Karthika deepam 2 April 21th : దీపా జైలుకే అంకితం.. కార్తీక్ ను పెళ్లి చేసుకునేందుకు జ్యోత్స్న మాస్టర్ ప్లాన్

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 19వ తేదీ 336వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆస్పత్రిలో ఉన్న దశరథం స్పృహలోకి వస్తాడు. డాక్టర్లు వచ్చి శివనారాయణ, సుమిత్రలకు ఆ విషయం చెప్పడంతో కాస్తా ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు దాసుకు గతం గుర్తుకు వస్తుంది. దశరథం ఆస్పత్రిలో ఉన్న విషయం తెలుసుకుంటాడు. దీపా పోలీస్ స్టేషన్ లో ఉన్న సంగతి కూడా తెలుసుకుని కంగారు పడుతాడు. వెంటనే వెళ్లి అన్నయ్య దశరథను కాపాడాలని అంటాడు. ఇంట్లో నుంచి బయల్దేరి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ కొడుకు కాశీ, కోడలు స్వప్న అడ్డుకుంటారు. బయటకి వెళ్లకుండా ఇంట్లోకి తీసుకెళ్లి రూమ్ లో బంధిస్తారు. వెంటనే డాక్టర్ కు ఫోన్ చేసి పిలిపిస్తారు. డాక్టర్ వచ్చే వరకు దాసు మళ్లీ గతం మర్చిపోతాడు.

ఆస్పత్రిలో దశరథ స్పృహలోనికి వచ్చాక జ్యోత్స్న, పారుజాతంలు చూసి, మళ్లీ బయటికి వచ్చి కూర్చుంటారు. ఈ సందర్భంగా పారుజాతం దశరథం ప్రాణాలకు ప్రమాదం తెచ్చింది నువ్వే కదా అని పరోక్షంగా అడుగుతుంది. దానికి జ్యోత్స్న మండిపోతుంది. నేను ఎలాంటి ప్లాన్ చేయలేదని, దీపానే వచ్చి ఇరుక్కుందని అంటుంది. కానీ ఈ అవకాన్ని వదులుకోనని, దీపాను జీవితాంతం జైలుకే పరిమితం చేసేలా సాక్ష్యాలు అన్ని లాయర్ కు పంపించానని చెబుతుంది. దాంతో దీపాకు శిక్ష పడుతుందని, ఆ తర్వాత బయటికి రావడం కష్టమని చెబుతుంది. నెక్ట్స్ కార్తీక్ బాబును పెళ్లి చేసుకొని శౌర్యకు తల్లిగా మారుతానని చెబుతుంది. కొన్నాళ్లు దిగి నాటకం ఆడితేనే పరిస్థితి మన దారిలోకి వస్తుందని పారిజాతంకు చెబుతుంది. అందుకు పారిజాతం కూడా నా పూర్తి మద్దతు నీకే ఉంటుందని హామీనిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 21వ తేదీ 337 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 337 April 21th 2025

దీపా జైలులో శోఖంలో మునిగిపోతుంది. అన్నం, నిద్ర మానేసి దశరథం కు ఏమైందోనని బాధపడుతుంది. లేడీ పోలీస్ వచ్చి చెప్పినా తినడానికి ఒప్పుకోదు. ఈ క్రమంలోనే కార్తీక్ బాబు ఇంటి దగ్గరి నుంచి క్యారేజ్ పట్టుకొని వస్తాడు. తన చేతులతోనే స్వయంగా వండి తీసుకొస్తాడు. కార్తీక్ బాబు పోలీస్ స్టేషన్ కు వచ్చే సరికి దీపా తినను అని లేడీ కానిస్టేబుల్ లో తో అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ బాబు ఇలా మాట్లాడుతాడు. గుండెలో బాధ ఉంంటే ఎలా తింటారని, కుటుంబం కష్టంలో ఉంటే కడుపులో ఆకలి ఎలా వేస్తుందని కార్తీక్ బాబు అంటాడు. కనీసం తన కూతురు శౌర్య ఈరోజు కడుపు నిండా భోజనం చేసిందని చెప్పితేనైనా కొంచెం బాధ తగ్గి తింటుందేమోనని అంటాడు. అలాగే ఆస్పత్రిలో దశరథం మామకు స్పృహ వచ్చిందంటే నైనా ఇంకాస్తా బాధ తగ్గి తింటుందేమో, ఇక నా చేతులతోనే వంట చేసి తీసుకొచ్చానని చెబితే ఇంకా ఇంకా బాధ తగ్గి అప్పుడైనా తింటుందేమోనని కార్తీక్ బాబు అంటాడు.

చేతిలోని క్యారేజ్ చూపిస్తూ తననే స్వయంగా తినిపిస్తానని అంటాడు. అందుకు లేడీ కానిస్టేబుల్ ఒప్పుకొదు. ఎస్సై వస్తే తిడతారని హెచ్చరిస్తుంది. కార్తీక్ బాబు రిక్వెస్ట్ తో సరేనని అంటుంది. త్వరగా భోజనం చేయండి అని చెప్పి లేడీ కానిస్టేబుల్ తన పనికి వెళ్తుంది. అయితే.. కార్తీక్ బాబు మాటలకు దీపా కాస్తా శాంతిస్తుంది. శౌర్య భోజనం చేయడం, దశరథంకు స్పృహ వచ్చిందనడంతో కాస్తా బాధను తగ్గించుకుంటుంది. కార్తీక్ బాబు తెచ్చిన క్యారేజ్ తినేందుకు ఒప్పుకుంటుంది. దీంతో కార్తీక్ బాబే స్వయంగా దీపాకు భోజనం తినిపిస్తాడు. ఇంట్లో విషయాలన్ని దీపాకు చెబుతాడు.

నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి కార్తీక్ బాబు దీపాకు భరోసానిస్తాడు. త్వరలోనే నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావని చెబుతాడు. జైలు మనకు చాలా పాఠాలు నేర్పిస్తుందని అంటాడు. మంచి వారు ఎప్పుడూ ఈ బడి నుంచి నిర్దోషిగానే బయటికి వెళ్తారని భరోసానిస్తారు. ఇక శౌర్య బాగా ఏడుస్తోందని, తనతో ఫోన్ లోనైనా మాట్లాడించు అని మారం చేస్తుందని దీపాకు చెబుతాడు. అందుకు కనీసం వాయిస్ రికార్డు అయినా వినిపిస్తానని కొన్ని మాటలు మాట్లాడు అని దీపాతో కార్తీక్ బాబు అంటాడు. దీంతో దీపా శౌర్య పాప అంటూ.. చాలా సేపు మాట్లాడుతుంది. ఆ లోపే ఎస్సై వచ్చి మరో షాకింగ్ న్యూస్ చెబుతాడు. దశరథం స్పృహలోకి వచ్చినంత మాత్రం దీపా బయటికి వస్తుందని అనుకుంటున్నారా? అది జరగదు.

ఎందుకంటే జ్యోత్స్న దీపాపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది. మొత్తం 4 సెక్షన్ల కింద కేసులు ఫైల్ అయ్యాయని ఎస్సై చెబుతాడు. రేపే దశరథం గారి వాగ్మూలం తీసుకునేందుకు వెళ్తున్నాం. ఆయన గనుక దీపానే తనను కాల్చిందని చెబితే ఇక జీవితాంతం జైలులోనే ఉండిపోతావని దీపాను హెచ్చరిస్తాడు. అందుకు దీపా కూడా చాలా భయపడుతుంది. కానీ కార్తీక్ బాబు ఎస్సైతో ఇలా ఎవరు మాట్లాడిస్తున్నారో మనకు తెలియనిది కాదు కదా అని అంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు త్వరలోనే బయటకి వస్తావని చెబుతాడు. కార్తీక్ బాబు వెళ్లి పోయిన తర్వాత దీపా ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటుంది. దశరథం తన పేరు చెబితే యావజ్జీవ కారాగార శిక్ష తప్పదా? అని తనలో తానే కుమిలి పోతుంది. చేసేదేమీ లేక కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇక మరోవైపు పోలీసులు ఆస్పత్రిలో ఉన్న దశరథం దగ్గరకు వెళ్లి వాగ్మూలం తీసుకుంటారు. చాలా ప్రశ్నలు అడిగిన తర్వాత.. మిమ్మల్ని కాల్చింది దీపానా? కాదా? అని ఎస్సై ప్రశ్నిస్తాడు. దీంతో దశరథ అన్నీ ఆలోచించి దీపా అని చెబుతాడు. దాంతో జ్యోత్స్న, పారుజాతం సంతోషిస్తారు. ఇక దీపా జీవితాన్ని జైలుకే అంకితం చేస్తానని, అందుకు మరో పని మిగిలి ఉందని బయటికి వెళ్తుంది. మరోవైపు కార్తీక్ బాబు తల్లి దీపా కోసం బాధ పడుతున్న కూతురు శౌర్యతో మాట్లాడుతాడు. దీపాతో చేయించిన వాయిస్ రికార్డును వినిపిస్తాడు. దాంతో శౌర్య సంతోషిస్తుంది. ఇక అమ్మ వచ్చే వరకు ఏమాత్రం అలగనని చెబుతుంది. ఇలా కార్తీక్ బాబు, శౌర్య మాట్లాడుకుంటూ ఉండగా జ్యోత్స్న వస్తుంది. దాంతో కార్తీక్ బాబు శౌర్యను ఇంట్లోకి పంపించి ఎందుకు వచ్చావని జ్యోత్స్నను అడుగుతాడు. ఇక శౌర్య ఇంట్లో నుంచి వీరి మాటలను వినే ప్రయత్నం చేస్తుంది..... ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X