Karthika deepam 2 April 10th : జ్యోత్స్న వ్యూహానికి కాంచన బలి.. ఆ విషయంతో రగిలిపోతున్న వంటలక్క
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 9వ తేదీ 327వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. గౌతమ్ మళ్లీ జ్యోత్స్నతో పెళ్లికి ఓకే అని చెప్పడంతో కథ రివర్సైంది. ఆగిపోయిందనుకున్న పెళ్లికి మళ్లీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవైపు జ్యోత్స్న తన ఎంగేజ్ మెంట్ ను తానే గౌతమ్ తో జరిపించి, పక్కా ప్లాన్ తో దీపా ద్వారా ఆగిపోయేలా చేసి సక్సెస్ అయ్యింది. దాంతో దీపాను ఇంట్లో నిందితురాలిగా మార్చేసింది. సుమిత్ర, శివనారాయణల నోటితో నానా మాటలు అనిపించింది. పుట్టెడు శోకంలోకి నెట్టేసింది. ఇక ప్రస్తుతం దీపా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు మరో మాస్టర్ ప్లాన్ వేసింది. గౌతమ్ పెళ్లి అంటూ మళ్లీ తన వెంట పడుతుండంతో మరో వ్యూహాన్ని రచిస్తుంది.
తనకు గౌతమ్ తో పెళ్లే వద్దని నిర్ణయించుకున్న జ్యోత్స్నకు షాకింగ్ న్యూస్ చెబుతాడు శివనారాయణ. గౌతమ్ ఒప్పుకున్నాడు కాబట్టి త్వరలోనే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పైగా వివాహా వేడుక మొత్తం ఫారేన్ లో జరిపిస్తామని జ్యోత్స్నతో తాత శివనారాయణ చెబుతాడు. అందుకు జ్యోత్స్న వద్దని చెబుతుంది. పెళ్లి మాత్రం ఓకే చెబుతుంది. బంధువులందరి సమక్షంలో జరగాలని, అది తన కోరిక అని తాత శివనారాయణతో చెబుతుంది. అందుకు ఆయన కూడా సరేనని చెబుతాడు. ఇంట్లోనే పెళ్లి జరిగితే మళ్లీ దీపా చేత ఆగిపోయేలా చేసి ఆ నింద మొత్తం దీపాపై వేసి శాశ్వతంగా ఇంట్లో నుంచి కార్తీక్ బాబు జీవితంలోంచి వెళ్లగొట్టాలని వ్యూహం రచిస్తుంది.

కానీ జ్యోత్స్నకు తెలియకుండా శివనారాయణ పెళ్లి ఏర్పాట్లను దగ్గరి ముహూర్తంలో చేస్తున్నారు. ఈలోగా గౌతమ్ మంచి వాడు కాదని చెప్పేందుకు కాంచన వస్తుంది. శివనారాయణ గౌతమ్ ను కలిసి పెళ్లి ఏర్పాట్ల గురించి చెబుదామని వెళ్తుండగా ఎదురవుతుంది. అతనితో పెళ్లి వద్దని కాంచన చెప్పడంతో మండిపోతాడు. కాస్తా మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 10వ తేదీ 328 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?
గౌతమ్ తో పెళ్లి వద్దని చెప్పినందుకు కాంచన తండ్రి శివనారాయణ మండిపడతాడు. జ్యోత్స్న పెళ్లి ఎవరికీ ఇష్టం ఉన్న లేకున్నా జరిగి తీరుతుందని అంటాడు. నీ కొడుకు పెళ్లి చేసుకొని సుఖంగానే ఉన్నాడు కదా మరి మీ అన్న దశరథ్ కూతురు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని ఎందుకు కోరుకోవడం లేదంటూ మండిపడతాడు. దాంతో కాంచన కన్నీళ్లు పెట్టుకుంటూనే జ్యోత్స్న పెళ్లి గౌతమ్ తో చేయొద్దు అని పదే పదే చెబుతుంది. దాంతో శివ నారాయణ కోపం తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఎందుకు ఏడవడం అంటూ మరింతగా ఫైర్ అవుతాడు. ఇది చావు ఇల్లున, లేక పెళ్లి ఇల్లున అని కసరుకుంటాడు. ముందు ఆ ఏడుపు ఆపమని చెబుతాడు.
ఎవరెన్ని రకాలుగా తన మనవరాలు జ్యోత్స్న పెళ్లిని ఆపాలని ప్రయత్నించిన అసలు ఆగదు అని స్పష్టం చేస్తాడు. ఇంటిదగ్గర పెళ్లి చేద్దామనుకుంటే ఆ దీపతో సమస్య ఏర్పడుతుందని ఈసారి పక్కా ప్లానింగ్ తో ఫారెన్ లో చేయబోతున్నట్టు చెబుతారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ఇక గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ముహూర్తాలు పెట్టించడమే మిగిలి ఉందని చెబుతాడు. మరోసారి జ్యోత్స్న పెళ్లి ఆపాలని చూస్తే ఏమాత్రం సహించ లేనని హెచ్చరిస్తాడు. ఇలాంటి విషయాలు చెప్పడానికి అయితే మరొకసారి ఈ ఇంటి వైపు కూడా రావద్దని కఠినంగా మాట్లాడతాడు. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో తనను కూతురు రూపంలో వేధిస్తుంది అంటాడు.
చేసేదేమీ లేదు కాంచన తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే జ్యోత్స్న పెళ్లి విషయం లో శివ నారాయణ తుది నిర్ణయాన్ని కాంచనకు తెలియజేయడం పారిజాతం వింటుంది. దాంతో వెంటనే జ్యోత్స్నకు జరిగిన విషయం చెప్పాలనుకుంటుంది. పరుగు పరుగునా తన మనవరాలు జ్యోత్స్న వద్దకు వెళుతుంది. మరోవైపు ఇంటికి తిరిగి వెళ్ళిన కాంచన దీపాను కలుస్తుంది. శివ నారాయణ ఇంటిదగ్గర జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరిస్తుంది. అమ్మ దీప నువ్వు చెప్పింది నిజమే.. జ్యోత్స్నకు గౌతమ్ తో మళ్లీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతుంది.
ఎంత చెప్పినా తన తండ్రి వినిపించుకోవడంలేదని తెలియజేస్తుంది. దీంతో అనసూయ స్పందిస్తూ నువ్వే ఏదైనా చేయాలంటూ సూచిస్తుంది. తన భర్త కార్తీక్ బాబు కోసం యుద్ధం చేయాలని, వాళ్లకి బుద్ధి చెప్పాలని దిశా నిర్దేశం చేస్తుంది. ఇక దీపం ఉగ్రరూపం దాల్చుతుంది. శివ నారాయణ జ్యోత్స్న పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను అని ఖరాకండిగా చెప్పడంతో ఏం చేయాలని ఆలోచిస్తుంది. జ్యోత్స్నా తోనే నిజం చెప్పించాలని అనుకుంటుంది. దాంతో గౌతమ్ తో జ్యోత్స్న పెళ్లి ఆగిపోతుందని, తనపై పడ్డ నింద కూడా తొలిగిపోతుందని భావిస్తుంది. వెంటనే శివ నారాయణ ఇంటికి వెళ్లి అసలు విషయం బయటపెట్టి బయలుదేరుతుంది.
అయితే అప్పటికే పారిజాతం జ్యోత్స్న కు జరిగిన విషయాన్ని చెబుతుంది. మీ మేన అత్త కాంచన ఇంటికి వచ్చి వెళ్ళిందని, తాత శివ నారాయణ తిట్టి పంపించారని చెబుతుంది. అలాగే పెళ్లికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారని, అది కూడా ఫారేన్ లో చేయబోతున్నారని వివరిస్తుంది. మరోవైపు దీపాకు తన ప్లాన్ మొత్తం తెలిసిపోయింది చెబుతుంది. రమ్యతో నిజం చెప్పించకుండా, సత్తిపండుతో అబద్ధం చెప్పింది కూడా నువ్వేనని దీపాకు తెలిసిపోయింది అంటూ పూర్తిగా తెలియ పరుస్తుంది. కానీ జ్యోత్స్న పారిజాతం చెప్పిన మాటలను నమ్మబోదు. దాంతో వెంటనే నేరుగా జ్యోత్స్న దీపాకు కాల్ చేస్తుంది.
అప్పటికే శివ నారాయణ ఇంటికి బయలుదేరిన దీప జ్యోత్స్న ఫోన్ కాల్ కి షాక్ అవుతుంది. లిఫ్ట్ చేసి వెంటనే మాట్లాడుతుంది. నేను నిజ స్వరూపం నాకు పూర్తిగా తెలిసిపోయిందని దీప అంటుంది. పది నిమిషాల్లో ఇంటికి వస్తున్నాను వచ్చాక నేరుగా మాట్లాడుకుందామని హెచ్చరిస్తుంది. దీంతో దీపకు నిజం తెలిసిపోయిందని కన్ఫామ్ చేసుకుంటుంది. అనవసరంగా ఇక్కడికి వచ్చి చిక్కుల్లో పడవద్దు అని హెచ్చరిస్తుంది. దాంతో దీప మండిపడుతుంది. నేను వచ్చే లోపే శివ నారాయణ వద్ద నిజం ఒప్పుకోమని కండిషన్ పెడుతుంది.
లేదంటే నా జీవితాన్ని నువ్వు నాశనం చేయడం కాదు.. నేనే నీ జీవితాన్ని నాశనం చేస్తానని తిరిగి హెచ్చరిస్తుంది. దీంతో జ్యోత్స్న ఎలాగైనా దీపాను ఆపాలని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కార్తీక్ బాబు దీపం ఇంట్లో లేదనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఈ క్రమంలోనే దీపా ఎక్కడికి వెళ్లిందని కాంచనను అడుగుతాడు. దాంతో వాళ్లు జరిగిన విషయం అంత కార్తీక్ బాబుకు చెబుతారు. దాంతో కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు. జ్యోత్స్న తప్పు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి నిలదీయాలి కదా అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











