Karthika deepam 2 April 18th : జ్యోత్స్న గొంతు నులిమిన దీపా.. వంటలక్క ఆవేశంతో మరో ప్రమాదం

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 17వ తేదీ 334వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాను బయటికి తీసుకొచ్చేందుకు లాయర్ తో కార్తీక్ బాబు పోలీస్ స్టేషన్ ను వెళ్తాడు. దీపాను కలిసిన తర్వాత లాయర్ పలు ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు దీపాను కావాలనే కుట్ర పన్ని పెళ్లి చేసుకున్నావు. జ్యోత్స్న అడ్డుపడటంతో చంపాలనుకున్నావు. కానీ ఆమె తప్పించుకోవడంతో దశరథంను చంపబోయావు కదా? అని ప్రశ్నిస్తాడు. దీంతో దీపా, కార్తీక్ బాబు షాక్ అవుతారు. ఇలా అడుగుతున్నారేంటి లాయర్ అని కంగారు పడుతారు. నిజమైతే నిజమని, లేకపోతే లేదని చెప్పు అని అంటాడు లాయర్. మీరు ఇక్కడే చెప్పకపోతే ఇక కోర్టులో ఎలా చెబుతారని అంటాడు. ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని ట్రైన్ చేస్తాడు. తబడితే మీరే దోషులుగా నిలుస్తారు అని చెబుతాడు. కోర్టులో ప్రత్యర్థి న్యాయవాది ఇలాంటి ప్రశ్నలు అడిగితే అప్పుడు ఏం చేస్తారు. ముగ్గురి మధ్యనే నిజం చెప్పడానికి భయపడితే 30 మంది మధ్య ఏలా చెబుతారు. అక్కడ మాట మార్చే అవకాశం ఉండదు. అంతా రికార్డ్ అవుతుంది. ముందుగా ప్రశ్నను అర్థం చేసుకొని ప్రశాంతంగా బదులివ్వాల్సి ఉంటుంది.. అని లాయర్ దీపాకు వివరిస్తాడు.

ఇక లాయర్ కళ్యాణ్ దాస్ పోలీస్ స్టేషన్ లో దీపా, కార్తీక్ తో మాట్లాడిన దృశ్యాన్ని చూస్తుంది. అసలు దీపాతో మాట్లడుదామని వెళ్లిన జ్యోత్స్నకు లాయర్ కళ్యాణ్ కనిపిస్తారు. దీంతో ముందుగా లాయర్ తో మాట్లాడాలని అనుకుంటుంది. వెంటనే వెళ్లి లాయర్ తో మాట్లాడుతుంది. క్రిమినల్స్ కు మీరు సపోర్ట్ చేయొద్దని అంటుంది. దాంతో లాయర్ స్పందిస్తూ నేను నీకోసమో దీపా కోసమో వాదించే వాడిని కాదని, న్యాయంకోసం వాదిస్తానని నిజాన్ని గెలిపిస్తానని అని చెప్పి వెళ్లిపోతాడు. లాయర్ జ్యోత్స్న ఎంత భయపెట్టే ప్రయత్నం చేసినా ఏమాత్రం అతను భయపడడు. పైగా ధీటుగా బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక జ్యోత్స్న పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి కార్తీక్, దీపాలతో మాట్లాడుతుంది. తన తండ్రి దశరథకు ఏదైనా జరిగితే అస్సులు ఊరుకోనని అంటుంది. దాంతో మీనా కోపంతో జ్యోత్స్న గొంతు పట్టుకుని నులుముతుంది. ఇక ఏప్రిల్ 18వ తేదీ 335 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 335 April 18th 2025

జ్యోత్స్న పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి తర్వాత దీపాతో కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అప్పటికే దీపా కార్తీక్ బాబుతో మాట్లాడుతూ ఉంటుంది. శౌర్యకు నిజం చెప్పారా? శౌర్య ఎలా ఉందని కార్తీక్ బాబును అడిగి తెలుసుకుంటుంది. కార్తీక్ బాబు శౌర్య కు ఇంకా నిజం తెలియదని చెబుతుంటూ ఉంటాడు. ఈలోగా జ్యోత్స్న వచ్చి దీపాకు వార్నింగ్ ఇస్తుంటుంది. నీ కూతురులాగే మా నాన్న కూడా నన్ను పెంచాడని నన్ను చంపాలని ఎందుకు ప్రయత్నించావని కార్తీక్ బాబు ముందు జ్యోత్స్న దీపాను అడుగుతుంది. దీంతో దీపా ఒక్కసారిగా కోపం తెచ్చుకుంటుంది. అంతటితో ఆగకుండా జ్యోత్స్న దీపాను ఇంకా మాటలతో రెచ్చగొడుతుంది. మా నాన్న దశరథం కు ఏదైనా అయితే మాత్రం అస్సలు ఊరుకోనని, నిన్నూ నీ కూతురు శౌర్యను చంపేస్తానని జ్యోత్స్న హెచ్చరిస్తుంది.

దీంతో దీపా కోపం ఆపులేక వెంటనే సెల్ లోపలి నుంచే జ్యోత్స్న గొంతును పట్టుకుంటుంది. అసలు ఆరోజు గన్ ఎందుకు తీసుకొచ్చావే అని అడుగుతుంది. ముందుగానే నువ్వే ఏదో ప్లాన్ చేసి నా చేతికి గన్ వచ్చేలా చేశావు కదా అని అడుగుతుంటుంది. నీ అసలు ప్లాన్ ఏంటని అడిగ్గా నిలదీస్తుంది. గొంతు గట్టిగా నొక్కడంతో జ్యోత్స్న కు ఊపిరాడదు. ఓవైపు కార్తీక్ బాబు ఆపే ప్రయత్నం చేసినా దీపా పట్టువిడువదు. ఈ క్రమంలోనే గొడవను గమనించి ఎస్సై వచ్చి దీపాను అడ్డుకొని జ్యోత్స్న ను కాపాడుతాడు. ఇలా పోలీస్ స్టేషన్ లోనే మరొకరిని చంపాలని చూస్తున్నావా? అని దీపాపై మండిపడుతాడు. నీకోసంతో ఇప్పటికే ఒక ప్రాణం ఆస్పత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోందని, ఇక ఇప్పుడు స్టేషన్ కు సంతకం కోసం పిలిపించిన జ్యోత్స్న ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నావా? అంటూ ఎస్సై మందలిస్తాడు.

ఇలా పోలీస్ స్టేషన్ లోనే మరొకరిపై భౌతిక దాడికి దిగినందుకు మరో కేసు ఫైల్ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తాడు. దీంతో కార్తీక్ బాబు స్పందిస్తూ సెల్ లో ఉన్న దీపాకు జ్యోత్స్ననే వచ్చి వార్నింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా సార్ అని అడుగుతాడు. దీంతో జ్యోత్స్నపైనా కూడా ఎస్సై ఫైర్ అవుతాడు. సైన్ చేసి త్వరగా వెళ్లండని చెబుతారు. తర్వాత దీపా కార్తీక్ బాబుతో మాట్లాడుతూ నేను ఈ హత్యయత్నం చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? అని అడుగుతుంది. నేను నమ్మడంలేదు. కానీ సాక్ష్యాలు కావాలి కదా.. నువ్వు ప్రతిసారి ఇలా ఆవేశానికి పోయి సమస్యను ఇంకా పెద్దదిగా చేస్తే ఎలా? నాకైతే ఇప్పటి వరకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇక లాయర్ మాత్రమే తన తెలివి తేటలతో నిన్ను బయటకి తీసుకురాగలడు అని చెప్పి స్టేషన్ నుంచి బయటికి వెళ్తాడు.

స్టేషన్ బయటనే వేచి ఉన్న జ్యోత్స్న కార్తీక్ బాబుతో మాట్లాడుతుంది. దీపా చేసిందాన్ని నువ్వు సమర్థిస్తున్నావా అని అడుగుతుంది. గతంలో నువ్వు చేసిందే నీకు తిరిగి జరుగుతుందని అంటాడు. నువ్వు ఎన్ని విషయాల్లో తప్పులు చేసినా నిన్ను మాత్రం మార్చాలని మాత్రమే ప్రయత్నించిందని అంటాడు కార్తీక్ బాబు. కానీ జ్యోత్స్న మాత్రం మరీ గన్ ఎలా పేలించిందని ప్రశ్నిస్తాడు. అదే అర్థం కావడం లేదని కార్తీక్ బాబు అంటాడు. కానీ అసలు దీపా చేతిలోకి గన్ రావడానికి నీ ప్లాన్ ఉందని అంటాడు. ఎవరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు అని అంటాడు. దీపాను కావాలనే రెచ్చగొట్టావని అంటాడు. శౌర్య గురించి మాట్లాడితే దీపా కంట్రోల్ తప్పుతుందని వీక్ నెస్ తెలుసుకొని మరీ దీపాను ఈ హత్యహత్నంలోకి దింపావని కార్తీక్ బాబు అంటాడు. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకుందామని అంటాడు.

అయితే, జ్యోత్స్న మాత్రం ఇలాంటి సందర్బంలోనూ తన ప్రేమను కార్తీక్ బాబుకు చెప్పే ప్రయ్నతం చేస్తుంది. కానీ అది కార్తీక్ బాబుకు చిరాకు తెప్పించేలా ఉంటుంది. అన్నీ సమస్యలకు తనే కారణమని కార్తీక్ బాబు అనడంతో ఇక నేనే వెళ్లిపోతానని జ్యోత్స్న. కానీ దీపాను మాత్రం కేసు నుంచి బయటికి రానివ్వనని, జైలు జీవితం గడిపేలా చేస్తానని సవాల్ చేస్తుంది. ఇక కార్తీక్ బాబు తిరిగి ఇంటి వస్తాడు. శౌర్య దీపాతో మాట్లాడాలని గట్టిగా అడుతుంది. అమ్మకి ఏమైందని, నిన్నటి నుంచి అమ్మను చూడలేదని అడుగుతుంది. నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్లు అంటుంది. ఆ తర్వాత తల్లి కాంచనకు జరిగిన విషయం చెబుతాడు. దీపా కేసును వాదించడానికి కళ్యాణ్ ప్రసాద్ అనే లాయర్ దొరికాడని, దశరథం కూడా స్పృహలోకి వచ్చాడని చెబుతాడు. దీంతో కాంచన కాస్తా ఊపిరిపీల్చుకుంటుంది. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X