Karthika deepam 2 April 30th : కోర్టులో జ్యోత్స్నకు షాక్.. ఆశలు వదులుకున్న దీపాకు తిరిగొచ్చిన ప్రాణం
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 29వ తేదీ 345వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తను జైలులో నుంచి బయటికి రావడం కష్టమేనని దీపా మాట్లాడిన మాటలకు కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు. పైగా కార్తీక్ బాబును మరో పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వడంతో ఇంకా మండి పోతాడు. ఇప్పుడు నువ్వు జైలు నుంచి రావని, నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని చెబుతున్నావా అని దీపాను ప్రశ్నిస్తాడు కార్తీక్. నేను మరో పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయిని కూడా నువ్వే చూసి పెట్టాలని, మా ఇద్దరికీ పెళ్లి జరిగిపించి, వారి చేతిలో మరొకరి చేయిని వేసి ఒకటి చేయాలని అంటాడు. అంతేకాదు మా ఇద్దరికీ పెళ్లి చేయడంతో పాటు శౌర్య ను కూడా మాకు అప్పగించే బాధ్యత కూడా నీపై నే ఉందని కార్తీక్ బాబు దీపాను దెప్పి పొడుస్తాడు. చివరిగా నిన్ను జైలు నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది అని కార్తీక్ బాబు హామీనిస్తాడు.
ఆ తర్వాత దీపాను పోలీసులు మళ్లీ కోర్టుకు తీసుకెళ్తారు. ముందుగా శివ నారాయణ ను డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ పలు ప్రశ్నలు అడుగుతాడు. దీపానే మీ కొడుకు దశరథంను కాల్చిందని మీరు నమ్ముతున్నారా అని అడుగుతాడు. దానికి అవును అని బదులిస్తాడు. దీప చేతిలో గన్ ఉండడం, దశరథంకు బుల్లెట్ తగలడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అని కోర్టుకు వివరిస్తాడు. ఇక కోర్టులో జ్యోత్స్నతో చేతులు కలిపిన ఎప్సై కాకుండా మరో ఎస్సై ఫోరెన్సిక్ రిపోర్టను సమర్పిస్తాడు. ఆ రిపోర్ట్ లో గన్ పై ఉన్న వేలిముద్రలు దీపావే అని స్పష్టం చేస్తారు. కానీ ఆ బుల్లెట్ మాత్రం దీప పట్టుకున్న గన్ లో నుంచి పేలలేదని రెండవ పాయింట్ ను కోర్టు కు వివరిస్తారు. దీంతో ముందుగా జ్యోత్స్న షాక్ అవుతుంది. తన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యిందని అప్సెట్ అవుతుంది. మరోవైపు ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆరా తీయాలని కోర్టు ఆదేశించింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 30వ తేదీ 346 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపా గన్ నుంచి బుల్లెట్ రాలేదని రిపోర్ట్ వెల్లడించింది. దీంతో వెంటనే తన క్లైంట్ దీపాను నిర్దోషిగా విడుదల చేయండి అని కళ్యాణ్ ప్రసాద్ కోర్టును కోరుతాడు. కానీ భగవాన్ దాస్ ఈ అధారాల్లో ఏదైనా అవకతవకలు జరిగి ఉండొచ్చు కదా అని సందేహం వ్యక్తం చేస్తాడు. దాంతో డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ స్పందిస్తూ తన దగ్గర మరిన్ని ఆధారాలు కూడా ఉన్నాయని కూడా కోర్టుకు చెబుతాడు. ఆ వెంటనే సీసీ టీవీ ఫోటోలను తీసి చూపిస్తాడు. మూడో వ్యక్తి ఎవరో గన్ పేల్చారని చెబుతాడు. ఆ బుల్లెట్ మరి ఎవరి గన్నులో నుంచి పేలిందో వెంటనే కనుక్కోవాలని కోర్టు ఆదేశిస్తుంది. దీపను కావాలనే ఇరికించాలని మూడో వ్యక్తి ఎవరో ఘటన స్థలంలో ఉన్నారని డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ కోర్టుకు వివరిస్తాడు. అతని గురించి వెంటనే దర్యాప్తు జరపాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశిస్తుంది. అలాగే ఆ మూడో వ్యక్తి దొరికే వరకు దీపా కు బెయిలు మంజూరు చేస్తున్నామని ప్రకటిస్తుంది. ఇక వెంటనే ఆ అనుమానస్పద వ్యక్తి ఎవరనేది కనుక్కోవాలని చెబుతూ... కోర్టును 15వ తారీకు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడిస్తారు.
ఇక దీపాకు బెయిల్ మంజూరు కావడంతో కార్తీక్ బాబు సంతోషం వ్యక్తం చేస్తాడు. అటు జోష్నా మాత్రం ఇలా జరిగిందని కంగారు పడుతుంది. అనుకున్నదొకటి అయినది ఒకటి అయ్యేసరికి కంగు తింటుంది. అయితే దీప నేరం చేయలేదని, దీప అసలు గన్ పేల్చలేదని కోర్టు తేల్చడంతో.. శివ నారాయణ, సుమిత్ర దీపపై సానుభూతి వ్యక్తం చేస్తుంటారు. ఇది గమనించిన జోత్స్నా వెంటనే వారిని రెచ్చగొడుతుంది. తన తండ్రిని కాల్చిన దీపాకు బెయిల్ మంజూరు కావడం ఏంటని శివ నారాయణ తో అంటుంది. మీరందరూ దీపాపై ఎందుకు సింపతి చూపిస్తున్నారని ప్రశ్నిస్తుంది. కళ్ళ ముందే సాక్షాలను మార్చేసిన దీపాను ఎందుకు మంచిగా చూస్తున్నారని అంటుంది.
తన తండ్రి దశరథమే దీప బుల్లెట్ దింపిందని చెప్పినా కూడా ఎవరు నమ్మడం లేదేంటి అని ప్రశ్నిస్తుంది. దీపాకు ఇప్పుడు బెయిల్ వచ్చిన నిజం నిజం కాకుండా పోతుందా అని జోష్ణ శివ నారాయణ తో అంటుంది. ఎంత తెలివిగా సాక్షాలను మార్చేసిందని తాత శివ నారాయణ రెచ్చగొడుతుంది. ఇలాగే ఊరుకుంటే రేపు బయటికి వచ్చి ఇంకా నానా రచ్చ చేస్తుందని అంటుంది. దాంతో శివ నారాయణ స్పందిస్తూ అలా జరగదని, అస్సలు అలా జరగనివ్వనని అంటాడు. దీపాను జైలు నుంచి బయటకు రానివ్వరని అంటాడు. వెంటనే దీప కార్తీక్ బాబుల దగ్గరికి వెళ్లి మండిపడతాడు. సాక్షాలను తెలివిగా మార్చేశారని ఫైర్ అవుతాడు.
అప్పుడు గౌతం విషయంలో ఎవరో తెలియని అమ్మాయిని తీసుకువచ్చి డబ్బులు ఇచ్చే సాక్ష్యం చెప్పించాలని చూసిన దీపాకు ఇప్పుడు సాక్షాలను మార్చేయడం తేలికగా మారిపోయిందని అంటాడు. ఏకంగా కోర్టునే మీ తెలివితో నమ్మించారని అవమానిస్తాడు. బెయిల్ వచ్చినంత మాత్రాన సంబర పడాల్సిన పని ఏమీ లేదని శివ నారాయణ దీపతో అంటాడు. నిన్ను మాత్రం ఈ జన్మలో వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తాడు. సుమిత్ర కూడా నమ్మించి గొంతు కోయడంలో ఆరితేరారని మండిపడుతుంది. తన భర్తకు జరిగిన అన్యాయం ఎలా రుజువు అవుతుందని అంటుంది. ఏకంగా దీపా గన్ పేలలేదని కోర్టును నమ్మించడంతో ఇప్పుడు సమస్య నా వైపు, నా మనవరాలు జోష్నా వైపు తిరిగిందని శివ నారాయణ అంటాడు.
దీపా గన్ పేల్చకపోతే మరి అందులో ఉన్న బుల్లెట్టు ఏమైందని గన్ లైసెన్స్ ఓనర్ అయినందుకు నన్ను, లైసెన్స్ గన్ తీసినందుకు ప్రశ్నిస్తారు. సమాధానం చెప్పకపోతే ఇద్దరిని శిక్షిస్తారు. జరిమానా కూడా విధిస్తారు. ఇలా కేసును మీ ఇద్దరి తెలివితేటలతో మా వైపుకు తిప్పారు ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని శివ నారాయణ రగిలిపోతాడు. కార్తీక్ బాబు స్పందిస్తూ అసలు నిజం ఏంటో ముందు ముందు మీకే తెలుస్తుంది అని అంటాడు. న్యాయస్థానం ఉన్నది వ్యక్తిగత విషయాలను సమర్థించడం కోసం కాదని సరైన ఆధారాలు విశ్లేషణ దర్యాప్తు ఆధారంగా తీర్పును వెల్లడిస్తుందని, నిర్దోషులకు న్యాయం చేస్తుందని చెబుతాడు. ఇక తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. జోత్స్నా మాత్రం ఆ ఎస్ఐ ని కలవడం కోసం వెళ్తుంది. అసలు రిపోర్టు మారిపోవడానికి కారణం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











