Karthika deepam 2 May 2nd : జ్యోత్స్నకు చెంపపెట్టు.. తండ్రిపై కార్తీక్ బాబు ఆగ్రహం

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 1వ తేదీ 347వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు దీపాను జైలు నుంచి ఇంటికి తీసుకొస్తాడు. శౌర్య పాపకు ఇచ్చిన హామీ మేరకు దీపాను ఇంటికి తీసుకొచ్చి తన మాట నిలబెట్టుకుంటాడు. కోర్టులో కేసు గెలవకపోయినా.. బెయిల్ లభించడంతో దీపా ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి తిరిగి వచ్చిన దీపాను శౌర్య పాప ఘనంగా స్వాగతం పలుకుతుంది. పూల బాట ఏర్పాటు చేసి రమ్మంటుంది. దీపా ఇంటికి రావడంతో కార్తీక్ బాబు వల్ల తల్లి కాంచన కూడా ఎంతో సంతోషిస్తుంది. ఇక అనసూయమ్మ దీపాకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇంట్లోకి వచ్చిన దీపా మళ్లీ పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కకుండా చూసుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటుంది.

మరోవైపు జ్యోత్స్నకు కోర్టులో అవమానం జరుగుతుంది. ఎస్సై ఫోరెన్సిక్ రిపోర్ట్ ను పూర్తిగా మారుస్తాడని, దీపాకు యావజ్జీవ జైలు శిక్ష పడుతుందని భావించినా అందుకు రివర్స్ గా ఫలితం ఉంటుంది. కోర్టులో దీపా నేరస్తురాలు కాదని, మూడో వ్యక్తి ఎవరో బుల్లెట్ కాల్చారని తెలియడంతో దీపాకు బెయిల్ వస్తుంది. అయితే ఎస్సై తనను మోసం చేశాడని జ్యోత్స్న అతన్ని పిలిపించి ఎందుకిలా చేశావని ఎస్సైని అడుగుతుంది. అందుకు ఎస్సై కార్తీక్ బాబు మంచితనాన్ని వివరించి వారికే మద్దతుగా ఉంటానని జ్యోత్స్నను లెక్క చేయకుండా వెళ్లిపోతాడు. మరోవైపు బుల్లెట్ పేల్చిన మూడో వ్యక్తి ఎవరని ఆలోచిస్తుండగా.. కార్తీక్ బాబు ఇంటికి శ్రీధర్, కావేరి వస్తారు. శ్రీధర్ ఇంటికి వచ్చిన దీపాను చూసి హేళన గా మాట్లాడుతారు. వచ్చింది బెయిలే కాదు.. మళ్లీ ఏదైనా జరిగితే జైలుకే కదా అని అంటాడు. దాంతో బెయిల్ వచ్చిందని నీకెవరు చెప్పారని కార్తీక్ బాబు శ్రీధర్ ను ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మే 2వ తేదీ 348 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 348 May 2nd 2025

దీపా గురించి శ్రీధర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతాడు. ఇంటికి దీపా తిరిగి వచ్చిందన్న సంతోషంలో అందరూ ఉంటే.. శ్రీధర్ మాత్రం హేళన చేస్తూ అందరి మనస్సు నొచ్చుకునేలా మాట్లాడుతాడు. అయినా ఇప్పుడు దీపాకు వచ్చింది కేవలం బెయిలే కదా.. మళ్లీ ఏదైనా సమస్య అయితే దీపాను మళ్లీ జైలుకే పంపిస్తారు కదా అని తెలివిగా మాట్లాడుతాడు. అందరిని బాధపెట్టాలని అలా మాట్లాడుతూ ఉంటాడు. దీంతో వెంటనే శ్రీధర్ రెండో భార్య కావేరి స్పందిస్తూ నీ నోటి వెంట ఒక్క మంచి మాట కూడ రాదా? మొన్న దీపా జైలులో ఉన్నప్పుడు నువ్వు బయటకి రావని చెప్పి కంగారు పెట్టారు. అలాగే కార్తీక్ బాబుకు మరో పెళ్లి చేసుకోమని చెప్పు అని ఉచిత సలహాలు ఇచ్చావు. ఇప్పుడు మళ్లీ దీపా తిరిగి జైలు వెళ్తుందని మాట్లాడుతున్నావు అంటూ కావేరి శ్రీధర్ పై మండిపడుతుంది.

అయితే కావేరీ చెప్పిన మాటాలకు కార్తీక్ బాబు శ్రీధర్ పై ఇంకా ఫైర్ అవుతాడు. ఎందుకంటే.. దీపాతో కార్తీక్ బాబుకు మరో పెళ్లి చేసుకోమనే చెత్త సలహా ఇచ్చింది శ్రీధరే అనే విషయం తెలుసుకొని రగిలిపోతాడు. ఆ చెత్త ఐడియా ఇచ్చింది ఎవరో అని అనుకున్నాను. అలాంటి సలహా ఇవ్వడానికి నీకు ఏమాత్రం సిగ్గుగా లేదా అని శ్రీధర్ పై కొడుకు కార్తీక్ బాబు మండిపడుతాడు. దాంట్లో బాధపడాల్సిన పని ఏముంది? దీపా జైలులో ఉంటే.. కార్తీక్ బాబు, శౌర్య ఒంటిరి వాళ్లు అయ్యిపోతారు కాదా అందుకే మళ్లీ పెళ్లి చేసుకోని సంతోషంగా ఉంటారని ఆ సలహా ఇచ్చాను. ఆ విషయాన్ని దీపాతోనే చెప్పించాను. నాకు నా కొడుకు సంతోషంగా ఉండటమే కావాలి... అని శ్రీధర్ తిరిగి కార్తీక్ బాబుకు బదులిస్తాడు.

ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ తనకు నాకోసం ప్రాణాలైనా ఇస్తుంది. అలాంటిది నేను సంతోషంగా ఉంటానంటే విడాకులు ఇవ్వడం పెద్ద లెక్క కాదు కదా. అంతటి గొప్ప మనస్సు ఉన్న వ్యక్తికి ఇలాంటి మాటలు చెప్పడం ఏ మాత్రం సబబు అని ప్రశ్నిస్తాడు. వెంటనే నువ్వు దీపాకు సారీ చెప్పాలి అని కార్తీక్ బాబు డిమాడ్ చేస్తాడు. మరోవైపు కాంచన, కావేరి, అనసూయ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే చీపురు తిరగేసి కొడతామని హెచ్చరిస్తాడు. భయపడిపోయిన శ్రీధర్ వెంటనే సారీ చెబుతాడు. ఇక మరోవైపు దశరథం ఇంట్లో కోర్టులో వాయిదా పడ్డ కేసు గురించి చర్చ మొదలవుతుంది. దశరథం కాస్తా కోలుకోగానే కేసుకు సంబంధించిన విషయాలను మాట్లాడుతూ ఉంటారు.

దీపాకు జైలు శిక్ష పడేవరకు వదిలే ప్రసక్తే లేదని ఓవైపు జ్యోత్స్న, మరోవైపు శివనారాయణ అంటారు. దీంతో దశరథం స్పందిస్తూ ఎలా శిక్ష పడుతుంది.. కోర్టే దీపా చేతిలోని గన్ పేలలేదని, నా ఛాతిలో దిగిన బుల్లెట్ వేరొక గన్ కు సంబంధించిందని తీర్పునిచ్చింది కదా అని అంటాడు. అంటే ఇంకో వ్యక్తి ఎవరో మనల్ని చంపాలని చూస్తున్నారు కదా అని అంటాడు దశరథం. ఇంకెవ్వరికో మనల్ని చంపాల్సిన పని ఏముందిరా అని శివనారాయణ అంటాడు. ఎవ్వరికీ ఏ అవసరం ఉందో మనకేమీ తెలుస్తుంది నాన్న. సుమిత్రపై ఎటాక్, దాసుపైనా దీపా శౌర్యలను చంపాలనుకోవడం, ఇప్పుడు నాపై షూట్ ఎటాక్ ఇవన్నీ చేసింది ఒక్కరే అని సందేహంగా ఉంది అని అంటాడు.

దశరథం మాటలకు పారుజాతం కంగారు పడుతుంది. మరోవైపు జ్యోత్స్న దాసును, దీపా, శౌర్యలను చంపే ప్రయత్నం చేసింది నేనే అని మనస్సులో అనుకుంటుంది. ఆ విషయం కూడా నీకు తెలుసు నాన్న.. కానీ దాసు కోలుకునే వరకు నువ్వు ఎవ్వరికీ నిజం చెప్పవు అని కూడా నాకు తెలుసు. కానీ దాసు కోలుకోవడం జరగదని జ్యోత్స్న తన మనస్సులో అనుకుంటుంది. మరోవైపు నువ్వు చేస్తున్న తప్పులన్నీ నాకు తెలుసు జ్యోత్స్న అని దశరథం మనసులో అనుకుంటాడు. వెంటనే తనను గన్ తో కాల్చింది ఎవరో తెలుసుకోవాలని దశరథం అంటాడు. ఇంకెవరురూ దీపానే అని తెలిసిందే కదా అని శివనారాయణ అంటాడు. ఒకవేళ దీపా కాకపోతే ఇంకెవరూ అయ్యి ఉంటారని దశరథం అంటాడు. దశరథం మాటలకు జ్యోత్స్న కంగారు పడుతుంది. జ్యోత్స్న ఎందుకు కంగారు పడుతుందని పారుజాతం అనుకుంటుంది. అదే సమయంలో పారుజాతానికి దాసు కొడుకు కాశీ నుంచి మెసేజ్ వస్తుంది. అందులో ఏముందన్నదని ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X