Karthika deepam 2 April 17th : పోలీస్ స్టేషన్ లో దీపా రచ్చ.. కార్తీక్ బాబుకు వంటలక్క ద్రోహం
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 16వ తేదీ 333వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కోడలు దీపా జైలులో ఉందని, తన అన్న దశరథం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడని, కొడుకు కార్తీక్ బాబు దీపాను, దశరథను కాపాడేందుకు రోడ్లపైనే తిరుగుతున్నాడని తన గోడును వెళ్లగక్కుతుంది. ఇక నేను ఎందుకు బతకాలని బాధపడుతూ నెత్తినోరు బాదుకుంటుంది. ఈలోగా శ్రీధర్ రెండో భార్య కావేరి వచ్చి కాంచనను ఓదార్చుతుంది. ఆ వెంటనే శ్రీధర్ బాబు కూడా వస్తాడు. దీంతో కాంచన అతనిపై మండిపడుతుంది. శ్రీధర్ బాబు మాటలు కలుపుతూ కాంచన బాధపడితే చూడాలని అనుకుంటాడు. ఇక అనసూయ కూడా వెళ్లకపోతే చీపురు తిరగేసి కొడతానని అంటుంది. ఆలోపే కార్తీక్ బాబు వచ్చి విజిల్ వేస్తాడు. బాగా చెప్పావని అంటాడు.
అసలు దీపాకు బెయిల్ రాదని, దశరథం బతికే అవకాశమే లేదని చెప్పి భయపడేలా చేస్తాడు. దీపాను కాపాడటం చాలా కష్టం అని అంటాడు. అసలు దీపా తప్పే చేయనప్పుడు బయపడాల్సిన పనిలేదని కార్తీక్ బాబు అంటాడు. కానీ దీపాను నిర్దోషని రుజువు చేయాలంటే సాక్ష్యాలు, ఆధారాలు కావాలి కదా అని అంటాడు. మరోవైపు జ్యోత్స్న, కార్తీక్ బాబు ఇద్దరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి దీపాతో మాట్లాడుతారు. కార్తీక్ బాబు ముందుగా వెళ్లి దీపాతో మాట్లాడుతాడు. ఇక ఏప్రిల్ 17వ తేదీ 334 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపా దశరథంను గన్ తో కాల్చిందనడానికి శివనారాయణ దగ్గర బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయని శ్రీధర్ అంటారు. దీంతో దీపా బయటికి రావడం జరగదని అంటాడు. అసలే శివనారాయణ దగ్గర ఉన్న భగవాన్ లాయర్ గురించి మీకు తెలిసిందే. ఎలాగైనా గెలిపిస్తాడు. దీపాకు యావజ్జీవ శిక్ష పడటం ఖామంటాడు శ్రీధర్. అంతటితో ఆగకుండా దీపాకు ఊరిశిక్ష పడుతుందని, మీరిక దీపాను వదిలేయండి అని చెబుతాడు. శౌర్యను ఏదోక అనాథ ఆశ్రమంలో పడేసి కార్తీక్ బాబుకు మరో పెళ్లి చేసేద్దామని నోటికి వచ్చింది వాగుతుంటాడు. దీంతో కార్తీక్ బాబు మండిపోతాడు. నువ్వు ఆపకపోతే నీపెళ్లి చేస్తానని హెచ్చరిస్తాడు. కార్తీక్ బాబు కోపంతో రగిలిపోవడం చూసి నెమ్మదిగా జారకుంటాడు.
శ్రీధర్ అలా మాట్లాడటంతో కాంచన, అనసూయ బాధపడుతూ ఉంటారు. కానీ కార్తీక్ బాబు ఆయన చెప్పింది కూడా తమ మంచికే అని అంటాడు. దీపాను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దీపా తరుపున మాట్లాడటానికి ఒక లాయర్ ఉండాలి కదా.. తెలిసో తెలియకో మాస్టర్ సలహా ఇచ్చి వెళ్తున్నారు అని అంటాడు కార్తీక్ బాబు. ఇక వెంటనే సత్యరాజ్ రెస్టారెంట్ ఓనర్స్ కు తెలిసిన ఒక ప్లీడర్ ను కలుస్తాడు. ఇక ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటాడు. తను అన్యాయాన్ని ఎదిరించడం కోసమే ఈ వృత్తిలో ఉన్నానని, కానీ న్యాయం కోసం పోరాడే వారిని ఈ సమాజం వెలివేస్తుందని కార్తీక్ బాబుతో చెబుతాడు. అయినా నేను పేదలకు న్యాయం చేయడం కోసమే పనిచేస్తున్నానని వివరిస్తాడు.
ఇక మీ భార్య దీపా మర్డర్ కేసుల అరెస్ట్ అయ్యిందని విన్నాను అంటూ కార్తీక్ బాబుతో అంటాడు. అందుకు కార్తీక్ బాబు స్పందిస్తూ.. తన కథ మొదటి నుంచి చెబుతాడు. దీపాతో పరిచయం, తర్వాత జరిగిన పరిణామాలను వివరిస్తాడు. ఇక అన్ని విన్న తర్వాత దీపా వెర్షన్ గురించి తెలుసుకుందామని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తాడు ఆ లాయర్ కార్తీక్ బాబును. ఇక మరోవైపు జ్యోత్స్న లాయర్ భగవాన్ ను కలిసి దీపా ఎలాగైనా బయటికి రాకుండా చూడాలని అడుగుతుంది. దాంతో ఆ లాయర్ 4 ఏళ్ల వరకు శిక్ష తప్పనిసరి అని, అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని చెబుతాడు. ఆ మాత్రం శిక్ష సరిపోదని యావజ్జీవ శిక్ష పడాలని అంటుంది. ఎలాంటి ఎవిడెన్స్ అయినా తెచ్చి ఇస్తానని చెబుతుంది. దాంతో లాయర్ ఇక దీపా బయటికి రాకుండా చూస్తానని జ్యోత్స్నకు హామీనిస్తాడు.
మరోవైపు సత్యరాజ్ కు తెలిసిన లాయర్ తో కార్తీక్ బాబు పోలీస్ స్టేషన్ ను వెళ్తాడు. దీపాను కలిసిన తర్వాత లాయర్ పలు ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు దీపాను కావాలనే కుట్ర పన్ని పెళ్లి చేసుకున్నావు. జ్యోత్స్న అడ్డుపడటంతో చంపాలనుకున్నావు. కానీ ఆమె తప్పించుకోవడంతో దశరథంను చంపబోయావు కదా? అని ప్రశ్నిస్తాడు. దీంతో దీపా, కార్తీక్ బాబు షాక్ అవుతారు. ఇలా అడుగుతున్నారేంటి లాయర్ అని కంగారు పడుతారు. నిజమైతే నిజమని, లేకపోతే లేదని చెప్పు అని అంటాడు లాయర్. మీరు ఇక్కడే చెప్పకపోతే ఇక కోర్టులో ఎలా చెబుతారని అంటాడు. ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని ట్రైన్ చేస్తాడు. తబడితే మీరే దోషులుగా నిలుస్తారు అని చెబుతాడు. కోర్టులో ప్రత్యర్థి న్యాయవాది ఇలాంటి ప్రశ్నలు అడిగితే అప్పుడు ఏం చేస్తారు. ముగ్గురి మధ్యనే నిజం చెప్పడానికి భయపడితే 30 మంది మధ్య ఏలా చెబుతారు. అక్కడ మాట మార్చే అవకాశం ఉండదు. అంతా రికార్డ్ అవుతుంది. ముందుగా ప్రశ్నను అర్థం చేసుకొని ప్రశాంతంగా బదులివ్వాల్సి ఉంటుంది.. అని లాయర్ దీపాకు వివరిస్తాడు.
ఇక లాయర్ కళ్యాణ్ దాస్ పోలీస్ స్టేషన్ లో దీపా, కార్తీక్ తో మాట్లాడిన దృశ్యాన్ని చూస్తుంది. అసలు దీపాతో మాట్లడుదామని వెళ్లిన జ్యోత్స్నకు లాయర్ కళ్యాణ్ కనిపిస్తారు. దీంతో ముందుగా లాయర్ తో మాట్లాడాలని అనుకుంటుంది. వెంటనే వెళ్లి లాయర్ తో మాట్లాడుతుంది. క్రిమినల్స్ కు మీరు సపోర్ట్ చేయొద్దని అంటుంది. దాంతో లాయర్ స్పందిస్తూ నేను నీకోసమో దీపా కోసమో వాదించే వాడిని కాదని, న్యాయంకోసం వాదిస్తానని నిజాన్ని గెలిపిస్తానని అని చెప్పి వెళ్లిపోతాడు. లాయర్ జ్యోత్స్న ఎంత భయపెట్టే ప్రయత్నం చేసినా ఏమాత్రం అతను భయపడడు. పైగా ధీటుగా బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక జ్యోత్స్న పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి కార్తీక్, దీపాలతో మాట్లాడుతుంది. తన తండ్రి దశరథకు ఏదైనా జరిగితే అస్సులు ఊరుకోనని అంటుంది. దాంతో మీనా కోపంతో జ్యోత్స్న గొంతు పట్టుకుని నులుముతుంది. ఆవేశంతో రగిలిపోతుంది... ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











