Karthika deepam 2 April 19th : జ్యోత్స్నకు కార్తీక్ బాబు వార్నింగ్.. వంటలక్క జైలుకు వెళ్లేలా సాక్ష్యాలు
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 18వ తేదీ 335వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా పోలీస్ స్టేషన్ లో.. దశరథం ఆస్పత్రిలో ఉన్నారు. ఇక కార్తీక్ బాబు దీపాను బయటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యరాజ్ కు తెలిసిన కళ్యాణ్ ప్రసాద్ అనే లాయర్ ద్వారా కేసును గెలిపించాలని అనుకుంటాడు. ఇందుకోసమని అతన్ని కలిసి జరిగిన విషయాన్ని పూర్తిగా వివరిస్తాడు. అసలు దీపా తనకు ఎలా పరిచయం అయ్యిందో ఎలా పోలీస్ స్టేషన్ కు వచ్చిందో కూలంకూషంగా వివరిస్తాడు. ఆ లాయర్ కూడా పోలీస్ స్టేషన్ కు కార్తీక్ బాబును తీసుకెళ్లి మరీ దీపాను విచారిస్తాడు. పలు విషయాలను తెలుసుకుంటాడు.
ఇక లాయర్ వెళ్లిన తర్వాత జ్యోత్స్న కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లుంది. ఈ క్రమంలోనే లాయర్ ను కూడా కలుస్తుంది. దీపాకు సపోర్ట్ గా మాట్లొద్దని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అతను జ్యోత్స్న మాటలకు బెదరడు. దాంతో ఇక దీపాను మరింతగా ఇరకాటంలో పడేయాలని లోపలికి వెళ్లి మరీ దీపాను రెచ్చగొడుతుంది. పదే పదే తన కూతురు శౌర్యను చంపేస్తానని అనడంతో దీపా ఆవేశంతో గొంతుపట్టుకుటుంది. దాంతో ఎస్సై వచ్చి అడ్డుకుంటాడు. మరో కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తాడు. దీంతో జ్యోత్స్న, కార్తీక్ బాబు బయటికి వెళ్తారు. ఇక బయట కార్తీక్ తో దీపాకు వాగ్వాదం జరుగుతుంది. దీపాను కావాలనే రెచ్చగొట్టావని, శౌర్య గురించి మాట్లాడి దీపా చేత గన్ పేల్పించి హంతకురాలిగా మార్చవనే విషయం తనకు తెలుసని కార్తీక్ బాబు జ్యోత్స్నపై మండిపడుతాడు. ఇక జ్యోత్స్న నేను అలా చేయలేదు. దీపా అసలు రంగు అదే అని చెబుతుంది. నువ్వు కూడా ఎంత చెప్పినా వినడం లేదు కాబట్టి దీపాను బయటికి రాకుండా చేస్తానని హెచ్చరించి వెళ్లిపోతుంది. ఇక ఏప్రిల్ 19వ తేదీ 336 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

ఆస్పత్రిలో ఉన్న దశరథం స్పృహలోకి వస్తాడు. డాక్టర్లు వచ్చి శివనారాయణ, సుమిత్రలకు ఆ విషయం చెప్పడంతో కాస్తా ఊపిరి పీల్చుకుంటారు. దేవుడి దయ చూపించడాని సుమిత్ర శివనారాయణతో అంటుంది. ఇక వెంటనే వెళ్లి దశరథతో మాట్లాడుతారు. డాక్టర్ వచ్చి ఇక దశరథకు ఎలాంటి సమస్య లేదని, ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పిందని అంటాడు. మరోవైపు జ్యోత్స్న వచ్చి నాన్ను ఇక నీ ప్రాణాలకు ప్రమాదం తప్పింది, నీకు ఏం కాదని భరోసా వ్యక్తం చేస్తుంది. అలాగే మీరు పూర్తిగా కోలుకునే లోపు దీపాకు శిక్ష పడేలా చేస్తానని చెబుతుంది.
దశరథ జ్యోత్స్న మాటలకు షాక్ అవుతాడు. కానీ బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉండటంతో తన మనస్సులో ఉన్న మాటలు చెప్పలేకపోతాడు. ఇక మరోవైపు దాసుకు గతం గుర్తుకు వస్తుంది. దశరథం ఆస్పత్రిలో ఉన్న విషయం తెలుసుకుంటాడు. దీపా పోలీస్ స్టేషన్ లో ఉన్న సంగతి కూడా తెలుసుకుని కంగారు పడుతాడు. దీపా దశరథంను గన్ తో కాల్చిందని చెప్పడంతో తన తండ్రిని తానే ఎందుకు కాల్చుతుందని అంటాడు. ఇదంతా ఆ రాక్షసి పనే అయ్యి, వెంటనే వెళ్లి అన్నయ్య దశరథను కాపాడాలని అంటాడు. ఇంట్లో నుంచి బయల్దేరి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు.
కానీ దాసుకు గతం గుర్తుకు వచ్చిన విషయం తెలియక కొడుకు కాశీ, కోడలు స్వప్న అడ్డుకుంటారు. బయటకి వెళ్లకుండా ఇంట్లోకి తీసుకెళ్లి రూమ్ లో బంధిస్తారు. వెంటనే డాక్టర్ కు ఫోన్ చేసి పిలిపిస్తారు. ఇక డాక్టర్ వచ్చి అతని ఆరోగ్యాన్ని పరీక్షించి సవ్యంగానే ఉందనే చెబుతాడు. అయితే డాక్టర్ వచ్చే వరకు దాసు మళ్లీ గతం మర్చిపోతాడు. దాంతో మెమోరీ రికవరీ కావడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? అని స్వప్న డాక్టర్ ను అడుగుతుంది. చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీ మామయ్య బాగానే ఉన్నాడు కదా.. దాంతో ఇప్పుడు అలా ట్రీట్ మెంట్ చేయడం కుదరదు. ఆయన బాగానే ఉన్నారు కాబట్టి అలానే చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతారు.
ఇక దాస్ కు గతం గుర్తుకు వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్న మాటలను కాశీ, స్వప్నలు గుర్తుకు చేసుకుంటారు. దశరథం పెద్దనాన్నను కాపాడాలని, దశరథం ప్రాణాలకు ఆ రాక్షసి వల్ల ప్రమాదం ఉందని అనడంతో.. ఇంతకీ ఆ రాక్షకి ఎవరు అయ్యి ఉంటారని సందేహిస్తారు. నాన్న దాసు తలకు గాయమవ్వడానికి, దశరథం, దీపా, జ్యోత్స్న పారిజాతంతోపాటు ఆ ఇంటికి ఏదో సంబంధం ఉందని, అదే విషయాన్ని నాన్న కూడా చెప్పాలని ప్రయత్నిస్తున్నార అని దాసు కొడుకు కాశీ, కోడలు స్వప్న అనుకుంటారు. ఇక ఎలాగైనా ఆ విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు. దీంతో కొన్నాళ్లపాటు దాసును ఇంటి నుంచి వైజాగ్ కు తీసుకెళ్లి గతం గుర్తుకు వచ్చేలా ప్రయత్నిద్దామని అనుకుంటారు.
ఇక మరోవైపు శ్రీధర్ తన భార్య కావేరితో శుభవార్త చెబుతాడు. దశరథం కళ్లు తెరిచాడని తెలియజేస్తాడు. దాంతో కావేరి సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక గండం గట్టేక్కిందని అనుకుంటుంది. కానీ శ్రీధర్ మరో బ్యాడ్ న్యూస్ చెబుతాడు. దరశరథం బతికి బట్ట కట్టినంత మాత్రానా దీపా కేసులోంచి ఈజీగా బయటకి జారుకోలేదని అంటాడు. శివనారాయణ దీపాకు యావజ్జీవ కారగారశిక్ష పడేలా చేస్తారని సంతోషంగా చెబుతాడు. సొంత అల్లుడిని నన్నే ఇంట్లో నుంచి తరిమేశాడు. ఇక దీపాను అయితే సర్వనాశనం చేస్తాడని అంటాడు. దాంతో దీపా పీడవిరగడ అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత తన కొడుకును ఒప్పించి జ్యోత్స్నతో పెళ్లి చేయిస్తానని తన మనస్సులోని మాటను చెబుతాడు. దీంతో కావేరి కాస్తా కంగారు పడుతుంది.
మరోవైపు ఆస్పత్రిలో దశరథ స్పృహలోనికి వచ్చాక జ్యోత్స్న, పారుజాతంలు చూసి, మళ్లీ బయటికి వచ్చి కూర్చుంటారు. ఈ సందర్భంగా పారుజాతం దశరథం ప్రాణాలకు ప్రమాదం తెచ్చింది నువ్వే కదా అని పరోక్షంగా అడుగుతుంది. దానికి జ్యోత్స్న మండిపోతుంది. నేను ఎలాంటి ప్లాన్ చేయలేదని, దీపానే వచ్చి ఇరుక్కుందని, తనను కాల్చబోయి తన తండ్రిని కాల్చిందని చెబుతుంది. ఏదేమైనా దీపాను ఈ కేసు నుంచి బయటికి రాకుండా చూడాలని అంటుంది. ఇంతకంటే మంచి అవకాశం రాదని పారుజాతం జ్యోత్స్నతో చెబుతుంది. అందుకు జ్యోత్స్న ఇది ఎంతటి మంచి అవకాశమో నీకంటే నాకే బాగా తెలుసని అంటుంది. దీపాను జీవితాంతం జైలుకే పరిమితం చేసేలా సాక్ష్యాలు అన్ని లాయర్ కు పంపించానని చెబుతుంది. దాంతో దీపాకు శిక్ష పడుతుందని, ఆ తర్వాత బయటికి రావడం కష్టమని చెబుతుంది. నెక్ట్స్ కార్తీక్ బాబును పెళ్లి చేసుకొని శౌర్యకు తల్లిగా మారుతానని చెబుతుంది. కొన్నాళ్లు దిగి నాటకం ఆడితేనే పరిస్థితి మన దారిలోకి వస్తుందని పారిజాతంకు చెబుతుంది. అందుకు పారిజాతం కూడా నా పూర్తి మద్దతు నీకే ఉంటుందని హామీనిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











