అన్నింటిని జ్యోత్స్న చాటుగా వింటుంది. అయితే అప్పటికే గౌతమ్ కు జ్యోత్స్న ఒక కండిషన్ పెడుతుంది. దీపాను నాశనం చేస్తేనే తమ పెళ్ళికి ఒప్పుకుంటానని చెబుతుంది గౌతంతో.. అలా అయితేనే తన తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారని వివరిస్తుంది. అయితే గౌతం దీపాను పట్టించుకోవడం మానేసి జ్యోత్స్నతో పెళ్లికి ఏర్పాట్లు చేయించాడని శివ నారాయణ తో మాట్లాడుతూ ఉంటాడు. జ్యోత్స్నను పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని కుట్ర పన్నుతాడు.
గౌతమ్ పచ్చి మోసగాడు అనే విషయం జ్యోత్స్నకు ముందుగానే తెలుసు. అతని పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం ఆమెకి ఇష్టం లేదు. కానీ దీపాను ఇబ్బంది పెట్టేందుకు గౌతమ్ ను వాడుకుంటున్నట్టుగా జ్యోత్స్న తను మనసులో అనుకుంటుంది. దీప సంగతి చూడరా అంటే పెళ్లికి తొందర పడుతున్నాడు ఏంటని కంగారుపడుతుంది. ఈ సమయంలోనే గౌతమ్ జ్యోత్స్నకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటాడు. దీంతో జ్యోత్స్న ఇంకా మండిపోతుంది. దీప సంగతి ఏంటి అని మెసేజ్ చేస్తుంది?? అయినా వినకుండా గౌతమ్ ఫోన్ కాల్స్ చేస్తూనే ఉంటాడు. మధ్యలో పారిజాతం వచ్చి మాట్లాడు అని బలవంతం చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి గౌతమ్ తో మాట్లాడుతుంది. దీప సంగతి చూశాకే పెళ్లి గురించి ఆలోచించు అని సమాధానం ఇచ్చి కట్ చేస్తుంది.
దీంతో గౌతమ్ దీపా పై రగిలిపోతాడు. అసలు ఆమె తన జీవితంలోకి ఎందుకు వస్తున్నదని ఆలోచిస్తాడు. ఇక చేసేది ఏమీ లేకపోవడంతో నేరుగా కార్తీక్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్లి దీపాకు వార్నింగ్ ఇస్తాడు. గౌతమ్ బాబును చూసిన దీప, కాంచన, అనసూయ షాక్ అవుతారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. నా అంతట నేను రాలేదు రప్పించారు అని దీప మొహం చూస్తూ చెబుతాడు. నేను వెళ్లే కార్ కు అడ్డు వస్తేనే ఊరుకోనని, ఇంక నా జీవితానికి అడ్డుపడుతున్న నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టనని హెచ్చరిస్తాడు. ఇప్పటితో సైలెంట్ గా ఉంటే మీకే మంచిదని దీపాకు సూచిస్తాడు. లేదంటే కార్తీక్ బాబు, నీ కూతురు శౌర్యకు ఎప్పుడు ఏం జరిగేది చెప్పలేనని భయాందోళనలకు గురి చేస్తాడు. నేను డబ్బులు ఇచ్చి ఏదైనా చేయగలనని తెలియజేస్తాడు. కానీ దీప గౌతం మాటలకు ఏమాత్రం భయపడదు. గౌతమ్ ఇంటి వరకు వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో అతని నిజ స్వరూపం కాంచన స్వయంగా చూస్తుంది. దాంతో దీపా చెప్పిన మాటల్ని నమ్ముతుంది... ఇక తర్వాత ఏం చేయబోతారనేది నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తిని కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications











