Karthika deepam 2 May 5th : జ్యోత్స్నపై పారుకు అనుమానం.. క్రూరంగా ఆలోచిస్తున్న జ్యోగ

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 3వ తేదీ 349వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కాశీ నుంచి వచ్చిన మెసేజ్ తర్వాత పారుజాతం దాసును చూసేందుకు వెళ్తుంది. అక్కడ దాసుకు గతం గుర్తుకు వచ్చిందని తెలుసుకొని షాక్ అవుతుంది. దాసు గతం గుర్తుకు వచ్చినప్పుడు రాసిన పేపర్లను తీసుకొని ఇంటికి తిరిగి వస్తుంది. ఆ పేపర్లను జ్యోత్స్నకు చూపించడంతో జ్యోత్స్న సాక్ అవుతుంది. ఆ పేపర్లలో రాసింది చదివిన తరువాత పారుజాతం జ్యోత్స్న పైనా కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. నువ్వే నా కొడుకును చంపాలని ప్రయత్నం చేశావా? సందేహిస్తుంది. ఇక పారుజాతం గదిలోంచి బయటికి వెళ్లిపోవడంతో వెంటనే జ్యోత్స్న ఆ కాగితాల్లో ఇంకా దాసు ఏం రాశోడోనని పరిశీలిస్తుంది. అన్ని పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అన్నీ సగం సగం రాసిందని గమనిస్తుంది. ఎందులోనూ తన పేరు మాత్రం రాయలేదు కదా అని స్పష్టం చేసుకుంటుంది. ఏ పేపర్ లోనూ తన పేరు లేకపోవడంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది.

ఇక ఆ పేపర్లన్నింటినీ జ్యోత్స్న మరొకరి కంట పడకుండా కాల్చి బూడిద చేస్తుంది. దాసుతో నిజం చెప్పనివ్వనని తన మనస్సులో అనుకుంటుంది. ఇక ఆ పేపర్లను కాల్చడాన్ని పారుజాతం చూస్తుంది. అంటే దాసును కొట్టింది జ్యోత్స్ననేనా, అలాగే జ్యోత్స్నకు కూడా అసలు వారసురాలు ఎవరో తెలుసునని పారుజాతం అనుమానం వ్యక్తం చేస్తుంది. అదే నిజమైతే నిన్ను అస్సలు వదలనని జ్యోత్స్నపై పారుజాతం మండిపడుతుంది. ఇక మరోవైపు దీపాను ఇరికించేందుకు ఎవరు ప్రయత్నించారని, కోర్టులో తేల్చిన మూడో వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకోవాలని కార్తీక్ బాబు దీపాతో చర్చిస్తూ ఉంటాడు. ఆ రోజు నీవెంట ఇంకెవరో ఫాలో అయ్యారని కార్తీక్ బాబు అంటాడు. లేదంటే నువ్వు ఆ ఇంటికి వెళ్లే సమయానికి, గన్ పట్టుకొని బెదిరించే సమయానికి పర్ఫెక్ట్ గా ఎలా బుల్లెట్ పేల్చారని సందేహం వ్యక్తం చేస్తాడు కార్తీక్ బాబు. ఎవరూ ఫాలో కాలేదని, తానే జ్యోత్స్న కు ముందుగా ఫోన్ చేసి ఇన్ ఫామ్ చేశానని అంటుంది. ఆ తర్వాత కార్తీక్ బాబు ఏం తేల్చాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక మే 5వ తేదీ 350 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 350 May 5th 2025

దీపా జ్యోత్స్నను హెచ్చరించేందుకు ఇంటికి వెళ్లిన విషయం ఇంకెవ్వరికీ తెలియదు కదా అని కార్తీక్ బాబు అడుగుతాడు. దాంతో దీపా నేనే జ్యోత్స్నకు చెప్పాను అని అంటుంది. దాంతో కార్తీక్ బాబు షాక్ అవుతాడు. నువ్వు ముందుగానే చెప్పావు కాబట్టి జ్యోత్స్న నిన్ను చంపేందుకు పక్కాగా ప్లాన్ చేసింది. కానీ నువ్వు అక్కడికి వెళ్లి గన్ తీసుకుంటావని జ్యోత్స్న ఊహించి ఉండదేమో, ఒక వేళా నీతోనే అలా కాల్చేలా ప్లాన్ చేసిందా? అని కార్తీక్ బాబు అంచనా వేస్తాడు. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని అంటాడు. ఇక మరోవైపు జ్యోత్స్న ఒక వ్యక్తిని కలిసేందుకు హడావుడిగా బయటికి వెళ్తుంది. జ్యోత్స్నపై అనుమానం వ్యక్తం చేస్తూ వెంటనే ఫాలో అవుతూ వెళ్తుంది.

ఇక అక్కడ జ్యోత్స్నను కలిసేందుకు సత్తిపండు వస్తాడు. సత్తి పండు రాగానే చెంప చెల్లుమనిపిస్తుంది. ఈ సగంతి అంతా పారుజాతం తన కారులో కూర్చొని చూస్తూ ఉంటుంది. సత్తిపండును జ్యోత్స్న ఎందుకు కొట్టిందా? అని అదే షాక్ లో చూస్తూ ఉంటుంది. ఇక సత్తిపండుతో జ్యోత్స్న మాట్లాడుతూ. . చెప్పిన పని సరిగా ఎందుకు చేయలేదని, నేను ఎక్కడ బుల్లెట్ కాల్చమంటే నువ్వు ఇంకెక్కడా కాల్చవాని ఫైర్ అవుతుంది. నువ్వు చేసిన పనికి చావాల్సిన మనిషి బతికాడని, జైలుకు వెళ్లాల్సిన మనిషి తిరిగి ఇంటికి వచ్చాడని మండిపడుతుంది. నువ్వు గుండెల్లో సరిగ్గా కాల్చితే దశరథం చనిపోయే వాడని, దీపా జైలుకు వెళ్లేదని అంటుంది. కానీ అలా జరగకపోవడంతో కోర్టులో కేసు వాయిదా పడిందని, ఇప్పుడు ఆ బుల్లెట్ కాల్చిన వ్యక్తి గురించి పోలీసులు వెతుకుతున్నారు.

నువ్వు ఎక్కడైనా అసలు విషయం చెబితే మాత్రం నువ్వే ఇరుక్కుపోతావని జ్యోత్స్న ఆ సత్తి పండును బెదిరిస్తుంది. ఇక అతను మాత్రం తిరిగి జ్యోత్స్ననే బెదిరిస్తాడు. చంపే ప్రయత్నం చేసిన నాకే శిక్ష పడితే, మరి చంపమని చెప్పిన నీకు ఎలాంటి శిక్ష పడదా? అని హెచ్చరిస్తాడు. దాంతో జ్యోత్స్న కూడా షాక్ అవుతుంది. వెంటనే సత్తిపండును హెచ్చరిస్తుంది. తన తండ్రినే చంపడానికి వెనకాడ లేదని, ఇక తానే దొరికిపోతానని తెలిస్తే, అలాంటి పరిస్థితితే వస్తే నిన్ను కూడా చంపేందుకు ఏమాత్రం ఆలోచించనని చెబుతుంది. దాంతో ఇప్పుడు ఏం చేయాలని సత్తిపండు జ్యోత్స్నను అడుగుతాడు.

అందుకు జ్యోత్స్న స్పందిస్తూ నువ్వు కాల్చిన విషయం నీకు, నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందుకని నువ్వు ఇంకెక్కడా కూడా కనిపించకని అంటుంది. ఎవ్వరితోనూ నోరు విప్పకని సూచిస్తుంది. అందుకు వెంటనే నగరం వదిలేసి వెళ్లిపోవాలని చెబుతుంది. కొంత డబ్బు ఇచ్చి సత్తి పండును పరార్ అవ్వమని చెబుతుంది. దాంతో సత్తి పండు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఈ విషయాన్ని మొత్తం కారులోంచి పారుజాతం గమనిస్తూ ఉంటుంది. సత్తి పండును జ్యోత్స్న కొట్టడం, సత్తి పండు గన్ సింబల్ చూపించడం, జ్యోత్స్న అతనికి డబ్బులు ఇచ్చి పంపించడం వంటి అన్ని విషయాలను గమనిస్తూ ఉంటుంది. ఇక దాసును, దశరథంను చంపడానికి ప్రయత్నం చేసింది జ్యోత్స్ననేనా? అని సందేహం వ్యక్తం చేస్తుంది. అదే నిజమైతే జ్యోత్స్న అంతు తేల్చుతానని నిర్ణయించుకుంటుంది.

ఇక మరోవైపు దీపా మళ్లీ శివనారాయణ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఎవ్వరికీ చెప్పుకుండా దీపా సైలెంట్ గా వెళ్లడం చూసిన అనసూయ ఎక్కడికి అని అడుగుతుంది. శివనారాయణ ఇంటికి అని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నీకు కాస్తా కూడా బుద్దిలేదా అని మండిపడుతుంది. ఈసారి ఎవరినీ హత్య చేయడానికి వెళ్తున్నావని దెప్పి పొడుస్తుంది. ఇక అందుకు దీపా స్పందిస్తూ.. దశరథం గారికి ఎలా ఉందో చూసి వద్దామని వెళ్తున్నానని, ఆయన్ని రక్తపు మరకల్లోనే చివరిగా చూశానని, కోలుకున్నాకా కనీసం దూరం నుంచైనా చూద్దామని వెళ్తున్నానని చెబుతుంది. మళ్లీ జ్యోత్స్నకు చిక్కుకుంటావని అనసూయ హెచ్చరిస్తుంది. అలా కాదని జ్యోత్స్న తనకు మొదట్లో ఎంతో సహకరించిందని, అక్కా అంటూ అప్యాయంగా పిలిచి, ఆ ఇంట్లో చక్కగా చూసుకుందని దీపా చెబుతుంది. అందుకే జ్యోత్స్నతో గౌతమ్ పెళ్లి జరగకుండా అడ్డుకుంటున్నానని, అలాగే దాసు కుటుంబాన్ని శివనారాయణ కుటుబాని, మన కుటుంబాన్ని ఏకం చేయాలని ఆలోచిస్తున్నానని తన మనస్సులోని మాటను చెబుతుంది. ఆ విషయాన్ని కార్తీక్ బాబు వింటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X