Karthika deepam 2 April 8th : దీపాకు గౌతమ్ సీరియస్ వార్నింగ్.. వంటలక్క ఉగ్రరూపం

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 7వ తేదీ 325వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న తో పెళ్లి కోసం గౌతమ్ ఎంతో తాపత్రయ పడుతుంటాడు. అప్పటికే ఎంగేజ్ మెంట్ ఆగిపోవడంతో మళ్లీ శివనారాయణకు ఫోన్ చేసి సారీ చెబుతాడు. తన మనవరాలిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనని, కానీ ఆరోజు దీపా అలా నింద వేయడంతో కోపం వచ్చి వెళ్లి పోయినట్టు వివరిస్తాడు. ఇదే విషయాన్ని శివనారాయణ ఇంట్లో కుటుంబ సభ్యులకు వివరిస్తాడు. అందుకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. ఆ విషయం జ్యోత్స్నకు కూడా తెలుస్తుంది. అయితే గౌతమ్ పచ్చి మోసగాడు అనే విషయం జ్యోత్స్నకు ముందుగానే తెలుసు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం ఇష్టం లేదు.

కానీ దీపాను ఇబ్బంది పెట్టేందుకు గౌతమ్ ను వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక దీప సంగతి తెల్చితేనే పెళ్లి గురించి ఆలోచించు అని కండీషన్ పెడుతుంది. దీంతో గౌతమ్ దీపా పై రగిలిపోతాడు. అసలు ఆమె తన జీవితంలోకి ఎందుకు వస్తున్నదని ఆవేశానికి లోనవుతాడు. ఇక వెంటనే కార్తీక్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్లి దీపాకు వార్నింగ్ ఇస్తాడు. తనకు అడ్డు వస్తే ఊరుకోనని, నా జీవితానికి అడ్డుపడితే అస్సలు వదిలిపెట్టనని హెచ్చరిస్తాడు. ఎంత చెప్పినా వినకపోతే మాత్రం కార్తీక్ బాబుకైనా, శౌర్యకైనా తన వల్ల ప్రమాదం తప్పదని చెప్పకనే చెప్పి హెచ్చరిస్తాడు.ఇక దీపా ఏమాత్రం బయపడదు. అతనికి ధీటుగా బదులిస్తుంది. గౌతమ్ గుట్టు రట్టు చేసి శిక్షపడేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 8వ తేదీ 326 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Karthika deepam 2 Serial Today s Episode 326 April 8th 2025

కార్తీక్ బాబుకు తన ప్రాణదాత దీపా అని తెలుసని దీపాతో చెబుతాడు. దాంతో వాళ్లిద్దరూ ఇంకా బాగా కలిసిపోతారు. కార్తీక్ బాబు, దీపా సంతోషంగా ఉండటం చూసి కాంచన ఆనందంతో పొంగిపోతుంది. ఈ క్రమంలోనే గౌతమ్ వచ్చి దీపాకు వార్నింగ్ ఇవ్వడం అంతా గందరగోళ పరిస్థితిగా మారింది. గౌతమ్ నిజస్వరూపం కళ్లార చూసిన కాంచనాకు దీపాపై పూర్తి నమ్మకం వస్తుంది. అయితే పెళ్లి వద్దనుకొని వెళ్లి పోయిన వాడు మళ్లీ ఎందుకు తిరిగి వచ్చి వార్నింగ్ ఇచ్చి ఉన్నాడని కాంచన సందేహం వ్యక్తం చేస్తుంది. ఒక వేళ మళ్లీ జ్యోత్స్న గౌతమ్ ల పెళ్లికి శివనారాయణ ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా? అని అనసూయ సందేహిస్తుంది.

అందుకు కాంచన స్పందిస్తూ తన తండ్రి అస్సలు అలా చేయబోడని, పైగా గౌతమే వద్దనుకొని వెళ్లిపోయాడు కాబట్టి అస్సలు వారి పెళ్లికి అంగీకరించబోడని కాంచన అంటుంది. మరీ మళ్లీ గౌతమ్ ఎందుకు వచ్చి తనకు వార్నింగ్ ఇచ్చాడని దీపా కూడా సందేహిస్తుంది. పెళ్లే ఆగిపోయాక, తను తప్పు చేయలేదని నిజాయితీగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చి హెచ్చరించాడని దీపా ఆలోచిస్తూ ఉంటుంది. వాడు వచ్చింది బెదిరించడానికి కాదని, బలుపుతో వచ్చాడని చెబుతుంది. అతని సంగతేంటో నేను చూసుకుంటానని అంటుంది దీపా.

దాంతో కాంచన స్పందిస్తూ ఇకపై నువ్వు ఏం చేసినా నాకు చెప్పే చేయ్ అని దీపాతో అంటుంది. ఇక ఈ విషయాన్ని కార్తీక్ బాబుకు పూర్తిగా వివరించు అని, గౌతమ్ వచ్చి బెదిరించడానే విషయాన్ని వెంటనే తెలియజేయి అని చెబుతుంది. దాంతో దీపా లేదని, కార్తీక్ బాబుకు తెలిస్తే వాడిని ఇంటికెళ్లి మరీ కొడుతాడని అంటుంది. అందుకని కార్తీక్ బాబుకు చెప్పబోనని తానే చూసుకుంటానని అంటుంది. ఇక మరోవైపు జ్యోత్స్నకు గౌతమ్ నుంచి దీపా సంగతి చూశానంటూ మెసేజ్ వస్తుంది. అది చూసి సంతోషిస్తుంది. నేను నిన్ను కలవాలని జ్యోత్స్నకు మరో మేసెజ్ కూడా పెడుతాడు. దాంతో వెంటనే గౌతమ్ ను కలిసేందుకు వెళ్తుంది.

అయితే ఆ మెసేజ్ లు చూసిన పారుజాతం ఎవరని జ్యోత్స్నను అడుగుతుంది. కానీ జ్యోత్స్న చెప్పకుండా దాస్తుంది. కానీ గౌతమ్ ను అవైడ్ చేయడాన్ని అప్పటికే గమనించిన పారు జాతానికి జ్యోత్స్నపై సందేహం కలుగుతుంది. ఓవైపు గౌతమ్ తో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నా ఇంత మౌనంగా ఎందుకు ఉందని పారుకు డౌట్ క్రియేట్ అవుతుంది. దాంతో గౌతమ్ గురించి అసలు గుట్టు తెలుసుకోవాలని, దీపా చెప్పింది నిజమేనా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. దాంతో వెంటనే రమ్య భర్య అని అబద్ధం చెప్పి నమ్మించిన సత్తిపండు దగ్గరికి వెళ్తుంది. డబ్బులిచ్చి అసలు విషయం తెలుసుకుంటుంది. రమ్య కడుపులో పెరుగుతుంది గౌతమ్ బిడ్డనే అని తెలుసుకుంటుంది. సత్తిపండుకు డబ్బులిచ్చి మరీ దీపాను నిజం చెప్పనివ్వకుండా చేసి, గౌతమ్ ను కాపాడింది జ్యోత్స్న అని అతను చెబుతాడు. దాంతో పారు షాక్ అవుతుంది.

ఇక గౌతమ్ చెడ్డవాడైనప్పుడు జ్యోత్స్న ఎందుకు కాపాడాలని అనుకున్నదనే సందేహం వ్యక్తం అవుతుంది. నేరుగా జ్యోత్స్న నే అడిగి తెలుసుకుంటా అని కలవడానికి బయల్దేరుతుంది. అయితే గౌతమ్ కల్దుద్దామని మెసేజ్ చేయడంతో ఒక హోటల్ కు వెళ్తుంది. అప్పటికే అక్కడ శ్రీధర్ రెండో భార్య ఉంటుంది. గౌతమ్ తో జ్యోత్స్న రావడం చూస్తుంది. ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యాక కలిసి తిరుగుతున్నారెందుకని అనుమానిస్తుంది. వారి మాటలను వింటూ ఉంటుంది. ఇక గౌతమ్ మాట్లాడుతూ దీపాకు వార్నింగ్ ఇచ్చానని, మన విషయంలో అడ్డుపడదని, మీ తాత శివనారాయణకు కూడా ఫోన్ చేసి పెళ్లికి ఏర్పాట్లు చేయమని చెప్పానని జ్యోత్స్నతో అంటాడు.

అందుకు జ్యోత్స్న స్పందిస్తూ గౌతమ్ పై మండిపడుతుంది. దీపా అస్సలు వదిలదని చెబుతుంది. దాంతో గౌతమ్ నేను కూడా ఊరోకనని బదులిస్తాడు. ఈలోపే పారుజాతం జ్యోత్స్న హోటల్ లో ఉన్న సంగతి తెలుసుకొని అక్కడికి వస్తుంది. లోపలికి వెళ్లి చూడటంతో జ్యోత్స్న గౌతమ్ తో కనిపిస్తుంది. దాంతో షాక్ అవుతుంది. పారును చూసిన జ్యోత్స్న గౌతమ్ ను త్వరగా వెళ్లిపో అనిచెబుతుంది. ఇక గౌతమ్ వెళ్తూనే ఎంట్రన్స్ వద్ద పారును పలకరించి వెళ్తాడు. ఇక పారు వచ్చి నీ ప్లాన్ అంతా తెలిసిపోయిందని జ్యోత్స్న తో అంటుంది. దాంతో జ్యోత్స్న ఏం ప్లాన్ అనగానే.. రమ్య కడుపులో పెరుగుతున్నది గౌతమ్ బిడ్డ అనే నిజం అంటుంది. అతనితో నీ పెళ్లి జరగకుండా చేసే ప్లాన్ అని చెబుతుంది.

కానీ, ఓవైపు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో గౌతమ్ గుట్టురట్టు చేయకుండా ఎందుకు వేచి చూస్తున్నావని పారు జ్యోత్స్నను అడుగుతుంది. అందుకు జ్యోత్స్న పెళ్లికి ఏర్పాట్లు జరిగినా పెళ్లి జరగదని, దీపా వచ్చి ఆపుతుందని బదులిస్తుంది. అలా ప్లాన్ చేశానని, పెళ్లి అడ్డుకోవడం వల్ల దీపా అటు కార్తీక్ బాబుకు దూరమవుతుందని చెబుతుంది. దీపా, శౌర్యలను కార్తీక్ బావకు దూరం చేయడమే లక్ష్యమని, అందుకే ఇలా ప్లాన్ చేశానని వివరిస్తుంది. మరోవైపు ఈ విషయాలన్నింటనీ శ్రీధర్ రెండో భార్య మొత్తం వింటుంది. జ్యోత్స్న కుట్ర పూరితమైన ప్లాన్ తెలుసుకొని వెంటనే దీపాకు చెప్పడానికి వెళ్లుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X