Karthika deepam 2 April 14th : కార్తీక్ కు గుండె పగిలిపోయే సిచ్యూయేషన్.. ప్రమాదంలో దీపా

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 12వ తేదీ 330వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న కుట్ర మొత్తం దీపాకు తెలిసిపోతుంది. జ్యోత్స్న ప్లాన్ పక్కాగా అమలవుతోంది. దీపాను ఎలాగైనా నిందితురాలిని చేయాలని వేసిన వ్యూహంలో దీపా బలైంది. గౌతమ్ తో జ్యోత్స్న పెళ్లి నాటకం ఆడుతుందని తెలుసుకున్న దీపా నేరుగా వెళ్లి అడుగుతుంది. ఈ క్రమంలోనే జ్యోత్స్న పొగరు మాటలకు చేయి చేసుకుంటుంది. దాంతో జ్యోత్స్న ఇంట్లోకి వెళ్లి లైసెన్స్డ్ గన్ తీసుకొని వచ్చి దీపాను చంపుతానని బెదిరిస్తుంది. కానీ దీపా ధైర్యంగా జ్యోత్స్నను ఎదుర్కొంటోంది. జ్యోత్స్న చేతిలోని గన్ ను తన చేతిలోకి తీసుకొని తానే బెదిరించడం స్టార్ట్ చేస్తుంది. దీప చేతిలోకి గన్ రావడంతో జోష్నా భయంతో వణికి పోతుంది. తనను చంపొద్దు అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకు గదిలో ఉన్న దశరథం, సుమిత్ర, శివ నారాయణ, పారిజాతం వెంటనే కిందికి దిగి వస్తారు. దీప చేతిలో గన్ చూసి భయపడతారు.

జ్యోత్స్నను చంపొద్దని దీపాను అందరూ అడుగుతారు. కానీ వారందరి మాటలను దీపా పట్టించుకోదు. అందరి ముందు నిజం ఒప్పుకోమని జ్యోత్స్నును బెదిరిస్తుంది. ఈ క్రమంలోనే జ్యోత్స్న మరింత ఎక్కువగా భయపడుతూ.. తనను చంపితే ఇంట్లో వాళ్ళు ఎవరు ఊరుకోరని, నీ కూతురు శౌర్యను చంపేస్తారని కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే దశరథం ఛాతిలోకి బుల్లెట్ దిగుతుంది. అప్పటికే పోలీసులకు పారిజాతం ఫోన్ చేయడంతో వారు వచ్చి దీపాను తీసుకెళ్తారు. దశరథంను ఆస్పత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కార్తీక్ బాబు అటు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ముందు దీపాతో మాట్లాడుతాడు. అసలు ఎలా కాల్చవని అడగడంతో దీపా తను కాల్చలేదని, బుల్లెట్ ఎలా దిగిందో అర్థం కావడం లేదని చెబుతుంది. ఆ తర్వాత దశరథంను చూసేందని ఆస్పత్రికి వెళ్తాడు కార్తీక్ బాబు. అక్కడ ఏం జరిగిందనేని ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 14వ తేదీ 331 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 331 April 14th 2025

దీపాను పోలీస్ స్టేషన్ లో కలిసిన తర్వాత కార్తీక్ బాబు నేరుగా ఆస్పత్రికి వెళ్తాడు. తన మేనమామ దశరథం చాతిలోకి బుల్లెట్ దిగడంతో ఆసుపత్రికి తరలించగా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునేందుకు కార్తీక్ బాబు ఆస్పత్రికి వెళ్తాడు. ఇక కార్తీక్ బాబు ఆసుపత్రికి చేరుకొని వార్డులోకి వెళ్ళగానే శివ నారాయణ ఆవేశంతో ఊగిపోతాడు. అప్పటికే అందరూ దశరథకు ఏమవుతుందో అని భయంతో ఏడుస్తూ ఉంటారు. ఇక కార్తీక్ బాబు వెళ్లి దశరథ మామయ్యకు ఎలా ఉందని అడుగుతాడు. అందుకు శివ నారాయణ స్పందిస్తూ.. నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోరా.. అని అంటాడు. కార్తీక్ బాబు మాత్రం దశరథకు ఎలా ఉందని పదే పదే అడుగుతుంటాడు. దీంతో కోపంతో రగిలిపోతున్నా తాత శివ నారాయణ కార్తీక్ బాబును ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నెట్టేస్తాడు. అయినప్పటికీ కార్తీక బాబు తప్పుతన వైపు ఉండడంతో సహనంగా ఉంటాడు.

దశరథ మామయ్య ఎలా ఉందని పదే పదే అడుగుతుంటాడు. దీంతో శివ నారాయణ కు కోపం కట్టలు తెంచుకుంటుంది. నా కొడుకు ఎలా ఉంటే నీకెందుకురా అని బిగ్గరగా అరుస్తాడు. నా కొడుకు ఈరోజు ఆస్పత్రి పాలు కావడానికి కారణం నీ భార్య దీపా అని నీకు తెలిసిన ఏమి చేయలేకపోతున్నావు. ఇన్ని సమస్యలకు కారణంగా దీప మిగిలిన కూడా చేతకాని వాడిలా చూస్తూ ఉన్నావు అంటూ రగిలిపోతాడు. అయినా ఇప్పుడు వచ్చింది కూడా దశరథకు ఎలా ఉందో అని కాదు.. దశరథకు ఏమైనా అయితే నీ భార్య దీప ప్రమాదంలో పడుతుందని ఆరా తీయడానికి వచ్చావు అంటూ శివనారాయణ మండిపోతాడు. పారిజాతం కూడా దశరథ బాబు కోసం రాలేదని, దీప ను సమస్య నుంచి గట్టెక్కించడానికి వచ్చాడని అంటుంది.

దాంతో కార్తీక్ బాబు స్పందిస్తూ అసలు దీప మీ ఇంటికి వచ్చిందనే విషయం నాకు తెలవదు తాతయ్య అని శివ నారాయణ తో అంటాడు. శివ నారాయణ ఇంకా మండిపోతాడు. నీకు ఏమీ తెలియదు రా, నీ కళ్ళముందే దీప జోష్నా పెళ్లి ని ఆపడం తెలియదు, రోడ్డున పోయే అమ్మాయిని తీసుకువచ్చి గౌతమి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని నింద వేయడం తెలియదు, పైగా మీ అమ్మ కాంచనను అనసూయ ను పంపి ఈ ఇంటి శుభకార్యాన్ని ఆపడం కూడా నీకు తెలియదు. ఇలా ఏ విషయాలు నీకు తెలియదురా.. చేతకాని దద్దమ్మల ఉండిపోతావు. నీ భార్య దీపా నీతో ఉంటే చాలు అనుకుంటావు. ఇంకా ఎవరు ఏమైపోయినా నీకు సంబంధం లేదు అని రగిలిపోతాడు.

అలా ఏం లేదు తాతయ్య అని కార్తీక్ బాబు ఎంత చెప్పే ప్రయత్నం చేసిన శివ నారాయణ ఒప్పుకోడు. అయినా ఇప్పుడు నేను వచ్చింది దశరథ మామయ్య ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకోవడానికి మాత్రమే అని, గొడవ పడడానికి కాదని అర్థమయ్యేలా వివరిస్తూ ఉంటాడు. కార్తీక్ బాబు అలా సమాధానాలు ఇస్తుంటే శివ నారాయణ కంట్రోల్ తప్పి రాత్రి బాబును కొట్టబోతారు. దీంతో సుమిత్ర అడ్డుకుంటుంది. అడ్డుకోవడం కాకుండా తన ఆవేదనను కూడా కార్తీక్ బాబుపై వెళ్లగకుతుంది. దీప చేసిన తప్పులకు నువ్వెందుకు మాటలు పడుతున్నావు బావ అని జోష్నా అనడంతో సుమిత్రమ్మ ఇంకా మండిపడుతుంది. అసలు తప్పు దీపా ది కాదు కార్తీక్ దే అని అంటుంది. ఇప్పటివరకు వచ్చిన అన్ని సమస్యలకు కారణం దీప కాదు కార్తీక్ బాబు అని గట్టిగా చెబుతుంది.

దీపా తన ప్రాణాలు కాపాడడానికి రాలేదని తన పసుపు కుంకుమలు తెంపడానికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంట్లో ఎవరో ఒకరు చావు చూసే వరకు దీప ప్రశాంతంగా ఉండదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు వీటన్నిటికీ కారణం దీప కాదని కార్తీక్ అని అంటుంది. దీప మెడలో తాళి కట్టి ఈ ఇంటికి ప్రమాదాన్ని తెచ్చి పెట్టావని కార్తీక్ బాబును నిందిస్తుంది. అసలు దీప అనే వ్యక్తి లేకుంటే ఈ రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉండేవని గుర్తు చేసింది. మీ నాన్న శ్రీధర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో అన్ని సమస్యలు తీరిపోయాయని, కానీ మళ్ళీ దీపాను ఇంటి కోడలుగా చేసుకొని కార్తీక్ తప్పు చేశాడని రగిలిపోతుంది. ఇక శివ నారాయణ స్పందిస్తూ తన కొడుకు దశరథకు ప్రాణాపాయం లేకపోతే కనీసం దీప జైలులోనైనా ఉంటుందని, లేదంటే ప్రాణానికి ప్రాణాలు లెక్క కడతానని హెచ్చరిస్తాడు. ఇంకోసారి నువ్వు, మీ అమ్మ కాంచన, మీ చెల్లి స్వప్న అంటూ ఎవరైనా ఎటువైపు వస్తే ఏ మాత్రం సహించబోనని, నా కొడుకు దశరథకు ఏమైనా మీకు అనవసరమని తేల్చి చెబుతాడు.

దాంతో కార్తీక్ బాబు చాలా బాధపడతాడు. తన చేతకాని వాడే నేనని, రెండు కుటుంబాలను కలపడం కోసమే చేతకానివాడిగా ఉంటున్నానని చివర్లో బదులిస్తాడు. తన తల్లికి పుట్టిల్లు ఉండాలని, తన తల్లికి తండ్రి ప్రేమ దక్కాలని, తన తల్లికి అన్న ప్రేమ దక్కాలని చేతకాని వాడిలా ఉంటున్నానని చెప్తాడు. నేను ఆవేశపడి బంధాలను పెంచుకోవడానికి నేను సిద్ధంగా లేనని, చేతకాని వాడిలా ఉండి, అన్ని నిందలు, అవమానాలు భరిస్తూ కుటుంబాలను దగ్గర చేయాలని తాను దూరం అవుతున్నానని వివరిస్తాడు. ఇక చేసేదేమీ లేక వెనతిరిగి ఇంటికి వెళతాడు. అక్కడ కాంచన ఎదురుచూస్తూ ఉంటుంది. కొడుకు రాగానే దీప గురించి అడుగుతుంది. తన బస్ స్టేషన్కు వెళ్లిందని చెబుతాడు. అదేంటి దీప శివ నారాయణ ఇంటికి వెళ్లలేదా అని కాంచన అడుగుతుంది. తన కూతురు శౌర్యను ఇంట్లోకి పంపించి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. దీప జైలులో ఉందని, దశరథం ఆసుపత్రిలో ఉన్నాడని వివరిస్తాడు. ఇక ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కాంచన కూడా దుఃఖంలో మునిగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X