Karthika deepam 2 April 11th : దీపా చేతిలోకి గన్.. దశరథ్ ఛాతిలోకి బుల్లెట్ దింపిన వంటలక్క

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 10వ తేదీ 328వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న కుట్ర మొత్తం దీపాకు తెలిసిపోతుంది. గౌతమ్ తో పెళ్లి నాటకం, రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు గౌతమే తండ్రి అని నిజం చెప్పించకుండా అడ్డుకోవడం, సత్తిపండుతో రమ్యకు బెదిరింపులు, అంతకు ముందే ఎంగేజ్ మెంట్ తనచేతనే ఆగిపోయేలా చేయడం, కావాలనే క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వడం వంటివన్నీ జ్యోత్స్న నాటకమేనని దీపాకు తెలిసిపోతుంది. హోటల్ లో గౌతమ్ ను కలిసి దీపాపైకి ఉసిగొలుపుదామని వెళ్లిన జ్యోత్స్న.. అక్కడి చెప్పాపెట్టకుండా వచ్చిన పారిజాతం తో తన మాస్టర్ ప్లాన్ ను తెలియజేస్తుంది. ఎంగేజ్ మెంట్ ను చెడగొట్టిందే తను అని, కానీ దీపాతో చెడగొట్టేలా చేశానని పారిజాతానికి వివరిస్తుంది.

గౌతమ్ పచ్చిమోసగాడనే విషయం తనకు ఎప్పుడో తెలుసని, రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు గౌతమ్ తండ్రి అనే విషయం కూడా తెలుసని జ్యోత్స్న పూర్తిగా పారిజాతానికి తెలియజేస్తుంది. కానీ దీపా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేందుకే గౌతమ్ తో పెళ్లికి ఒప్పుకుంటున్నానని, కానీ పెళ్లి మాత్రం జరగదని చెబుతుంది. దీపాతోనే ఆపిస్తానని, అందుకు ప్లాన్ రెడీగా ఉందంటుంది. ఈ విషయాన్ని శ్రీధర్ రెండో భార్య కావేరి విని.. వెంటనే వెళ్లి దీపాకు చెబుతుంది. దాంతో దీపా రగిలిపోతుంది. జ్యోత్స్న తోనే అసలు నిజం చెప్పించాలని ఇంట్లో నుంచి బయల్దేరుతుంది. మరోవైపు దీపాకు నిజం తెలిసిపోయిందనే విషయం పారిజాతం ద్వారా జ్యోత్స్నకు తెలుస్తుంది. దీంతో జ్యోత్స్న నేరుగా దీపాకు ఫోన్ చేసి అడుగుతుంది. ఫోన్ లో ఎందుకు నేరుగానే కలిసి నీ కుట్రను బయటపెడుతానని దీపా హెచ్చరిస్తుంది... శివనారాయణ ఇంటికి వెళ్లి జ్యోత్స్నతో గొడవపడుతుంది. దాంతో జ్యోత్స్న గన్ తో బెదిరిస్తుంది. దీపా ఆ గన్ ను గుంజుకొని తిరిగి జ్యోత్స్నకే గురిపెడుతుంది. ఈ క్రమంలో గన్ పేలి దశరథ్ ఛాతిలోకి బుల్లెట్ దిగుతుంది. ఇక ఏప్రిల్ 11వ తేదీ 329 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 329 April 11th 2025

దీప జ్యోత్స్న అంత చూడడానికి శివ నారాయణ ఇంటికి వెళ్తుంది. ఇక వెంటనే కార్తీక్ బాబు ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చి రాగానే దీపా ఎక్కడ అని తల్లి కాంచనను అడుగుతాడు. దీపా ఈ మధ్యలో చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళ్తుందని, సడన్ గా డల్ అయిపోతుందని కార్తీక్ బాబు తల్లి కాంచనతో అంటాడు. ఆ విషయంలో దీపను హెచ్చరించాలని అంటాడు. ఇక దీపను పిలుస్తూ ఉంటాడు కానీ దీపారాదు. దాంతో ఎక్కడికి వెళ్లిందని మరోసారి కాంచనను అడుగుతాడు. అప్పటికే దీప కాంచనాకు చెప్పి శివ నారాయణ ఇంటికి వెళ్తుంది. కానీ కాంచన మాత్రం కార్తీక్ బాబుకు దీప ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలియదని బదిలిస్తుంది. రెస్టారెంట్ కి వచ్చిందని అనుకుంటున్నాము అని అబద్ధం ఆడుతుంది. అనసూయ కూడా అలాగే బదిలిస్తుంది.

దీంతో కార్తీక్ బాబు మండిపడతాడు. దీప ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అనే విషయం ఇంట్లో ఎవరికీ తెలియకపోవడం ఏంటని ప్రశ్నిస్తాడు. పైగా తన వచ్చి అడిగే వరకు దీపా గురించి తెలుసుకోకపోవడం ఏంటని చిరాకుపడతాడు. ఇప్పటికైనా ఏం జరిగిందో అసలు నిజం చెప్పండి అంటూ కార్తీకి బాబు కాంచనను గట్టిగా అడుగుతాడు. తల్లి కాంచన కార్తీక్ బాబుకు జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తుంది. జ్యోత్స్న దీపపై వేసిన నింద గురించి, అందుకు ఆమె ఆడిన నాటకాన్ని పూర్తిగా కార్తీక్ బాబుకు వివరిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న దీప నేరుగా శివ నారాయణ ఇంటికి వెళ్లి జ్యోత్స్న కు బుద్ధి చెప్పబోతుంది అని తల్లి కాంచన కొడుకు కార్తీక్ బాబుకు వివరిస్తుంది. దీంతో కార్తీక్ బాబు ఇంకా ఆవేశానికి గురవుతాడు. దీప వెళ్లే సమయంలో కనీసం తనకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని ఇటు కాంచన అటు అనసూయ ఇద్దరిని గట్టిగా మందలిస్తాడు. ఇక దీప శివ నారాయణ ఇంట్లో ఏం చేస్తుందో అని కంగారుపడుతూ ఆ ఇంటికి బయలుదేరుతాడు.

మరోవైపు జ్యోత్స్న అంతు చూసేందుకు బయలుదేరిన దీప కోసం జ్యోత్స్న ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక దీపా వెళ్లగానే ఎదురవుతుంది. మరొకసారి దీపకు నిజం తెలిసిందా తెలియలేదా అనే విషయంపై క్లారిటీ తెచ్చుకుంటుంది. చీకట్లో బాణం వేసినంత మాత్రాన నీ మాటలు ఎవరు నమ్మరని దీపతో జ్యోత్స్న అంటుంది. దాంతో దీప రెస్టారెంట్లో పారిజాతంతో నువ్వు మాట్లాడిన మాటలు నిజం కాదా అని బదులిస్తుంది. ఇంక నిజం తెలిసిపోయిందా నీకు కన్ఫామ్ చేసుకున్న జ్యోత్స్న దీపపై మాటల తూటాలు పేల్చుతుంటుంది. ఇప్పటికైనా నిజం ఒప్పుకోమని దీప అడగ్గా జోత్స్న అందుకు అంగీకరించదు. పైగా తన బావ కార్తీక్ బాబుకు దూరం చేసిందని దీపాపైనే మండిపడుతుంది. కార్తీక్ బాబుతో నా పెళ్లి జరిపిస్తానని చెప్పి నమ్మించి తన మెడలో తాళి కట్టించుకుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇవన్నీ తప్పులకు కారణం నువ్వే అని దీపాపై రగిలిపోతుంది.

అందుకే నిన్ను, నీ కూతురు శౌర్యాను చంపే వరకు ఊరుకోనని జోష్ణ దీపా తో అంటుంది. దాంతో దీప వెంటనే జ్యోత్స్న మెడ పట్టుకుంటుంది. నా కూతురు జోలికి వస్తే నా భర్తనే సహించలేదు ఇక నువ్వెంత అని హెచ్చరిస్తుంది. జ్యోత్స్న కూడా నాది కూడా అదే డైలాగ్ అని నా బావ జోలికి వస్తే నిన్ను చంపడానికి వినపడలేదు అలాంటిది నీ కూతురు ఎంత అని ఇంకా రెచ్చగొడుతుంది. నీపై ఉన్న అందరి నుంచి తీసేసి నిన్ను చెడ్డదానిగా మార్చి ఈ రెండు కుటుంబాలకు దూరం చేస్తానని, మా రెండు కుటుంబాలను కలిపి కార్తీక్ బావతో పెళ్లి చేసుకుంటానని దీపాతో అంటుంది. నాతో దీపా స్పందిస్తూ కార్తీక్ మనసులో నువ్వు ఉంటే ఇలాంటి మాటలకు అర్థం ఉండేదని, కానీ ఇప్పుడు కార్తీక్ బాబు మనసులో నేను ఉన్నానని చెబుతోంది. అందుకే కార్తీక్ బాబు నా వెంట ఉన్నాడని గర్వంగా చెబుతుంది.

ఇక జోష్నా దీపను రెచ్చగొట్టడానికి పదేపదే శౌర్య గురించి మాట్లాడుతుంది. నీ కూతురును చంపేస్తాను నీ కూతురుని చంపేస్తాను అని అంటూనే ఉంటుంది. దీంతో దీపాకు ఆపుకోలేని కోపం వస్తుంది. జోష్న చెంప చెల్లుమనిపిస్తుంది. అంతేకాకుండా నా కూతుర్ని చంపడానికంటే ముందు నేనే నిన్ను చంపేస్తానని కర్ర తీసుకొని తరుముతుంది. ఇక జోష్ణ ఇంట్లోకి వెళ్తుంది. దీప కూడా జోష్ణ వెంటనే వెళ్తుంది. కాసేపు అటు ఇటు చూసేలోపు జోష్న గన్ తీసుకొని వస్తుంది. దీపాకు ఎక్కుపెట్టి చంపేస్తానని బెదిరిస్తుంది. ఈరోజు నీ చావు ఖాయమని, తర్వాత మళ్లీ నీ కూతుర్ని చంపేస్తానని జోష్నా అంటుంది. దాంతో దీప తన చేతిలో ఉన్న కర్రను విసురుతుంది. జోష్నా భయపడడంతో అదే సమయంలో చేతిలోని గన్ ను కూడా గుంజుకుంటుంది.

దీప చేతిలోకి గన్ రావడంతో జోష్నా భయంతో వణికి పోతుంది. తనను చంపొద్దు అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకు గదిలో ఉన్న దశరథం, సుమిత్ర, శివ నారాయణ, పారిజాతం వెంటనే కిందికి దిగి వస్తారు. దీప చేతిలో గన్ చూసి భయపడతారు. జోష్నాను కాల్చవద్దు అంటూ దీపాను శాంత పరిచే ప్రయత్నం చేస్తారు. ఓవైపు దీప జోష్నాను ఎక్కడ కాలుస్తుందో అని కంగారు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే జ్యోత్స్నజోష్ణ మరింత ఎక్కువగా భయపడుతూ.. తనను చంపితే ఇంట్లో వాళ్ళు ఎవరు ఊరుకోరని, నీ కూతురు శౌర్యను చంపేస్తారని మరోసారి హెచ్చరిస్తుంది. ఇదే సమయంలో దశరథం చాతిలోకి బుల్లెట్ దిగుతుంది. దాంతో అందరూ భయపడి పోతారు. దశరథంకు ఏమైందని కంగారు పడతారు. చాతి నుంచి కారుతున్న రక్తాన్ని చూసి ఆందోళన చెందుతారు. అయితే ఆ బుల్లెట్ మాత్రం దీప పట్టుకున్న గన్ను నుంచి మాత్రం పేరు లేదని అర్థమవుతుంది. మరి బుల్లెట్ ఎలా దిగింది అనేది సస్పెన్స్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X