Karthika deepam 2 April 12th : సుదర్శన్ ఛాతిలోకి వెళ్లిన బుల్లెట్ ఎక్కడిది.. పోలీసుల అదుపులోకి దీపా
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 11వ తేదీ 329వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న అంతు చూసేందుకు బయలుదేరిన దీప కోసం జ్యోత్స్న ఎదురు చూస్తూ ఉంటుంది. దీపా రాగానే మాటల తూటాలు పేల్చుతుంది. అసలు దీపాకు నిజం తెలిసిందా? లేదా? అనే విషయాన్ని కన్ఫమ్ చేసుకునేందుకు దీపాపై మాటల అస్త్రాలను సంధిస్తుంది. దాంతో రెస్టారెంట్లో పారిజాతంతో నువ్వు మాట్లాడిన మాటలు నిజం కాదా? అని ప్రశ్నిస్తుంది. అంతటితో జ్యోత్స్నకు దీపా నిజం తెలుసుకుందని అర్థం చేసుకుంటుంది. దీపాను ఎలాగైనా బలి చేయాలని భావిస్తుంది. అందుకు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. కానీ అది ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది.
కావాలనే దీపాను రెచ్చగొట్టేలా మాట్లాడి తనపై చెయ్యి చేసుకునేలా మాట్లాడుతుంది. అంతే కాదు ఇంట్లోని గన్ తీసుకొచ్చి దీపాను బెదిరించినట్టు చేసి ఆ గన్ తో తిరిగి దీపా జ్యోత్స్న ను బెదిరించేలా సీన్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇదంతా తెలియని దీపా నిజంగానే గన్ తీసుకొని జ్యోత్స్న ను బెదిరిస్తుంది. ఎంగేజ్ మెంట్ ఆగిపోవడానికి కారణం ఎవరు? రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? గౌతమ్ తో పెళ్లి నాటకం ఎందుకు ఆడుతున్నావు? అనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అందరి ముందే గన్ పట్టుకొని అడుగుతుంది. అయితే ఆ గన్ లోడ్ చేసి ఉందని జ్యోత్స్న చెప్పడంతో అందరూ ఇంకా బయపడుతారు. దీపాను అడ్డుకునే ప్రయత్నం చేసే క్రమంలోనే దశరథ్ ఛాతిలోకి బుల్లెట్ దింగుతుంది. అప్పటికే కార్తీక్ బాబు కూడా ఆ ఇంటికి చేరుకొని దీపా చేతిలో గన్ ఉండటం చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 12వ తేదీ 330 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీప చేతలోకి గన్ రావడంతో జ్యోత్స్న వైపు గురిపెట్టి బెదిరిస్తుంది. తాత శివ నారాయణ దగ్గర నిజం ఒప్పుకోమని హెచ్చరిస్తుంది. రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు గౌతమే తండ్రి అని నిజం చెప్పమంటుంది, అలాగే తన ఎంగేజ్మెంట్ ను తనే పాడు చేసిందని చెప్పమని దీప జోష్నాను బెదిరిస్తుంది. అసలు ఈ పెళ్లి ఒక నాటకం అని ఇంట్లో వాళ్ళందరికీ అర్థం అయ్యేలా చెప్పుమని అంటుంది. ఇక దీప చేతిలో గన్ చూసిన శివ నారాయణ, సుమిత్ర, దశరథం, పారిజాతం కంగారుపడతారు. గన్ కింద పడే అంటూ దీప తో చెబుతుంటారు. కానీ దీప వారి మాటలను పట్టించుకోదు. పదే పదే తన కూతురు శౌర్యను చంపుతాను అన్న జోష్నా పైనే గన్ గురిపెడుతుంది. ఎవరు ఎంత చెప్పినా నిజం చెప్పే వరకు వదిలిపెట్టనున్నట్టుగా గన్ గురి పెట్టి ఉంటుంది.
ఈలోగా దీప శివ నారాయణ ఇంటికి వెళ్లిందని తెలుసుకున్న కార్తీక్ బాబు వెంటనే అక్కడికి చేరుకుంటాడు. దీపా చేతిలో గన్ చూసి ఆశ్చర్యపోతాడు. ఈ సమయంలోనే ఒక్కసారిగా గన్ పేలి దశరథం ఛాతి లోకి బుల్లెట్ దిగుతుంది. అందరూ షాక్ అవుతారు. ఏమైంది అని భయపడతారు. మరోవైపు దీపా కూడా దశరథంకు బుల్లెట్ తగలడంతో షాక్ అవుతుంది. భయపడుతుంది కూడాను. ఇక అప్పటికే పారిజాతం పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఏమైందని ఆరా తీస్తారు. దీప తన కొడుకు దశరథను హత్యాయత్నం చేసిందని శివ నారాయణ పోలీసులకు వివరిస్తాడు. దాంతో పోలీసులు కాల్చిన గన్ ను, ఆధారాలను సేకరిస్తారు. తర్వాత దీపను కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలిస్తారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు.
ఇక తన ముందే దీప దశరథంను కాల్చడం, పోలీసులు రావడం దీపాన్ని తీసుకెళ్లడం చూసిన కార్తీక్ బాబు ఏమి చేయలేక పోతాడు. దీప దశరథును గన్ తో కాల్చిందనే నమ్ముతాడు. ఇక దశరథం ను హాస్పిటల్ కి తీసుకెళ్దామని కార్తీక్ బాబు సాయం చేస్తుంటే శివ నారాయణ కార్తీక్ బాబును నెట్టేస్తాడు. నా కొడుకుని చంపమని దీపను పంపింది నువ్వే కదా అని నిందలు వేస్తాడు. నా కొడుకు దశరథం ఎవరు తాకవద్దని, చచ్చిపోయిన ముట్టుకోవాల్సిన పనిలేదని శివ నారాయణ హెచ్చరిస్తాడు. దాంతో కార్తీక్ బాబుకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.
మొదట కార్తీక్ బాబు పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. అప్పటికే దీపాను పోలీసులు ఖైదీల సెల్ లోకి పంపిస్తారు. ఆమె దగ్గర ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తీసుకొని దర్యాప్తు మొదలుపెడతారు. ఈ క్రమంలో దీప ఎస్సై తో మాట్లాడుతూ తను గన్ పేల్చలేదని చెబుతుంది. అసలు ఆ బుల్లెట్టు ఎలా తగిలిందో తనకు కూడా అర్థం కావడం లేదని వివరిస్తుంది. కానీ ఎస్ ఐ మాత్రం నమ్మడు. లైవ్ గా చూసిన మమ్మల్ని మోసం చేస్తున్నావా అంటూ దీపపై మండిపడతాడు. నేను జోష్నాతో మాట్లాడడానికి మాత్రమే వెళ్లానని ఎంత చెప్పినా వినిపించుకోరు. అదే మాట్లాడడానికని వెళ్లి మర్డర్ చేశావని ఎస్ఐ బెదిరిస్తాడు. ఈ సమయంలోనే కార్తీక్ బాబు ఎంట్రీ ఇస్తాడు. అసలు ఎలా జరిగింది అని దీపా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.
ఇక దీప కార్తీక్ బాబు తో మాట్లాడుతూ గన్ తను పేల్చలేదని చెబుతుంది. అసలు బులెట్ ఎలా తగిలిందో తనకు అర్థం కావడం లేదని వాపోతుంది. కానీ కార్తీక్ బాబు కూడా నమ్మడు. దీపా పై మండిపడతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవు ఎందుకు? నీకు నిజం తెలిసినప్పటికీ ఆ ఇంటికి వెళ్లే ముందు కనీసం నాకు ఒక ఫోన్ కాల్ కూడా చేయాలని ఎందుకు అనిపించలేదని మండిపడతాడు. అప్పుడు విషయం చెప్పి ఉంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు నువ్వు రావాల్సిన పరిస్థితి వచ్చేది కాదని అంటాడు. ఏదేమైనా ఇప్పుడు నువ్వే దశరథం అంకుల్ ను కాల్చావని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు నువ్వు పెద్ద సమస్యల్లో చిక్కుకున్నావు. జాగ్రత్తగా ఉండాల్సిన నువ్వే మళ్ళీ మళ్ళీ జోత్స్నా కు చిక్కుకుంటున్నావని అంటాడు.
ఇక ఈలోగా ఎస్సై వచ్చి కార్తీక్ బాబుతో మాట్లాడుతాడు. హంతకురాలు అని ఎస్ఐ చెబుతాడు. దాంతో కార్తీక్ బాబు మీ దగ్గర ఏం ఆధారం ఉందని అలా చెబుతున్నారని ఎస్ అని అడుగుతారు. ఎస్సై స్పందిస్తూ దీప వాడిన గన్, దీపానే చంపే ప్రయత్నం చేసిందని ప్రత్యక్ష సాక్ష్యాలు, త్వరలో ఫింగర్ ప్రింట్స్ కూడా ఆధారంగా ఉన్నాయని చెబుతాడు. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టుకు పంపించడం మా బాధ్యత అని ఎస్సై కార్తీక్ బాబుకు వివరిస్తాడు. ఇక దాంతో చేసేది ఏమీ లేక కార్తీక్ బాబు సైలెంట్ గా ఉంటాడు. అక్కడ ఆసుపత్రిలో దశరథంకు ఎలా ఉందని కంగారు పడతాడు. దాంతో దీప ముందు నువ్వు అక్కడికి వెళ్లి దశరథకు ఏం జరిగిందో చూసి రా అని చెబుతుంది. కార్తీక్ బాబు కూడా పోలీస్ స్టేషన్ నుంచి వెను తిరుగుతాడు. ఆస్పత్రి దగ్గరికి చేరుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











