Karthika deepam 2 April 28th : కార్తీక్ బాబుకు షాకిచ్చిన దీపా.. జ్యోత్స్న మాటే శాసనంగా..

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 26వ తేదీ 342వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాను మళ్లీ పోలీసులు జైలుకు పంపిస్తారు. కార్తీక్ బాబు డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ తో మీటింగ్ తర్వాత తిరిగి ఇంటి వస్తాడు. కేసు మొత్తం జ్యోత్స్న కు ఫేవర్ గా మారుతోందని కళ్యాణ్ ప్రసాద్ చెప్పారు. అదే విషయాన్ని కార్తీక్ బాబు తిరిగి ఇంటికి వచ్చి చెబుతాడు. మరోవైపు దీపాను జైలు శ్రీధర్ కలిసి కేసు నీకు వ్యతిరేకంగా ఉందని, నువ్వు బయటికి వచ్చే ప్రసక్తే లేదని చెబుతాడు. దాంతో నీ కూతురు శౌర్య పరిస్థితి దారుణంగా మారుతుందని భయపెడుతాడు. నువ్వే నీ కూతురు కోసమైనా రెండో పెళ్లి చేసుకోమని చెప్పాలని అంటాడు. దీంతో దీపా తన కూతురు గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే.. దీపాను ఎలా బయటికి తీసుకు రావాలని కార్తీక్ బాబు తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని తన తల్లి కాంచనతో చెబుతూ ఉంటాడు. కానీ దీపాకు ఫేవర్ గా సాక్ష్యాధారాలు లేవని కార్తీక్ బాబు చెబుతాడు. అదే సమయంలో జ్యోత్స్న కార్తీక్ బాబు ఇంటికి వస్తుంది. వచ్చి దీపా నిజంగానే బయటికి రాదని చెబుతుంది. దాంతో జ్యోత్స్న మాటలను శౌర్య ఎక్కడ వింటుందోనని భయపడి బయటికి తీసుకెళ్తాడు. బయటికి వచ్చిన తర్వాత జ్యోత్స్న దీపాను అస్సలు జైలు నుంచి బయటి రానివ్వనని హెచ్చరిస్తుంది. ఆ విషయాన్ని శౌర్య వింటుంది. వెంటనే వెళ్లి జ్యోత్స్ను తన తల్లి దీపా గురించి అడుగుతుంది. కానీ ఈసారి మాత్రం శౌర్యకు దీపాను చూపించకుండా వెళ్లిపోతుంది. ఇక ఎలాగైనా శౌర్య దీపాను కలవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఏప్రిల్ 28వ తేదీ 343 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 343 April 28th 2025

తన తల్లి దీపా జైలులో ఉందని ఇక తిరిగి రాదని తెలుసుకున్న శౌర్య వెంటనే తన తల్లితో మాట్లాడాలని అనుకుంటుంది. జోత్స్నా ఇంటికి వచ్చి కార్తీక్ బాబుతో మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఎలాగైనా తన తల్లి దీపాను శౌర్య కలవాలని అనుకుంటుంది. తన మాటలు చెప్పాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది. జ్యోత్స్న శౌర్యాను తన తల్లి దీపావద్దకు తీసుకువెళ్ళనని చెప్పడంతో ఇక శౌర్యనే దీపావద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. దీంతో అర్ధరాత్రి ఒంటిగంటకు అందరు పడుకున్నాక బయటికి వెళుతుంది.

మధ్యలో మేలుకువ వచ్చిన కార్తీక్ బాబు శౌర్య ఇంట్లో లేదని గమనిస్తాడు. ఒకవేళ నానమ్మ కాంచన వద్ద పడుకుందేమో అని అనుకొని సైలెంట్ గా ఉంటాడు. కానీ బెడ్ పై ఉన్న పెన్ను పేపర్ చూసి అనుమానంతో శౌర్య ఇంట్లోనే ఉందా లేదా అని వెతుకుతాడు. అటు తల్లి కాంచనను శౌర్య గురించి అడగగా తమ వద్దకు రాలేదని చెబుతుంది. ఇక ఇంటి చుట్టూ ప్రాంతంలో వెతికిన శౌర్య కనిపించారు. ఇక శౌర్య చెప్పులు కూడా ఇంటి ముందు లేకపోవడంతో దీపాను వెతుక్కుంటూనే వెళ్లిందని సందే ఇస్తాడు. ఇక వెంటనే సైకిల్ తీసుకొని వెతుకుతూ పోలీస్ స్టేషన్ వైపు వెళ్తాడు. శౌర్య కూడా అటువైపే వెళుతుంది.

దారి మధ్యలో శౌర్య కనిపించడంతో కార్తీక్ బాబు అడ్డుకుంటాడు. ఇంత అర్ధరాత్రి అందరిని వదిలేసి ఇలా బయటికి రావడం సరైన పని కాదని పాప శౌర్యపై కార్తీక్ బాబు కోపం చేస్తాడు. ఇక శౌర్యాను తిరిగి ఇంటికి తీసుకెళ్తాడు. అసలు అర్ధరాత్రి ఎందుకు బయటికి వెళ్లావు అని ప్రశ్నిస్తాడు. దాంతో శౌర్య మాట్లాడుతూ అమ్మ తిరిగి రాదని తనకు తెలుసు అని, అందుకే లెటర్ ఇద్దామని వెళ్లానని చెబుతుంది. దీప ఇంటికి రాదు అనే విషయాన్ని నీకు ఎవరు చెప్పారు అనే కార్తీక్ బాబు అడుగగా జ్యోత్స్నా అని బదులిస్తుంది. దీంతో కార్తీక్ బాబు మండి పోతాడు. జోష్నాకు ఎన్నిసార్లు చెప్పినా తన కుటుంబం విషయంలో తల దూర్చుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

కావాలనే శౌర్యకు దీప గురించి అన్ని మాటలు చెప్పి బాధ పెడుతుంది అని రగిలిపోతాడు. ఈ క్రమంలోనే శౌర్య చేతిలో ఉన్న లెటర్ని తీసుకుంటాడు. ఈసారైనా లెటర్ తన తల్లి దీపాకు ఇవ్వమని శౌర్య అడుగుతుంది. ఇవ్వకుండానే ఇచ్చానని అబద్ధం చెప్పకు నాన్న అంటుంది. దాంతో ఒక్కసారిగా కార్తీక్ బాబు గుండె పగిలినంత పనవుతుంది. జోష్న చేస్తున్న పనికి ఇంకా మండిపోతాడు. అసలు దీపాను బయటికి రాకుండా జోష్నా కాకుండా ఇంకెవరు ఆపుతున్నారని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గౌతమ్ అని అనసూయ చెబుతుంది. నిశ్చితార్థంతోనే అతనితో సమస్య ముగిసిపోయింది కదా అని కార్తీక్ బాబు అంటాడు. లేదని, అతను నువ్వు లేని సమయంలో ఇంటికి వచ్చే అందరికీ వార్నింగ్ ఇచ్చాడని చెబుతుంది.

ఇక వెంటనే కార్తీక్ బాబు గౌతమ్ దగ్గరికి వెళ్లి తను లేని సమయంలో ఇంటికి వచ్చి ఆడవాళ్లను బెదిరించడం మగతనం కాదని హెచ్చరిస్తాడు. దీప చేతులో గన్ను పేలకున్న తనను దోషిగా నిలబెట్టారని, అందుకు కారణం నువ్వే అని గౌతమ్ నిందిస్తాడు. నీ అంతట నువ్వే నిజం ఒప్పుకో అని అంటాడు. కానీ గౌతం అసలు నేను ఆరోజు హైదరాబాదులోనే లేనని, నేనే కాల్చానని నీ దగ్గర ఒక్క ఆధారమైన ఉందా అని ప్రశ్నిస్తాడు. ముందు వెళ్లి నీ భార్య దీపాను ఎలా కాపాడుకోవాలో చూసుకో అంటాడు. చేసేది ఏమీ లేక కార్తీక్ బాబు వెనుదిరుగుతాడు. మరోవైపు అనసూయ జైలుకు వెళ్లి దీపాకు శౌర్య రాసిన లెటర్ ను అందజేస్తుంది. ఆ లెటర్ చదివిన దీప ఇంకా కుమిలిపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక తను జైలు నుంచి బయటికి రాలేనని బాధతో అంటుంది. ఇకపై శౌర్యాకు తండ్రితో తల్లి కూడా ఉండదని అంటుంది. ఇక తను జైలుకే పరిమితం అవుతానని కుమిలిపోతుంది. దీప మాటలకు అనసూయ ఇంకా బాధపడుతుంది. మరోవైపు కోపం కూడా చేస్తుంది. అలా మాట్లాడకు అని ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X