Karthika deepam 2 April 29th : జ్యోత్స్నపై రగిలిపోయిన కార్తీక్ బాబు.. శౌర్య విషయంలో దీపా కీలక నిర్ణయం

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 28వ తేదీ 343వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తన దీపా ఎప్పుడూ ఇంటికి తిరిగి వస్తుందా? అని ఎదురుచూస్తున్న శౌర్య.. అందరూ పడుకున్నాక అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్తుంది. అది గమనించిన కార్తీక్ బాబు శౌర్య కనిపించకపోవడంతో కంగారు పడుతాడు. వెంటనే వెళ్లి తల్లి కాంచన, అనసూయలను అడుగుతాడు. వాళ్లు కూడా తెలియదని చెప్పడంతో కచ్చితంగా దీపా దగ్గరికే వెళ్తూ ఉంటుందని పోలీస్ స్టేషన్ వైపు వెళ్తాడు కార్తీక్ బాబు. దారి మధ్యలో శౌర్య పాప కనిపిస్తుంది. వెంటనే శౌర్యను ఆపి తిరిగి ఇంటికి తీసుకొస్తాడు. ఎందుకు అలా వెళ్లావని కార్తీక్ బాబు శౌర్యను అడుగుతాడు. దాంతో శౌర్య షాకింగ్ విషయాన్ని చెబుతుంది. తల్లి దీపాను కలిసేందుకు వెళ్లానని చెబుతుంది. అమ్మ తిరిగి రాదని నాకు తెలుసు. జ్యోత్స్న మీతో మాట్లాడటం అంతా నేను విన్నాను. అమ్మ ఇక తిరిగి రాదని జ్యో అనడం నేను పూర్తిగా విన్నానని అంటుంది.

అందుకే అమ్మను వెతుక్కుంటూ వెళ్లాను. అమ్మకు నేనంటే ఇష్టం కాబట్టి ఈ లెటర్ అందించేందుకు వెళ్లాను అని చెబుతుంది. వెంటనే ఆ లెటర్ ను కార్తీక్ బాబు తీసుకుంటాడు. నేను తీసుకొస్తానని చెప్పాను కదా అని శౌర్యతో అంటాడు. దాంతో శౌర్య నువ్వు మొదటి నుంచి అబద్దాలే చెబుతున్నావు నాన్న. కనీసం ఈ లెటర్ అయినా అమ్మకు చేరవేయి. ఇందులో కూడా ఇచ్చానని అబద్ధం చెప్పకు. జ్యో తప్ప ఎవ్వరూ నిజం చెప్పడం లేదని శౌర్య అంటుంది. దాంతో కార్తీక్ బాబుకు జ్యోత్స్న పై కోపం పెరుగుతుంది. జ్యోత్స్న కావాలనే ఇంకా సమస్యను పెద్దగా చేస్తుందని మండిపడుతాడు. ఇక శౌర్య ఇచ్చిన లెటర్ ను అనసూయ దీపాకు చేరవేస్తుంది. అది చదివిన దీపా చాలా బాధపడుతుంది.

Karthika deepam 2 Serial Today s Episode 345 April 29th 2025

ఇక తను బయటికి రాలేనని కుమిలిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 29వ తేదీ 345 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీప జైలులో అనసూయతో మాట్లాడుతూ ఉంటుంది. శౌర్య పంపిన లెటర్ చదివిన తర్వాత ఇంకా కుమిలిపోతుంది. తన జైలులో నుంచి బయటికి రావడం కష్టమేనని అనసూయతో చెబుతూ ఉంటుంది. శౌర్య పాపను జాగ్రత్తగా చూసుకో అని చెబుతూ ఉంటుంది. ఇదే సమయంలో కార్తీక్ బాబు ఎంట్రీ ఇస్తాడు. అప్పటికి దీప మాటలను పూర్తిగా విన్న కార్తీక్ బాబు దీపపై కోపం చేస్తాడు. అసలు నువ్వు జైల్లో నుంచి బయటికి రావాలి నీతో చెప్పిన మనిషి ఎవరు అని, ఎవరి మాటలు నమ్మి నువ్వు ఇలా మాట్లాడుతున్నావో అని కార్తీక్ బాబు దీపా తో అంటాడు. నేను ఎవరి మాటను నమ్మి ఇలా మాట్లాడటం లేదని, నేను జైల్లో నుంచి బయటికి రావడం జరగని పని అని మళ్ళీ అదే పాట పాడుతుంది దీప. దాంతో కార్తీక్ బాబు ఇంకా కోపం చేస్తాడు.

ఇప్పుడు నువ్వు జైలు నుంచి రావని, నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని చెబుతున్నావా అని దీపాను ప్రశ్నిస్తాడు కార్తీక్. దాంతో వెంటనే అనసూయ కార్తీక్ బాబు అలా అంటున్నారు ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు దీపా చెబుతున్నా మాటల వెనుక ఉన్న సారాంశం అదే అని కార్తీక్ బాబు అంటాడు. ఇక దీప కూడా ఓపెన్ గా మాట్లాడుతుంది. నా జీవితం జైలులోనే గడిచిపోతుందని, నన్ను బయటికి రానివ్వరని కార్తీక్ బాబుతో అంటుంది. అందుకోసం కార్తీక్ బాబు మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా చెబుతుంది. కార్తీక్ బాబు మరో పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాడని, శౌర్య పాపకు కూడా తల్లి దొరుకుతుంద ని తన అభి ప్రాయం చెబుతుంది. దాంతో కార్తీక్ బాబు ఇంకా మండిపోతాడు.

నేను మరో పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయిని కూడా నువ్వే చూసి పెట్టాలని, మా ఇద్దరికీ పెళ్లి జరిగిపించి, వారి చేతిలో మరొకరి చేయిని వేసి ఒకటి చేయాలని అంటాడు. అంతేకాదు మా ఇద్దరికీ పెళ్లి చేయడంతో పాటు శౌర్య ను కూడా మాకు అప్పగించే బాధ్యత కూడా నీపై నే ఉందని చెబుతాడు. నేను సీరియస్ గా చెబుతున్నాను అని దీప చెప్పడం తో నేను కూడా చాలా సీరియస్ గా చెబుతున్నా అని కార్తీక్ బాబు అంటారు. దాంతో దీప నేను నీకు సరైన జోడి కాదని బదులిస్తుంది. మరి ఎవరు నాకు సరైన జోడి, ఆ జోష్నా సరైన జోడి అవుతుందా అని ప్రశ్నిస్తాడు. ఇలాంటి మాటలు మాట్లాడి కోపం తెప్పించకు అని గట్టిగా మాట్లాడతాడు.

నిన్ను జైలు నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది అని, అక్కడ శౌర్యకు కూడా ఇదే మాట చెప్పి వచ్చానని అంటాడు. ఇక జైలు నుంచి అనసూయమ్మ ఇంటికి పంపించి ధైర్యంగా చూసుకోమని చెబుతాడు. ఆ తర్వాత దీపా ను కోర్టుకు తీసుకువెళ్తారు. కార్తీక్ బాబు కూడా కోర్టు స్పెషల్ కు హాజరవుతాడు. అటువైపు శివ నారాయణ, పవిత్ర పారిజాతం జోత్స్న కూడా హాజరవుతారు. ముందుగా శివ నారాయణ ను డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ పలు ప్రశ్నలు అడుగుతాడు. దీపానే మీ కొడుకు దశరథంను కాల్చిందని మీరు నమ్ముతున్నారా అని అడుగుతాడు. అందుకు దశరథం అవునని బదులిస్తాడు. ఎందుకు నమ్ముతున్నారని ప్రశ్నించగా, నా మనవరాలు జోష్నాతో కార్తీక బాబు నీ బావనే, కార్తీక్ బాబుతో నీకే పెళ్లి జరిపిస్తానని చెప్పి తను పెళ్లి చేసుకుని మోసం చేసింది.

అలా మాటలే మార్చిన దీప చేతలు మార్చడం ఎంతసేపని కోర్టుకు వివరిస్తాడు. దీప చేతిలో గన్ ఉండడం, దశరథంకు బుల్లెట్ తగలడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. దానిపై మళ్లీ మళ్లీ ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు. దీప నేరస్థురాలు మేమంతా సాక్ష్యం చెబుతున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఏంటని ప్రశ్నిస్తాడు. ఓకే వెంటనే డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ మాట్లాడుతూ దీపా చేతిలో ఉన్న గన్ను లోనుంచి బుల్లెట్ రావడం మీరు చూశారా అని ప్రశ్నిస్తాడు. మళ్లీ శివ నారాయణ అది అందరి ముందు జరిగిన విషయమే కదా అని బదిలిస్తాడు. ఇలా చాలా ప్రశ్నలు వేస్తాడు. పలు సమాధానాలు రాబడతాడు.

తా త శివ నారాయణ చెబుతున్న సాక్ష్యానికి జ్యోత్స్న సంతోషపడుతుంది. మరోవైపు ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిందనీ లాయర్ భగవాన్ కోర్టుకు సమర్పిస్తాడు. గన్ పై ఉన్న వేలిముద్రలు దీపాకు సంబంధించినవే అని, బుల్లెట్ కూడా దీప గన్నులో నుంచి వచ్చిన దేనని ఆ రిపోర్టులో ఉన్నట్టుగా వివరిస్తాడు. దాంతో కోర్టు ఆ ఆధా రాన్ని నమ్ముతున్నానని దీపాకు జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిస్తుంది. జ్యోత్స్న నవ్వుతూ సంతోషం వ్యక్తం చేస్తుంది. పక్కనే ఉన్న పారిజాతం జ్యోత్స్న ను పగటి కలల నుంచి నిద్ర లేపుతుంది. ఇంకా కోర్టులో వాదనలు జరుగుతున్నాయని రియాలిటీ కి తీసుకొస్తుంది. అయ్యో ఇంతవరకు నేను ఊహలో ఉన్నానా అని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత అసలైన ఫోరెన్సిక్ రిపోర్టును కోర్టుకు సమర్పిస్తారు.

అయితే అప్పటికే జ్యోత్స్న ఒక ఎస్సై ని కలిసి తనకు మద్దతుగా నిలవాలని డబ్బు కూడా ఖర్చుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కోర్టులో మాత్రం ఆ ఎస్సై కనిపించకుండా పోతాడు. ఆయనకు బదులుగా మరొక ఎస్సై ఆ ఫోరెన్సిక్ రిపోర్టును కోర్టుకు అందిస్తాడు. ఆ రిపోర్టులో మొదటి ఆధారం గన్ పై ఉన్న వేలిముద్రలు దీపావే అని స్పష్టం చేస్తారు. కానీ ఆ బుల్లెట్ మాత్రం దీప పట్టుకున్న గన్ లో నుంచి పేలలేదని రెండవ పాయింట్ ను కోర్టు కు వివరిస్తారు. దీంతో ఒక్కసారిగా జోష్నా షాక్ అవుతుంది. మరి దీప పేల్చకపోతే ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ సందేహంలో మునిగిపోతారు. కోర్టు కూడా ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీయాలని ఆదేశిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్ కి వాయిదా పడింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X