Karthika deepam 2 April 25th : మళ్లీ జైలుకు వెళ్లిన దీపా.. కార్తీక్ బాబుకు జ్యోత్స్నతో కొత్త సమస్య
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 24వ తేదీ 340వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కోర్టులో దీపాను పోలీసులు హాజరు పరుచుతారు. శివనారాయణ, సుమిత్ర, పారుజాతం, జ్యోత్స్నలు ఒకవైపు.. కార్తీక్ బాబు, పిన్ని కావేరి ఒకవైపు ఉంటారు. ఇక దీపాను న్యాయమూర్తి విచారణ కోసం పిలుస్తుంది. ఈ సందర్భంగా డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ దీపా నిర్దోషి అని నిరూపించేందుకు తన వెర్షన్ ను వినిపిస్తాడు. మరోవైపు దీపా ఉద్దేశ పూర్వకంగానే హత్యాయత్నానికి పూనుకుందని శివనారాయణ తరుపు లాయర్ భగవాన్ వాదిస్తాడు. ఇలా కోర్టులో రసవత్తంగా వాదనలు కొనసాగుతాయి.
వాదోపవాదాలను విన్నాక అసలైన ఆధారాలు లేకపోవడంతో దీపాను దోషిగానూ, నిర్దోషిగానూ తేల్చ లేకపోతుంది కోర్టు. దీంతో నెక్ట్స్ సెషన్ కు వాయిదా వేస్తుంది. దశరథం ఒంట్లో దిగిన బుల్లెట్ దీపా గన్ లో నుంచే వచ్చిందా? లేదా? అనే రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి చెబుతారు. కానీ అప్పటి వరకు దీపా జైలులోనే ఉండాలని, పోలీసుల రిమాండ్ లోనే ఉంటుందని ఆదేశిస్తుంది కోర్టు. ఇక దీంతో ఎవరి దారిన వారు వెళ్లిపోతాడు. మరోవైపు కార్తీక్ బాబు దీపాను ఎలాగైనా నిర్దోషిగా రుజువు చేసేందుకు సరైనా సాక్ష్యాధారాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 25వ తేదీ 341 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కోర్టులో కేసు వాయిదా పడటంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు దీపాను తిరిగి మళ్లీ జైలుకు తీసుకెళ్తారు. విచారణ నిమిత్తం రిమాండ్ లో ఉంచాలని చెబుతాడు. ఇక తిరిగి మళ్లీ జైలు గోడల్లోకి రావడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు దశరథం కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతాడు. దశరథంను తీసుకొని ఇంటికి తీసుకొస్తారు. దిష్టి తీసి హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు. అందరూ హాల్ లో కూర్చుంటారు. ఇక దశరథం చాలా ఎమోషనల్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఏమైందని సుమిత్ర అడగడంతో మళ్లీ మీ అందరినీ చూస్తానని అనుకోలేదు అంటాడు. దాంతో అందరూ భాగోద్వేగానికి గురవుతారు. ఇక దశరథ మాట్లాడుతూ చెల్లి కాంచనకు నేను కోలుకున్న విషయం తెలిసిందా? అని అడుగుతాడు.
దాంతో శివనారాయణ మండిపడతాడు. దానికి అన్నయ్య దశరథ ఎలా ఉన్నాడో అవసరం లేదురా... ఏదో ఫార్మాలిటీకి రెండు మూడు సార్లు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగింది అని శివనారాయణ అంటాడు. ఇక వెంటనే పారుజాతం మాట్లాడుతూ అది కూడా కేవలం తన కోడలు దీపా కోసమే అడిగిందని, దశరథకు ఏమైనా అయితే దీపా జైలులోనే ఉండిపోతుందనే భయంతోనే చేసి ఉంటుందని అంటుంది. మరోవైపు సుమిత్ర కూడా స్పందిస్తూ ఇప్పుడు కాంచనకు మన అవసరం లేదని సుమిత్ర భర్త దశరథంతో చెబుతుంది. వెంటనే జ్యోత్స్న స్పందిస్తూ నాన్న కోలుకున్నంత మాత్రాన దీపాను అస్సలు వదిలే ప్రసక్తి లేదని అంటుంది.
మనం ఎంత బాధను అనుభవిస్తున్నామో.. దీపా కూడా అనుభవించాలని, జీవితాంతం జైలులోనే ఉంచాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక శివనారాయణ కూడా స్పందిస్తూ అవునని అంటాడు. ఈ విషయంలో ఎవరూ ఎన్ని రకాలుగా బతిమిలాడిన అస్సలు కరిగిపోవద్దని కొడుకు దశరథంకు శివనారాయాణ సూచిస్తాడు. దీపాకు జైలు శిక్ష పడేందుకు అవసరమైతే దశరథనే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాడని అంటాడు. ఈ విషయంలో కచ్చితంగా ఉండాలని, కనీసం దీపాకు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడాలని అంటాడు శివనారాయణ. ఇక దశరథకు ఛాతీలో నొప్పి రావడంతో అందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి విశ్రాంతి తీసుకోమని చెబుతారు.
మరోవైపు కార్తీక్ బాబుతో లాయర్ కళ్యాణ్ ప్రసాద్ సమావేశం అవుతాడు. కేసు సంబంధించిన కీలకమైన అంశాలపై మాట్లాడుతాడు. దీపా చేతిలో గన్ పేలలేదని గట్టిగా చెబుతోంది. అంటే మరెక్కడి నుంచే గన్ పేలి ఉండాలని లాయర్ కళ్యాణ్ ప్రసాద్ సందేహిస్తాడు. అక్కడ మీ కుటుంబ సభ్యులు కాకుండా మూడో వ్యక్తి ఎవరో ఉన్నారని అంటాడు. కానీ అతను ఎవరనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. అంతే కంటే ముందే దశరథం ఒంట్లోకి దిగిన బుల్లెట్ దీపా గన్ లో నుంచి పేలలేదని రిపోర్ట్ రావాలని, ఒకవేళ ఆ బుల్లెట్ దీపా గన్ లో నుంచే వచ్చిందని రిపోర్ట్ వస్తే ఇంకా దీపాను కాపాడ లేమని వివరిస్తాడు. రిపోర్ట్ వచ్చే వరకు మనం ఆగాల్సిందేనని అంటాడు.
ఇక దీపాను దోషిగా రుజువు చేసేందుకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ను సంపాదించే పనిలో జ్యోత్స్న బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఎస్సైతో రహస్యంగా కలుస్తుంది. దీపా జైలులోనే ఉండాలంటే నాకో సాయం చేయాలని అడుగుతుంది. ఎస్సైకి డబ్బు ఆశగా, అతని కూతురుకు స్కూల్ అడ్మిషన్ ఇప్పించి తన దారిలోకి తెచ్చుకుంటుంది. దాంతో ఎస్సైతో మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఏం చెప్పిందనేది సస్పెన్స్ గా మారింది. ఇక మరోవైపు దీపు జైలులో కావేరి, శ్రీధర్ కలుస్తారు. కావేరీ దీపాను పరామర్శించి ధైర్యం చెబుతుంటే.. శ్రీధర్ మాత్రం దెప్పిపొడుస్తాడు. దీపా జైలు నుంచి బయటికి రావడం కష్టమని అంటాడు. అన్న సాక్ష్యాధారాలను సంపాదిస్తున్నారని దీపా బయటికి రావడం అంటూ జరగదని తన మాటాలతో భయపెడుతాడు.
సాక్ష్యాధారాలను సంపాదిస్తుండటంతో పాటు అవసరమైతే కోర్టులో దశరథతో సాక్ష్యం చెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెబుతాడు శ్రీధర్. శివనారాయణ తన కొడుకుకు ఇంత జరిగాక కూడా ఊరుకునే వాడు కాదని అంటాడు. దీపా ఎప్పటికీ జైలులోనే ఉండటం ఖాయమని భయాందోళన కలిగిస్తాడు. ఇక కార్తీక్ బాబును రెండో పెళ్లి చేసుకోమని దీపానే చెప్పాలని, అలాగైనా నా కొడుకు కార్తీక్ బాబు సంతోషంగా ఉండేలా చూడాలని, ఆ పని దీపానే చేయాలని సూచిస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్నతో పెళ్లి జరిగి కార్తీక్ బాబు సంతోషంగా ఉంటాడని శ్రీధర్ తన మనస్సులోని మాట చెబుతాడు. ఇక అలా ఏం జరగదని, ధైర్యంగా ఉండమని దీపాకు కావేరి ధైర్యం చెబుతుంది. శ్రీధర్ మాటలు విన్నాక దీపా ఆలోచనలో పడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతుంది.


Click it and Unblock the Notifications











