Karthika deepam 2 May 3rd : జ్యోత్స్నకు బిగుస్తున్న ఉచ్చు.. మళ్లీ దీపాకు మంచి రోజులు
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 2వ తేదీ 348వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా తిరిగి ఇంటికి వచ్చిన ఆనందంలో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ శ్రీధర్ ఇంటికి వచ్చి దీపా విషయంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతాడు. హేళన చేస్తూ అందరి మనస్సు నొచ్చుకునేలా మాట్లాడుతాడు. దీపాకు వచ్చింది బెయిలే కదా.. మళ్లీ ఏదైనా సమస్య అయితే మళ్లీ జైలుకే వెళ్తుంది కదా అని అంటాడు. వెంటనే శ్రీధర్ రెండో భార్య కావేరి స్పందిస్తూ ఇప్పటికే దీపా జైలు నుంచి రాదని, కార్తీక్ బాబును మరో పెళ్లి చేసుకోమని చెప్పు అంటూ దీపాకు ఉచిత సలహాలు ఇచ్చావు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడుతుంది. దీపా ఆ సలహా ఇచ్చింది నువ్వేనా అంటూ కార్తీక్ బాబు ఫుల్ ఫైర్ అవుతాడు. వెంటనే దీపాను క్షమించమని అడుగుతాడు. లేదంటే దేహశుద్ది తప్పదని హెచ్చరిస్తాడు. దాంతో బయపడ్డ శ్రీధర్ వెంటనే దీపాకు క్షమాపణలు చెబుతాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు శివనారాయణ ఇంట్లో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. దీపా పట్టుకున్న గన్ నుంచి బుల్లెట్ రాకపోతే మరీ ఎవరి గన్ నుంచి బుల్లెట్ వచ్చిందని, ఆ మూడో వ్యక్తి ఎవరని దశరథం తన తండ్రి శివనారాయణతో చర్చించి ఉంటాడు. సుమిత్రను, దీపా శౌర్యను, దాసును, ఇప్పుడు తనను చంపాలనుకున్నది ఒక్కరేనేమోనని అనుమానిస్తాడు. ఇక వీటన్నింటికి కారణం జ్యోత్స్ననే అయ్యి ఉంటుందని తన మనస్సుల్లో అనుకుంటుంది. దశరథం ఇలా ఆరా తీస్తూ ఉంటే జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటుంది. మేటర్ మొత్తం తనవైపునకు తిరుగుతుందని టెన్షన్ పడుతుంది. ఈ క్రమంలోనే దాసు కొడుకు కాశీ నుంచి పారు జాతానికి ఒక మేసెజ్ వస్తుంది. అందులో ఏముందని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 3వ తేదీ 349 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

పారుజాతానికి దాసు కొడుకు కాశీ మెసేజ్ చేస్తాడు. దాసును చూసేందుకు రమ్మని చెబుతాడు. దాంతో పారుజాతం దాసు ఇంటికి వెళ్లి కలుస్తుంది. ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది. నాకు బాగానే ఉందని దాసు చెబుతాడు. కాదురా నీకు గతం తెలియదని అంటాడు. లేదు నాకు అన్నీ తెలుసు అని అంటాడు. అయితే నిన్ను తలపై కొట్టింది ఎవరో చెప్పు అని అంటుంది. దీంతో దాసు స్పందిస్తూ నన్ను ఎవరైనా కొడితే నేను ఊరుకుంటానా? అని బదులిస్తాడు. ఆ తర్వాత పారుజాతం మరిన్ని ప్రశ్నలు వేయడంతో చిరాకు పడి ఇంట్లోకి వెళ్లిపోతాడు. కానీ దాంతో ఏమైందని పారుజాతం కాశీని అడుగుతుంది. దాంతో కాశీ మాట్లాడుతూ నాన్నకు అప్పుడప్పుడు గతం గుర్తుకు వస్తుందని చెబుతాడు. దాంతో పారుజాతం షాక్ అవుతుంది.
మరీ ఏమైందని, ఏమైనా చెబుతున్నాడా? అని అడుగుతుంది పారుజాతం కాశీని. ఏమీ చెప్పడం లేదని, కానీ ఏదో చెప్పాలని అనుకుంటున్నాడని తెలియజేస్తాడు. గతం గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం పేపర్ లో ఏదేదో రాస్తున్నాడని, కానీ పూర్తిగా చెప్పడం లేదని అంటాడు. దీంతో వెంటనే పారుజాతం వెంటనే ఆ పేపర్లను తీసుకొని రమ్మని చెబుతుంది. కాశీ వెళ్లి ఆ పేపర్లను తీసుకొని వస్తాడు. పారుజాతానికి చూపించడంతో చదివేందుకు ప్రయత్నం చేస్తుంది. దీంతో కొన్ని పేపర్లు చదువుతుంది. ఒక దాంట్లో 'కొట్టింది వారసురాలు... అస్సలు వదలను'.. మరొక దాంట్లో 'అన్నయ్య దశరథకు నిజం చెప్పాలి.. అసలు వారసురాలు' అని రాసి ఉంటుంది. అలాగే మరో పేపర్ లో దీపం బొమ్మను గీస్తాడు.
అవన్నీ చూసిన పారుజాతం షాక్ అవుతుంది. దాసును కొట్టింది, శివనారాయణ అసలు వారసురాలు ఎవరో తెలిసిన విషయాన్ని ఈ రాతలతో చెప్పాలని అనుకుంటున్నాడు అని పారుజాతం ఒక అంచనాకు వస్తుంది. అయితే పారుజాతం ఆ పేపర్లన్నింటిని ఇంటికి తీసుకెళ్లి చదువుతూ ఉంటే జ్యోత్స్న వచ్చి ఏంటని అడుగుతుంది. ఆ పేపర్లన్నీంటిని చూసి షాక్ అవుతుంది. దాసుకు గతం గుర్తుకు వస్తోందని, దాసును కొట్టింది తానేననే నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని జ్యోత్స్న తెలుసుకుంటుంది. దీంతో కంగారు పడుతుంది. అయితే దాసును చంపాలనుకుంది, దీపా అసలు వారసురాలు అనే విషయం తెలిసిన వ్యక్తినే అని పారు జాతం అంటుంది. దాసు నా కొడుకు కాబట్టి నేను చంపే ప్రయత్నం చేయను.. ఇక అప్పుడు ఇంకెవ్వరికి దాసును చంపాలనే ఆలోచన ఉంటుంది, అసలు వారసురాలు ఎవరు అని పారుజాతం ప్రశ్నలు వేస్తూ ఉంటుంది.
దాంతో పారుజాతం జ్యోత్స్న పైనా కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. నువ్వే నా కొడుకును చంపాలని ప్రయత్నం చేశావా? అని అడుగుతుంది. దాంతో జ్యోత్స్న నేను అసలు అలా ఎందుకు చేస్తానని అంటుంది. నువ్వు ఈ మధ్యలో ఏ విషయాన్ని కూడా నాకు సరిగా చెప్పడం లేదని పారుజాతం మనవరాలు జ్యోత్స్నపై మండి పడుతుంది. అందుకు జ్యోత్స్న సీరియస్ అవుతుంది. నేను అలా ఎందుకు చేస్తానని అంటుంది. పారుజాతానికి సర్ది చెప్పి తన గదిలోంచి వెళ్లిపో అని చెబుతుంది. పారుజాతం అలా బయటికి వెళ్లిపోవడంతో వెంటనే జ్యోత్స్న ఆ కాగితాల్లో ఇంకా దాసు ఏం రాశోడోనని పరిశీలిస్తుంది. అన్ని పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అన్నీ సగం సగం రాసిందని గమనిస్తుంది. ఎందులోనూ తన పేరు మాత్రం రాయలేదు కదా అని స్పష్టం చేసుకుంటుంది. ఏ పేపర్ లోనూ తన పేరు లేకపోవడంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది.
ఇక ఆ పేపర్లన్నింటినీ జ్యోత్స్న మరొకరి కంట పడకుండా కాల్చి బూడిద చేస్తుంది. దాసుతో నిజం చెప్పనివ్వనని తన మనస్సులో అనుకుంటుంది. ఇక ఆ పేపర్లను కాల్చడాన్ని పారుజాతం చూస్తుంది. అంటే దాసును కొట్టింది జ్యోత్స్ననేనా, అలాగే జ్యోత్స్నకు కూడా అసలు వారసురాలు ఎవరో తెలుసునని పారుజాతం అనుమానం వ్యక్తం చేస్తుంది. అదే నిజమైతే నిన్ను అస్సలు వదలనని జ్యోత్స్నపై పారుజాతం మండిపడుతుంది. ఇక మరోవైపు దీపాను ఇరికించేందుకు ఎవరు ప్రయత్నించారని, కోర్టులో తేల్చిన మూడో వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకోవాలని కార్తీక్ బాబు దీపాతో చర్చిస్తూ ఉంటాడు. ఆ రోజు నీవెంట ఇంకెవరో ఫాలో అయ్యారని కార్తీక్ బాబు అంటాడు. లేదంటే నువ్వు ఆ ఇంటికి వెళ్లే సమయానికి, గన్ పట్టుకొని బెదిరించే సమయానికి పర్ఫెక్ట్ గా ఎలా బుల్లెట్ పేల్చారని సందేహం వ్యక్తం చేస్తాడు కార్తీక్ బాబు. ఎవరూ ఫాలో కాలేదని, తానే జ్యోత్స్న కు ముందుగా ఫోన్ చేసి ఇన్ ఫామ్ చేశానని అంటుంది. ఆ తర్వాత కార్తీక్ బాబు ఏం తేల్చాడనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











