Karthika deepam 2 May 7th : కొన ఊపిరితో దీపాకు.. వంటలక్కపై పగ సాధించిన జ్యోత్స్న
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 6వ తేదీ 350వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా బెయిల్ పై బయటికి రావడంతో జ్యోత్స్న కు కడుపు మంటగా ఉంటుంది. ఎలాగైనా మళ్లీ జైలులోకి పంపించాలని ప్రయత్నిస్తుంటుంది. లేదంటే తను ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని ఏకంగా దీపాను చంపించేందుకే మాస్టర్ ప్లాన్ వేస్తుంది. మందుగా తన గురించి ఎలాంటి నిజం చెప్పుకుండా సత్తిపండు అనే రౌడీకి డబ్బులిచ్చి సిటీలో నుంచి దూరంగా పంపించేస్తుంది. ఆ వెంటనే గౌతమ్ ను వెళ్లి కలుస్తుంది. మన పెళ్లి జరగాలంటే దీపా అడ్డు తొలగించుకోవాలని అంటుంది. కానీ ఎన్ని చేసినా దీపా ప్రయత్నాలు ఫలిస్తూనే ఉన్నాయని, ఏకంగా మా నాన్న దశరథనే కాల్చి చంపేందుకు ప్రయత్నించిందని గౌతమ్ తో అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు దీపా బెయిల్ పై బయట తిరుగుతుండటంతో ఎలాగైనా మన పెళ్లికి అడ్డుగా నిలుస్తుందని, ఇక మన పెళ్లి జరగడం కష్టమేనని, ఈ విషయం ఇంతటితో వదిలేయమని గౌతమ్ తో అంటుంది జ్యోత్స్న. అప్పటికే జ్యోత్స్న ఆస్తిపై కన్నేసిన గౌతమ్ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక జ్యోత్స్న తన మాటలతో రెచ్చగొట్టడంతో ఆవేశానికి లోనవుతాడు. పోయినసారి దీపాను హెచ్చరించాను కానీ.. ఈసారి మాత్రం భూమి మీదనే లేకుండా చేస్తానని గౌతమ్ జ్యోత్స్నకు వాగ్దానం చేస్తాడు. దీపాను చంపిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటాడు. దీంతో జ్యోత్స్న మనస్సులో సంబరపడుతుంది. కానీ బయటికి మాత్రం చంపడాలు, హత్యలు అంటే నాకు భయమని నాటకమాడుతుంది. ఇక దీపాను చంపాకనే కలుద్దామని చెప్పి గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అన్నట్టుగానే దీపాను చంపేందుకు కార్తీక్ బాబు ఇంటికి ఒక రౌడీని పంపిస్తాడు. అతను ఇంట్లోకి చొరబడుతాడు. అప్పటికే గుడికి వెళ్దామని రెడీ అవుతుంటారు దీపా, కార్తీక్. ఇక కార్తీక్ బయటికి వెళ్లి సైకిల్ తీసి బయల్దేరేందుకు రెడీగా ఉంటాడు. కానీ ఇంట్లోకి వచ్చిన ఆ గుండా దీపా నోరు నొక్కి ఇంటి వెనకాల ఉన్న డోర్ దగ్గరు తీసుకెళ్లి కత్తితో పొడుస్తాడు. దీపా అక్కడే కుప్పకూలిపోతుంది. కార్తీక్ బాబు పిలిచి పిలిచి ఇంట్లో వచ్చి వెతుకుతాడు.కత్తి గాయాలతో రక్తం కారుతున్న దీపాను చూసి భయాందోళన చెందుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 7వ తేదీ 351 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపాను చంపేస్తానని జ్యోత్స్నకు గౌతమ్ హామీనిస్తాడు. జ్యోత్స్న కూడా దీపాను భూమి మీద లేకుండా చేయమని రెచ్చగొడటంతో గౌతమ్ సీరియస్ అవుతాడు. ఎలాగైనా దీపా అడ్డు తొలగించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. అందుకోసమే వెళ్లి దీపాను కిరాయి రౌడీతో హత్య చేయించేందుకు పూనుకుంటాడు. ప్లాన్ ప్రకారమే దీపాను రౌడీతో హత్య చేయిస్తాడు. దీపాను ఆ రౌడీ గుండా ఇంటికి వెళ్లి మరీ కత్తితో పొడుస్తాడు. అక్కడి నుంచి వెంటనే పారిపోతాడు. ఇక కార్తీక్ బాబు ఇంట్లోకి వచ్చి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దీపాను చూసి కంగారు పడుతాడు. ఎవరు కత్తితో పొడిచారని చూట్టు చూస్తాడు. కానీ ఎవరూ కనిపించరు. దాంతో దీపాను ముందుగా ఆస్పత్రికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత పోలీస్ లకు ఫిర్యాదు కూడా చేస్తాడు. తనకు జ్యోత్స్న పై అనుమానం ఉందని చెబుతాడు.
దాంతో పోలీసులు నేరుగా శివనారాయణ ఇంటికి వెళ్తాడు. అక్కడ అప్పటికే పారుజాతం, జ్యోత్స్న దశరథంను కాల్చిన వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. పారుజాతం జ్యోత్స్న పై అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడుతుంది. జ్యోత్స్న మాత్రం నేను ఎందుకు అలాంటి పని చేస్తానని అంటుంది. ఒకవేళ నువ్వే అని తేలితే ఏం చేస్తావని పారు అడుగుతుంది. అందుకు జ్యోత్స్న నేను అస్సలు దొరకను. అసలు వాడు కూడా దొరకడని ఆవేశంలో నోరు జారుతుంది జ్యోత్స్న. వెంటనే పారుజాతం పట్టేస్తుంది. అంటే అసలు వాడు ఎవరో నీకు తెలిసిందా అని ప్రశ్నిస్తుంది. దాంతో జ్యోత్స్న అలా ఏం లేదు. నువ్వు మాట్లాడుతుంటే నాకు మతిపోతుంది... అసలు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదని అంటుంది. ఈలోపు శివనారాయణ జ్యోత్స్న జ్యోత్స్న అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తాడు. ఏం జరిగిందా అని పారుజాతం జ్యోత్స్నకిందికి వెళ్లి చూస్తారు.
అప్పటికే ఇంటిలోపలికి పోలీసులు వచ్చి ఉంటారు. జ్యోత్స్న పారుజాతం కంగారు పడుతారు. పోలీసులను చూసి జ్యోత్స్న ఎందుకు వచ్చారా అని ఆలోచిస్తుంటుంది. ఒకవేళ సత్తిపండు దొరికిపోయాడా? అని సందేహిస్తుంది. ఏదైతే అది అయ్యిందని అనుకొని తాత శివనారాయణ దగ్గరకు వెళ్లి ఏం జరిగింది? ఎందుకు పోలీసులు వచ్చారు తాత అని అడుగుతుంది. అందుకు శివనారాయణ మాట్లాడుతూ ఇప్పుడే ఓ వార్త అందింది. దీపాను ఎవరో కత్తితో పొడిచారంట. అందుకు కార్తీక్ బాబు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారంట. అక్కడ పోలీస్ స్టేషన్లో మనపై అనుమానం ఉందని, ముఖ్యంగా నీపైనే అనుమానం ఉందని కూడా చెప్పారంట అమ్మ అంటూ శివనారాయణ మండిపోతాడు. ఇక పోలీసులతో కూడా శివనారాయణ మాట్లాడుతాడు.
ఈమె నా మనవరాలు జ్యోత్స్న. ఈమెకు జ్యోత్స్నపై దాడి చేయించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదని పోలీసులకు వివరిస్తాడు. అయితే పోలీసులు మాత్రం ఒక్కసారి జ్యోత్స్నను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించాల్సిన అవసరం ఉందని చెబుతారు. అందుకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తాడు. ముఖ్యంగా సుమిత్ర మాట్లాడుతూ నా కూతురు జ్యోత్స్న హత్య చేయించిందనేందుకు మీ దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయా? అని పోలీసులను ప్రశ్నిస్తుంది. ఎవరో ఏదో చేప్పారని ఇలా ఇంటి లోపలికి వచ్చి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం సరికాదని అంటుంది. సాక్ష్యాధారాలతో రండి అంటూ వెళ్లి గొడుతుంది. ఇక జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది.
మరోవైపు దీపాకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ఉంటారు. పరీక్షించిన డాక్టర్లు దీపాకు బాగా రక్తం పోయిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెబుతారు. అందుకు చాలా బ్లడ్ కావాలని సూచిస్తారు. దీపాకు ఓ పాజిటివ్ బ్లడ్ అవసరమని, మొత్తం 3 యూనిట్ల బ్లడ్ అవసరం ఉంటుందని చెబుతారు. ఆస్పత్రిలో కేవలం 1 యూనిట్ మాత్రమే అందుబాటులో ఉందని, మిగతాది 2 గంటల్లో మీరు ఏర్పాటు చేస్తేనే దీపా బతుకుతుందని సూటిగా చెబుతారు. దాంతో ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న జ్యోత్స్న, సుమిత్రలను రక్తదానం కోసం అడిగేందుకు కార్తీక్ బాబు శివనారాయణ ఇంటికి వెళ్తారు. వెళ్లి అడగడంతో వారు అస్సలు ఒప్పుకోరు. దీపా చచ్చినా పర్లేదని, నా భర్త దశరథను చంపాలని చూసిన దీపాకు నేనెలా రక్తదానం చేస్తానని అంటుంది. ఇక పారుజాతం, సుమిత్ర, శివనారాయణ నానా మాటలు అంటారు. అయినా కార్తీక్ బాబు వచ్చి రక్తదానం చేయండి అంటూ బతిలాడుతూనే ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











