Karthika deepam 2 April 23rd : దీపాకు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాధారాలు.. దిక్కుతోచని స్థితిలో కార్తీక్ బాబు
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 22వ తేదీ 338వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దశరథంను గన్ తో కాల్చిందనే నేరారోపణతో దీపా పోలీస్ కస్టడీలో ఉంది. ఓవైపు దీపా ఆ గన్ తను పేల్చ లేదని చెబుతూ ఉంది. మరోవైపు శివనారాయణ, సుమిత్ర, జ్యోత్స్న దీపాపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. ఇక ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడిని దశరథం కూడా కళ్లు తెరుస్తాడు. కానీ అతను కూడా దీపానే తనను గన్ తో కాల్చిందని పోలీసులకు వాగ్మూలం ఇస్తాడు. దాంతో దీపాపై నేరారోపణకు బలమైన సాక్ష్యాధారాలు లభించినట్లైంది. మరోవైపు జ్యోత్స్న కూడా దీపాను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా మరింత సెక్షన్ల కింద కేసులు బనాయించి, సాక్ష్యాలు, ఆధారాలను కూడా రెడీ చేసి కోర్టుకు అందించేందుకు సిద్ధంగా ఉంది.
ఇక దీపా సైడ్ నుంచి కేవలం కళ్యాణ్ ప్రసాద్ అనే లాయర్ తప్ప మరెవరూ లేరు. నేరం తను చేయలేదు అనేందుకు ఎలాంటి ఆధారాలు చూపించడానికి, సాక్ష్యం చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో దీపాను కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు పోలీసులు తీసుకెళ్లారు. మరోవైపు దీపాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వద్దకు బయల్దేరారు. కార్తీక్ బాబు అందరి కంటే ముందుగానే కోర్టు ఆవరణంలో వేచి ఉంటాడు. కార్తీక్ బాబుకు తోడుగా శ్రీధర్ రెండో భార్య కావేరి ఉంటుంది. ఇంకా దీపా తరుపు లాయర్ కోర్టులో ఎలా వాదిస్తారు? కార్తీక్ బాబు దీపాను రక్షించేందుకు ఏదైనా ఉపాయం చేస్తాడా? జ్యోత్స్న దీపాను పక్కాగా దోషిగా రుజువు చేయిస్తుందా? అనే విషయాలకు సమాధానాలు తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక ఇక ఏప్రిల్ 23వ తేదీ 339 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపాను పోలీసులు కోర్టుకు తీసుకొని వస్తారు. ఇక దీపాను చూసిన కార్తీక్ బాబు, శ్రీధర్ రెండో భార్య కావేరి భాపడుతారు. కావేరి మాట్లాడుతూ నా వల్లనే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని దీపాతో అంటుంది. ఆ రోజు హోటల్ లో చూసింది నీకు చెప్పకపోతే బాగుండేదని అంటుంది. అది అంతా నా తలరాత దానికి మీరేం చేస్తారని బాధపడుతుంది. దాంతో కార్తీక్ బాబు స్పందిస్తూ ఎవరో రాస్తున్న రాతలను నీ తలరాత అనుకోకు అని, వాటిని మార్చేస్తానని కార్తీక్ బాబు దీపాకు ధైర్యం చెబుతాడు. ఈ లోగా శివనారాయణ, సుమిత్ర, పారుజాతం కూడా కోర్టు వద్దకు వస్తారు. వచ్చి రాగానే దీపా, కార్తీక్ బాబు, కావేరి కనిపించడంతో ఇంకా రంగిపోతారు.
శ్రీధర్ రెండో భార్య కావేరి సుమిత్రను పలకరిస్తుంది. దశరథం అన్నయ్యకు ఎలా ఉందని అడుగుతుంది. దాంతో పారుజాతం కోపం చేస్తుంది. ఆ విషయం నీ పక్కన ఉన్న మనిషి దీపాను అడుగు అంటుంది. కావేరి స్పందిస్తూ ఇదంతా చేసింది దీపా కాదు జ్యోత్స్న అని వివరించే ప్రయత్నం చేస్తుంది. దాంతో వెంటనే శివనారాయణ రగిలిపోతాడు. కావేరిపై విరుచుకు పడతాడు. నా మనవరాలి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని అంటాడు. ఆ వెంటనే పారుజాతం కార్తీక్ బాబును ఇంట్లో వాళ్లు పరాయి వాళ్లు అయ్యారు.. పరాయి వాళ్లు ఇంట్లో వాళ్లు అయ్యారని దీపా, కావేరిని చూసి అంటుంది. దాంతో కార్తీక్ బాబు పారుజాతంపై అరుస్తాడు. అందుకు సుమిత్ర మాట్లాడుతూ అత్త పారు చెప్పిన దాంట్లో తప్పేముంది రా అని కార్తీక్ బాబుతో అంటుంది.
దాంతో దీపా స్పందిస్తూ కార్తీక్ బాబును ఏమనకండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ సుమిత్ర దీపా మాటలకు ఇంకా రగిలిపోతుంది. కార్తీక్ కు బదులు నిన్ను అనాలంటే నీ మొహం చూడాలి. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నీ మొహం చూస్తే నా భర్త ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న దృశ్యం గుర్తుకు వస్తోంది. ప్రాణాలు కాపాడిన దానివని గౌరవిస్తే నా పసుపు కుంకుమలే తుడవాలని చూశావు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అందుకు కార్తీక్ బాబు బదులివ్వబోతుంటే.. శివనారాయణ స్పందిస్తాడు. రేయ్ నువ్వు నా ప్రేమ, శాంతం, కోపం, ఆవేశం మాత్రమే చూసి ఉంటాడు. కానీ పగను చూసి ఉండవు. నేను పగబడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా.
ఒక్కటి గుర్తు పెట్టుకో దీపా మాత్రం అస్సలు బయటికి రాదు. రానివ్వకుండా చూసుకుంటాను. ఇది మాత్రం తథ్యం.. అని కార్తీక్ బాబును హెచ్చరించి అందరూ కోర్టు లోపలికి వెళ్లిపోతారు. ఆ వెంటనే జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్నను చూడగానే కార్తీక్ బాబు మండిపోతాడు. అసలు శౌర్యకు దీపా పోలీస్ స్టేషన్ లో ఉందనే విషయాన్ని ఎందుకు చెప్పావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో జ్యోత్స్న స్పందిస్తూ నేనేం చెప్పలేదు. నీతో ఇంటి దగ్గర మాట్లాడుతున్నప్పుడే శౌర్య వినింది. తన తల్లికి ఏదో ప్రమాదం ఉందని అర్థం చేసుకొని వెతకడం కోసం రోడ్ల వెంట తిరుగుతుంది. అలా నాకు కనిపించడంతో ఆగి మాట్లాడాను. మన మాటలన్నీ తను చెప్పడంతోపాటు దీపాను చూపించు అని అడిగింది. అందుకే చూపించాను. లేదంటే ఈ పాటికి రోడ్ల వెంట ఎక్కడో తిరుగుతుండేది.. శౌర్య కోసం నువ్వు తిరుగుతూ ఉండేవాడివి అని అంటుంది.
ఇక నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోవని, నెగెటివ్ గా ఆలోచించడం నీకు అలవాటై పోయిందని జ్యోత్స్న కార్తీక్ బాబుపై మండిపడుతుంది. ఇక కోర్టులోపల దీపాకు ఎలాంటి శిక్ష పడుతుందో చూద్దాం రా అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. కార్తీక్ బాబు కూడా కోర్టులోపల ఎలాంటి తీర్పు వస్తుందోనని కంగారు పడుతూ లోపలికి వెళ్తాడు. ఇక జడ్జీ ముందు దీపాను పోలీసులు హాజరుపరుస్తారు. దీంతో ముందుగా దీపా లాయర్ కళ్యాణ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇది కేవలం హత్య చేసిందనే అభియోగమే అని చెబుతాడు. మరోవైపు శివనారాయణ లాయర్ భగవాన్ స్పందిస్తూ అది అభియోగం కాదు అటెంప్ట్ టు మర్డర్ అని వాదిస్తాడు. ఈ క్రమంలో కళ్యాణ్ ప్రసాద్ సుమిత్రను విచారించి దీపాకు నీకు సంబంధం ఏంటీ? నీ భర్తను ఎందుకు చంపాలనుకుంది అనే ప్రశ్నలు వేస్తాడు. ఆమె ఇచ్చిన సమాధానంతో దీపా కావాలని చేయలేదని జడ్జీకి రుజువు చేస్తాడు. కానీ భగవాన్ దాస్ అసలు కథ ఇది కాదని, దీపా జ్యోత్స్నను చంపాలనుకుందని, అది కార్తీక్ బాబు కోసమని భగవాన్ దాస్ కోర్టుకు వివరిస్తాడు. కార్తీక్ బాబు కోసమే ఇలా ఆవేశానికి లోనవుతూ అరాచకాలు చేస్తుందని అంటాడు... ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చేసిందని వాదిస్తాడు. దాంతో దీపా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











