Karthika deepam 2 April 22nd : జ్యోత్స్న మరో నాటకం.. కార్తీక్ బాబుకు కొత్త సవాల్

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 21వ తేదీ 337వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పోలీస్ స్టేషన్ సెల్ లో ఉన్న దీపాను కలిసేందుకు కార్తీక్ బాబు వెళ్తాడు. అక్కడ దీపా పుట్టెడు శోకంలో మునిగిపోతుంది. అన్నం, నిద్ర మానేసి దశరథం కు ఏమైందోనని బాధపడుతుంది. అదే సమయంలో కార్తీక్ బాబు వచ్చి ఓదార్చుతాడు. దశరథం మామ కళ్లు తెరిచాడని, ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతాడు. ఇక శౌర్య కూడా కడుపు నిండా భోజనం చేసిందని చెబుతాడు. తప్పు చేయని వారిని న్యాయం స్థానం నిర్దోషులుగానే తేల్చుతుందని చెబుతాడు. ఎవరెన్నీ కుట్రలు పన్నినా నిజం గెలుస్తుందని, త్వరలోనే నువ్వు బయటికి వస్తావని చెప్పి దీపాలో ధైర్యం నింపుతాడు. తను తెచ్చిన క్యారేజ్ తినిపిస్తాడు. ఇదే సమయంలో ఎస్సై వచ్చి ఊహించని షాక్ ఇస్తాడు.

దశరథం స్పృహలోకి వచ్చినప్పటికీ దీపా బయటికి వెళ్తుందనే భ్రమలో ఉండొద్దని చెబుతాడు. జ్యోత్స్న దీపాపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిందని, నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిందని, దీపా హంతకురాలు అనే రుజువు చేసేందుకు పక్కా ఆధారాలను, సాక్ష్యాలను కూడా సిద్ధం చేసిందని ఎస్సై హెచ్చరిస్తాడు. దాంతో దీపా ఇంకా బాధపడుతుంది. కానీ కార్తీక్ బాబు నువ్వు బాధపడాల్సిన పనిలేదని, ఎస్సైతో ఎవరు మాట్లాడిస్తున్నారో మనకు తెలిసిందే కదా అని జ్యోత్స్న ను గుర్తు చేసుకుంటూ చెప్పి స్టేషన్ నుంచి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన కార్తీక్ బాబు శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోగా జ్యోత్స్ననేరుగా కార్తీక్ బాబును కలిసేందుకు వెళ్తుంది... అయితే ఇప్పటి వరకు శౌర్యకు దీపా పోలీస్ స్టేషన్ లో ఉందనే విషయం తెలిసిందే. జ్యోత్స్న రాగానే కార్తీక్ బాబు శౌర్యను ఇంట్లోకి పంపించి మాట్లాడాలనుకుంటాడు. కానీ శౌర్య తలుపు చాటున నిల్చొని వింటుంది. అయితే జ్యోత్స్న కార్తీక్ బాబుతో ఏం మాట్లాడింది, ఆ విషయాలను శౌర్య విన్నదా? అనేది లేటెస్ట్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచాయి. ఇక ఏప్రిల్ 22వ తేదీ 338 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 338 April 22nd 2025

కార్తీక్ బాబుతో మాట్లాడేందుకు వచ్చిన జ్యోత్స్నను కార్తీక్ బాబు ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తాడు. దీంతో జ్యోత్స్న స్పందిస్తూ ఇక దీపాను కాపాడే ప్రయత్నాలు మానుకో బావ అని బదులిస్తుంది. దీపానే గన్ తో కాల్చిందని పోలీసులకు తన తండ్రి దశరథం చెప్పాడని తెలుపుతుంది. ఇక జైలులోనే ఉంటుందని అంటుంది. అయితే ఈ విషయాన్ని తలుపు చాటు నుంచి శౌర్య వింటుంది. అమ్మకు ఏమైంది? పోలీస్ లతో పనేముందని అని కంగారు పడుతుంది. మళ్లీ ఈ విషయాన్ని నాన్న కార్తీక్ బాబును అడిగినా నిజం చెప్పడని అనుకుంటుంది. దాంతో వెంటనే కాశీ మామ దగ్గరకు వెళ్లి అసలు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుని కార్తీక్ బాబు, జ్యోత్స్న ఇంటి ముందు మాట్లాడుతూ ఉంటే.. ఇంటి వెనకాల నుంచి బయటికి వెళ్తుంది.

ఇక కార్తీక్ బాబుతో జ్యోత్స్న మాట్లాడుతూ దీపానే నేరం చేసిందని, తనను గుడ్డిగా నమ్మకు అని, నీ అతి ప్రేమనే దీపాను కాపాడుకుంటూ వస్తుందని, దీపా చేసే తప్పులను చూడలేక పోతున్నావని కార్తీక్ బాబుతో అంటుంది. అయితే కార్తీక్ బాబు మాత్రం జ్యోత్స్న మాటలను ఏమాత్రం పట్టించుకోడు. పైగా చూసేదంతా నిజం కాదని, నేతిలో కత్తి ఉండి నా ఒంట్లో గాయాలు, రక్తం కనిపిస్తే ఎవ్వరైనా నువ్వే దాడి చేశావని అనుకుంటారు కదా.. అదే పరిస్థితి దీపా విషయంలో జరిగిందని బదులిస్తాడు. కానీ దీపాను నిర్దోషిగా రుజువు చేస్తానని అంటాడు. అంతే సవాల్ గా జ్యోత్స్న బదులిస్తుంది. దీపాను జైలుకు పంపించడం ఖాయమని, దీపా బయటికి రాకుండా చూసుకుంటానని ఛాలెంజ్ చేసి వెళ్లిపోతుంది.

ఇక శౌర్య పాప ఇంటి నుంచి బయటికి వెళ్లి రోడ్లపై కాశీ మామ ఇంటి కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే దారి తప్పుతుంది. అందరినీ అడుగుతూ ఉంటుంది. ఎవరూ తను తెలియదని చెబుతూ ఉంటారు. ఇలా రోడ్లపై తిరుగుతూ ఉన్న శౌర్యను జ్యో కారులో వెళ్తూ చూస్తుంది. వెంటనే కారు ఆపి శౌర్యతో మాట్లాడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. కాశీ మామ వాళ్ల ఇంటికని శౌర్య బదులిస్తుంది. ఎందుకనగా.. మా అమ్మ కోసం అంటుంది. దీపా అక్కడుందని నీకు ఎవ్వరు చెప్పారు అని అడగ్గా.. నువ్వే చెప్పావని, మన నాన్న కార్తీక్ బాబుతో నువ్వే చెప్పడం విన్నానని అంటుంది. ఇక వెంటనే తన తల్లి దీపాను ఒక్కసారి చూపించూ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. చాలాసార్లు తన తల్లిని చూపించు అని అడుగుతుంది.

దీంతో జ్యోత్స్న శౌర్యను పోలీస్ స్టేషన్ కు దగ్గరల్లో దింపేస్తుంది. అయితే అప్పటికే దీపాను కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయం వచ్చిందని ఎస్సై చెబుతాడు. దాంతో దీపాను సెల్ నుంచి బయటికి తీసుకొస్తారు. ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు దీపాను కారులో ఎక్కించేబోతుంటారు. ఈలోపే అమ్మా.. అమ్మా.. అనుకుంటూ శౌర్య దీపా దగ్గరకు వస్తుంది. శౌర్యను చూసిన దీపా గుండెలకు హత్తుకొని ముద్దాడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదే సమయంలో కార్తీక్ బాబు కూడా పోలీస్ స్టేషన్ వరకు వస్తాడు. అసలు నువ్వు పోలీస్ స్టేషన్ వరకు ఎలా వచ్చావని అడగ్గా జ్యో తీసుకొచ్చిందని, జ్యోనే నువ్వు ఇక్కడ ఉన్నావని నాన్నతో చెప్పడం విన్నానని బదులిస్తుంది. దాంతో జ్యో చేసిన పనికి కార్తీక్ బాబు, దీపా షాక్ అవుతారు. ఇక శౌర్య ఎంత చెప్పినా దీపాను వదిలిపెట్టదు. తనకు దీపాతోనే వస్తానని అంటుంది. వస్తేనే ఇంటికి వెళ్తానని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు కోర్టుకు టైమ్ అవుతుండటంతో ఎస్సై ఆదేశాలతో దీపాను కోర్టుకు తీసుకెళ్తారు.

మరోవైపు శివనారాయణ, పారుజాతం, సుమిత్రలు కూడా కోర్టుకు వస్తారు. దీపాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు పోలీసుల ఆదేశాల మేరకు అందరూ కలిసి కోర్టు వరకు వెళ్తుంటారు. ఇక అప్పటికే కార్తీక్ బాబు కోర్టు వద్దకు చేరుకుంటాడు. కార్తీక్ బాబుతో పాటు కోర్టు ఆవరణలో శ్రీధర్ రెండో భార్య కావేరి కూడా ఉంటుంది. అసలు జ్యోత్స్న ఆ రోజు హోటల్ లో మాట్లాడింది నాకు చెప్పి ఉంటే బాగుండేదని కార్తీక్ బాబు అంటాడు. ఇక అసలు దీపా చెప్పిన బట్టి చూస్తే.. జ్యోత్స్న చేస్తున్న దానికి ఇంకేదో జరిగి ఉంటుందని కార్తీక్ బాబు ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా దీపాను పోలీసులు కోర్టుకు తీసుకొస్తారు. మరోవైపు శివనారాయణ కూడా కారులో వస్తూ ఉంటాడు. ఇక కోర్టులో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X