Karthika deepam 2 May 1st : దీపాకు బెయిల్.. జ్యోత్స్న వైపు మళ్లిన కేసు.. కార్తీక్ బాబు వార్నింగ్

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఏప్రిల్ 30వ తేదీ 346వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కోర్టులో దీపాకు కాస్తా ఊరట కలిగింది. దశరథంను గన్ తో కాల్చి హత్యాహత్నం చేసిందనే ఆరోపణలలో అరెస్ట్ అయిన దీపాకు న్యాయం స్థానం బెయిల్ మంజూరు చేసింది. ఓవైపు జ్యోత్స్న దీపాను బయటికి రానివ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఏకంగా ఎస్సైని కూడా ప్రలోభ పెట్టి దొంగ సాక్ష్యాలను సృష్టించాలని ప్రయత్నించింది. కానీ అవేవీ కుదరలేదు. పైగా దీపాకు ఊరట లభించడంతో పాటు ప్రస్తుతం జ్యోత్స్న, శివనారాయణకు ఉచ్చు బిగుసుకునేలా కథ మారింది.

రెండో సారి కోర్టుకు హాజరైన సందర్భంగా కోర్టులో ఫోరెన్సిక్ రిపోర్ట్ ను న్యాయమూర్తికి అందజేస్తారు. అందులో దీపా చేతి వేలిముద్రలు గన్ పై ఉన్నాయని రిపోర్ట్ వస్తుంది. కానీ బుల్లెట్ మాత్రం ఆ గన్ లో నుంచి వచ్చిందని కాదని ల్యాబ్ రిపోర్ట్ ఇస్తుంది. దీంతో కోర్టు దీపా హత్యాయత్నం చేయలేదని నమ్ముతూ బెయిల్ మంజూరు చేస్తుంది. దీంతో కార్తీక్ బాబు సంతోషం వ్యక్తం చేస్తాడు. మరోవైపు జ్యోత్స్నకు మండిపోతుంది. ఎస్సైని కలిసి డబ్బులిచ్చినా ఫోరెన్సిక్ రిపోర్ట్ మార్చలేదని కంగుతింటుంది. ఇక వెంటనే అతన్ని కలవడానికి వెళ్తుంది. అయితే దీపాకు బెయిల్ మంజూరు కావడంతో ఆ బుల్లెట్ పేల్చిన మరో వ్యక్తి ఎవరనే దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శివనారాయణ లైసెన్స్డ్ గన్ లోని బుల్టెట్ ఏమైందనే విషయంలో అతను, జ్యోత్స్న న్యాయం స్థానానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Karthika deepam 2 Serial Today s Episode 347 May 1st 2025

ఈ క్రమంలో తరువాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మే 1వ తేదీ 347 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కోర్టులో దీపాకు బెయిల్ లభించడంతో కార్తీక్ బాబు తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. ఇక తన తల్లి దీపా కోసం ఎదురుచూస్తున్న శౌర్య ఇంటి ముందు పువ్వులు పరిచి స్వాగతం పలుకుతుంది. తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక దీప రాగానే టక్కున వెళ్లి కౌగిలించుకుంటుంది. అమ్మ వచ్చావా అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. దీప తిరిగి రావడంతో కాంచన కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక వారిద్దరిని ఇంటి లోపలికి ఆహ్వానిస్తుంది. ఇదే సమయంలో అనసూయ ఎర్ర నీళ్లు తీసుకువచ్చి దీపా కు కార్తీక్ బాబుకు దిష్టి తీస్తుంది. జ్యోత్స్న నుంచి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని ఆ భగవంతుడిని వేడుకుంటుంది. ఇప్పుడు ఇంట్లో పెట్టిన కాలు మళ్లీ జైలులో పెట్టకూడదని, కోర్టు మెట్లు అసలే ఎక్కకుండా చూసుకోవాలని కోరుకుంటుంది.

ఇక దీప ఇంట్లోకి తిరిగి రాగానే ముందుగా వెళ్లి తన తండ్రి ఫోటోకు దండం పెట్టుకుంటుంది. దీపాలు ముట్టించి మొక్కుకుంటుంది. తన జీవితంలో ఏది అడగలేదని, మొదటిసారిగా అడుగుతున్నానని, అయ్యేలా చూడాలని తన తండ్రిని కోరుతుంది. తనకు కార్తీక్ బాబు కుటుంబంతో కలిసి ఉండాలని ఉందని చెప్పుకొస్తుంది. ఇక మరోవైపు జ్యోత్స్న కోర్టులో ఓడిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. తన పంతం నెగ్గకపోవడంతో సవాల్ గా తీసుకుంటుంది. అయితే జ్యోత్స్న ఎస్సై ని ప్రలోభ పెట్టిన సంగతి తెలిసిందే. స్కూల్ అడ్మిషన్, లక్షల్లో లంచం ఇచ్చినా కూడా ఎస్సై జ్యోత్స్న కు అనుగుణంగా రిపోర్టు ఇవ్వలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టు ను మార్చి ఇవ్వమని జ్యోత్స్న చెప్పినప్పటికీ ఆ ఎస్సై మాత్రం దీప కార్తీకులకు అనుగుణంగానే రిపోర్టు పంపిస్తాడు.

ఆ విషయం తేల్చడం కోసమే జ్యోత్స్న ఎస్సై ని కలవడానికి వెళుతుంది. ఎస్ఐ ని కలిసిన తర్వాత ఎందుకలా రిపోర్టు మార్చి పంపించామని అడుగుతుంది. దాంతో ఎస్సై నేనేమి రిపోర్టు మార్చలేదు ఉన్నది ఉన్నట్టుగానే పంపించాను అని చెబుతాడు. అదే అలా ఎందుకు చేసావు అని జ్యోత్స్న అడగడంతో ఆ విషయం నీకు చెప్పాల్సిన పనిలేదని అంటాడు. స్కూల్ అడ్మిషన్, డబ్బు ఇచ్చినందుకే నువ్వు ఇంత ధైర్యంగా నన్ను నిలదీస్తున్నావు కదా అని.. వాటిని తిరిగి ఇచ్చేస్తాడు. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుందని జ్యోత్స్న కు చెబుతాడు. అసలు నీకు వాళ్ళు ఎలా మంచి వాళ్ళు అయ్యారో కాస్త చెప్పి వెళ్ళమని అడగడంతో ఎస్ఐ బాబు గతాన్ని గుర్తు చేసుకుంటాడు.

తన కూతురుకు రోడ్డు యాక్సిడెంట్ జరగడంతో కార్తీక్ బాబు సమయానికి ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందిస్తాడు. అంతేకాకుండా రక్తదానం కూడా చేసి పాప ప్రాణాన్ని కాపాడతాడు. కాదే సమయంలో ఎస్సై కూడా ఆసుపత్రికి చేరుకొని కార్తీక్ బాబు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెబుతాడు. మీరు చేసిన మేలు ఎప్పటికీ తీర్చుకోలేనిదని అంటాడు. కూతురిని చూస్తే మా శౌర్య పాప గుర్తుకు వచ్చిందని, శౌర్య పాపకు దీప అంటే చాలా ఇష్టమని, దీపా లేకుండా శౌర్య ఉండలేదని కార్తీక్ బాబు ఎస్సైతో చెబుతాడు. తన కూతురి ప్రాణాలను కాపాడినందుకు బదులు గా ఎస్సై కార్తీక్ బాబుకి దీప కేసు విషయంలో సాయం చేస్తాడు. అయితే ఈ విషయాన్ని మొత్తం తన మనసులో తలుచుకుంటాడు ఎస్సై. కానీ జ్యోత్స్నకు మాత్రం ఈ విషయాన్ని చెప్పకుండానే అక్కడే నుంచి వెళ్ళిపోతాడు.

ఇక మరోవైపు శ్రీధర్ రెండో భార్య కావేరి సంతోషంలో మునిగి తేలుతుంటుంది. దీప జైలు నుంచి తిరిగి వచ్చిందని తెలుసుకొని, వెంటనే కలిసి ఎందుకు వెళుతుంది. ఈ సందర్భంలో శ్రీధర్ ఎదురవడంతో అతనిని గదిలోకి తీసుకెళ్లి లాక్ చేసి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. వెళ్తూ వెళ్తూ దీపా నిర్దోషిగా తిరిగి ఇంటికి వచ్చిందని కూడా శ్రీధర్ కు చెప్పి వెళ్తుంది. దీపా ఇంటికి వచ్చిందని తెలుసుకున్న వెంటనే శ్రీధర్ అప్సెట్ అవుతాడు. ఇక కావేరి కార్తీక్ బాబు ఇంటికి వెళ్లి దీపాను పరామర్శిస్తుంది. నువ్వు తిరిగి రావడం సంతోషంగా ఉందని చెబుతుంది. శ్రీధర్ ఇక్కడికి రాకుండా ఇంట్లోనే లాక్ చేసి వచ్చానని చెబుతుంది. కానీ ఈ లోపు శ్రీధర్ ఇంట్లో నుంచి తప్పించుకొని కార్తీక్ బాబు ఇంటికి వస్తాడు. రాగానే దీపా జైల్లో నుంచి వచ్చింది కదా శుభాకాంక్షలు చెబుదామని వచ్చానని అంటాడు. అయినా ఇప్పుడు వచ్చింది కేవలం బైలే కదా మళ్లీ ఏదైనా తేడా వస్తే దీప జైలుకు వెళుతుంది కదా అని అంటాడు శ్రీధర్. అసలు ఈ విషయం నీకు ఎవరు చెప్పారని కార్తీక్ బాబు అడుగుతాడు. దాంతో వెంటనే శ్రీధర్ బాబు నాలుక కరుచుకుంటాడు. మొహం చాటేస్తాడు... ఇక తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X