Karthika deepam 2 April 16th : జీవితాంతం జైలులోనే దీపా.. కఠిన నిర్ణయం తీసుకున్న శివనారాయణ

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 15వ తేదీ 332వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దశరథం కి ఏమైంది డాక్టర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇక డాక్టర్ రాగానే త్వరగా చెప్పండి డాక్టర్ అంటూ పారిజాతం, జోష్ణ, సుమిత్ర, శివ నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని చెబుతారు. కండ్లు తెరిచే వరకు ఎలాంటి హామీ ఇవ్వలేమని, మెరుగైన చికిత్స మాత్రం అందిస్తున్నామంటూ వివరిస్తాడు. ఆయన స్పృహలోకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే అని డాక్టర్ చెబుతాడు. ఇక చివర్లో శివ నారాయణను పక్కకు తీసుకెళ్లి అసలు దశరథం పరిస్థితి ఎలా ఉందో పూర్తిగా వివరిస్తాడు. బుల్లెట్ గుండెకు దగ్గరగా దిగిందని, దశరథం బతకడం సాధ్యం కానీ పని, ఇంట్లో ఒక్కరికైనా చెప్పాలి కాబట్టి మీతో చెబుతున్నావంటూ డాక్టర్ వివరిస్తారు. ముందుగానే ఇంట్లో వాళ్లను ప్రిపేర్ చేసి ఉంచండి అంటూ సూచిస్తారు. ఆ విషయం విన్న శివ నారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.

తన కొడుకు బ్రతకడని డాక్టర్ చెప్పడంతో కుమిలి పోతాడు. ఇక జోష్ణ పారిజాతం సుమిత్ర శివ నారాయణ వద్దకు వచ్చి ఏమైంది అని, డాక్టర్ మీతో ఏం చెప్పారని అడుగుతారు. శివ నారాయణ అసలు విషయం దాచి ఏమీ కాలేదు త్వరలోనే కోలుకుంటాడనీ చెప్పి వదిలేస్తాడు. కానీ పారిజాతానికి సందేహం కలుగుతుంది. దశరథకు సీరియర్ గా ఉంది కాబట్టే అలా బాధలో ఉన్నాడని గ్రహిస్తుంది. ఇక తన కుట్రలో తను ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో దీపాకు ఎస్సై వార్నింగ్ ఇస్తాడు. ఇప్పటికే గన్ ను, దశరథ ఒంట్లోకి దిగిన బుల్లెట్ ను ల్యాబ్ టెస్ట్ కు పంపించామని చెబుతాడు. ఒకవేళ పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మాత్రం కఠిన శిక్ష తప్పదని చెబుతాడు. ఇక ఆస్పత్రిలో ఉన్న శివనారాయణనకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు రావాలని ఆదేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 16వ తేదీ 333 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 333 April 16th 2025

దశరథం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక దీపా వల్లనే తమకు సమస్యలు వచ్చాయని బాధపడుతారు. దశరథను బెడ్ పై చూడలేకపోతున్నాని సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో పారిజాతం స్పందిస్తూ తండ్రిలా చూసుకున్న దశరథను దీపా ఎలా చంపాలనుకుంది. ఆ బుల్లెట్ ఏదో నాకు తగిలినా బాగుండేది. దశరథను అలా చూడలేకపోతున్నానని ప్రేమ వొలకబోస్తుంది. ఇక సుమిత్ర మాట్లాడుతూ దీపాను ఎంత బాగా చూసుకున్నా ఇంత శోకంలోకి నెట్టేసిందని అంటుంది. దీపాను చేరదీయడం వల్లే ఇలాంటి కష్టాలు వచ్చాయి. దీపా ఆయుధం లాంటిది గాయం చేయడమే తప్ప సాయం చేయడం తెలియదని, ఆ ఆయుధాన్ని చెరదీసి తప్పు చేశానని సుమిత్ర బాధపడుతుంది.

దాంతో జ్యోత్స్న స్పందిస్తూ ఆ తప్పును సరిదిద్దుకుందాం అత్త అని అంటుంది. దీపాను అస్సలు జైలు నుంచి బయటికి రానివ్వనని, దీపాకు బెయిల్ రాకుండా చూస్తానని జ్యోత్స్న చెబుతుంది. కార్తీక్ బాబు ఎంత ప్రయత్నించినా దీపాను మాత్రం జైలు నుంచి బయటికి రాకుండా చూసుకుంటానని శపతం చేస్తుంది. ఆ వెంటనే వెళ్లి దశరథతో ఏదో మాట్లాడుతుంది. తను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏదో చేయబోతున్నట్టు తాత శివనారాయణకు చెబుతుంది. దాంతో శివనారాయణ కూడా ఒప్పుకుంటాడు. ఇక జ్యోత్స్న కూడా ఆ పనిమీద బయటికి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత కాంచన తన అన్నయ్య దశరథం కు ఎలా ఉన్నాడోనని చాలా బాధపడుతుంది. దాంతో ఎలాగైనా ఆస్పత్రికి వెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. కానీ తన తండ్రి శివనారాయణ ఆస్పత్రికి రావొద్దని ఖరాకండిగా చెప్పడంతో ఆగిపోతుంది. ఇక కనీసం ఫోన్ చేసైనా దశరథకు ఎలా ఉందనే విషయం తెలుసుకుందామని అనుకుంటుంది. ఎవ్వరికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరని, పారిజాతంకు ఫోన్ చేస్తుంది. ఇక పారిజాతం మాట్లాడకుండా.. బాధ, కోపంతో రగిలిపోతున్న సుమిత్రకు ఫోన్ ఇస్తుంది. సుమిత్ర మాట్లాడుతూ నీ కోడలు దీపా వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదని, ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని బాధపడుతూ కసురుకుంటూ చెబుతుంది.

దాంతో కాంచన చాలా బాధపడుతుంది. వదిన నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ సుమిత్ర రగిపోతూ నన్ను వదినా అని పిలవొద్దంటూ అని, మీ అన్న ఆస్పత్రి బెడ్ మీదకు ఎక్కగానే ఆ బంధం పోయిందని బోరున ఏడుస్తూ చెబుతుంది. అంతేకాకుండా ఫోన్ పారిజాతం కూడా తీసుకొని కాంచనపై మండిపడుతుంది. ఉట్టప్పుడు అన్న అన్నా అని తెగ తిరిగావు కదా.. మరీ ఇప్పుడు దశరథ చావు బతుకుల్లో ఉన్నాకూడా కనీసం చూడటానికి రాలేదు ఎందుకని ప్రశ్నిస్తుంది. దశరథ చచ్చిపోతే ఆస్తి మొత్తం నీకే సొంతం అవుతుందని ఆశపడుతున్నావా? అని పారిజాతం ఓవర్ గా మాట్లాడుతుంది. ఆ మాటలకు శివనారాయణ మండిపడుతాడు. అసలు ఇప్పుడు ఆసక్తి గోల ఎందుకు? ఆమె అడిగిందా అని, అసలు ఆవిడతో అంతసేపు మాట్లాడాల్సిన పని ఏముందని శివనారాయణ ఫోన్ గుంజుకుంటాడు.

ఇకపై నువ్వు నన్ను నాన్న అని పిలవొద్దని, మన మధ్య ఏ సంబంధం లేదని చెబుతాడు. వీలైతే జీవితాంతం నాకు కనిపించకుండా ఉండమని, అదే నాకు నువ్వు చేసే అతి పెద్ద సాయం అంటాడు. దీంతో కాంచన గుండెలు బాదుకుంటుంది. తనను కన్న తండ్రే అసహించుకుంటున్నాడని, పిన్ని, వదిన తనను చీదరించుకుంటున్నారని నెత్తికొట్టుకుంటుంది. కన్నీళ్ల వరద కారుతూనే ఉంటుంది. తన కోడలు దీపా జైలులో ఉందని, తన అన్న దశరథం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడని, కొడుకు కార్తీక్ బాబు దీపాను, దశరథను కాపాడేందుకు రోడ్లపైనే తిరుగుతున్నాడని తన గోడును వెళ్లగక్కుతుంది. ఇక నేను ఎందుకు బతకాలని బాధపడుతూ నెత్తినోరు బాదుకుంటుంది.

ఈలోగా శ్రీధర్ రెండో భార్య కావేరి వచ్చి కాంచనను ఓదార్చుతుంది. ఆ వెంటనే శ్రీధర్ బాబు కూడా వస్తాడు. దీంతో కాంచన అతనిపై మండిపడుతుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావని, వెళ్లిపోమని అంటుంది. కానీ శ్రీధర్ బాబు మాటలు కలుపుతూ కాంచన బాధపడితే చూడాలని అనుకుంటాడు. ఇక అనసూయ కూడా వెళ్లకపోతే చీపురు తిరగేసి కొడతానని అంటుంది. ఆలోపే కార్తీక్ బాబు వచ్చి విజిల్ వేస్తాడు. బాగా చెప్పావని అంటాడు. దానికి శ్రీధర్ బాబు మండిపోతాడు. అసలు దీపాకు బైలు రాదని, దశరథం బతికే అవకాశమే లేదని చెప్పి భయపడేలా చేస్తాడు. దీపాను కాపాడటం చాలా కష్టం అని అంటాడు. అసలు దీపా తప్పే చేయనప్పుడు బయపడాల్సిన పనిలేదని కార్తీక్ బాబు అంటాడు. కానీ దీపాను నిర్దోషని రుజువు చేయాలంటే సాక్ష్యాలు, ఆధారాలు కావాలి కదా అని అంటాడు. మీ దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు కదా అని ప్రశ్నిస్తాడు. దానికి కార్తీక్ బాబు ఎలా బదులిచ్చాడనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X