Karthika deepam 2 April 26th : జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. దారుణ పరిస్థితిలో దీపా
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 25వ తేదీ 341వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాను మళ్లీ పోలీసులు జైలుకు పంపిస్తారు. కోర్టు సెషన్ తర్వాత వంటలక్కను ఇంకా రిమాండ్ లోనే ఉంచుతారు. కేసు వాయిదా పడటంతో ఇరువైపులా సరైన సాక్ష్యాధారాలను సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కార్తీక్ బాబు డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ తో సమావేశం అవుతాడు. దీపా దశరథంను కాల్చకోపోతే మరీ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై చర్చిస్తారు. ఇక రిపోర్ట్ లో బుల్లెట్ దీపా గన్ లోంచి రాలేదని తేలితే దీపాను కాపాడగలమని, లేదంటే కేసు జ్యోత్స్న, శివనారాయణలకు ఫేవర్ గా వెళ్లిపోతుందని కళ్యాణ్ ప్రసాద్ కార్తీక్ బాబుకు వివరిస్తారు.
మరోవైపు దశరథం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే చెల్లి కాంచన గురించి అడుగుతాడు. దాంతో శివనారాయణ మండిపోతాడు. నీకు చెల్లిపై ఉన్నంత ప్రేమ ఆ చెల్లికి నీపై లేదని చెబుతాడు. ఏదేమైనా దీపాను మాత్రం వదిలే ప్రసక్తే లేదని, అవసరమైతే దశరథనే వచ్చి కోర్టులో సాక్ష్యం చెబుతాడని అంటాడు. అలాగే జ్యోత్స్న కూడా దీపాను బయటికి రాకుండా చేస్తానని అంటుంది. వెంటనే ఎస్సైని కలిసి తనకు ఫేవర్ గా ఉండాలని చెబుతుంది. అతని డబ్బు, అతని పాపకు స్కూల్ అడ్మిషన్ ఆశ చూపి తనవైపు తిప్పుకుంటుంది. ఈ క్రమంలో కోర్టులో నెక్ట్స్ హియరింగ్ ఎలా సాగుతుంది, దశరథం ఛాతిలో దిగిన బల్లెట్ ఎక్కడిదనే దానిపై రిపోర్ట్ ఎలా ఉందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 26వ తేదీ 342 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపాను జైలు నుంచి తీసుకొస్తానని చెప్పిన కార్తీక్ బాబు డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ తో మీటింగ్ తర్వాత తిరిగి ఇంటి వస్తాడు. అప్పటికే నాన్న ఎప్పుడూ వస్తాడని శౌర్య నాన్నమ్మ కాంచనను అడుగుతుంది. మరోవైపు ఇంట్లో దేవుడికి ప్రత్యేక దీపారాధన చేస్తుంటారు. ఈలోగా కార్తీక్ బాబు ఇంటికి రాగానే శౌర్య కార్తీక్ బాబు షర్ట్ కు ఉన్న రక్తపు మరకలను చూసి ఏమైందీ నాన్న అని అడుగుతుంది. దారి మధ్యలో ఎవరికో యాక్సిడెంట్ అయితే ఆస్ప్రతిలో జాయిన్ చేసి రక్తదానం చేశానని చెబుతాడు. ఆ తర్వాత కార్తీక్ బాబు ఫ్రెష్ అయ్యి వస్తాడు. అందరూ కలిసి దేవుడికి పూజలు చేస్తారు.
ఇక అందరూ కలిసి నేల మీదనే భోజనం చేసి దీపా త్వరగా ఇంటికి రావాలని దేవుడిని బలంగా కోరుకుంటారు. తింటూ ఉండగా శౌర్యకు తల్లి దీపా గుర్తుకు వస్తుంది. నాన్న అక్కడ అమ్మ తిని ఉంటుంది అంటావా? అని నాన్న కార్తీక్ బాబును శౌర్య అడుగుతుంది. ఇక అక్కడ జైలు లో కూడా శౌర్యకు లేడీ కానిస్టేబుల్స్ భోజనం తీసుకొచ్చి ఇస్తారు. ఆ ప్లేట్ లో అన్నం చూడగానే దీపాకు శౌర్యనే గుర్తుకు వస్తుంది. గతంలో కూతురు శౌర్య చేతులతో అన్నం తిన్న గుర్తులను తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. తన కూతురు శౌర్య కోసం తప్పక తింటూ ఉంటుంది. మరోవైపు తన కూతురు శౌర్య ఎలా ఉంటుందో, ఎలా తింటుందోనని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఐనా కార్తీక్ బాబు శౌర్యకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడని అనుకుంటుంది. కానీ శ్రీధర్ చెప్పినట్టుగా తనకు శిక్ష పడి జైలులోనే ఉంటే శౌర్య పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. శ్రీధర్ జైలుకు వచ్చి చెప్పిన అన్నీ మాటలను గుర్తుకు చేసుకుంటుంది. ఇక మరోవైపు దీపాతో అడ్డగోలుగా మాట్లాడిన శ్రీధర్ పై భార్య కావేరి మండిపడుతుంది. అసలే కష్టాల్లో ఉన్న దీపాతో అలా మాట్లాడటం ఏమాత్రం సరికాదని, వెంటనే దీపాతో పాటు మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. అప్పటి వరకు ఉపవాస దీక్ష విరమించుకోనని హెచ్చరిస్తుంది.
మరోవైపు కాంచన తన కొడుకు కార్తీక్ బాబుతో దీపా కేసు గురించి మాట్లాడుతుంది. దీపాను విడిపించేందుకు ఆధారాలు సరిపోతాయా ? లేదు కదా? మరి ఎలా అని కార్తీక్ బాబును అడుగుతుంది. దానికి కార్తీక్ బాబు బదులివ్వబోతుంటే.. జ్యోత్స్న ఇంటికి వస్తుంది. అవును ఆ సాక్ష్యాధారాలు అస్సలు సరిపోవని అంటుంది. తన తండ్రి దశరథం ఇప్పుడు కోలుకున్నాడని, కోర్టుకు వచ్చి మరీ సాక్ష్యం చెబుతాడని చెబుతుంది. అయినా నేను వచ్చింది మా మేనత్త కాంచన కోసమే అని అంటుంది. కనీసం డాడీని చూడటానికి కూడా రాలేదని మండి పడుతుంది. దీంతో కార్తీక్ బాబు ఇంట్లో నుంచి జ్యోత్స్నను బయటికి తీసుకొస్తాడు.
ఇంట్లో శౌర్య ఉందని, మెల్లగా మాట్లాడాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నిస్తాడు. దీపా జైలులో ఉందనే విషయం శౌర్యకు ఇంకా తెలియదా అని జ్యోత్స్న అంటుంది. అందుకు కార్తీక్ బాబు అది నీకు అనవసరం. ఇప్పటికే ఇంట్లో అమ్మ, శౌర్య చాలా బాధపడుతున్నారు. నీ మాటలతో ఇంకా వారిని శోకంలో నెట్టేయకు అని అంటాడు. దాంతో జ్యోత్స్న మండిపడుతుంది. అక్కడ మా ఇంట్లో కూడా అమ్మ నాన్న అలాంటి పరిస్థితిలోనే ఉన్నారని చెబుతుంది. ఏదేమైనా దీపా బయటికి రాదు. మా డాడీ సాక్ష్యం చెబుతాడు. దీపాకు శిక్ష పడుతుందని, నా విలువ నీకు తెలిసి వస్తుందని కార్తీక్ బాబు తో అంటుంది. నీకు తెలిసింది చేసుకో అని చెప్పి వెళ్లిపోతాడు. అయితే జ్యోత్స్న మాటలను శౌర్య మళ్లీ వింటుంది. తిరిగి వెళ్లిపోతున్న జ్యోత్స్న కారు దగ్గరకు వెళ్లి మా అమ్మ ఎక్కడుందని శౌర్య అడుగుతుంది. కానీ జ్యోత్స్న ఈసారి చెప్పదు. దాంతో తల్లి దీపాకు ఏమైందనేది ఎలా తెలుసుకోవాలని శౌర్య ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











