Karthika deepam 2 April 24th : దీపాకు కోర్టులో చుక్కెదురు.. వంటలక్కను దోషిగా తేల్చేలా సాక్ష్యాధారాలు

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 23వ తేదీ 339వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న దీపాను పోలీసులు కోర్టు తీసుకొస్తారు. మరోవైపు దీపాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు శివనారాయణ, సుమిత్ర, పారుజాతం, జ్యోత్స్న కూడా కోర్టు సెషన్ కు హాజరవుతారు. దీపా తరుపున కార్తీక్ బాబు, శ్రీధర్ రెండో భార్య కావేరి కూడా హాజరవుతుంది. ఇక న్యాయమూర్తి జరిగిన విషయాన్ని ఇరువురు లాయర్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తొలుత దీపా తరుపు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ ఆమెను ఉద్దేశ పూర్వకంగా ఈ హత్యాయత్నం కేసులో ఇరికించారని వాదిస్తాడు.

మరోవైపు జ్యోత్స్న తరుపున లాయర్ భగవాన్ ఉద్దేశ పూర్వంగా పెట్టిన కేసు కాదని కోర్టుకు విన్నవిస్తాడు. అసలు దీపా వారి కుటుంబ సభ్యురాలే కాదని, తనకు కార్తీక్ బాబు కావాలనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్ గా కొన్నాళ్లుగా ఆ కుటుంబంపై పగ సాధిస్తోందని చెబుతాడు. కార్తీక్ తో జీవితం పంచుకోవడం కోసమే జ్యోత్స్నను అడ్డు తప్పించాలని అనుకుంది. అందుకోసమే జ్యోత్స్న తో ఎన్నో మార్లు కార్తీక్ బాబు విషయంలో గొడపడిందని చెబుతాడు. అదే విషయాన్ని జ్యోత్స్న కూడా న్యాయ మూర్తి ముందు చెబుతుంది. అది అబద్ధమని దీపా చెబుతుంది. పక్కా ప్లాన్ తోనే జ్యోత్స్నను చంపబోయి దశరథంను కాల్చిందని లాయర్ భగవాన్ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 24వ తేదీ 340 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 340 April 24th 2025

కోర్టులో దీపాను దోషిగా తేల్చేందుకు లాయర్ భగవాన్ సాక్ష్యాధారాలను చూపెడుతున్నారు. దీపా కావాలనే ప్రీ ప్లాన్డ్ గా ఈ హత్యాయత్నానికి పూనుకుందని కోర్టులో చెబుతాడు. దాంతో దీపా అలాంటిదేమీ లేదని అంటుంది. కానీ భగవాన్ నువ్వు కావాలనే చేశావని కార్తీక్ బాబుతో కావాలనే తాళి కట్టించుకున్నావని అంటాడు. దాంతో డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ స్పందిస్తూ దీపా కార్తీక్ బాబును పెళ్లి చేసుకోలేదని, అది ఒక యాక్సిడెంటల్ మ్యారేజ్ అని వివరిస్తాడు. అది నిజం కాదని లాయర్ భగవాన్ వాదిస్తాడు. దీపాకు కార్తీక్ బాబుకు ముందుగానే పరిచయం ఉందని చెబుతాడు. ముత్యాలమ్మ గ్రామంలోనే వీరిద్దరూ కలిశారని చెబుతాడు. అప్పటి నుంచి కార్తీక్ బాబును వలలో వేసుకోవాలని దీపా ప్రయత్నం చేసిందని లాయర్ భగవాన్ వాదిస్తాడు.

జ్యోత్స్నకు కార్తీక్ బాబుతో పెళ్లి చేయిస్తానని చెప్పి మరీ మోసం చేసింది. ముఖ్యంగా దీపాకు కార్తీక్ బాబుతో కావాలనే తాళి కట్టించుకుంది అని భగవాన్ దాస్ కోర్టుకు వివరిస్తాడు. అది అవాస్తవమని దీపా మెడలో తాళి కట్టింది కార్తీక్ బాబే అని, కావాలనే కోర్టు వారిని అతనినే అడిగి తెలుసుకోండి అని లాయ్ కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. కార్తీక్ బాబు తాళి కట్టలేదని, కట్టేలా దీపా చేసిందని లాయర్ భగవాన్ వాదిస్తారు. అందుకోసమే జ్యోత్స్నను చంపాలని ప్రయత్నించిందని వివరిస్తాడు. జ్యోత్స్నతో చిన్నప్పటి నుంచి కార్తీక్ బాబునే భర్తగా ఊహించుకుని పెరిగిందని, కానీ దీపా కార్తీక్ బాబును జ్యోత్స్నకు దూరం చేసేలా ప్లాన్ వేసి మరీ ఇంతటి దారుణానికి ఒడికట్టిందని వాదిస్తాడు. జ్యోత్స్న పలు మార్లు కార్తీక్ బాబు విషయమై దీపాతో మాట్లాడినా ఖతారు చేయలేదని కోర్టుకు వివరిస్తాడు.

మరోవైపు దీపా స్పందిస్తూ కార్తీక్ బాబు గురించి జ్యోత్స్న ఎప్పుడూ నాతో మాట్లాడలేదని బదులిస్తుంది. దాంతో లాయర్ భగవాన్ దాస్ మరో చిక్కు ప్రశ్న వేస్తాడు. కార్తీక్ బాబు కోసం నువ్వు జ్యోత్స్నను చంపాలనుకోకపోతే మరీ ఆ ఇంటికి వెళ్లి జ్యోత్స్నపై కర్ర తీసుకొని ఎందుకు దాడి చేశావు. జ్యోత్స్నను చంపడం కోసమే కదా వెళ్లిందంటాడు. దాంతో దీపా మాట్లాడుతూ.. నేను ఆ ఇంటికి వెళ్లింది అసలు జ్యోత్స్నను చంపడానికి కాదు. పెళ్లి పేరుతో అందరినీ మోసం చేస్తున్న జ్యోత్స్న గురించి తెలియజేయడానికి, ఆ విషయాన్ని తన నోటనే చెప్పించడానికి వెళ్లాను అని బదులిస్తుంది. దాంతో లాయర్ నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? అని అడుగుతాడు. దీపా మౌనంగా ఉంటుంది. ఇక లాయర్ భగవాన్ రెచ్చిపోతాడు. దీపా కావాలనే ప్రీ ప్లాన్డ్ గా ఈ హత్యాహత్నానికి పాల్పడిందని కోర్టుకు వివరిస్తాడు. అంతే కాకుండా పోలీస్ స్టేషన్ లోనే దీపా జ్యోత్స్న గొంతు పట్టుకుందని, కావాలంటే ఎస్సైని అడగండి అని లాయర్ తెలియజేస్తాడు.

కానీ వెంటనే డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ స్పందిస్తూ.. జ్యోత్స్నపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అసలు దీపా తప్పేమీ లేదని, తనను దోషిగా నిల్చోబెట్టేందుకు జ్యోత్స్ననే అంతా నాటకం ఆడిందని కోర్టుకు తెలియ జేస్తాడు. ఆవేశంగా వెళ్లిన దీపా జ్యోత్స్నను చంపాలని అనుకోలేదు. అలా ప్లాన్ చేసింది జ్యోత్స్ననే అని వాదిస్తాడు. దీపా నిన్ను చంపాలని వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్న మీ అమ్మా నాన్నలకు విషయం చెప్పావా? అని డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ ప్రశ్నిస్తాడు. అందుకు జ్యోత్స్న ఎలాంటి సమాధానం ఇవ్వదు. ఇక ఆ వెంటనే అసలు దీపా చేతిలోకి గన్ ఎలా వచ్చిందని జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు. దాంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. అసలు విషయానికి కథ తిరగడంతో ఆందోళన పడుతుంది. అయినా ధైర్యంగా బదులిస్తుంది.

దీపా కర్రతో నాపై దాడికి దిగడంతో నన్ను నేను రక్షించుకునేందుకు గన్ తీశాను అని బదులిస్తుంది. ఆ టైమ్ లో ఏం చేయాలో తెలియకా, భయంతో గన్ తీశానని చెబుతుంది. అది భయంతో చేసింది కాదని, కావాలనే చేశావని అంటాడు. కానీ భగవాన్ స్పందిస్తూ దీపానే గన్ పేల్చిందనేందుకు అన్ని సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచానని అంటాడు. అయితే పూర్తి రిపోర్ట్ వచ్చే వరకు ఈ కేసును వాయిదా వేయాలని కళ్యాణ్ ప్రసాద్ కోరారు. దాంతో న్యాయమూర్తి స్పందిస్తూ సరైనా ఆధారాలు లేకపోవడంతో కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు చెబుతుంది. అప్పటి వరకు దీపా రిమాండ్ లో ఉండాలని ఆదేశిస్తుంది. ఆరేళ్ల కూతురు ఉన్నదని చెప్పినా ఒప్పుకోరు. విచారణ జరగాల్సి ఉందని న్యాయమూర్తి బదులిస్తుంది. ఇక కార్తీక్ బాబు తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. శౌర్య తల్లి దీపా కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు వస్తుందని అడుగుతుంది. త్వరలో వస్తుందని బదులిస్తాడు. తల్లి కాంచనకు కూడా కోర్టులో జరిగింది చెబుతాడు. ఆ తర్వాత ఎలాగైనా దీపాను బయటికి తీసుకొస్తానని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X