Karthika deepam 2 May 6th : దీపాను కత్తితో పొడిచిన రౌడీ.. రక్తపు మడుగులో వంటలక్క
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 5వ తేదీ 349వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దశరథం ఒంట్లో దిగిన బుల్లెట్ ఎక్కడిదని అందరూ సందేహంలో ఉన్న సందర్భంలో జ్యోత్స్న షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది. జ్యోత్స్ననే దశరథంను చంపించేందుకు ప్లాన్ చేస్తుంది. అది కూడా సత్తిపండు అనే కిరాయి రౌడీతో అలా చేయిస్తుంది. చెప్పిన పని సరిగా ఎందుకు చేయలేదని, నేను ఎక్కడ బుల్లెట్ కాల్చమంటే నువ్వు ఇంకెక్కడా కాల్చవాని ఫైర్ అవుతుంది. నువ్వు చేసిన పనికి చావాల్సిన మనిషి బతికాడని, జైలుకు వెళ్లాల్సిన మనిషి తిరిగి ఇంటికి వచ్చాడని మండిపడుతుంది. నువ్వు గుండెల్లో సరిగ్గా కాల్చితే దశరథం చనిపోయే వాడని, దీపా జైలుకు వెళ్లేదని అంటుంది. ఏదైనా తేడా వస్తే నువ్వే ఇర్కుకుంటావని జ్యోత్స్న సత్తి పండును హెచ్చరిస్తుంది. సత్తిపండు స్పందిస్తూ నేను ఇరుక్కుంటే నువ్వు కూడా బయటికి వస్తావని అంటాడు. దాంతో వెంటనే సిటీలో ఉండవద్దని సత్తి పండుకు డబ్బులిచ్చి ఎవరి కంట పడొద్దని చెబుతుంది జ్యోత్స్న.
ఇదంతా పారుజాతం గమనిస్తుంది. ఇక జ్యోత్స్ననే తన కొడుకు దాసు, దశరథంను చంపేందుకు ప్రయత్నించిందని సందేహిస్తుంది. కన్ఫమ్ అయితే మాత్రం తాట తీస్తానని జ్యోత్స్నపై కోపంతో రగిలిపోతుంది. ఇక మరోవైపు దీపా ఊహించని విధంగా షాక్ ఇస్తుంది. కేసులో ఇర్కుకున్నాకా కూడా మళ్లీ శివనారాయణ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. దశరథను చూసేందుకు బయల్దేరుతుంది. ఈ క్రమంలోనే అనసూయ దీపాను అడ్డుకుంటుంది. మళ్లీ జ్యోత్స్నకు చిక్కుకుంటావని అనసూయ హెచ్చరిస్తుంది. అయినా దీపా వినిపించుకోదు. జ్యోత్స్న తనకు మొదట్లో ఎంతో సహకరించిందని, అందుకే జ్యోత్స్నతో గౌతమ్ పెళ్లి జరగకుండా అడ్డుకుని రుణం తీర్చుకుంటానని చెబుతుంది. అలాగే దాసు కుటుంబాన్ని శివనారాయణ కుటుబాని, మన కుటుంబాన్ని ఏకం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెబుతుంది. దీపా మాటలను కార్తీక్ బాబు వింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత కార్తీక్ బాబు ఏం తేల్చాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక మే 5వ తేదీ 350 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్న సత్తిపండును సిటీ నుంచి బయటికి పంపించిన తర్వాత వెంటనే వెళ్లి గౌతమ్ ను కలుస్తుంది. అసలే సత్తిపండు తను దొరికితే నిన్ను కూడా పట్టిస్తానని చెప్పడంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. అందుకే దీపాను మళ్లీ ఎలాగైనా ఆకేసులో దోషి చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకే గౌతమ్ ను కలుస్తుంది. దీపా మన పెళ్లిని జరగనివ్వదని చెబుతుంది. ఆమె దశరథను చంపేందుకు ప్రయత్నించి మరీ బెయిల్ పై బయటికి వచ్చింది. ఇక మన పెళ్లిని చాలా ఈజీగా ఆపేస్తుందని జ్యోత్స్న గౌతమ్ తో అంటుంది. దానికి గౌతమ్ అలా కుదరదని, దీపా ఈసారి తమ పెళ్లికి అడ్డు వస్తే ఏమాత్రం సహించలేనని చెబుతాడు. అందుకు ఏం చేస్తావని జ్యోత్స్న మరింతగా రెచ్చగొడుతుంది. నువ్వు ఎన్ని చెప్పినా చేసినా దీపా అస్సలు ఊరుకోదని మరింతగా గౌతమ్ కు కోపం వచ్చేలా చేస్తుంది.
దాంతో గౌతమ్ మరింత కోపంతో రగిలిపోతాడు. పోయినసారి కేవలం దీపాను హెచ్చరించి మాత్రమే వదిలేశానని, ఈసారి నా దారికి అడ్డు వస్తే మాత్రం అస్సలు భూమి మీదనే లేకుండానే చేస్తానని అంటాడు. అదేదో ముందు చెయ్యి అని జ్యోత్స్న గౌతమ్ తో అంటుంది. లేదంటే మన పెళ్లికి దీపా అడ్డు పడుతూనే ఉంటుందని చెబుతుంది. అస్సలు దీపా అడ్డు రాలేదని గౌతమ్ అంటాడు. దానికి జ్యోత్స్న మరింతగా రెచ్చగొట్టేందుకు గౌతమ్ గుట్టు తెలిసినట్టుగా మాట్లాడుతుంది. ఈసారి దీపా మరెవరైనా అమ్మాయిని తీసుకొని వచ్చి ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు గౌతమే తండ్రి అని, కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయించి నిర్దార్థించుకోండి అంటూ అడిగితే ఏం చేస్తావని అంటుంది. నువ్వు ఎలాగూ మంచి వాడివని నమ్ముతున్న మావాళ్లు సరే టెస్ట్ చేయించండి అని ఒప్పుకుంటే ఏం చేస్తావని అంటుంది జ్యోత్స్న. అందుకే ముందుగానే మన పెళ్లికి వద్దని చెబుతున్నాను అని గౌతమ్ ను కంగారులో పడేస్తుంది.
అందుకు గౌతమ్ మరింతగా టెన్షన్ పడుతాడు. 100 కోట్ల ఆస్తిని చూస్తూ చూస్తూ ఎలా వదులుకుంటానని మనస్సులో అనుకుంటాడు. ఇక ఆవేశంలో జ్యోత్స్నకు హానిస్తాడు. దీపాను చంపేస్తానని, అసలు దీపా ఉండటం వల్లనే కదా మన పెళ్లి ఆగిపోతూ ఉంది. ఇక దీపాను చంపేస్తానని గౌతమ్ ఆవేశంలో చెబుతాడు. దాంతో జ్యోత్స్న మనస్సులో సంబరపడుతుంది. గౌతమ్ తను అనుకున్న దారిలోకి వచ్చాడని అనుకుంటుంది. ఇక పైకి మాత్రం తనకు చంపడాలు, హత్యలు అంటే చాలా భయమని చెబుతుంది. అవన్నీ నేను చూసుకుంటానని గౌతమ్ జ్యోత్స్నతో అంటాడు. అందుకు జ్యోత్స్న హా సరేనని చెప్పి ఇంటికి తిరిగి వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లిన జ్యోత్స్నకు పారుజాతం షాక్ ఇస్తుంది. జ్యోత్స్న గౌతమ్ ను కలిసేందుకు వెళ్లిందని ఇంట్లో వాళ్లకి చెబుతుంది.
దాంతో శివనారాయణ, సుమిత్రలు జ్యోత్స్నపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అసలు ఎందుకు గౌతమ్ ను కలిశావని అడుగుతారు. ఇంకెందుకు గౌతమ్ తో పెళ్లికి ఇష్టం ఉంది కాబట్టే కలిసిందని అంటుంది. మళ్లీ జ్యోత్స్న పెళ్లికి శివనారాయణ ఏర్పాట్లు చేయించేలా మాట్లాడుతుంది. జ్యోత్స్నను ఇరికిస్తుంది. ఇక మరోవైపు దీపాను చంపించేందుకు రౌడీని పంపింస్తాడు. దీపా కార్తీక్ బాబు గుడికి వెళ్లేందుకు రెడీ అవుతారు. కార్తీక్ బాబు బయటికి వెళ్లి సైకిల్ తీసి దీపా కోసం వెయిట్ చేస్తాడు. అప్పటికే ఇంట్లోకి వచ్చిన రౌడీ దీపా నోరుమూసి బలంగా పట్టుకొని కత్తితో పొడుస్తాడు. నాలుగైదు కత్తి పోట్లతో రక్తం కారిపోతుంది. ఆ రౌడీ దీపాను అలానే కిందపడేసి పారిపోతాడు. కార్తీక్ బాబు దీపా ఇంకా బయటికి రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. నేలపై ఉన్న రక్తం మరకలు చూసి ఇంటి వెనకాల డోర్ తీసి చూస్తాడు. అక్కడ దీపా రక్తం మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. వెంటనే కార్తీక్ బాబు వెళ్లి దీపాను దీపాను పట్టుకుంటాడు. రక్తం చూసి భయ పడుతాడు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











