Karthika deepam 2 April 9th : దీపాను నాశనం చేసేలా జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. ప్రమాదంలో వంటలక్క
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 9వ తేదీ 327వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జోత్స్నా తో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత గౌతం మళ్లీ శివ నారాయణకు ఫోన్ చేస్తాడు. దీపా నిందారోపణ చేయడంతో ఆరోజు ఎంగేజ్మెంట్ రింగ్ కింద పడేసి వెళ్లిపోయినట్టు చెబుతాడు. కానీ మీకు ఓకే అనుకుంటే జ్యోత్స్న ను పెళ్లి చేసుకోవడంలో అతనికి ఎలాంటి అభ్యంతరం లేదని, వెంటనే ముహూర్తాలు పెట్టించామని చెబుతాడు. ఇక ఆ విషయం జోత్స్న కు తెలవడంతో గౌతమ్ కు ఫోన్ చేసి ముందు దీప సంగతి చూడమని చెబుతుంది. దాంతో గౌతమ్ వెళ్లి దీపాకు వార్నింగ్ ఇచ్చి వస్తాడు. ఆ తర్వాత జోత్స్నా ను కలవాలని చెప్తాడు. వెంటనే వారిద్దరు కలుస్తారు. అయితే జోష్నా గౌతమ్ మోసగాడని తెలిసి కూడా ఎందుకు పెళ్లికి ఒప్పుకుందని పారిజాతం ఆరా తీస్తుంది. రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు గౌతమే తండ్రి అని తెలుసుకుంటుంది. వెంటనే అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు జోష్నా దగ్గరకు వెళుతుంది.
జ్యోత్స్నా గౌతమ్ ను కలిసేందుకు హోటల్కు వెళుతుంది. అక్కడ అప్పటికే శ్రీధర్ రెండవ భార్య ఉంటుంది. వారిద్దరిని చూస్తుంది. వారు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వింటుంది. ఇక గౌతం మాట్లాడుతూ దీపాకు గట్టి వార్నింగ్ ఇచ్చానని, తమ పెళ్ళికి అడ్డు చెప్పదని అంటాడు. కానీ దీప అంత పిచ్చిది కాదని అస్సలు వదిలే రకం కాదని గౌతమ్ కు జ్యోత్స్న వివరిస్తుంది. ఆ లోపే పారిజాతం జోష్న అడ్రస్ తెలుసుకొని రావడంతో గౌతమ్ ను వెంటనే వెళ్లి పొమ్మని చెబుతుంది. అతను వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం జోష్ణ అసలు ఏంటని నేరుగా అడుగుతుంది. గౌతమ్ మోసగాడు అనే విషయం తనకు కూడా తెలుసని, ఆ దీపాన్ని సర్వనాశనం చేయించేందుకే గౌతమ్ ను వాడుకుంటున్నట్టు తెలుపుతుంది. పెళ్లి పీటల వరకు వెళ్లిన దీపా తోనే ఆగిపోయేలా చేస్తానని, శుభకార్యాన్ని చెడగొట్టిన నింద దీపపై పడేలా చేస్తానని అందుకు పక్కా ప్లాన్ ఉందని పారిజాతం కు వివరిస్తుంది. ఇక ఈ విషయం విన్న శ్రీధర్ రెండో భార్య దీపాకు ఎలాగైనా తెలియజేయాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్ కి వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 9వ తేదీ 327 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

గౌతమ్ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోవడం, అమ్మాయిలను మోసం చేస్తున్న అతని గురించి ఆలోచిస్తూ రగిలిపోతుంది. అలాంటి వాడిని ఏం చేయలేకపోతున్నానని మండిపడుతుంది. ఏదోకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో కార్తీక్ బాబు దీపా దగ్గరికి వస్తాడు. ఎంతో ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే కోపంలో ఉన్న దీపా కార్తీక్ బాబు మాటలకు చిర్రుబుర్రులాడుతుంది. అర్థం చేసుకున్న కార్తీక్ బాబు కూల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. తన మాటలతో దీపా మనస్సును శాంత పరుస్తాడు. కొనేరు వద్దనే హగ్ చేసుకోవాలని ఉందని చెబుతాడు. అందుకని ఇవ్వాళ తన ప్రేమను చూపించేందుకు రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చానని తీసి ఇస్తాడు. దాంతో దీపా సంతోషం వ్యక్తం చేస్తుంది.
కార్తీక్ బాబుతో దీపా రొమాంటిక్ గా మాట్లాడుతున్న సమయంలోనే శ్రీధర్ రెండో భార్య వస్తుంది. అప్పటికే హోటల్ లో జ్యోత్స్న కుట్రను ఆమె తెలుసుకుంటుంది. దాంతో వెంటనే దీపాకు చెప్పాలని బయల్దేరుతుంది. అలా దీపా రెస్టారెంట్ లో ఉండటం తెలుసుకొని వస్తుంది. కార్తీక్ బాబు తన చిన్నమ్మ కావేరిని చూసి కిచెన్ నుంచి బయటకి వెళ్తాడు. ఇక ఆమె దీపాతో హోటల్ జరిగిన విషయాన్ని చెబుతుంది. రమ్య నిజం చెప్పకపోవడానికి, సత్తిపండుతో అబద్ధం చెప్పించింది జ్యోత్స్న అని వివరిస్తుంది. దీపా పెద్ద కుట్ర పడిందని, ఎంగేజ్ మెంట్ ను కూడా నీతో ఆపించేలా నాటకం సాగిందని దీపాకు వివరిస్తుంది. దాంతో దీపా చాలా షాక్ అవుతుంది.
ఎంగేజ్ మెంట్ ఆగిపోయాలా చేసింది కూడా జ్యోత్స్న ప్లానే అని దీపాతో కావేరి చెబుతుంది. అంతే కాదు జ్యోత్స్న తో పెళ్లికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెబుతుంది. అలాగే గౌతమ్ ను నీపై ఉసిగొల్పింది కూడా జ్యోత్స్ననే అని వివరిస్తుంది. జ్యోత్స్న పెద్ద కుట్రతో ఉందని, గౌతమ్ తో పెళ్లి నాటకం ఆడి నీపై పగ సాధించాలని, నీ ప్రాణాలను అపాయంలో పెట్టాలని ప్రయత్నిస్తుందని చెబుతుంది. ఇప్పుడు జ్యోత్స్న ప్లాన్ కు పారుజాతం కూడా కలిసిపోయిందని, వారిద్దరూ కలిసి ఏం చేస్తారోనని భయంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా నువ్వు ప్రమాదంలో ఉన్నావని చెబుతూ దీపాను జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని దీపా కావేరిని కోరుతుంది. సరేనని చెప్పి ఇక కావేరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక నిశ్చితార్థం ఆగిపోయినప్పుడు దీపా ఎంతలా నటించిందోనని, గౌతమ్ ను రమ్య నిలదీస్తున్నప్పుడు అక్కడే ఉన్నావా అని ఆలోచిస్తుంది. ఎంతలా నాటకం ఆడిందోనని రగిపోతుంది. ఇక నీ దగ్గరికే వస్తున్నాను జ్యోత్స్న, నీ పెళ్లి ముహుర్తం ఎప్పుడో తెలియదు కానీ నీ పెళ్లి ఈరోజు మాత్రం గట్టిగానే జరుగుతుందని చెబుతుంది. మరోవైపు జ్యోత్స్న, పారుజాతం ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వస్తాడు. చాలాసేపు ఇంట్లో కనిపించకపోవడంతో ఇంట్లో అందరూ కంగారు పడుతారు. ఎక్కడికి వెళ్లారని శివనారాయణ నిలదీస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్నకు ఊహించని విధంగా షాక్ ఇస్తాడు. పెళ్లి ఇంటి దగ్గర చేయాలని అనుకోవడం లేదని, పెళ్లిని ఫారేన్ లోనే చేయబోతున్నామని తమ నిర్ణయాన్ని చెబుతారు.
దాంతో జ్యోత్స్న అసలు పెళ్లే జరగదని, దీపాను కార్తీక్ బావ జీవితం నుంచి దూరం చేసేందుకే ఈ పెళ్లి నాటకమని మనస్సులో అనుకుంటుంది. దాంతో తన పెళ్లి ఫారేన్ లో జరగకూడదని, ఇంట్లోనే బంధువుల సమక్షంలో జరగాలని, అది తన కోరిక అని చెబుతుంది. కానీ దీపా వల్ల మళ్లీ ఏదైనా సమస్య వస్తుందని శివనారాయణ అంటాడు. అందుకు జ్యోత్స్న స్పందిస్తూ తనకు ఇంకా టైమ్ కావాలని, గౌతమ్ ఓకే అనగానే పెళ్లికి నేను సిద్ధం అవ్వాలా? మెంటల్ గా ప్రిపేర్ అవ్వడానికి ఇంకా సమయం కావాలని బదులిస్తుంది. దాంతో సరేనని శివనారాయణ జ్యోత్స్నకు నచ్చినప్పుడే ముహుర్తాలు పెట్టిస్తానని చెబుతాడు.
మరోవైపు జ్యోత్స్న కుట్రను కావేరి ద్వారా తెలుసుకున్న దీపా నేరుగా అత్త కాంచన వద్దకు వెళ్తుంది. జ్యోత్స్న నాటకాన్ని పూర్తిగా వివరిస్తుంది. దాంతో కాంచన షాక్ అవుతుంది. ఇంకా జ్యోత్స్న కడుపునిండా పగతోనే ఉందా? అని బాధపడుతుంది. ఇక దీపానే నేరుగా శివనారాయాణ ఇంటికి వెళ్లి జ్యోత్స్న సంగతి తేల్చుతానని దీపా కాంచనతో అంటుంది. కాంచన మాత్రం దీపాను ఆపుతుంది. నువ్వు వెళ్తే వాళ్లు నమ్మరని, సాక్ష్యం అడుగుతారని అంటుంది. అందుకనే ఇక తానే స్వయంగా వెళ్లి జ్యోత్స్న పెళ్లిని మొదట ఆపుతానని కాంచన దీపాకు సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న ను నిలదీస్తానని చెప్పి బయల్దేరుతుంది. కానీ అప్పటికే గౌతమ్ తో జ్యోత్స్నకు తెలియకుండానే ఏర్పాట్లు చేస్తుంటాడు శివనారాయణ. అదే సమయంలో కాంచన వెళ్లి గౌతమ్ తో పెళ్లి వద్దని, జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేయొద్దని ఈ ఒక్కసారికి తన మాట వినాలని కోరుతుంది. కానీ శివనారాయణ ఒళ్లు మండిపడుతుంది. కాంచనను నానా మాటలు అంటాడు. దీపాకు వత్తాసు పలుకుతున్నారా అంటూ రగిలిపోతాడు. ఎవ్వరు ఎన్నిచెప్పినా జ్యోత్స్న పెళ్లి ఆగదని చెబుతాడు. ఆ తర్వాత కాంచన, దీపా ఏం చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











