Karthika deepam 2 April 15th : పుట్టెడు శోకంలో కార్తీక్ బాబు.. జైలులో ఊచలు లెక్కిస్తున్న దీపా

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 14వ తేదీ 331వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా గన్ తో బెదిరిండం, ఆ గన్ పేలకపోయినా దశరథం ఛాతిలోకి బుల్లెట్ దిగడం, పోలీసులు రావడం, దశరథం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం, దీపా జైలుకు వెళ్లడం ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇక ఇప్పుడు కార్తీక్ బాబుకు పుట్టెడు శోకం మిగిలింది. ఓవైపు భార్య జైలు జీవితం గడుపుతుండటం, మరోవైపు తన మేనమామ దశరథం ఆస్పత్రి బెడ్ పై సీరియస్ కండీషన్ లో ఉండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో కన్నీళ్లు కార్చుతున్నాడు. ఇక దీపాను జైలులో కలిసి మాట్లాడిన తర్వాత తిరిగి ఆస్పత్రికి వస్తాడు. దశరథం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.

కానీ అక్కడ తాత శివనారాయణ కార్తీక్ బాబును దగ్గరికి కూడా రానివ్వడు. తన కొడుకు దశరథం గురించి ఎవ్వరూ అడాగాల్సిన పని, చూడాల్సిన అవసరం లేదని అంటాడు. ముఖ్యంగా కార్తీక్ తరుపున నుంచి ఎవ్వరూ తమ వద్దకు రావొద్దని హెచ్చరిస్తాడు. దీపా తప్పుల మీద తప్పులు చేస్తున్న చూస్తూ ఊరుకున్నావని మండిపడుతాడు. తన కొడుకు దశరథకు ఏదైనా జరగకూడనిది జరిగితే ఏమాత్రం సహించబోతనని చెబుతాడు. ప్రాణానికి ప్రాణం బదులు తీసుకుంటానని హెచ్చరిస్తాడు. దశరథం కోలుకున్నా కూడా దీపా జైలు నంచి రాకుండా చూసుకుంటానని, జీవితాంతం చరశాలలో బంధీగా ఉండటం ఖాయమని అంటాడు శివనారాయణ. ఇక ఆస్పత్రి నుంచి కార్తీక్ బాబు ఇంటికి తిరిగి వస్తాడు. తల్లి కాంచనకు జరిగిన విషయం చెబుతాడు. దీపా జైలు లో ఉందని, దశరథం మామకు బుల్లెట్ దిగి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని వివరిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక ఏప్రిల్ 15వ తేదీ 332 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 332 April 15th 2025

హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన కార్తీక బాబు తల్లి కాంచన ముందు కూలిపోతాడు. కన్నీళ్లతో కనిపిస్తాడు. దీపా చేతిలో గన్ ఉండడం తను చూసానని, అదే సమయంలో దశరథం మామయ్యకు బుల్లెట్ తగలడం కూడా తాను చూసానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీప జైలులో ఉందని, మామ ఆసుపత్రిలో ఉన్నారని కాంచనకు వివరించడంతో ఒక్కసారిగా గుండెలు బాధకుంటుంది. తన అన్న దశరథంకు బుల్లెట్ తగలడం ఏంటని రోదిస్తూ ఉంటుంది. అదికూడా దీప కాల్చడం ఏంటని, ఇంతటి దురదృష్టం మనకే ఎందుకు కలిగిందని బాధపడుతూ ఉంటుంది. తోడబుట్టిన అన్నయ్యకు బుల్లెట్ తగిలిందని తెలియడంతో బోరున విలపిస్తుంది.

ఇక వెంటనే తన అన్నయ్య దశరథంను చూడాలని ఏడుస్తూ ఉంటుంది.. కానీ అప్పటికే ఆస్పత్రి నుంచి వచ్చిన కార్తీక్ బాబు కలవడం కుదరదని చెబుతాడు. ఆసుపత్రికి దశరథం మామను చూసేందుకు వెళ్లిన తనని తాత శివ నారాయణ అస్సలు కలవనీయలేదని తల్లి కాంచనకు వివరిస్తాడు. ఆస్పత్రిలో మామయ్య సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పుకొస్తాడు. మన వైపు నుంచి ఎవరిని కూడా ఆసుపత్రి గడప తొక్క వద్దని హెచ్చరించినట్టు తల్లి కాంచనకు కార్తీక్ బాబు తెలియజేస్తాడు. దీంతో కాంచన మండిపడుతుంది. తన అన్నను చూడకుండా ఆపే హక్కు ఎవరికీ ఉందని కోపం తెచ్చుకుంటుంది. కానీ కార్తీక్ బాబు ఇప్పుడు వెళ్లడం సాధ్యం కానిపని అని తల్లికి చెబుతుంటాడు.

ఇక మరోవైపు దశరథం కి బుల్లెట్ ఎలా తగిలిందని మాట్లాడుకుంటూ ఉంటారు. దీప చేతిలో గన్ ఉండడం, దశరథ్ ఒంట్లోకి బుల్లెట్ దిగడం నేనే ప్రత్యక్షంగా చూసానని కార్తీక్ బాబు చెబుతాడు. దాంతో కాంచన ఆటో అనసూయ షాక్ అవుతారు. దీప కన్న తండ్రిగా భావించే దశరథను ఎలా కాల్చుతుందని అనుకుంటూ ఉంటారు. ఏదో జరిగిందని సందేహిస్తారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి దీపతో మాట్లాడిన సందర్భంలో బుల్లెట్ తన గన్ లో నుంచి పేలలేదని చెప్పినట్టు కార్తీక్ బాబు తల్లి కాంచన నాతో అంటాడు. అలాంటప్పుడు మరి ఆ బుల్లెట్ పేల్చింది ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కానీ తాను వెళ్లిన సమయంలో దీప చేతిలోనే గన్ ఉందని, చుట్టుపక్కల కూడా మరెవరు కనిపించలేదని కార్తీక్ బాబు చెబుతాడు.

ఇక జోష్ణ అన్నంత పని చేసిందని అనసూయ ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీపాను నీకు కావాలనే దూరం చేసిందని, అందుకు తగ్గట్టుగానే పథకం నడిపిస్తుందని అనసూయ సందేస్తోంది. కార్తీక్ బాబు స్పందిస్తూ ప్రస్తుతం ఆ బుల్లెట్ ఎలా పేలిందో తెలుసుకోవాలని అనుకుంటాడు. అందుకోసం మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఇక దీప పోలీస్ స్టేషన్లో ఉన్నదన్న సంగతిని కూతురు శౌర్యకు తెలియకుండా జాగ్రత్త పడతారు. మరోవైపు దశరథ ఆసుపత్రిలో చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారని కుటుంబ సభ్యులంతా ఏడుస్తూ ఉంటారు. హాస్పిటల్ లో అడ్మిన్ చేసిన ఒక రోజు తర్వాత డాక్టర్ వచ్చి దశరథ హెల్త్ కండిషన్ పై అప్డేట్ ఇస్తాడు.

దశరథం కి ఏమైంది అని అందరూ డాక్టర్ను అడుగుతుంటారు. త్వరగా చెప్పండి డాక్టర్ అంటూ పారిజాతం, జోష్ణ, సుమిత్ర, శివ నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని చెబుతారు. కండ్లు తెరిచే వరకు ఎలాంటి హామీ ఇవ్వలేమని, మెరుగైన చికిత్స మాత్రం అందిస్తున్నామంటూ వివరిస్తాడు. ఆయన స్పృహలోకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే అని డాక్టర్ చెబుతాడు. ఇక చివర్లో శివ నారాయణను పక్కకు తీసుకెళ్లి అసలు దశరథం పరిస్థితి ఎలా ఉందో పూర్తిగా వివరిస్తాడు. బుల్లెట్ గుండెకు దగ్గరగా దిగిందని, దశరథం బతకడం సాధ్యం కానీ పని, ఇంట్లో ఒక్కరికైనా చెప్పాలి కాబట్టి మీతో చెబుతున్నావంటూ డాక్టర్ వివరిస్తారు. ముందుగానే ఇంట్లో వాళ్లను ప్రిపేర్ చేసి ఉంచండి అంటూ సూచిస్తారు. ఆ విషయం విన్న శివ నారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.

తన కొడుకు బ్రతకడని డాక్టర్ చెప్పడంతో కుమిలి పోతాడు. ఇక జోష్ణ పారిజాతం సుమిత్ర శివ నారాయణ వద్దకు వచ్చి ఏమైంది అని, డాక్టర్ మీతో ఏం చెప్పారని అడుగుతారు. శివ నారాయణ అసలు విషయం దాచి ఏమీ కాలేదు త్వరలోనే కోలుకుంటాడనీ చెప్పి వదిలేస్తాడు. కానీ పారిజాతానికి సందేహం కలుగుతుంది. దశరథకు సీరియర్ గా ఉంది కాబట్టే అలా బాధలో ఉన్నాడని గ్రహిస్తుంది. ఇక తన కుట్రలో తను ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో దీపాకు ఎస్సై వార్నింగ్ ఇస్తాడు. ఇప్పటికే గన్ ను, దశరథ ఒంట్లోకి దిగిన బుల్లెట్ ను ల్యాబ్ టెస్ట్ కు పంపించామని చెబుతాడు. ఒకవేళల పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మాత్రం కఠిన శిక్ష తప్పదని చెబుతాడు. ఇక ఆస్పత్రిలో ఉన్న శివనారాయణనకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు రావాలని ఆదేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X